KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/నిత్యా ఆధ్యాత్మిక చికిత్స, ధ్యానం : (ఆనంద హీలింగ్)Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

నిత్యా ఆధ్యాత్మిక చికిత్స, ధ్యానం : (ఆనంద హీలింగ్)

బెంగుళూరు ఆశ్రమానికి లేదా స్వామీజీ ఎక్కడ ఉంటే అక్కడికి కొన్ని వేలమంది తమలోని మానసిక, శారీరక అనారో గ్యాలకు చికిత్స

చేయించుకోవటానికి వస్తుంటారు. అలా వచ్చేవారిలో తలనొప్పి, మైగ్గేన్ వంటి చిన్న చిన్న సమస్యలు దగ్గర నుంచి కేన్సర్ వంటి పెద్ద వ్యాధులు ఉన్నవారు వస్తుంటారు. అలా వచ్చినవారిని స్వామి, తన చేతితో చికిత్స చేసి పంపుతుంటారు. ఇంతవరకూ ఎవరూ అసంతృప్తితో తిరిగి వెళ్ళలేదు. భయంకరమయిన అనారోగ్యం నుంచి స్వామి చేతితో కోలుకొని, ఆరోగ్యవంతులయినవారంతా ఆయన పాదాల మీద వాలి "స్వామీ మీరు భగవంతుడు" అని అంటే ఆయన చాలా అందంగా నవ్వుతూ ఇది మాయ కాదు, అద్భుతం కాదు. మీకు కూడా నేర్చించుతాను. ఆ శక్తి మీలోనూ ఉన్నది. మీరు కూడా భగవంతుడే. కాకపోతే ఆశక్తిని మీ లోపల ఉన్న శక్తిని మీరు తెలుసుకోవాలనే కుతూహలం, బలమయిన కోరికా మీలో ఉండాలి అంతే అంటారు.

పరమహంస అందరితో అదే విషయం పదే పదే చెబుతారు. మీ శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోగల శక్తి, మీ శరీరానికి వచ్చే ఎటువంటి వ్యాధికి అయినా చికిత్స చేసుకోగల శక్తి మీలోనే ఉన్నది. అది తెలుసుకుని దానిని బయటకి తేవటం సాధ్యమే. దానిని ధ్యానం ద్వారా సాధించవచ్చు." అని తన శిష్యులకి భక్తులకి చెబుతుంటారు. ఆయనవైపు అపనమ్మకంగా చూసే భక్తులతో ఆయన రెండు విషయాలు చెబుతారు. మొదటిది " చాలా విచారకరమయన నిజం ఏమిటంటే మనని మనం నమ్మటం చాలా కాలం కితమే మానేసాము. (The sad truth is, we have all stopped trusting ourseleves a long ago)

సర్వపాణి కోటిలోనూ మనిషి అనే ఒక ప్రాణి ప్రకృతితో సంబంధాలను పూర్తిగా తెగ తెంపులు చేసుకొని చివరికి తన మార్గాన్ని మర్చిపోయాడు. (Humanbeing is the only animal who has lost connection with nature alltogether who has lost his way)

ఈ చికిత్సా శక్తి గురించి స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక సంఘటనని తన భక్తులకు చెబుతుంటారు. ఆయన హిమాలయాలలో బాగా లోపలి ప్రాంతం అయిన తపోవనంలో తపస్సు చేసుకునేవారు. అది గంగోత్రికి షుమారు 30 కి.మీ. లోపలికి ఉంటుంది. ఆ ప్రాంతం సంవత్సరం అంతా మంచుతో కప్పబడి

ఉంటుంది. ఒకసారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తపోవనం నుంచి గోముఖకి వచ్చి అక్కడి నుంచి క్రిందికి నడచి వస్తున్నారు. ఆదారిలో వెళ్ళుతున్న ఒక మిలటరీ వాహనం ఆయనని ఎక్కించుకుని క్రిందికి వచ్చింది. ఆ సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. అప్పుడు స్వామికి వీపు క్రింది భాగంలో చాలా పెద్ద గాయం అయింది. అది చాలా లోతు గాయం. వెంటనే వారు స్వామిని మిలటరీ వారి హాస్పటల్‌లో జాయిన్ చేసి రెండు మూడు రోజులు చికిత్స చేసి ఆయనని మూడు వారాలపాటు మంచం మీద నుంచి కదలకూడదు పూర్తి బెడ్‌రెస్ట్ ఇవ్వాలి అనిచెప్పారు.

అన్నిరోజులు అలా పడుకోవాలి అనగానే స్వామీజీకి తన సాధన గుర్తువచ్చి, అలా ఉందటం తన వల్లకాదని మెల్లిగా లేచి బయటకి వచ్చేసారు. గాయం చాలా బాధగా ఉంటే తన చేతిన గాయంపై పెట్టి ఏకాగ్రతని అక్కడ నిలిపారు. కొంతసేపటికి నొప్పి తగ్గింది. ఆ తరువాత క్రమంగా గాయం మానిపోయింది. అయన చాలా ఆశ్చర్యపోయారు. తరువాత తాను తనకు ఆ శక్తి ఉన్నది అని తెలుసుకున్నారు. శరీరానికి చికిత్స చేయగలను అని తెలుసుకున్నారు.

బహుశః ఆ పరాశక్తి ఆ సంఘటనని స్పష్టించి ఆయన హస్తాలు నిజమయిన అమృతహస్తాలు అని ఆయనకి తెలియజేసి ఉంటుంది. ఆ అమృతహస్త స్పర్శ ఎన్ని ప్రాణాలను నిలిపిందో ఎంతమంది నిరాశలో మరణశయ్య మీద వారిని తిరిగి ఈ లోకంలోనికి పంపించిదో ఆ పరమేశ్వరునికి, ఈస్వామికి మాత్రమే తెలుసు.

పరమహంస తన శిష్యులతో చాలామందికి చికిత్సా పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమయిన ధ్యానంతో కూడుకున్న శిక్షణ. శిక్షణ పూర్తి అయిన వారికి ఆయన దీక్షని ఇస్తారు. వారే అనంద హీలర్స్, ప్రపంచ‌వ్యాప్తంగా కొన్ని వేల‌మంది ఆనందా హీల‌ర్స్ ఎంద‌రికో హీలింగ్ చేస్తూ, స్వామి సేవలో పునీతులవుతున్నారు.

నిత్యా ఆధ్యాత్మిక చికిత్సా దీక్ష (నిత్య స్పిరిట్యువల్ హీలింగ్ ఇనిషియేషన్) నిత్యా ఆధ్యాత్మిక హీలర్స్ పరమహంస ప్రుత్యక్ష పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. దీనికి ముందు వారు మరికొన్ని ప్రాధమిక కార్యక్రమమాలయిన ఎ.ఎస్.పి., ఎన్.ఎస్.పి. మొదలయినవి చేసి ఉండాలి.

అప్పుడు వారు ఈ శిక్షణని స్వామి సమక్షంలో పొందవచ్చు. శిక్షణ పూర్తిగా శక్తి అంటే మేధస్సు అనే సూన్రం మీద ఆధారపడి ఉంటుంది. శిక్షణ పూర్తి అయి తరువాత గురుదేవులు వారిని ఆనందగంధ చక్రంతో దీక్షని ఇస్తారు. అప్పుడు వారు హీలర్స్ అవుతారు. ఇది వారి ద్వారా విశ్వశక్తి ప్రవహింపచేసే ఒక శాస్త్రీయ పద్ధతి. అలావారి ద్వారా విశ్వశక్తి ప్రవహించి వారు ఎవరికెనా చికిత్స చేయగలుగుతారు. ఈ హీలింగ్ పద్ధతిలో ఉండే ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇది వ్యాధి వున్న పేషెంట్లకి చాలా సహాయం చేస్తుంది. అదే విధంగా హీలర్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో తోడ్సుడుతుంది. బయటకి చూడటానికి ఇది ఒక చికిత్సావిధానం కానీ అంతర్లీనంగా ఇది ఒక గొప్ప ధ్యానపద్దతి. అన్నింటికంటే మించి ఇది మానవసేవ చేయగల ఒక మంచి మార్గం, ఆ పరమహంస లక్ష్యసాధనకు కొంత తోడ్సదాలి అనుకునే వారికి ఒక అద్భుత అవకాశం.