KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/ఇతర దేశాలలో స్వామి అనేక కార్యక్రమాలని నిర్వహించారు వాటిలో కొన్ని :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

ఇతర దేశాలలో స్వామి అనేక కార్యక్రమాలని నిర్వహించారు వాటిలో కొన్ని :

శిక్షణా కార్యక్రమాలు : నిత్యానందా స్పురణ, ధ్యాన స్పురణ, శక్తి స్పురణ, ఆచార్యా శిక్షణా, హీలర్స్ శిక్షణా, కార్య(క్రమాలు ముఖ్యమయినవి. ఈ కార్యక్రమాలు అమెరికా, కెనడా, పోలెండ్స్, సింగపూర్, మలేషియా, ఆ(స్టేలియా దేశాలలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.

ప్రవచనాలు : ప్రాశ్యాత్యులని బాగా ఆకట్లుకున్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కార్యక్రమాలలో ప్రముఖమయినది ఆయన ప్రవచనాలు. స్వామి చాలా చోట్ల ఎన్నో అంశాల మీద ప్రసంగించారు. వీటిలో చాలా ముఖ్యమయినవి 18 రోజులు భగవద్గీతపై ఆయన ఇచ్చిన వాఖ్య. అదే విధంగా పతంజలి యోగ, శివసూత్రాలు మొదలయిన ప్రాచీన హిందూ ఆధ్యాత్మిక విషయాల మీద ఆయన విస్తృతంగా ప్రవచనాలు ఇచ్చారు.

ప్రముఖ సంస్లలలో ఆయన ఇచ్చిన ప్రసంగాలు : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి చాలా పెద్ద పెద్ద సంస్గలతో తన ప్రవచనాలని ఇచ్చారు. వీటిలో ముఖ్యమయినవి మైకోసాఫ్ల్, ఒరాకిల్ కార్సొరేషన్, టెలికమ్యూనికేషన్స్ మొదలయన సంస్ధలలో మేనేజ్‌మెంట్, ఆధ్యాత్మికత అనే విషయంల మీద ఆయన ప్రసంగించారు.

ఆయన చాలా యూనివర్సీటీలు, కాలేజీలలో విద్యార్ధులని ఉద్దేశించి ప్రసంగించారు. అదే విధంగా చాలా కాన్పరెన్సులలో ప్రసంగించారు.

అంతర్హాతీయ అసోసియేషన్స్ అయిన 'అమెరికన్ తెలుగు అసోసియేషన్' (ATA), 'అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ Hindu ఆరిజన్' (A.A.P.I.) మొదలయిన వాటిలో ప్రసంగించారు.

అమెరికాలో ఉన్న హిందూ ఆర్లనైజేషన్స్‌ని దగ్గరగా రప్పించి కుంభమేళా జరిపించారు. కుంభమేళ యొక్క విశిష్టతని పాశ్చాత్యులకి తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పాశ్చాత్య గద్ద మీద ఆయన కుంభమేళా జరిపించారు.

ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆయన రేడియోలలో, టి.వి.లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, ప్రసంగాలు చేసారు.

ఆ తరువాత స్వామి యూరప్‌లో, సింగపూర్, బ్రొజిల్, ఫ్రాన్స్, వెస్ట్ ఇండీస్ ఇలా చాలా దేశాలలో పర్యటించారు. ఇక్కడ మరొక విచిత్రమయిన విషయం, సామాన్య మానవుల మేధస్సుకి అందని అద్భుతం ఉన్నది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి జన్మించినది, పెరిగినది తమిళనాడులో ఒక చిన్న

పట్టణం, తిరువణ్ణామలై. ఆయన తన సత్యాన్వేషణలో తపస్సు కోసం హిమాలయాలకి వెళ్ళే ముందు జీవితంలో ఎప్పుడూ ఆయన ఆ పట్టణం దాటి బయటికి రాలేదు. అప్పటివరకూ ఆయన చదివిన చదువు కూడా తమిళ మీడియంలోనే. ఆ తరువాత జీవితం అంతా హిమాలయాలలో ధ్యానంలో గడిపారు. జ్ఞానోదయమయిన తరువాత ఒక సంవత్సరం వరకూ మౌనంలో ఉన్నారు. ఆ తరువాత సంవత్సరంన్నర కావేరీనది ఒద్దున ఉన్నారు. అప్పుడు ఆయన భక్తులు శిష్యులు తమిళగ్రామీణులు మరి ఆయన అంత మంచి ఇంగ్లీషు ఎప్పుడు నేర్సుకున్నారు? మన మేధస్సుకి అందని జవాబు ఉన్న ప్రశ్న అది.

ప్రస్తుతం స్వామీజీ శిష్యులలో ఎక్కుమంది పాశ్చాత్యులు లేదా తమిళేతరులు. అందుకే ఆయన కార్యకమాలు ఎక్కువగా ఇంగ్లీషులో ఉంటాయి. ఆయన ఇంగ్లీషు చాలా ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. అది ఎంత ఉన్నతమైన భాషా చాతుర్యమంటే, ఆయన ఏ విషయంగురించైనా అనర్దళంగా, అసువుగా మాటాడేసారు. ఆయన దగ్గర ముందే వ్రాసిపెట్టుకున్న కాగితాలు ఉండవు. ఆయన చాలా సార్లు చెబుతుంటారు తాను అక్కడకి వచ్చి కూర్చునేవరకూ కూడా ఇది మాట్లాడాలి అని ప్లాన్ చేసుకోను అని. అక్కడ కూర్చొని, మైక్ తనవైపు తిప్పుకొని మాట్తాడటం మొదలుపెడతారు. ఆయన ప్రవచనాలన్నీ అదే విధంగా ఉంటాయి. అంత అనర్గళంగా అంతమంచి ఇంగ్లీషు మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నారు అని చాలా మంది భక్తులు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకి ఆయన మన స్తాయిలో మన మేధస్సుకి సరిపడే జవాబు ఇస్తారు. కానీ ఇది కేవలం మన తృప్తి కోసమే. ఆయన కారణ జన్ముడు, సిద్ధపురుషుడు, మహాజ్ఞాని అయిన యోగేశ్వరుడు. అయన సర్వాంతర్యామితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగిన భగవత్‌స్వరూపుడు. అంతే. ఆయన ఆయనే. వేరే జవాబు ఆ ప్రశ్నకి సరిపడదు.మనని ఒప్పించలేదు.

ఆయన ఇంగ్లీషు ప్రవచనాలు ట్రూన్స్‌లేట్ (తర్జుమా) చేయాలంటే తప్పనిసరిగా ఒకటి లేదా రెండు స్టాండార్ట్ డిక్షనరీలు తప్పనిసరిగా అది బాగా చదువుకున్న ప్రొఫెసర్లకయినా ఉండి తీరాలి. ఇక ఆయన మాతృభాష తమిళంలో అయితే, వినేవారికి అది తేనే ప్రవాహం : వినే కొద్ది ఇంకా ఇంకా వినాలి

అనిపిసుంది. ఇంత అందంగా, ఇంత అద్భుతంగా గంటలకొద్దీ ఆయన మాట్లాడుతున్నా వినేవారు రెప్పవాల్చకుండా,తమని తాము మరిచిపోయి వింటారు. ఆ ఆకర్షణ అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది ముఖ్యంగా బాగా పెద్ద చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండేవారు స్వామీజీని ఆ రహస్యం ఏమిటి అని అడుగుతుంటారు. దానికి ఆయన చాలా అందంగా నవ్వేసి "ఇందులో రహస్యం ఏమీలేదు. నేను ఏమి మాట్లాడాలో ముందుగా ప్లాన్ చేయను. అప్రయత్నంగా ఆ క్షణంలో మాట్లాడతాను. నేను చెప్పే ప్రతి మాట నా అనుభవంతో చెబుతాను. అవి కేవలం సత్యాలే. అందుకే మీరు విసుగులేకుండా వినగలుగుతారు," అంటారు.

గ్రంధాలయం :

బెంగుళూరు ఆశ్రమంలో ఒక చక్కని గ్రగంథాలయం ఉన్నది. స్వామీజీ స్వతః పుస్తక ప్రియులు. ఆయన ఎన్నో ప్రసిద్ధి గ్రంధాలు చదివారు.చాలామంచి పుస్తకాలని సేకరించి తన శిష్యులకోసం, బ్రహ్మచారులకి, విద్యార్ధులకి ఉపయోగించటానికి ఉంచుతారు. అందరినీ కూడా చదవమని ప్రోత్సహిస్తారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠ విస్తరణ :

1000కి పైగా ఉన్న సెంటర్ల ద్వారా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తగా అనేక మంచి కార్యక్రమాలని వారు చేస్తున్నారు. కొన్ని వేలమంది ఆనందసేవకులు, ఆనందా హీలర్స్ ఈ పనులలో నిమగ్నమయి ఉన్నారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి చేసే అన్ని కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకువచ్చి దాని ద్వారా ప్రపంచంలో మార్పు తేవాలి. ఆ ప్రపంచంలో అసూయ కోపం, అత్యాశ, అధికమయిన కోరికలు ఇలాంటి వ్యతిరేక భావాలు ఉండవు. దీనిని చాల సులభమయిన ధ్యాన పద్ధతుల ద్వారా సాధించవచ్చు అనేది ఆయన మనకి ఇచ్చినహామీ. అదే విధంగా ప్రతీ వ్యక్తి తాను దైవాంశసంభూతుడనని పరమానందం అనేది తనలోనే ఉన్నది అని తెలసుకోవాలి అనేది ఆయన తపన.

ధ్యానం మనలో తరంగాలుగా వ్యాపించే వ్యతిరేకపు ఆలోచనలని, భావాలని చాలా సమర్గవంతంగా అరికదుతుంది. అని స్వామి గట్టిగా చెబుతారు.

వ్యతిరేకపు ఆలోచనలు తరంగాలు సమాజంలో అవే వ్యతిరేకపు భావాలని మరింతగా వ్యాపింపచేస్తాయి. ఒకసారి అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌లో నిరంతరం వారం రోజులు ధ్యానం చేసారట. దీనిలో చాలా ధ్యానం నేర్చే సంస్థలు కలిసాయి. ఆ వారం అక్కడ నేరాల రేటు పడిపోయినట్లు రికార్డులు ఉన్నాయి. స్వామీజీ చెప్పేది ఆయన తీసుకురావాలి అని అనుకున్న మార్పు ఇదే.

ఒక చిన్న విషయం కానీ చాలా శక్తివంతమయిన విషయాన్ని పరమహంస తన భక్తులకి, శిష్యులకి చెబుతుంటారు. జ్ఞానోదయమయిన ఒక యోగి చెప్పే విషయం చాలా చిన్నది అయినా అది గొప్ప సత్యం అవుతుంది అది అత్యద్భుతమయిన ఫలితాలని ఇసుంది. ఆయన చెప్పే చాలా చిన్న పద్ధతిగాని, ఒక సూన్రతంకాని గొప్ప ఫలితాలని ఇస్తుంది. గౌతమబుద్ధుడు చాలా చిన్నది సామాన్యమయిన ఒక మాట "మీ శ్వాసని గమనించండి" అని చెప్పి కొన్ని వేలమందిని జ్ఙానోదయం పొందేలా చేసాడు. కొన్ని లక్షల మందిలో అద్భుతమయిన మార్పు తెచ్చాడు. ఆ మార్పు మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేసింది.

కానీ ఒక అద్భుతమయిన సత్యం సామాన్య మానువుని ద్వారా వస్తే అది వినాశనానికే దారితీసుంది. ఆటంని విచ్ఛిన్నంచేసే చాలా శక్తి పుడుతుంది అనేది చాలాగొప్ప సత్యం. అది గొప్ప సూత్రం. కాని అది సామాన్య మానవుడు చెప్పిన సత్యం. అది వినాశకారి అయినది.

కాబట్టి, ఎన్నో ప్రమాదాలతో,సమస్యలతో తెలియని భయంకరమయిన శారీరక, మానసిక వ్యాధులతో అల్లకల్లోలంగా ఉన్న ఈ ప్రపంచానికి ప్రస్తుతం కావలసిన ఔషదంతో, ఆయుధంతో భగవంతుడు ప్రపంచంలోనికి తన అంశను పంపించాడు. అందుకే ఆ పరమపావనమూర్తి ఏమి చెప్పినా అది మంగళశాసనం అవుతుంది. ఏమి చేసినా అది కళ్యాణకారి అవుతూంది.లోక కళ్యానానికి, మానవ శ్రేయస్సుకి నిరంతరం పని చేస్తున్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి సహస్రాబ్దిలో ఒక విప్లవాత్మకమయిన యోగీశ్వరుడు.

ఒకసారి ఇంటర్యూలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి స్వామి ఒక చక్కని వివరణని ఇచ్చారు. జ్ఞానోదయమయిన యోగీశ్వరులకు చేయవలసిన కర్మలు

ఏమీ ఉండవు. వారు సాధించవలసినది అంతకంటే ఉండదు. వారు కేవలం తమలోని అపార కరుణతో, ప్రేమతో మానవులంతా తనవారే అన్నంత ఆప్యాయతతో వారికి మంచిచేయాలి అనే తపనతో ఈ లోకంలో జన్మించుతారు. వారు పొందిన పరమానందస్థితి, దాని నుంచి వారు పొందే అత్యద్భుతమయిన ఆనందం,ఈ ప్రపంచం కానీ, శరీర స్వర్మావయవాలు కానీ, ఏ మానవులు కాని వారికి ఇవ్వలేవు. వారు పొందే ఆ అద్భుతమయిన ఆనందానికి సాటి రాగలది ఏవీ లేదు. అంత గొప్ప స్థితి నుంచి మానవుల మీద ఉండే అపార కరుణ ప్రేమతో వాళ్ళు మళ్ళీ ప్రపంచంలోనికి వస్తారు. ఆయన మరొక విషయం కూడా చెబుతారు. ఎప్పుడయినా ఎవరయినా గొప్ప సంతోషాన్ని పొందితే దానిని అందరికీ పంచాలి అని చూసారు. పరమహంస చేసేది కూడా అదే.

స్వామి ఎంతో దయతో,మానవులపై ఉండే అపార ప్రేమతో అంటుంటారు. "జ్ఞానోదయం పొందటానికి,అంతిమ సత్యాన్ని చేరటానికి ఎన్నో కష్టాలు పడి పదివేల తాళం చెవులని ప్రయత్నించి, సరియైన తాళం చెవిని పట్టుకున్నాను. ప్రస్తుతం అది నా చేతిలో ఉన్నది. ఎవరు దానిని నిజంగా పొందాలి అని అనుకుంటారో ఎవరు నిజాయితీగా ఆ అంతిమ సత్యాన్ని చేరాలనుకుంటారో వారికి తాళం చెవి ఇస్తాను. మీరు చేయవలసింది సరియైన ఈ తాళం చెవితో తాళం తీయటం మాత్రమే

ఆ ప్రేమమూర్తి, ఆ కరుణా సాగరుడు కాక ఎవరు అంత దయ చూపించుతారు. అవకాశాలను భగవంతుడు తన బిడ్డలకి కోకొల్లలుగా ఇస్తుంటాడు. కానీ వాటిని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందేది ఎంతమంది?