KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/జాడీలో సూర్యుడుSign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

జాడీలో సూర్యుడు

మీ వాస్తవ శక్తిని అన్వేషించండి

పరమాణు విచ్చిత్తిలో ఆశ్చర్యకరమయిన నూతనావిష్కరణను మార్చి, 2004లో భరతదేశంలో పుట్టిన శాస్త్రవేత్త డాక్టర్ ఋషి తలేయర్ ఖాన్ ప్రకటించారు. అతడు దానిని "జాడీలో సూర్యుణ్ణి తయారు చేయటం" అని పేర్కొన్నాడు.

చిన్న మీద చేసే ఈ ప్రయోగంలో, శాస్త్రజ్ఞడు అతడి టీము అతి మామూలు కూలిక సామగ్రిని ఉపయోగిస్తూ, పరమాణు విచ్చిత్తిని సాధించి సూర్యుడిలో ఉన్న శక్తితో పోల్చదగిన శక్తిని ఉత్పత్తి చేయగలిగాడు! "జాడీలో సూర్యుణ్ణి తయారుచేయటం" లాగా ఇది నమ్మదగినది కాదు-కాని ఇది జరిగింది.

మనం ఆశ్చర్యపడగూడదు. మనలో ప్రతి ఒక్కరమూ 'జాడీలో సూర్యుడు' వంటి వారం మాత్రమే! అయిదు లేదా ఆర్లు అడుగుల పరిమాణం ఉన్న శరీరంలో కుందించుకుపోయి మూడు పరిమాణాలలో నిర్భంధించబడి జీవిస్తూ మీరు మీ భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను కేవలం తెలుసుకోవటం లేదు. సాంకేతిక విజ్ఞానం ఎప్పటికీ సృష్టించ గలదని ఆశించని అతి మేధా సంపత్తికల అద్భుతం మీరు. మీ శరీరం సంపూర్ణ సామరస్యంతో పనిచేసే 50 లక్షల కోట్ల జీవకణాలతో నిర్మించబడింది. మీ మెదడు పదివేల మిలియన్ న్యూరాన్ల వ్యవస్థ. మీ మెదడులోని న్యూరాన్స్ గంటకు 200 మైళ్ళ వేగంతో సమాచారాన్ని, మీకళ్ళు ఒక కోటి 60 లక్షల రంగుల తేడాలను గుర్తించ గల్గుతాయి.

ప్రతీరోజు, సూచనలు లేకుండా, విశ్రాంతి లేకుండా మీ గుండె శరీరంలో ప్రతి భాగానికి అనేక లీటర్ల రక్తాన్ని పంపుచేస్తుంది.

మీ డిఎన్ఏ ప్రతి జీవాణువుకు అది కండరంలో లేదా రక్తంలో లేదా చర్మంలో ఏక్కడ ఎలా పెరగాలో తెలిపే తెలివిని అందిస్తుంది.

మరి మీరు ఆశ్చర్యపడతారు నా కడుపులో కలకలం రేకెత్తినప్పుడు దాని బాగోగుల్ని అదే చూసుకుంటుందా? లేదా నేను డాక్టరును చూడాలా?

సాధారణ వ్యక్తి 8-12% మెదడుకంటె ఎక్కువ ఉపయోగించడని నాడీ శాస్త్రజ్ఞులు తెలిపారు. ఐన్‌స్టీన్ లేదా లియోనార్డో డావెన్నీ 20-25% మెదడు శక్తి కంటె ఎక్కువ శక్తిని ఉపయోగించలేదు. ఏ ఐక్యు పరీక్ష కూడా మీ మెదడు వాస్తవ శక్తిని తెలపలేదు.

ఐక్యు పరీక్షలు చేతన క్రమాల్ని మాత్రమే కొలవగలవు, మీ మానసిక కార్యక్రమాలు చాలా వరకు అచేతనావస్థలోనే ఉంటాయి. మీ అచేతన మనస్సు మీకు తెలుసునన్న విషయం తెలియని ఎంతో సమాచారాన్ని నిల్వ ఉంచుకుంటుంది.

ఉదాహరణకు రాబోయే పది రోజులలో భూకంపం రానున్నదన్న విషయాన్ని మీరు చెపుగలరా? కిందటి వారం జరిగిన సంభాషణలోని ఖచ్చితమయిన పదాలను జ్ఞాపకం చేసుకోగలరా?

ఈ ఉదయం మీరు పని చేయటానికి వెళ్ళేదారిలో ఎన్ని చెట్లు లేదా ఎన్ని దీపస్తంభాలున్నాయో కనీసం చెప్పగలరా? అవును, చెప్పలేరు !

మీరు పరిశీలన శక్తికి లోబడి ఉన్నప్పుడు లేదా అచేతన నుండి మేల్కొన్నప్పటి పరిస్థితులలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పగల్గుతారు!

మన అచేతనతో మన సహజ ప్రవృత్తితో సంబంధాన్ని కోల్పోయేటట్లుగా మన చేతన మనస్సును అభివృద్ధి చేసుకోవటానికి మిక్కిలి శ్రమలో దృష్టిని కేంద్రీకరించాము. విశ్వం తోడి మార్మిక సంబంధాన్ని మనం కోల్పోయాము.

మన చేతనలో నిల్వ ఉంచుకున్న విశ్వ ఉమ్మడి జ్ఞానమే సహజ ప్రవృత్తి.

20 శతాబ్దపు మనస్తత్వ శాస్త్రజ్ఞుడు కార్ల్ యూంగ్ దీన్ని వర్ణించటానికి ఉమ్మడి అచేతనత్వం పరిభాషను సూచించాడు.

మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, మనం విశ్వంలోని ప్రతి ఒక్క వస్తువుతోను సంబంధం కలిగి ఉన్నాము. చక్రంలోని ఆకులలాగా ఉపరితలంపై మనం వేరే వ్యక్తిత్వాలతో కన్పిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే కేంద్రం ఒకటే అని తెలుసుకుంటాము.

సిఐఏలోని విచారణ ప్రత్యేకాధికారి క్లైవ్ బేక్‌స్టెర్ కనువిప్ప కలిగించే ప్రయోగం చేశాడు. వేర్వేరు విద్యుత్ ప్రేరణలకు మొక్కల ప్రతిచర్యను తనిఖీ చేయటానికి విచారణ చేయటానికి బేక్‌స్టెర్ కుండీలోని మొక్కను లై-డిటెక్టర్‌తో కలిపాడు. మన శరీరంలోని విద్యుత్ మార్పులను గ్రాపుపై నమోదు చేసే యంత్రం ఇది.

క్షుల ప్రేరణలకు మొక్క ఏ విధంగాను స్పందించకపోగా బేక్‌స్టెర్ ఆ మొక్కలోని ఆకును కాల్చాలని అనుకున్నాడు. అతని మనస్సులోకి ఈ భావం వచ్చిన క్షణంలోనే

గ్రాఫుపై మొక్క తీవ స్పందన నమోదు కావటాన్ని అతడు కనుగొన్నాడు!

ఆశ్చర్యపడి, బేక్‌స్టెర్ ఇతర మొక్కలపై కూడా ఈ ప్రయోగాన్ని పునరావృతంచేశాడు. అతడు హాని చేయాలనుకున్న మొక్క మాత్రమే కాకుండా ఆ గదిలోని ఇతర మొక్కలు కూడా వేర్వేరు డిగ్రీలలో ప్రతిస్పందించటాన్ని కనుగొన్నాడు. తర్వాత మొక్కలు అతడి కంఠ స్వరానికి ఆ గదిలోని అతని ఉనికికి కూడా స్పందించటాన్ని అతడు గమనించాడు.

ఈ ప్రయోగం పరస్సర మానసిక సంభాషణ (టెలిపతి) కంటె పరమాద్భుతమని నిరూపించింది - అవిజ్ఞాత వార్తా ఇంకొకదానికి సమాచార ప్రసారం కావించటం జరుగుతుంది.

ప్రతి ఒక్క జీవాణువు వేరే ప్రతి ఒక్క జీవాణువుతో - మొక్కదయినా లేదా మానవ సంబంధి అయినా - కలిసి వార్తా ప్రసారం చేయగలదని చూపబడింది. ఒక జీవాణువు తాను చనిపోయే ముందు తనతోటి ఇతర జీవాణువులతో తన భయాన్ని తెలుపుతుంది, అవి తనతోటి జీవాణువు మరణానికి సానుభూతి తెలుపుతాయి! ప్రతి జీవాణువుకు తెలివి, దయాదాక్షిణ్యాలు ఉన్నాయి. విశ్వవిజ్ఞానం కావాలనుకున్న వారికి అందరికి లభ్యమవుతుంది. మనలోని ప్రతి ఒక్కరు మన జీవితంలో ఏదో ఒక సమయంలో గాఢంగా పాల్గొనే క్షణాలను అనుభవిస్తూనే ఉంటాం.

అది అరుదమయిన ప్రకృతి సౌందర్యానుభవం, లేదా గాఢ ప్రేమానుభవం, లేదా దర్శన క్షణానుభవం కావచ్చు -

మనం ఏదో ఒక సమయంలో మొత్తం ఉనికితో గాథ సంబంధాన్ని పంచుకునే శరీరానికంటె అధికమయిన దానిని భావించి ఉంటాము.

ఒకసారి మనం అహంకారం అవరోధాలను తొలగించుకున్నప్పుడు, దీన్ని తెలుసుకోవటం తేలిక అవుతుంది. అహంకారం తన నుండి ప్రతి ఒక్క దానిని వేరుగా చూస్తుంది.

అకారణంగానే అహంకారం ప్రపంచాన్ని ఇటువంటి భయంకర ప్రదేశంగా కనుగొంటుంది!

వాస్తవ శక్తిని తెలుసుకోకుండానే మనం జీవిస్తుంటాము. మరణిస్తుంటాము - ఈ వాస్తవ అవగాహన లేక మనం భయపడుతుంటాము.

మీరు అంధుడు కథ విన్నారా?

చాలా సామర్థ్యంకల వైద్యుడు అంధుడికి అద్భుత చికిత్సను అందిస్తానని తెలిపాడు. "శస్త్ర చికిత్స అయిన తర్వాత నీవు బాగా చూడ గలుగుతావు అప్పుడు నీ చేతి కర్రను బయట విసిరివేయవచ్చు" అన్నాడు డాక్టరు.

గుడ్డివాడు పలికాడు. "మిమ్మల్ని అర్థం చేసుకోలేక పోతున్నాను. ఆపరేషన్ తర్వాత నేను చూడగల్గుతాను - కాని నా చేతి కర్ర లేకుండా నేను ఎలా నడవ గల్గుతాను".

నిజ సూర్యుడు

నీవు చూడగలగేటంత వరకు నీకు కర్ర అవసరం లేదని ఎలా తెలుస్తుంది? లోనికి చూసేటందుకు ఉన్న భయాన్ని వీడనంతవరకు మనం వాస్తవంగా ఎంత అద్భుత శక్తిమంతులమో ఎలా తెలుసుకోగలం?

ధ్యానం లోపలికి చూచే క్రమం మాత్రమే.

అది నిరవధిక శక్తి, విశ్వజ్ఞానాలను వినియోగించుకునే క్రమం. ఇది అస్పష్ట తాత్త్విక ఉద్యాటన కాదు. ప్రతి జీవశాస్త్రజ్ఞుడు జీవరసాయన వ్యవస్థలు -వృక్షాలు, జంతువులు, సూర్యుడు, మీరు కలుపుకొని - సమయమంతా తమ పర్యావరణంతో వార్తా ప్రసారం జరుపుతూనే ఉంటాయి. వార్తా ప్రసారాలలో పాల్గొనే అదృశ్య వెబ్ మొత్తం జీవితాన్ని విశాల స్వీయ భరణ వ్యవస్థతో కలుపుతుంది. దీన్ని జరిగేటట్లు చేసే తెలివి బయటి నుంచి ఎరువుగా తెచ్చుకొన్న ఏదో వస్తువు కాదు. మనలో ఉన్నది మాత్రమే. తెలివి మొక్కలలో అణువులలో ఉంది.

ఇది జీవిత రహస్యం.

మనం తెలివిలో జీవిస్తున్నా, తెలివిచే ఆవరించబడి ఉన్నాము.

మనం జ్ఞానం, మనం విశ్వజ్ఞాన అభివ్యక్తీకరణ మాత్రమే. మనం ఎంత లోతుగా విశ్వజ్ఞానంతో సంబంధం కలిగి ఉన్నామో తెలుసుకుంటే, ఇంకే మాత్రమూ మనకు భయం ఉండదు.

చేప సముద్రం కోసం వెదుకుతున్నట్లు, మన వెలుపల దేవుణ్ణి వెదుకుదాం. మనం చేప మాత్రమే కాదు. సముద్రం, జలం, ఉప్పదనం జీవితం కూడా !