KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/ఓ, ఇప్పుడు నేను చూస్తున్నాను!Sign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

ఓ, ఇప్పుడు నేను చూస్తున్నాను!

మీ జాగృతిని పెంచటం

కొన్ని నెలల కిందట ఒక మనిషి 14 సంవత్సరాల కొడుకును నా దగ్గరకు తీసుకువచ్చాడు. ఆ అబ్బాయి ఇంకో పసివాణ్ణి గాజుతో బాగా గాయపరిచినందుకు గాను అతడికి బడి నుండి ఉద్యోగ విరమణ చెప్పారు.

నేను ఆ అబ్బాయిని 'ఎందుకు కొట్టావు?' అని అడగ్గా అతడు నేను ఊహించని సమాధానం చెప్పాడు.

"నాకు బోరు కొట్టింది" అని అతడు చెప్పాడు.

దీన్ని మీరు ఊహించగలరా!

14 ఏళ్ళ వయసులో ఆ పసిబాలుడికి ఎంతబోరు కొట్టింది అంటే సామాన్య జీవితం అందించే ప్రతి వస్తువు అందుబాటులో ఉండగా అతని అన్వేషణలో హింసే అతనికి నచ్చింది!

తీవ్ర విసుగుదల మన కాలంలోని ప్రత్యేక రోగం. 5 సంవత్సరాల పసిప్రాయంలోనే పసిబిడ్డకు విసుగుదల అర్థం ఒంటబట్టింది.

వారి గురించి మనకు ఏమి తెలుస్తుంది? 5 సంవత్సరాల ప్రాయానికే అభిరుచి ఉన్న ప్రతి వస్తువును చూడటాన్ని అప్పటికే పూర్తి చేశారన్న మాట!

ఓ, ఇప్పుడు నేను చూస్తున్నాను !

కుంగుబాటు, త్వర, ఒత్తిడులతోపాటు విసుగుదల ఆధునిక జీవన శైలిలో ఒక భాగం! నగర ధనికులలోను మేధావులలోను కనిపించే ప్రత్యేక లక్షణం. నీవెలా నడుచుకుంటున్నావు? నీకు విసుగు వచ్చేటట్టుగా ఎలా ప్రవర్తిస్తున్నావు? విసుగు చెందటానికి జీవితాన్ని ఉపేక్షించే మహత్తర శక్తికావాలి. విసుగుదల జీవితాన్ని మద్దు పరిచేది మతెక్కించేది!

జీవితం జీవితంతో స్పందిస్తుంది - మీరు మీ కళ్ళను తెరచి చూడగలిగితే.

వ్యక్తిగత అపాయమున్న క్షణాల్లో గడియారం మందగమనంతో కదులుతున్నట్లు మీరు గమనించారా? మీరు పడినప్పుడు లేదా ఏదైనా మోటారు కారు మోటారు వాహన దుర్ఘటనకు లోనవటాన్ని ఊహించండి! మీరు వెనక్కితిరిగి చూచినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పటికి ప్రతిక్షణం మందగమనంతో జరిగినట్లనిపిస్తుంది! ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే మీ జాగృతిని గూఢ శక్తులన్నిటినీ పిలుస్తారు! ఆ క్షణంలో మాత్రమే 100% మీరు జాగరూకులవుతారు-ఆ క్షణాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉంటారు. ఆ క్షణంలో మాత్రమే మీరు నిజంగా జీవించినట్లు. మీరు సంపూర్ణంగా తెరచి ఉన్నప్పుడు, ప్రతి క్షణాన ఏదో కొత్త, తాజా, ఆసక్తిదాయక విషయం జరుగుతున్నట్లు మీరు కనుగొంటారు.

మన సామాన్య దినసరి వ్యవహారంలో మనం ఏ మాత్రమూ గమనించకుండానే రోజులు వారాలుగా వారాలు నెలలుగా గడుస్తుంటాయి. కాని మీరు వారాంతపు శలవులో వెళ్ళినప్పుడు రెండు రోజులు శాశ్వతమనిపిస్తాయి.

అనుభవిస్తూ జీవిత రసాన్ని ఆస్వాదిస్తారు. మనం ప్రతి క్షణాన్ని, ప్రతి బిందువును ఏవిధంగా ఆస్వాదించి ఆనందించాలో మనకు తెలియదు.

వాస్తవమేమిటంటే, జీవితాన్ని యథాతథంగా ఎలా చూడాలో మరిచిపోయాము. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువును మన కోరికలు, అలవాట్లు, భయాలు అనే కళ్ళద్దాల ద్వారా చూస్తుంటాం. నేడు, క్వాంటమ్ భౌతికశాస్త్రం చిత్తనిర్మాణమే యథార్ధమని చెప్పేటంతవరకు వెళ్ళింది. దీనినే మన జ్ఞానులయిన పూర్వీకులు 'మాయ' అని వ్యవహరించారు. మన ఆశా భయాల యథార్థ్యనాశనం మాత్రమే మాయ.

మన కాలంలో, మనకు ఇంకో సరదా హంతకుడు, మస్తిష్క జ్ఞానం, మన జీవితాలు మొత్తం మీద ఎక్కువగా మస్తిష్కానికి సంబంధించినవి. మనం మేధతో ఎక్కువగా జీవిస్తున్నాము, అనుభవంతో తక్కువగా జీవిస్తున్నాము. మీరు గమనిస్తే, అధిక మేధా సంపన్నులే చాలా సులువుగా బోరు కొట్టి ఉంటున్నారు! వారు జ్ఞానంతో గుడ్డి వారెపోయారని మీరు చెప్పవచ్చు! ఎందుకంటే ప్రతి విషయం నుంచి జ్ఞానం సిద్దాంతాన్ని రూపొందించ గల్గుతుంది. జ్ఞానం జీవితాన్ని తెలిసిన, ఆశించిన పెట్టెలో పెట్టగలదు. ఇంకో మాటలో చెప్పాలంటే, మనం ఆశించిన దానినే, మనం చూస్తాం, మనం జీవితాన్ని విసుగు పుట్టించేదిగా చూడటంలో ఆశ్చర్యం లేదు.

నేను జ్ఞానాన్ని ఖండించటం లేదు. మన దినసరి జీవన గమనానికి జ్ఞానం అత్యవసరం. విసుగు చెందటం కూడా తప్పకాదు. కొన్నిసార్లు విసుగు చెందటం సాధారణం! నేను చెప్పినట్లుగా విసుగుదల ఉత్కృష్ట మనశ్చిహ్నం. మీరు విసుగు చెందిన

ప్రెస్స్ కోతులను ఎప్పుడయినా చూశారా? విసుగు చెందటాన్ని తప్పగా భావించకండి! అసక్తిగా పానకోసం నేను మీకు చెప్పేదేమిటంటే ప్రయోగాత్మక జ్ఞానాన్ని జాగృతికి ప్రత్యామ్నాయం చేయకండి. మీ మేధా సంబంధి ఉపగమనాన్ని జీవిత దినసరి క్రియలతో గుడ్డిగా అయి పోయేటట్లు చేసుకోకండి. ప్రతి క్షణం జాగృతిలో జీవించటానికి చాలా కష్టమయిన దానిని దేనినీ చేయవలసిన అవసరం లేదు. జీవితాన్ని వాస్తవంగా ప్రశంసించేటట్లు ఉండటానికి మీరు దుర్ఘటనకు గురి కావనవసరం లేదు, లేదా విదేశీయ సెలవలను గడపనవసరం లేదు!

అది చాలా స్పష్టం: వేరే ప్రదేశానికి ఏ మాతమూ వెళ్ళనక్కరలేదు, వేరే మహాద్యుత కార్యాలను సాధించనవసరం లేదు. మీరు దాన్ని ఎలా చూడాలని ఎంచుకుంటారో అంతా దానిపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి నన్ను అడగకండి, నా జీవితం సామాన్యంగా ఉంది. ఎంతో విసుగుదలలో ఉంది. అద్భుతంగా గమనించటానికి ఏముంది? అని.

మీరు ఆశ్చర్యపడతారు. మీ దినసరి జీవనంలో కూడా సంపూర్ణ జాగృతి సాధ్యం. చిన్న కథ :

పల్లెటూరి బాటపై ఒక మేధావి ఒక వృద్దురాలిని కలిశాడు. ఆ ముదుసలిది తన మేకలను మేపి ఇంటికి తిరిగి వస్తుంది. ఏటి నీటితో నిండిన నిండుకుండను తలపై ఉంచుకుని ఆమె నడుస్తూ వస్తోంది. మేధావి ఆమెకు ఓ సలహా ఇవ్వాలని అనుకున్నాడు. "పాపంచిక విధులలో ఇంకా నీవు విరాంతి లేకుండా ఉన్నావా?"

ఓ, ఇప్పుడు నేను చూస్తున్నాను !

అని అతడు ఆమెను అడిగాడు. "నీ వయసులో మిగిలిన విషయాలను పక్కన పెట్టాలి, దేవుడి మీద ఏకాగ్ర దృష్టి పెట్టాలి! అని ఆ మేధావి ఆమెకు సలహా" ఇచ్చాడు.

ఆమె సమాధానమిచ్చింది : "నా ఏకాగ్రదృష్టి భగవంతుడి మీద లేదని ఎవరు చెప్పారు? ఈ క్షణంలో కూడా, మీతో మాట్లాడుతున్నప్పుడు, మేకల్ని కాపలా కాస్తున్నప్పుడు నా దృష్టి నా తలపై ఉన్న నీళ్ళకుండ పైనే ఉంది. ఇదేవిధంగా నా ఇంటి పనులను నిర్వర్తించేటప్పుడు నా జాగృతి ఎల్లప్పుడూ భగవంతుడిపైనే ఉంటుంది".

నిత్యజీవనంలోకి జాగృతిని తీసుకురండి - ప్రతి రోజు నిజంగా అద్బుతమనిపిస్తుంది. విసుగుదల తక్కువ శక్తికి చిహ్నంకాదు, అది నీకున్న శక్తి సామర్థ్యాల తక్కువ ఉపయోగ సూచన. ఐన్ స్టీన్ మనకు అనంత శక్తిని ప్రసాదించాడు - కాని మనకు దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు.

మనం దానిని జాగృతిలోకి, సృజనలోకి, ఉత్పత్తిలోకి, ప్రేమలోకి పంపలేకపోతున్నాము. మీ శక్తిని సరయిన దిశలోకి పంపకపోవటం పాపం.

నీలో ఎంతో శక్తి ప్రసరిస్తోంది. దానికి ఏమవుతుంది. నీవు దానిని సరిగా ఉపయోగించు కోకపోతే నీవు నేరుగా తమస్సులో పడిపోతావు. దాని తర్వాత కుంగి పోవటం, విసుగుదల కల్గుతాయి - ఇవి పిల్లలు తమలోతాము కేవలం వేడుకకోసం పరస్పరం గాయపరచుకోవటానికి పురికొల్పుతాయి.

ఆట వస్తువులలో ఆడుకోవటంలో విసుగు చెందటం పిల్లలు మాత్రమేకాదు. మనం కూడా విసుగు చెందుతాము, మన అభిరుచికి అనుగుణంగా ఉండి ఆకర్షించే దానినే చూస్తుంటాము. ఈ కారణం చేతనే బజారులో ప్రవేశపెట్టబడ్డ ఏ వస్తువునైనా కొనుగోలు చేయటానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. ఉత్పత్తి విజయం లక్ష్య విపణిలోని విసుగు చెందిన ప్రజల సంఖ్యపై నేరుగా దామాషా పద్దతిలో ఉంటుంది.

మనం వస్తువులతో మాత్రమే ఆడుకోవటంలేదు - ప్రజలతో కూడా ఆడుకొంటున్నాము. దాదాపు ప్రతి వ్యక్తి ప్రామాణిక ఫిర్యాదు చేస్తుంటాడు. వారి కుటుంబం, స్నేహితులు ప్రపంచంలో ఎంతో విసుగు కలిగించే వ్యక్తులు! మనం కాలమంతా కొత్త కొత్త వ్యక్తులను అన్వేషించి పొందటంలోనే గడిపేస్తుంటాము - కొత్త స్నేహితులు, కొత్త పొరుగుంటివారు, కొత్త క్లబ్బు, నూతన మిత్రుడు, ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాలలో, కనీసం మూడు నెలలకోసారి జనం తమ కారును, స్నేహితురాలిని మార్చుకుంటారు. మనం మన పరిసర ప్రాంతాల పట్ల విసుగు చెందుతాము, ఇంకొకరంటే విసుగు చెందుతాం, చిట్టచివరకు మనం మనమంటేనే విసుగు చెందుతాం. వాస్తవమేమిటంటే, మనం ఒంటరిగా ఐదు నిమిషాలు గడపలేము. మనం పూర్తిగా నిరాసక్తులుగా ఉండి మనల్ని మనం గమనించటానికి భయపడతాము. మన అందరి సామాజికీకరణ మనల నుండి మనం తప్పించుకోవటానికే. స్పష్టంగా ఉండండి : జీవితం విసుగు పుట్టించేదికాదు, మనస్సు మాత్రమే విసుగు పుట్టించేది!

మనస్సు ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. అద్దం మీద దుమ్ము ఉంటే ప్రపంచం బాగా ఎట్లా కనిపిస్తుంది? మనస్సు ప్రపంచానికి మిమ్మల్ని స్పందించేటట్లే చేయటం లేదు.

దేనికయినా అలవాటు పడటం మనః ప్రవృత్తి, మీరు దేనికయినా అలవాటు పడినప్పుడు అది లభించినట్లుగానే భావిస్తారు. ఈ కారణంగానే మీ తోటలోని పూలను రెండోసారి కనువిప్పి చూడరు. బయట మీరు వీక్షించే స్త్రీ వలె మీ భార్య మీ కెప్పడూ ఆసక్తికరంగా కన్పించదు. నేడు ఏదో కొత్త దానికోసం ప్రయత్నించండి: మీ పూలతోటలో నడవండి లేదా మీ వీథిలో తిరగండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని విషయాలను గమనించకుండా ఉండిపోయారో తెలుస్తుంది. ఎన్ని మొక్కలు వికసించాయో! ఎన్ని రంగులు! ఎన్ని ఇళ్ళు తాజాగా రంగులు వేయబడి ఉన్నాయో! ఎన్ని ధ్వనులను మీరు వింటున్నారో !

మీరు నడుస్తున్నప్పుడు మీరు వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా గమనిస్తూ వేయండి. మీ ముఖం మీద పడే ఎండను గమనించండి, మీ చర్మానికి తగిలే చల్ల గాలిని గమనించండి.

మనస్సును సంపూర్ణంగా లగ్నం చేసి నడవండి.

ఈ రోజుల్లో మీరు ఎంత కోల్పోయారో తెలుసుకొని ఆశ్చర్యపోతారు! జీవితం విలువ కల కానుక, కాని దానిని మీరు అప్రయత్నంగా సునాయాసంగా లభించినట్లుగా భావిస్తున్నారు. జీవితం తాను నిత్య నూతనంగా ఉండి నిరంతర పరివర్తన చెందుతున్నప్పుడు, అది మీకు ఎలా బోరుకొడుతుంది.

ఏకాగ్రత గొప్ప ధ్యాన విద్యామర్మం.

మీరు జాగృతిలో ఉన్నప్పుడు మీ మనస్సుకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వరు! సంపూర్ణంగా వర్తమానంలో ప్రవేశించినప్పుడు మీ మనస్సు మీ మీద భూతాన్ని లేదా భవిష్యత్తును రుద్దలేదు.

ఆ ప్రాపకాలు లేవు, ప్రణాళికలు లేవు, ప్రస్తుత క్షణానికి సంబంధించిన సంపూర్ణ జాగృతి. జాగృతితో మాత్రమే చిత్తైకాగ్రతను అనుభూతిని పొందగలరు. చిత్తెకాగ్రతతో మీరు జ్ఞానోదయాన్ని పొందగల్గుతారు.

ఒక వ్యక్తి బుద్ధుణ్ణి అడిగాడు :

మీ శక్తుల గురించి మేము చాలా విన్నాము! మీరు దేవుడా?

కాదు, నేను కాదు.

అపీశడు మాంత్రికులా? లేదా గారడీ వారా?

కాదు.

అప్పుడు మీరెవరు?

నేను జాగృతిని అని బుద్ధుడు సమాధానం చెప్పాడు.

మేల్కొని ఉండటం స్వేచ్ఛగా ఉండటం. అజ్ఞానం నుండి, దుఃఖం నుండి, విసుగునుండి స్వతంత్రంగా ఉండటం.

మీ అద్భుత భావం విలువయినది కాబట్టి దాన్ని పదిలం చేసుకోండి!

మీ జాగృతితో, ప్రతిదిన అద్భుతాన్ని మీ అద్భుతమయ జీవితంలో చూడగల్గుతారు.

కేవలం మీ జాగృతితో, మీరు మీ ప్రపంచాన్ని మార్చుకో గల్గతారు.

జ్యోతిశ్శాస్త్రం & అవతల

జ్యోతిశ్శాస్త్రానికి శాస్త్రీయ ఆధారం ఉందా?

జ్యోతిశ్శాస్త్రం వ్యవహారంలో సంక్షిష్టమయిన అంశం. కారణమేమిటంటే దాన్ని నమ్మేవారి సంఖ్య నమ్మని వారి సంఖ్య సమానంగా ఉంది.

నమ్మని వారికి, జ్యోతిశ్శాస్త్రం నిరూపిత శాస్త్రం అని చూపించవలసి ఉంది. జ్యోతిశ్శాస్త్రమే అంతిమ శాస్త్రంకాదని జ్యోతిశాస్త్రాన్ని నమ్మిన వారికి నచ్చ చెప్పాలి. జ్యోతిశ్శాస్త్ర జ్యోస్యాలకు అతీతమయిన మార్గం ఉంది.

గురించి నేను వివరించటానికి ప్రయత్నిస్తాను. ప్రాచీన కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతులచే బాబిలోనియన్ల చేత, గ్రీకుల చేత, రోమన్ల చేత, అరబ్బుల చేత, హిందువుల చేత - జ్యోతిశ్శాస్త్రం అభ్యసించబడింది.

విశ్వమూలాంశాలు భూమి మీది జీవితాన్ని సంఘటనలను ప్రభావితం చేస్తాయి అనేది జ్యోతిశ్శాస్త్ర మౌలిక సిద్ధాంతం.

అది నిశ్చితంగా వాస్తవం.

భూమి ఒంటరిగా ఉన్న గ్రహంకాదు. మనం తెలుసుకున్న తెలుసుకోలేకపోయినా మన మందరమూ వ్యోమగాములం! బహిరాకాశంలోని సంఘటనలు మన జీవితాలను నిశ్చితంగా ప్రభావితం చేస్తాయి.

ఎలా !

సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నీ భూమి మీది జీవిత లయలను ప్రభావతం చేసే అయస్కాంత క్షేతాలు భూమ్యాకర్షణ శక్తులు, కిరణ ప్రసారాలు కలిగి ఉన్నాయి.

జ్యోతిశ్శాస్త్రం & అవతల

దినసరి ప్రాతిపదికన సూర్య చంద్రులు మనల్ని ప్రభావితం చేస్తున్నాయని మనకు తెలుసు.

ప్రతిరోజు సూర్యుడి స్థితిపై ఆధారపడి ఉష్ణోగ్రత హృదయస్పందన మొదలయిన వాటి శారీరక మార్పులను మనం అనుభవిస్తున్నాము.

పౌర్ణమి సమయంలో 'పిచ్చి' ముదురుతుంది అనే విషయానికి సాక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సంస్కృతుల నుండి మనకు లభిస్తుంది. వాస్తవానికి, చంద్రుడికి సంబంధించింది అనే అర్థం కల 'లూనార్' పదం నుండి లూనటిక్ (పిచ్చిది, పిచ్చివాడు) పదం పుట్టింది. ఇది కేవలం డొల్ల విశ్వాసం కాదని ప్రయోగాలు నిరూపించాయి. పౌర్ణమి రోజులలో వినాశకర వాహన చోదన, దహనకాండ, ఆత్మహత్యలు వంటి వాటి పెరుగుదల మానసిక ప్రవర్తన వల్ల జరుగుతున్నాయని తెలపటానికి అమెరికన్ వైద్య వాతావరణ శాస్త్రసంస్థ వద్ద విస్తృత గణాంక సాక్ష్యం ఉంది. చంద్రుడి దశలు శ్వాసకోశ రక్త ప్రసరణ వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నాయని మృత్యు సమయాన్ని కూడా ప్రభావితం చేసేవిగా ఉన్నాయని జర్మనీ ప్రయోగాలు నిరూపించాయి. సూర్య జ్వాలల లేదా సూర్యుడిలోని గందరగోళ పరిస్టితుల సమయంలో మానసిక చికిత్సాలయాలలోని ప్రపేశాల సంఖ్య అధికంగా పెరగటాన్ని మనం గమనించాము. సూర్యుడు, చందుడు మన శారీరక, భావోదేక, మానసిక స్థితిని తీవంగా ప్రభావితం చేయ గల్గుతున్నప్పుడు, గ్రహాలు కూడా అదేవిధంగా చేస్తాయి అనే విషయాన్ని మనం ఎలా సందేహించగలము?

రసాయనిక సంవిధానంలో, గ్రహాలలోని పదార్థాలవంటి దానితో సమానమయిన దానితోనే మనిషి తయారు చేయబడ్డాడు. సహజంగా, ఇతర గ్రహాలచే భూమి అయస్కాంత క్షేతాలలో ఉత్పన్నమవుతున్న మార్పులకు మనం స్పందిస్తాము.

జ్యోతిశ్శాస్త్రజ్ఞులు రోజు వారి ప్రాతిపదికన ఉన్నప్పుడు, వాటిని అర్థం చేసుకోవటం తేలిక కాదు గ్రహాలు మనపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. ఇది జ్యోతిశ్నాస్త్ర కార్యాలకు ఆధారం.

జ్యోతిశ్శాస్త్ర క్యాస్యాలు (ముఖ్యంగా భరతదేశంలో జనాదరణ పొందినవి. బాతక చక్రాన్ని బిడ్డ పుట్టగానే తయారు చేస్తారు. జాతక చక్రం బిడ్డ పుట్టుక సమయాలను, బిడ్డ తీసుకోబోయే ఉద్యోగం మొదలయిన వాటిని, బిడ్డకు ఎప్పుడు పెళ్ళి కాబోతుంది అనే విషయాన్ని, ఇంకా ఎన్నో ఇతర విషయాల్ని తెలుపుతుంది.

గ్రహం మనల్ని ప్రభావితం చేస్తాయి అని జనం విశ్వసించినప్పటికి, వారు ఈ విషయాలను మనం ముందుగా తెలుసుకోగలం అనే దానిని నమ్మటంలేదు. మీరు పుట్టినప్పటి గ్రహాల స్థితిగతులు మీరు అవలంబించబోయే వృత్తులను ఏవిధంగా నిర్ధయిస్తాయి?

పూర్వీకుల అనుభవం దాన్ని నిరూపించింది !

పిట్స్‌స్ బర్గ్‌లో మనశ్శరీర ధర్మ ప్రయోగశాలలో పనిచేస్తున్న ప్రయోగకారుడు మైఖేల్ జాక్విలిన్ 1084 ప్రసిద్ధ భౌతిక శాస్త్రజ్ఞులను పరీక్షించి కుజశనిగ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వారంతా జన్మించారనే అద్భుత విషయాన్ని కనుగొన్నాడు. ఫలితాలు కాకతాళీయమనుకోవటానికి కేవలం కోటి రెట్లు అవకాశముంది !

ఇంకో ప్రయోగం : వెర్మన్ క్లార్క్ అనే అమెరికా మనస్తత్వ శాస్త్రజ్ఞుడు వివిధ వృత్తులకు చెందిన అనేక ప్రజా సముదాయాల నుండి జాతక చక్రాలను సేకరించాడు.

తరువాత ఈ జాతక చక్రాలను 20 మంది జ్యోతిశ్నాస్త్ర వేత్తలకు వ్యక్తుల వృత్తులకు జోడించి జోస్యాన్ని తెల్పవలసిందని పంపాడు. 20 మందిలో 17 మంది సరయిన సమాధానాల్ని కాకతాళీయమని చెప్పటానికి వీలులేని విధంగా 100 రెట్లు ఖచ్చితంగా జోస్యం చెప్పారు! క్లార్క్ ఈ పరీక్షలను పునరావృతం కావించాడు, ప్రతిసారి పరీక్షలను కొనసాగించాడు. అతడు ఇతోధికంగా ఆకట్టుకునే ఫలితాలనే సాధించాడు ! పూర్వ పాచీన కాలం నుండి భరతదేశంలో జ్యోతిషం ఖచ్చితంగా దీనికోసం ఉపయోగించారు: వ్యక్తి జీవితంలో ఏ మార్గాన్ని అనుసరించాలో నిర్ణయించటానికి. గురుకులంలో బాలుడు ప్రవేశించినప్పుడు అతని వ్యక్తిత్వం ఏవిధమయినదో, అతని వైఖరి ఎటువంటిదో, అతని సహజాభిరుచి ఎటువంటిదో నిర్ణారణ చేయటానికి జ్యోతిషం ఉపయోగపడేది. తదనుగుణంగా, వేదాధ్యయనంలో, సాముగరిడీలలో, వ్యాపార నైపుణ్యాలలో లేదా అతడికి ఏది తగినదో దానిలో అతడికి శిక్షణనిచ్చేవారు. భరతదేశంలో జ్యోతిషం వ్యాప్తి చెందటానికి ఇది ఒక హేతువు.

ఈ రకమయిన జోస్యం ఎలా సాధ్యం ?

చంద్రదుడి కార్యకలాపం కొంత మేరకు మన మనఃస్థితులను నిర్ణయించినట్లుగా, చంద్రుడు, గ్రహాలు కూడా గర్బస్థ శిశువుపై ప్రభావం చూపుతాయి. నిశ్చిత తరంగ దైర్ఘ్య కిరణ ప్రసారం నిశ్చిత మస్తిష్య క్షేతాన్ని ఉద్దేకపరుస్తుంది. అది చిట్టచివరకు ఒక వ్యక్తి గణితంలో రాణిస్తాడా, కళాత్మకంగా అభివృద్ది పొందుతాడా మొదలయిన వాటిని నిర్ణయిస్తుంది. శిశువు అభివృద్ధి సమయంలో ఏ గ్రహాలు చురుకుగా ఉన్నాయో మనం తెలుసుకుంటే, మనం వాడి భవిష్యత్తును గురించి కొంతవరకు ఖచ్చితంగా జోస్యం చెప్పవచ్చు. మీ అవగాహనకు మౌలిక వివరణ. అంతేకాకుండా పదార్లమంతా ఒకే రకమయిన మౌలిక రేణువులతో కూర్చబడింది. ప్రతి చోట ఈ రేణువులు ఒక పధంగా ప్రవర్తిస్తాయి - అవి గ్రహంలో భాగం కావచ్చు చెట్టులో లేదా మీలో భాగం కావచ్చు! పదార్టం కూడా తరంగ గతి విశేషమని క్వాంటమ్ మెఖానిక్స్ నిరూపించింది. కాబట్టి గ్రహాలలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేక తరంగ గతి ఉంది. భిన్న తరంగ దైర్యాల నుండి తరంగాలు (భిన్న గ్రహాల నుండి) పరస్పరం కలుసుకున్నప్పుడు, ఒకదానిపై ఒకటి ముద్దవేసుకున్నపుడు, కొన్ని ఉన్నత బిందువుల (రెండు తరంగాలు క్రమ పద్ధతిలోను, గుణాలు పెరిగిన సమయంలోను) కొన్ని నిమ్నబిందువులు (అవి పరస్పర ప్రభావాన్ని రద్దు చేసుకుంటాయి) ఉంటాయి. ఈ విధంగా వివిధ గ్రహాల ప్రభావాన్ని ఏర్పరుస్తారు.

తరంగాలకు నియత పౌనఃపున్యం ఉన్న కారణంగా, నియత వ్యవధానంలో త్రిగుణబద్దతగా భంగాల సమయాలు కూడా సంభవించవచ్చు. దీన్ని ఆధారంగా తీసుకొని, జ్యోతిశ్శాస్త్రజ్ఞులు మీ జీవితంలోని ఒడిదుడుకులను (జోస్యం) చెబుతారు.

జ్యోతిశ్శాస్త్రానికి ఆధారం గారడీకాదు, ఇది గణితం, జ్యోతిశ్నాస్త్ర సమీకరణ వంటిది. జ్యోతిశ్నాస్త్ర సమీకరణలో సూర్యుడి చందుడి గ్రహాల స్థితులను చరరాశులుగా చూడగలం.

ఈ స్టితులపై వాటి ప్రభావాలపై ఆధారపడి చేసిన సంక్షిష్ట గణనల ద్వారా శిక్షణ పొందిన జ్యోతిశ్శాస్త్ర వేత్త ఖచ్చితంగా సరిగా నిరూపించ తగ్గ ఫలితాలను ఉత్పత్తి చేయగలుగుతాడు.

ఇతర ప్రమాచారంలాగానే, జ్యోతిశ్నాస్త్ర దత్తాంశం గణాంక రీత్యా విశ్లేషించవచ్చు, గుణాత్మకతను నిశ్చయించవచ్చు.

సౌండ్ ఉమ్మా ఏమిటంటే అతి విస్తృతమయిన అనేక చరరాశుల దత్తాంశం క్షీణించి గుణించుకోవాలి, విభిన్న ప్రస్తార సంయోగాలను పూర్తిగా లెక్కలేసి త్రిమాంశాల యొక్క ప్రత్యేక సమ్మిళిత ప్రభావాన్ని పరిశీలించాలి. ఇంతేకాకుండా ఈ ఉసిల్ని కాకుండా ఇతరుల్ని కూడా ప్రభావితం చేస్తాయి.

జ్యోతిశ్ళాస్త్రం & అవతల

ఇది మిక్కిలి కఠినమయిన విధి, కాబట్టి ఈరోజులో చాలామంది జ్యోతిశ్నాస్త్ర వేత్తలు తుదకు ఖచ్చితమయిన ఫలితాలను ఇవ్వని కొన్ని మౌలిక చరరాశులను ఉపయోగిస్తున్నారు. అన్నిటి కంటె మించి, ఫలితాలను ఎవరికి వారు బహిరంగంగా అన్వయించవచ్చు. దీని ఫలితంగా ఈ శాస్త్రం తక్కువ విశ్వసనీయతను పొందుతుంది. ఈనాడు జ్యోతిశ్శాస్త్రం విశ్వసనీయ శాస్త్రంగా చూడబడకపోవటానికి ఇవి కారణాలు.

నేను ఇక్కడ జ్యోతిశ్నాస్తాన్ని నిరూపించటానికి లేదా ఖండించటానికి లేను.

నేను ఇక్కడ దాని రహస్యాన్ని ఛేదించటానికి ఉన్నాను. జ్యోతిశ్నాస్త్రం మీమీద పనిచేసే ప్రభావాల గురించి స్పష్టమయిన భావాన్ని కలగజేస్తుంది. అది మీ సమస్యను తెలియజేస్తుంది కాని పరిష్కారాన్ని చూపించదు.

ధ్యానం పరిష్కారాన్ని చూపించగల్గుతుంది. ధ్యానం సూర్యుడికి, గ్రహాలకు, మీకు దారి చూపించే విశ్వశక్తితో అనుసంధానం చేసేది మాత్రమే. మీరు విశ్వశక్తితో కలిసి సామరస్యంతో పని చేస్తున్నప్పుడు, ఈ ప్రభావాల నుండీ మీకు సహజంగా మంచి రక్షణ లభిస్తుంది. ఏ వ్యక్తి అయినా వర్షంలో తడిసి వెళ్తున్నప్పుడు, ఈ వ్యక్తికి రొంప పట్టటం సహజం, కాని రైన్‌కోటు వేసుకొని వర్షంలో వెళ్ళినప్పుడు, ఆ రైన్‌కోట్ తప్పకుండా సాయపడుతుంది.

పౌర్ణమినాడు ప్రతి వ్యక్తికి పిచ్చిపడుతుందా?

అలాకాదు ! పౌర్ణమి అప్పటికే సమతూకం తప్పిన మనస్సును ప్రభావితం చేస్తుంది. మీ పరిస్థితులు స్థిరంగా ఉంటే, ఈ అంశాలు మిమ్మల్ని కేవలం ప్రభావితం చేయలేవు. ధ్యానం మిమ్మల్ని ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగాను, మానసికంగాను భావోదేకంగానూ కూడా బలపరుస్తుంది.

ధ్యాసంతో మీరు జ్యోతిశ్నాస్త్ర పరిధి దాటి వెళ్ళగల్గుతారు.