KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/మీ విధిని మీరు నిర్వర్తించవద్దు !Sign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

మీ విధిని మీరు నిర్వర్తించవద్దు !

విధి ప్రతిగా బాధ్యత

ఒక రాతన హిందూ కథ :

రాజుగారు అడవిలోకి వేటకు వెళ్లారు. అకస్మాత్తుగా పిల్లనుగోవి నుండి వెలువడిన మధుర సుస్వరాన్ని విని రాజుగారు మంత్ర ముగ్ధులయ్యారు. సంగీతం ఎక్కణ్ణుంచి వస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నించి రాజుగారు చివరకు, అది తన గుడిసె బయట కూర్చుని నది, గాలి వింటూండగా స్వేచ్చగా వాయించే మనిషిని సమీపించారు.

ఆ మనిషిని రాజుగారు అడిగారు. 'నీవు పిల్లన గ్రోవిని అద్భుతంగా మోగిస్తున్నావు. దీన్ని నీకు ఎవరు నేర్పారు?'.

'ఎవరూ కాదు!' ఆ మనిషి నవ్వాడు. "నేను ఇక్కడ కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుప్పడు సంగీతం దానంతట అదే వస్తుంది. నా ఆనందాన్ని వ్యక్తం చేసే మార్గమిదే!" అని అతడు పలికాడు.

రాజుగారిని అతడు ఆకట్టుకున్నాడు. రాజభవనంలోని సంగీత విద్వాంసులెవరూ అంత బాగా వాయించలేరు. రాజుగారు అతణ్ణి తనతోబాటు రాజ భవనానికి తీసుకుపోవలని నిర్ణయించారు. ఆ మనిషి తిరస్కారాన్ని తెలిపినప్పటికీ, రాజుగారు అతణ్ణి తన రాజభవనానికి తీసుకుపోయాడు. అతడు చేయవలసిన పని తన మధుర సంగీతంతో కేవలం రాజుగారిని సంతోషపెట్టటమే. రాజుగారు అతడికి రాజోద్యానవనానికి ఎదురుగా ఉన్న రాజభవనంలోని చక్కటి గదిని నివసించటానికి ఏర్పాటుచేశారు.

మర్నాటి పొద్దుట, రాజుగారు పొద్దుటే లేచి అతణ్ణి ఉద్యాన వనానికి రప్పించారు.

"పిల్లనగ్రోవి శ్రావ్యంగా మోగించు" అని రాజుగారు ఆజ్ఞాపించారు. వినయంగా ఆ మనిషి పిల్లన గ్రోవిని మోగించాటానికి తంటాలు పడ్డాడు - కాని దాని నుండి ఏ సంగీతమూ రాలేదు !

రాజుగారు ఆశ్చర్యపోయారు!

"సంగతేమిటి? రాజోద్యానంలో సౌందర్యంలోపించిందా? పిల్లన గ్రోవి మోగించటానికి ప్రోత్సాహం లభించటం లేదా?" అని రాజుగారు గట్టిగా అడిగారు.

"లేదు! అలాకాదు, ఉద్యానవనం మనోహరంగా ఉంది, కాని నా సంగీతం, ఉద్యానవన సౌందర్యానికి ఏ మాత్రం సరిపోలడం లేదు" అతడు విచారంగా అన్నాడు.

"ఎందుకు?" అడిగారు రాజుగారు.

"ఎందుకంటే నిన్న నా సంగీతం నాకు ఆనందాన్నిచ్చేది. ఈ రోజు అది నావిధి అయింది!" అని అతడు రాజుగారికి సమాధానమిచ్చాడు.

వాస్తవంగా విధి అనేది అసహ్యకరమయిన పదం. భాషలోని ఇక ఏ పదానికీ సంతోషాన్ని దుఃఖంలోకి మార్చే అద్భుత శక్తిలేదు.

మన కాలంలో విధి మిక్కిలి నిందా పదం.

నాగరికత చరితలో, ఒకరి విధి నిర్వహణ ప్రాముఖ్యాన్ని గురించి ఎంతో చెప్పబడింది. రాయబడింది, వాస్తవంగా విధి అంటే ఏమిటి? అని అడగవలసిన సమయ మాసన్నమయింది. తప్పడు కారణం కోసం ఒక పనిని చేయటమే విధి. బయటి

నుంచి మన మీద విలువల భావాన్ని, రుద్దినప్పుడు విధి ఆవిర్బవిస్తుంది. మీరు స్వయంగా ఒక పని చేసినప్పుడు, ఆ పనిలో మీకే ఏ మాతం సంతోషం లేదా సర్వహణ తృప్తి లేనప్పుడు, అది సామాన్యంగా మీరు కేవలం మీ విధిని నిర్వహిస్తున్నట్లు అవుతుంది. అపవాదం లేకుండా, ప్రతి వ్యక్తి తన విధిని నిర్వహించే భావానికి రహస్యంగా తిరుగుబాటు చేస్తాడు.

కాని విధి రెండుంచల కత్తి !

మీరు కేవలం విధి భావంతో ఒక దానిని చేస్తే, సామాన్యంగా మీరు చిరచిరలాడుతూనో భంగపాటుతోనో ఉంటారు. కాని మీరు విధిని నిర్వహించకుంటే మారుగా తప్ప చేసిన భావంతో ఉంటారు! రెండు విధాలుగాను, విధి మీకు సుఖం పొందే అవకాశాన్ని ఇవ్వదు. మనంతట మనం విధి అనే ఉక్కుబోనులో ఎలా చిక్కుకున్నాము? విచారకరమయిన వాస్తవమేమిటంటే, మనలో చాలా మందికి తమ జీవితాన్ని తమతమ ఇష్తానుసారం గడుపుకునే ధెర్యం లేదు. మనం అనేక సంస్థల - సాంఘిక, నైతిక, న్యాయ ఆశ్రయాన్ని వెదుకుతున్నాము. కాని జీవితంలో మనకు ఏదీ ఉచితంగా రాదు అనే విషయాన్ని మనం మరచి పోతుంటాము! తిరిగి, ఈ సంస్థలు మన మీద విధులను విధిస్తాయి. తుదకు మన నియంత్రణలు సదా ఇతరుల చేతులలో ఉంటాయి! కాని మనం బోనులో చిక్కుకున్నామన్న విషయాన్ని ఏ మాతము తెలుసుకోలేనంతటి గాఢ అచేతనావస్థలో ఉంటాము.

ఒకప్పుడు ఒకవ్యక్తి సన్యాసం కోసం బుద్ధుడి దగ్గరకు వచ్చాడు.

అతడు బుద్ధుడి శిష్యుడు కావాలనుకున్నాడు.

బుద్ధుడు నవ్వి అతడికి చెప్పాడు. సరే, నిన్ను అంగీకరిస్తాను. కాని ఒక షరతుపైన మొదట, నీవు వెళ్ళి నీ కుటుంబాన్ని, నీ స్నేహితుల్ని చంపి అప్పడు నా దగ్గరను .

ఆ మనిషి ఆశ్చర్యపోయాడు. ఆవిధంగా చెప్పటంలో బుద్ధుడి ఆంతర్యమేమిటి? బుద్ధుడు ఆ మనిషిని నిజంగా అతడి కుటుంబాన్ని స్నేహితుల్ని భౌతికంగా చంపమని చెప్పాడా?

లేదు । బుద్ధుడి భావమేమంటే, "వెళ్ళి నీలో ఉన్న నిరంతరాయంగా బోధిస్తున్న ఖంగం నిర్వాహాన్ని నొక్కిహతమార్చు. వారిని వాస్తవంగా కాకుండా మానసికంగా చంపు. నీ స్థితి నుండి వారి ప్రభావాన్ని తొలగించు" అని.

నీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించండి.

ఈ మస్తిష్కంలో ఎంతమంది జనం కూర్చుని మీరు ఎట్టా జీవించాలో ఏమి చేయాలో మీకు సూచనలిస్తున్నారు?

ఏది ఒప్పో ఏది తప్పో మీకు ఎంతమంది చెబుతున్నారు?

మీ జీవితాన్ని నియంత్రించే జనాలు ఎవరు?

మీ తల్లిదండులు, మీ పిల్లలు, మీ భార్య, మీ స్నేహితులు, కొత్తవారు, సంఘం, శాసనం, మీరు చదివిన సకల నైతిక గ్రంథకర్తలు; మీరు విన్న ప్రసంగకర్తలు. ఏమి త్యాగం చేయాలో ఎవరికోసం త్యాగం చేయాలో చెప్పే తగినంత మంది ఉంటారు. మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, సంఘం కోసం, కూడి భూమికోసం, ఆదర్శం కోసం, దేవుడి కోసం! ప్రతి దేశభక్తుడు చంపటం తన విధిగా భావిస్తాడు.

హిట్లర్ కూడా భూగ్రహం మీది యూదులందర్నీ చంపటం తన పవిత విధిగా భావించాడు, ఆమెడ్లింలో విధి నిర్వహణకోసం జనం శత్రువుల్ని చంపుతారు.

మీ విధిని మీరు నిర్వర్తించవద్దు !

ముఖ్యంగా మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు!

ఈ ప్రశ్నను జాగరూకతతో మీలో మీరు ప్రశ్నించుకోండి:

నా విధిని నిర్వహించుకోవాటానికి నా వాస్తవ హేతువు లేమిటి?

ఇతరులను సంతోష పెట్టాలనే కోరిక ?

అనంగీకార భయం ?

దోష భావన ?

నైతికంగా శ్రేష్ఠంగా ఉండటంలోని గర్వం?

గడచిన 5 సంవత్సరాల నుండి మీరు నిర్వర్తిస్తున్న విధుల జాబితాను తయారు చేయండి. ఇప్పుడు మీరు నిర్వర్తిస్తున్న వాటిని గుర్తించండి.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి : దానికి విలువుందా? మీరు ఇతోధిక ఆనందంగా ఉండటానికి సాఫల్యం పొందటానికి వారేమైనా తోడ్పడ్డారా? లేదా వారు మిమ్మల్ని అస్పష్ట రోష భావానికి గురి చేశారా.

ఇప్పుడు, దీన్ని చేయండి, ఇది ముఖ్యమయినది. ఇతరులకు కొంత చేసినప్పుడు మీకు అమితానందం కలిగిన సమాయలను అన్నింటిని గుర్తించండి. ఈ సమయాలేవి? ఆ ప్రజలెవరు? నిస్వార్ధంగా సదా పనులు నిర్వర్తించిన సమయాలుగా వీటిని మీరు కనుగొంటారు. మీరు స్వేచ్చగా మీ నుండి మీ ఏకాగ్రతను ఇతరులపై దృష్టిని మరల్చినప్పుడు - ఆ ఇతరులు ఎవరైనా కావచ్చు - మీరు ప్రేమించినవారు మీ బిడ్డ, మీ ప్రాణ స్నేహితుడు - మీకు అమితానందం కల్గుతుంది. అపవాదం లేకుండా, ప్రేమతో పని నిర్వర్తించినప్పుడు రోషానుభవం కలగదు. విధి భారంగా ఉండదు. విధి కారాగారం నుండి మిమ్మల్ని ప్రేమ అనే తాళం చెవి విడిపిస్తుంది.

ఇది నైతిక ప్రకటన కాదు.

మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు అంగీకరించండి అంగీకరించకపోండి, మనమందరమూ అత్యంత అంతస్సంబంధీకులం. భూమి పర్యావరణ వ్యవస్థలో ప్రతిప్రాణి భౌతిక సమతలంలో అంతస్సంబంధం కలిగి ఉన్నట్లు, మనకు తెలియకుంటేనే మనమందరమూ పరస్పర సంబంధం కలిగి ఉన్నాము.

ఆది మన ఉనికి యథార్థం.

ఉన్ని గుర్తించటం పరిపక్వతకు గుర్తు.

తాగృతిలోకి దూకగల్గుతారు.

విధిని గురించి ప్రజలు నాతో మాట్లాడుతున్నప్పుడు, వారితో నేను చెప్పాను.

మీరు చేస్తున్నది ఒప్పు.

కాని దాన్ని చేయటానికి గల హేతువు తప్పు!

ప్రేమ నుండి జీవించండి, మనస్సాక్షి నుండికాదు.

మీ బుద్ధిని నమ్మకండి. మీ తెలివి తేటల్ని నమ్ముకోండి. భయం నేరం లేనప్పటికి మార్గంలో ఉండవచ్చు.

అనుభవించవచ్చు. మీరు అడగవచ్చు, కాని నా విధులలో అనేకం నేను ప్రేమించే ప్రజలకు సంబంధించినవిగా ఉన్నప్పుడు నేను ఇటువంటి అతి శ్రమను ఎందుకు పొందుతున్నాను?

మీ విధిని మీరు నిర్వర్తించవద్దు !

ఎందుకంటే, నిత్య జీవనంలోని ఒడిదుడుకులలో దారిలో ఎక్కడో ఒకచోట మీ ప్రేమ బిందువును కోల్పోయారు!

మీరు బలవంతంగా రుద్దబడ్డ విధి భావం చేత మీ సహజ బాధ్యతా భావాన్ని అనుభవం కావించారు.

బాధ్యతకు విధికి మధ్య చాలా తేడా ఉంది.

బాధ్యత నొక్కిచెప్పినట్లుగా ప్రతిస్పందించే సామర్థ్యం. అది ఇతరుల అవసరాలకు ఆకస్మికంగా ప్రతిస్పందించే శక్తి.

తగలబడుతున్న ఇంటి నుంచి ముక్కూమొగం తెలియని వ్యక్తిని రక్షించటానికి మనిషిని పరుగులు తీయించే ప్రేరణయే బాధ్యత. ఏ విధి కూడా దీన్ని సాధించలేదు! బాధ్యత ప్రేమ నుండి సహజంగా పుట్లేది.

మీరు ఇతరుల నుండి వేరుకాదు అని మీరు గుర్తించినప్పుడు అది పుడుతుంది. అది గాఢ అవగాహన నుండి తటాలున లేస్తుంది.

మీరు, కాబట్టి నేను.

ఒకసారి బాధ్యత పొటమరించినప్పుడు, విధి తనంతట తానే అదృశ్యమవుతుంది