Part 3: Open the door...let the breeze in!
మళ్ళీ రహస్యమయినది ఏదీ కాదు!
దీని అర్థం చేసుకోవటానికి, మొదట మీరు మానవ మస్తిష్కం పనిచేసే మార్గాన్ని గురించి కొంత తెలుసుకోవాలి.
మెదడు కార్యకలాపాన్ని సూక్ష్మవిద్యుత్పవాహ రూపంలో నమోదు చేస్తుంది. సమాచారాన్ని అందుకొన్నప్పుడు లేదా నిశ్చిత విధులను నిర్వర్తించినప్పుడు, అది భిన్న పౌనఃపున్యాలలో విద్యుత్ ప్రవాహాలను లేదా లయలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రవాహాలను మస్తిష్క తరంగాలంటారు.
భిన్న కార్యకలాపాలకు సమంగా మస్తిష్క తరంగాలు నాలుగు మౌలిక రకాలుగా ఉన్నాయి. డెల్టా తరంగాలు (గాఢ నిద్దలో ఉద్భవిస్తాయి). ఆల్ఫా తరంగాలు (ధ్యానంలో ఉద్భవిస్తాయి). తీటా తరంగాలు (గాఢ భావోదేక సమయంలో ఉద్భవిస్తాయి); బీటా తరంగాలు (సంక్షిష్ట గణిత సంబంధి లేదా విశ్లేషాత్మక కార్యకలాపాల సమయంలో మస్తిష్కలలాట ఖండం ఉత్తేజపరచబడినప్పుడు ఉద్భవిస్తుంది). ఆల్ఫాతరంగాలు ధ్యానానికి టెలిపతికి ప్రత్యేకమయిన శాంతి, ప్రశాంతతా, విశ్రాంత ఏకాగ్రతలను ప్రేరేపిస్తాయి. స్పుహలో ఉన్నప్పుడు లేదా స్పుహలో లేనప్పుడు అన్ని ధ్యాన విధానాలు మెదడులో ఆల్ఫా తరంగాల ఉత్పత్తి కోసం ఒప్పయిన పరిస్థితులను కల్పించటానికి ప్రయత్నిస్తాయి. ఆల్ఫా తరంగాల గురించిన విషయమేమిటంటే, మెదడు ప్రాణవాయు సరఫరా తక్కువగా ఉన్నప్పుడు మస్తిష్కంలో అవి (ఆల్ఫా తరంగాలు) ఉద్భవిస్తాయి. తక్కువ ప్రాణ వాయు సరఫరా మస్తిష్క కార్యకలాపాన్ని తగ్గిస్తుందని సామాన్యంగా మనం భావిస్తుంటాం. కాని వాస్తవమేమిటంటే, తక్కువ ప్రాణవాయువున్న సమయాల్లో మస్తిష్కం అలసిపోయేటట్లుగా పనిచేస్తుంది. మెదడులోని రక్షనాళాలు అధిక రక్త అంతఃప్రవాహాన్ని అధికం చేస్తాయి. ఇది సడలింపు అనుభూతిని కల్గిస్తుంది. ఏకకాలంలో మెదడు సడలింపు ఆల్ఫా తరంగాలను ఉత్పాదన చేయటానికి ప్రారంభిస్తుంది. మెదడుకు తక్కువ ప్రాణవాయు సరఫరా చేయటమనేది ఆల్ఫా తరంగాల ఉత్పత్తికి ఒక ప్రధాన హేతువు.
ఇది ఏవిధంగాను మస్తిష్కాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయదు.
ఇప్పుడు ఆహార విషయం.
ప్రకృతిలో మాంసం మిక్కిలి ఆమ్లమయినది, రక్తామ్లాన్ని నేరుగా పెంచుతుంది. దీని పూరించటానికి, ఊపిరితిత్తులు తక్కువ బొగ్గుపులుసు గాలిని (ఇది కూడా ఆమ్లమే) తీసుకుంటాయి, మారుగా ఎక్కువ ప్రాణవాయువును తీసుకుంటాయి. కాబట్టి మెదడుకు చేరే రక్తం కూడా ఎక్కువ ప్రాణవాయువును తక్కువ బొగ్గు పులుసుగాలిని కల్గి ఉంటుంది. పోల్చి చూస్తే, శాకాలు రక్తకార్యకలాపాన్ని తగ్గిస్తాయి. రక్తంలోని ఆమ్లక్షార సమతౌల్యాన్ని యథాస్థితిలో ఉంచటానికి, ఊపిరితిత్తులు ఎక్కువ ఆమ్ల బొగ్గు పులుసు గాలిని తీసుకుంటాయి. కాబట్టి మెదడుకు చేరే రక్తం కూడా తక్కువ ప్రాణవాయువును కలిగి ఉంటుంది.
ధ్యానంలో సహాయపడే ఆల్ఫాతరంగాల ఉత్పత్తి ప్రారంభానికిగాను ఇది మెదడుకు పూర్ణ పరిస్థితిని కల్గిస్తుంది.
ఈ కారణంగానే ప్రాచీన కాలం నుంచి ఋషులు తక్కువ ప్రాణవాయువు కల ఎత్తెన ప్రదేశాలలో (ఋషులు హిమాలయాలలో ఉండటానికి ఇష్టపడేవారు). శాకాహార తత్త్వం, వెనక ఉన్న శాస్త్రం చాలా తక్కువ మందికి తెలుసు. మీకు తెలుసుకోవలసిన అవసరంలేదు. శాకాహారంతో మీకు యాంత్రికంగా ఆ భేదం తెలుస్తుంది. ఒకసారి మీరు నియతంగా ధ్యానం చేస్తుంటే, మీ శరీరం క్రమంగా శుద్ధి అవుతుంది, ఇతోధికంగా ధ్యానానికి తగి ఉంటుంది. అప్పుడు, మీకడుపు గందరగోళమయినప్పుడు మీ శరీరానికి ఏ ఆహారం తీసుకోకూడదో తెలిసినట్లుగానే,
సహజంగా అది మీరు ధ్యానం సరిగా చేయటాన్ని నిరోధించే ఆహార పదార్హాల్ని ఆపివేస్తుంది.
మీరు ధ్యానాన్ని అవలంభించాలని అనుకున్నప్పటికీ మీ మీద మీరు శాకాహారాన్ని బలవంతంగా రుద్దుకొనండి.
దాన్ని చేస్తే, అణచబడ్డ కోరికలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి, సామాన్యంగా మీరు వాటి ప్రభావం నుంచి బయటపడలేరు.
పెద్ద కష్టం లేకుండా మాంసాన్ని మానివేయ గలిగితే, మానివేయండి.
అలాకాకుంటే, చింత లేదా దోషభావన లేకుండా మాంసాహారాన్ని కొనసాగించి ఆనందించండి.
దయచేసి దాని గురించి దోషభావనకు తావీయకండి ! తుదకు, దోష భావన మీ వ్యవస్థలో మిక్కిలి శక్తి నిరోధ స్థితిని కల్గిస్తుంది, అది మాంసం కంటె అధికతర హాని కల్ల చేస్తుంది !
మీ శరీరం సిద్ధపడినప్పుడు, తనంతట తానే అది అలవాటును అడ్డుకుంటుంది.
ప్రశ్న : ఉపవాసం వాస్తవంగా ఆరోగ్యానికి లాభదాయకమా?
అవును.
సక్రమ మార్గంలో చేస్తే, ఉపవాసం నిక్కచ్చిగా లాభదాయకమే.
రోజురోజుకు చెడ్డగా మారుతున్న తినే అలవాటు కారణంగా మనకాలంలో ఉపవాసం చేయటం అంతకంతకు ముఖ్యమవుతోంది !
మత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపవాసం చేస్తున్నారని అనుకోవద్దు. ఈ సంప్రదాయాలన్నిటి వెనక నిశ్చిత శాస్త్రీయ హేతువులున్నాయి.
సంస్కృతంలో అన్నం బ్రహ్మ, అన్నం దేవుడు అని మనం చెబుతుంటాం.
మన జీవితాలను పోషించే ఆహారం శక్తి. భక్షణం ఒక రకమయిన పూజ.
కాని సామాన్యంగా మనం మన కడుపులను ఎలా పరిగణిస్తున్నాము? మనం దేన్నెనా, ప్రతి దానిని దానిలోకి తోసివేస్తున్నాము!
ఏ ఇతర జంతువు 2, 3 ఆహార పదార్థాల కన్న ఎక్కువ తినదు. వాస్తవంగా పెంపుడు జంతువులు తప్ప, ఇతరమైనవి తమ తమ జీవిత కాలంలో ఒకే రకమయిన ఆహారాన్ని తింటాయి. సింహం మాంసాన్ని మాత్రమే తింటుంది. లేడి గడ్డిని మాత్రమే తింటుంది. వాటికి అవసరమయిన పోషకాన్ని ఆ ఒక ఆహారమే సరఫరా చేస్తుంది. అంతేకాదు, ప్రతి ఇతర జంతువు నిర్దిష్ట సమయంలో తనకు అవసరమయినంత పుట్టుకు మాత్రమే తింటుంది. జంతు ప్రపంచంలో అత్యాశ వినపడదు!
మీరు బిడ్డలను గమనిస్తే, వారికి అవసరమయిన దానికంటె మీరు వారి నెంతబలవంత పెట్టినాప్పటికి ఒక పాల చుక్కను కూడా తాగరు! కాని మన పొట్ట ఇచ్చే హెచ్చరిక సూచనలను మనం పూర్తిగా పెడచెవిని పెడతాము. మనం కడుపును అన్ని రకాల ఆహార పదారాలతో నింపటమే కాకుండా, మనం మనకు అవసరమయిన దాని కుప్ప ఎక్కువ తింటున్నాము. మనం మనకడుపులను తిండి చెత్తకుండీలలా పరిగణిస్తున్నాము!
ఆహార ప్రయోజనమేమిటి? శక్తినివ్వటం. కాని తిన్న తర్వాత మనం సాధారణంగా శక్తి కలవారంగా అనుభూతి పొందుతున్నామా? లేదు! సామాన్యంగా మనమంతా తిన్న తర్వాత కునుకుతీయటానికి ఇష్టపడతాము! తిన్న తర్వాత మనకు కుసుకు పడుతుందనటం సూర్యుడుదయించినప్పుడు చీకటి పడుతుందని చెప్పటంలా ఉంది! అది పూర్తిగా అసహజం, మనమేమి తప్పచేస్తున్నాము?
మనం మన ఆహారంతో మన వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాము.
జీర్ణంలో ఉపయోగించే శక్తి ఆహారం విడుదల చేసే శక్తి కంటే అధికం కాబట్టి తిన్న తర్వాత మనం వాస్తవంగా శక్తి తక్కువ కలవారమవుతున్నాము.
మన శరీరంలోని జీర్ణశక్తి జఠరాగ్ని అని పిలవబడుతుంది -
మూలాగ్ని.
పంచభూతాలలో అగ్ని పదార్థం, శక్తి కలుసుకునే బిందువు. అగ్ని పదార్థాన్ని శక్తిగా మార్చేది. సాధారణ దినాలలో, మనం ఎక్కువగాను నిర్లక్ష్యంగాను తినటంవల్ల మన క డుపులను శ్రమపెట్టి నప్పుడు, జఠ రాగ్ని వెబుత్తం శక్తి ఈ ఆహారాన్ని జీర్ణంచేసుకోవటంలోను, టాక్సిన్ల ప్రధాన భాగాన్ని శుభపరచటంలోను ఉపయోగ పడుతుంది. అది 'నిర్వహణకార్యం'లో ఇరుక్కుంటుంది. మనం జఠరాగ్నికి తన ఇతర ప్రధాన విధులను నిర్వర్తించే అవకాశాన్ని ఇవ్వము.
జఠరాగ్ని శుభపరిచే గొప్పబలం.
మనం ఉపవాసాన్ని అభ్యాసం చేసుకున్నప్పుడు, జఠరాగ్ని మన శరీరాల నుండి అధికంగా ఉన్న కొవ్వును కరిగించటమే కాకుండా మనం కూడబెట్లుకున్న వ్యతిరేక శక్తిని గూడా శుభపరుస్తుంది.
అనియత భోజనం అలవాటు మన భౌతిక శరీరాలలో పోగుపడటానికి కొవ్వు విక్షేపాలను కల్పించినట్టుగా, మన శక్తి భాగంలోని పొర నుండి మన అణచబడ్డ భావోదేకాలు విక్షేపాలను కల్పిస్తాయి. ఏళ్ళు గడిచేకొద్దీ, కొలెస్టరాల్ ధమనులను అడ్డి గుండెలోని రక్తప్రవాహాన్ని భంగపరిచినట్లు, 'శక్తి అవరోధాలు' మన శరీరమంతటా శక్తి స్వేచ్చా ప్రవాహాన్ని భంగపరుస్తాయి.
మనం కడుపుకు విశ్రాంతి కల్పించిన రోజులలో జఠరాగ్ని ఈ శక్తి అవరోధాలను తొలగించి వ్యతిరేక శక్తిని అనుకూల శక్తిగా మారుస్తుంది. అందుచేత, మీరు ఉపవాసం చేసినప్పుడు, సాధారణంగా మిక్కిలి తేలికగాను, శక్తిమంతంగాను అలిసిపోనట్లుగాను భావిస్తారు!
కొంచెం ప్రయత్నిస్తే మీ అంతట మీరే చూస్తారు. వాస్తవానికి, మీరు ఉపవాసం చేస్తున్న రోజులలో రోగనివారణ, ధ్యానం మంచి ఫలితాలనిస్తాయి.
మధుమేహం లేదా ఆమ్లతతో మీరు బాధపడుతుంటే ఉపవాస నిర్ణయానికి ముందు మీ డాక్టరును సంప్రదించటం మంచిది.
మీరు ఉపవాసం చేసే అసలు రోజులు ఏవి అన్నది ముఖ్యంకాదు, అది సాంఘిక సంప్రదాయాలకు సంబంధించినది. ప్రత్యేక దినాలలో ఉపవాసం చేయటాన్ని అనుసరిస్తున్నారు. ఎందుచేతనంటే ఆ రోజుల్చి గుర్తు పెట్టుకొని నియతంగా ఉపవాసం చేయటం సులభం (ఉదా - ప్రతి శుక్రవారం లేదా ప్రతి పౌర్ణమి).
కాని కనీసం పక్షానికి ఒకసారి ఉపవాసం చేయటం శరీరాన్ని శుభపరచటానికి ఒక ప్రపూర్ణం. సంపూర్ణ ఉపవాసం (నీటిని మాత్రమే తాగటం) సర్వశ్రేష్ఠం. కాని మీరు అలా చేయలేకపోతే, కనీసం రసం లేదా ఫలహారంతో ఉపవాసం చేయటానికి ప్రయత్నించండి.
అది అందరూ అనుకునేటంత కష్టంకాదు ! మొదటి కొన్ని గంటలు ఎక్కువగా ఉండే ఆకలి తర్వాత, అది తనంతతానే తగ్గిపోతుంది. చింతించకండి, మీకేమీ కాదు - మీరు చచ్చిపోరు! మీకు తెలుసా? ఆరోగ్యవంతుడు నీరు మాత్రమే తాగి 90 రోజులు జీవించగల్గుతాడు. మన శరీరంలో 90 రోజులకు సరిపడే శక్తి నిల్వలున్నాయి. మీ కడుపుకు 24 గంటల విరామమివ్వమని మాత్రమే నేను మిమ్ముల్ని అడుగుతున్నాను!
మీకు కృతజ్ఞతలు వద్దు !