KAILASA Library/చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/(ప్రశ్న): స్వామీజి! మంత్రాలకు నిజంగా శక్తి ఉందా?Sign in
చల్లగాలి లోనికి రానివ్వండి! సుఖజీవనంకోసం సాధనాలు / THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

(ప్రశ్న): స్వామీజి! మంత్రాలకు నిజంగా శక్తి ఉందా?

అవును, మంత్రాలకు గొప్పశక్తి ఉంది, కాని ప్రజలనుకున్నట్లు కాదు!

మంత్రాలు శక్తిమంతమయినవి, అవి ఏదోవిధంగా ఐశ్వర్య జ్ఞాన దేవతల్ని ప్రసన్నం చేసుకొనేటట్లు చేసి మనకు సహాయాలను ప్రదానం చేయటానికి కాదు.

మంత్రాలు జాగ్రత్తగా ఏర్పరచబడ్డ ధ్వనుల క్రమం కాబట్టి ప్రభావం కలవి - ధ్వని శక్తి యొక్క బలమైన రూపం.

మనం వేటిని భిన్న ధ్వనులుగా అవగతం చేసుకుంటున్నామో అవి నిజంగా భిన్న పౌనఃపున్యాల వైవిద్యాలు - మన చెవులు ఈ వైవిధ్యాలను గ్రహిస్తాయి, మెదడు ధ్వనులుగా అనువదిస్తాయి. ధ్వనితరంగాలు ఒక దాని తర్వాత ఇంకొకటి నియత క్రమంలో వస్తే, అది క్రమబద్దతా భావాన్ని సృజిస్తుంది - సంగీతమని మనం పేర్కొంటాము. అది అనియత రీతిలో ఉన్నప్పుడు, మనం దాన్ని చప్పుడు అంటాము.

పదాలు మనం అర్థాలు కల్పించిన ధ్వనులు మాత్రమే. శక్తిస్టాయిలో అవి ఇంకా తరంగాలు లాగా, కదలికలులాగా పనిచేస్తాయి. రంగులలాగా, వేర్వేరు కదలికలు మీలో భిన్న శారీరక భావోద్వేక ప్రతి క్రియలను ప్రేరేపిస్తాయి. ఇది ప్రతి ధ్వనికి సహజగుణం కారణంగా జరుగుతుంది. మీ మస్తిష్క తరంగాలతో నిశ్చిత పౌనఃపున్య ధ్వని తరంగాలు కలిసినప్పుడు, కలయిక సామరస్య పూర్వకమయిన లేదా సామరస్యపూర్వకంకాని ప్రభావాన్ని పుట్టిస్తుంది.

లేదా అవి మెదడులోని విభిన్న భాగాలను ఉత్తేజపరుస్తాయి. లేదా నిద్రపుచ్చుతాయి. ఇది శారీరకంగాను, భావోద్వేకంగాను ప్రభావితం చేస్తుంది.

జపాన్ యోధులు సరిగ్గా ఈ ప్రభావం కోసమే 'యుద్ధనినాదం' లేదా కీఐ చేస్తారు. ఈ ధ్వని అల్పకీలకంగా ఉత్పన్నమయినప్పుడు, ప్రతి ద్వంద్విలో ధమని సంబంధి రక్తపోటును తగ్గించటానికి తక్షణమే పాక్షిక పక్షపాతాన్ని కల్పించటంలోను ధ్వని శక్తిమంతంగా ఉంటుంది!

ఏకకాలికంగా, అది ప్రతి ద్వంద్వి మెదడులో భయక్షేత్రాన్ని ఉత్తేజపరుస్తుంది.

అతడి మనసులో భయభావనను సృష్టిస్తుంది కూడా.

బాగా స్పష్టతతో ఉండండి : పదాలు పదాలు మాత్రమే కాదు! అవి శబ్దశక్తి మూర్తులు. మంత్రాలు అదేవిధంగా పనిచేస్తాయి.

సరస్వతీ సూక్తాన్ని క్రమబద్ధంగా జపించటం విద్యాధ్యయనంలో విద్యార్థులకు సహాయ పడుతుంది.

ఎందుకు? విద్యాధి దేవత సరస్వతి విద్యార్థుల ముందు ప్రత్యక్షమై పరీక్షల్లో ఉత్తీర్ణుల్ని చేస్తుందని కాదు!

వాస్తవమేమిటంటే సరస్వతీ సూక్తంలోని బీజ మంత్రం నిరంతరాయంగా ఉచ్ఛరించ బడ్డప్పుడు జ్ఞాపకశక్తిని ఏకాగ్రతను నియంత్రించే మస్తిష్క క్షేతాలను ఉత్తేజ పరుస్తుందని నిరూపించబడింది.

ఈ మంత్రాన్ని పునఃపునః జపించటం మెదడులోని ఆ భాగానికి పదును పెట్టే ఉష్ణ వ్యాయామం! కాబట్టి సహజంగా, తన పుస్తకాలను చదవటానికి తీసుకునే ముందు సరస్వతీ మంత్రాన్ని జపించే విద్యార్థి తన పాఠంపై చాలా బాగా ఏకాగ్రత కలిగి ఉండి దాన్ని ప్రభావ వంతంగా బాగా జ్ఞాప‌కం పెట్టుకుంటాడు.

భక్తులయిన ఆరాధకులు కొన్నిసార్లు సముచిత మంత్రాన్ని జపించటం ద్వారా నిర్దిష్ట దైవరూపాన్ని సాక్షాత్కరించుకున్నట్లు వాదిస్తున్నారు.

అగ్నికి హోమద్రవ్యాల్ని సమర్పిస్తూ శక్తిమంతమయిన యాగాలను లేదా హోమాలను నేడు నిర్వహిస్తున్నప్పుడు, చాలా సార్లు నేను స్వయంగా ఈ అనుభవాన్ని పొందాను.

యాగ కార్యక్రమ సమయంలో, నేను మంత్రంతో దైవాన్ని ప్రార్థించినప్పుడు, పవిత్రాగ్ని వాస్తవంగా దైవరూపంలో సాక్షాత్కరిస్తుంది. ఈ మూలాంశాన్ని నిరూపించటానికి అనేక ఛాయా చిత్రాలున్నాయి. ఇది గారడీలా అనిపించవచ్చు, కాని దీనికి దృఢమయిన శాస్త్రీయ కారణం ఉంది.

మీరు ధ్వని దర్శినిని గూర్చి విన్నారా?

ఇరవయ్యో శతాబ్దం చివరి భాగంలో, స్విట్టెర్లండ్‌లో జరిపిన ఒక ప్రయోగం ద్వారా హన్స్ జెన్నీ ధ్వనిదర్శినిని కనిపెట్టాడు. ఈ సాధనం ధ్వనులను రేఖాచిత్ర సమూనాలుగా మారుస్తుంది. ఒక వ్యక్తి ఈ సాధనంలోకి మాట్లాడి, అది ఆ వ్యక్తి మాట్లాడిన పదాల ధ్వనులనుబట్టి 'చిత్రాన్ని' రూపొందిస్తుంది.

వారు ధ్వనిదర్శినిని పరీక్షించినప్పుడు, ప్రయోగాలు వస్తవ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ధ్వనిదర్శినిలో ఒకరు 'ఓహోహో' అని మాట్లాడినప్పుడు, చిత్రం సంపూర్ణ వృత్తాకారంలో ఉంది. 'ఓం' అని వారు కనుగొన్నారు! రేఖాచిత్రంగా చిత్రించబడ్డప్పుడు, ఓహోహో ధ్వనిచే ఉత్పన్నమయిన ప్రకంపనలు సహజంగా రాత భాషలో రాసినట్లుగా వృత్తరూపంగా రూపొందుతుంది.

ధ్వనికి అది తీసుకునే రూపానికి మధ్య ఖచ్చితమయిన సంబంధముంది అని అర్థం. విభిన్న ప్రకంపనలు నిర్దిష్ట రూపాలుగా మన కళ్ళకు కనిపిస్తాయి. ఒక నిర్దిష్ట మంత్రాన్ని జపించినప్పుడు, అగ్నిలో ఒక ప్రకంపనను రూపొందిస్తుంది. అది తరంగ సదృశ రూపాన్ని రూపొందిస్తుంది.

ప్రాచీన హిందూ మహర్షులు మొదట ఈ రూపం నుంచే దేవతా సాధారణ రూపాన్ని సాక్షాత్కరించుకునేవారు. కాబట్టి సాధారణంగా, ఎవరయినా సహజంగా ధ్వనుల క్రమాన్ని పూర్ణంగా నిర్దోషంగా జపిస్తే, అదే ప్రకంపన వారికి లభిస్తుంది, తుదకు అదే రూపాన్ని లేదా దైవాన్ని అగ్నిలో దర్శిస్తారు. సరళం

మన జాగృతి లేకుండా, మంత్రాలు మన మీద అనేక సూక్ష్మమార్గాలలో పని చేస్తాయి. శక్తిస్థాయిలో, మంత్రాలు ఉత్పేరకాలుగా లేదా పవిత్రకాలుగా పనిచేస్తాయి. ఈ భావన అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టంకాని అది సత్యమని నా అనుభవం ద్వారా మీకు తెలుపుతున్నాను.

మీ వ్యవస్థలో మీకు మూడు శక్తులున్నాయి. ఇచ్చాశక్తి (దర్శించే శక్తి), క్రియాశక్తి (కార్యశక్తి), జ్ఞానశక్తి (తెలివిశక్తి), ఇచ్చాశక్తి మూల లోహం. దీని నుండి ఇతర రెండు శక్తులు పవితీకరణ ప్రక్రియ ద్వారా సృష్టించబడతాయి. మీ శక్తి (మీ శక్తి - క్షేత్రం)లోకి పునఃపునః కలిపినప్పుడు, మంత్రాల ప్రకంపనలను ఇచ్చాశక్తిని క్రమంలో పెట్టి పవిత్రీకరించి జ్ఞానశక్తిగా మార్చే శక్తి ఉంది.

మంత్ర పదానికి రెండు అర్దాలున్నాయి.

మంత్రం : మన్ పదానికి మనుష్య జాతి అని అర్థం, 'త్ర' కు మార్గాన్ని చూపేది అని అర్థం. కాబట్టి 'మంత్రం' అంటే మనిషికి దారి చూపేది అని అర్ధం.

'మంత్రం' : 'మన్' అంటే మనస్సు అనే అర్థం కూడా ఉంది, 'త్ర' కు మార్గాన్ని చూపేది అని అర్థం కాబట్టి 'మంత్రం' అంటే మిమ్మల్ని మనసుకు అతీతంగా తీసుకువెళ్ళే మనోతీత మార్గాన్ని చూపేది అనే అర్థం కూడా ఉంది.

సుగంధం చేయటానికి ముడిపదార్థానికి ఆమ్లాన్ని చేర్చినట్లుగా మీ అస్తిత్వానికి జాగ్రత్తగా మంత్రాలను కలిపినప్పుడు, అది 22 కేరట్ల బంగారమవుతుంది. మీరు ఆ ప్రక్రియను కొనసాగిస్తే, అది 24 కేరట్ల బంగారమవుతుంది. కాబట్టి మంత్రాలు ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించటానికి శక్తిమంతమయిన సాంకేతిక ప్రక్రియ - నేను వాస్తవ జీవితం అని చెబుతున్నాను. కాని మనం ఆధ్యాత్మిక జీవితంలో మంత్రాలనుపయోగించి

మనమంతా మంతాలను నిరంతరాయంగా మత సంబంధమయిన వారయినా కాకున్నా, ఆధ్యాత్మిక సంబంధమయిన వారమయినా కాకున్నా మనం జపిస్తున్నాము. ప్రతి ఒక్కరోజు, మన నిత్య జీవితంలో, మనం మంత్రాలను వాటి గురించిన ఎరుక లేకుండానే వినియోగిస్తుంటాము. మంత్రం సంస్కృతంలోనే ఉండవలసిన అవసరంలేదు. మంత్రమంటే 'ఓం నమశ్శివాయ', లేదా 'ఓం నమో నారాయణాయ' అని మాత్రమే అనుకోవద్దు. ఆంగ్ల మంత్రాలను కూడా మీరు ఉపయోగించవచ్చు 'I must win' (నేను జయించాలి!), 'I must convince that person' (నేను ఆ వ్యక్తిని ఒప్పించాలి!). 'I must make her love me !' (నేను ఆమె నన్ను ప్రేమించేటట్లు చేసుకోవాలి). ఈ మంత్రాలు వాటి ధ్వని నుండి వాటి శక్తిని సంపాదించుకుంటాయి, మీరు వాటిలో మీరు పెట్టుబడి పెట్టిన శక్తి నుంచి సంపాదిచుకుంటాయి.

కాని మీరు మంత్రాల శక్తిని తెలుసుకోవటం లేదు!

చిన్నకథ :

ఒకప్పుడు, ప్రసిద్ద ప్రాచ్య వక్త మంత్రాల ప్రాధాన్యాన్ని గురించి పాశ్చాత్య దేశాలలో సంభాషించాడు. ఒక మనిషి లేచి సవాలు చేశాడు.

నేను దీన్ని నమ్మను, అర్థ రహితం. పద క్రమ పునఃపునరుచ్చారణ మనసులపై ఏవిధమయిన ప్రభావమైనా ఎలా ఉంటుంది? మేమంత తెలివి తక్కువ వాళ్ళమా? వక్త అతణ్ణి చూచి, గద్దించాడు. నోరుమూసుకో మూఢమతీ! అవివేకీ! ఎంత సాహసం నన్ను సవాలు చేస్తావా?

ప‌శ్న అడిగిన మ‌నిషి కేవ‌లం ముక్కోపి అయ్యాడు. కోపంతో అత‌డు ఊగిపోసాగాడు. అతడు వక్తను తిడుతూ పోలీసులకు రిపోర్టు చేస్తానని బెదిరించాడు.

ఆ మనిషి తుదకు పూర్తిచేసినప్పడు, వక్త నవ్వి అతడితో చెప్పాడు,

కొత్త వ్యక్తి మాట్టాడిన కొన్ని మాటలు మీ నిర్జిద మనసుపై ఇటువంటి భంగకర ప్రభావాన్ని కలిగి ఉంటే, మీరు అతి జాగ్రత్తగా పునఃపునః మీలో మీరు ఉచ్చరించుకునే అనుకూల వాజ్మూలానికి స్పృహ లేని మీ మనసుపై ప్రభావం లేదని ఏలా సందేమిస్తారు?

ఏ పదాలనయినా మీరు పదేపదే ఉచ్చరిస్తే, ఏ సందేశాన్నైనా మీ అచేతనకు అందిస్తే మీకు అది మంత్రమవుతుంది. మీరు ఏది ఉచ్చరించినా అది మంత్రమవుతుంది.

నిజంగా, మీరు ఏదయినా పొందటానికి అదే మార్గం. మీ జీవితంలో ఏదయినా కోరిక ఉంటే అది మొదట వాంఛా రూపంలో మాత్రమే కన్సిస్తుంది. నిరంతర ప్ర‌య‌త్పంతో మంత్రం దాన్ని మీకు సాకారం చేస్తుంది!

కాని మీరు స్పష్టంగా ఉండండి : మంత్రం అచేతనమైతే, ఫలితం కూడా 'అచేతనం' అపుతుంది. మీ నియంత్రణలో ఉండదు. మంత్రం జాగృతితతో జపిస్తే, మీ శక్తిని సరయిన ప్రయోజన బుద్ధితో నిర్దేశిస్తే, ఫలితం కూడా మీరు కోరుకున్నట్లుంటుంది.

మంత్రం చేతనమో, అచేతనమో మీకు ఎలా తెలుస్తుంది? నిత్య జీవితంలో మిమ్మల్ని ్రపేరేపించే శక్తులను సన్నిహితంగా పరీక్షించండి.

అవి ఏమిటో మీ చర్యలను అవి ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో మీకు తెలుసా? మీరు స్పృహలో ఉండి జాగ్రత్తగా నిర్ధిష్టమార్గాన్ని అనుసరిస్తున్నారా? ఎందుకో మీకు స్పష్టత ఉందా? మీ మంత్ర చేతనమయినప్పడు, మీకు అర్థంకాని అలవాటు రీతి కారణంగా మీరు చర్యల్ని పదేపదే చేస్తుంటే, మీకు ఫలితంపై నియంత్రణ ఉండడు. ఈ అచేతన గతి శక్తులు మీ జీవితాన్ని ఎటు తీసుకుపోతే అక్కడకు మీ జీవితం లాగబడుతుంది.

మీరు మంత్రాన్ని జాగ్రత్తగా జపించాలని నిర్ణయించుకుంటే, మీరు కారును నడుపుతారు. మంత్రం మిమ్మల్ని జపించేటట్లు చేస్తే, మీలోని అచేతన ప్ర‌కియ‌ను మీరు కొనసాగిస్తే, మీ చర్యల్ని నియంత్రించేటట్టు చేస్తే, కారు మిమ్మల్ని నడుపుతుంది! మీరు కారును నడిపితే, మీరు ఎక్కడకు వెళ్తున్నారో మీకు తెలుస్తుంది. కారు మిమ్మల్ని నడిపితే, మీరు దేనిని చేరుకుంటారో మీకు తెలియదు!

కాబట్టి మీ మనసులో చేతనను ప్రపహింపచేసుకోండి.

స్పష్టతతో నిబద్ధతతో మీ మంత్రాన్ని ఎంచుకోండి.

మార్గం, లక్ష్యం రెండూ మీకు స్పష్టమవుతాయి.

నాట్యం చేస్తూ మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు.

తొందరేమిటి ?