అసూయ వద్దని చెప్పండి
సంప్రదాయం రహస్యం బహిరంగ పరచబడింది
(ప్రశ్న) : ఇతరులతో నన్ను నేను పోల్చుకోవటాన్ని, దుఃఖంతో ఉండటాన్ని నేనెలా ఆపుకోగలను?
కనీసం పోల్చుకోవటం మాత్రమే దుఃఖాన్ని కల్గిస్తుందని నీవు తెలుసుకున్నావు అది మంచి ప్రారంభం.
కథతో నీకు జవాబు చెప్పనీ.
సరిగా నీవడిగిన ప్రశ్నవంటి ప్రశ్నతో ఒక మనిషి ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వచ్చాడు. గురువు అతణ్ణి ఒకదాని పక్క మరొకటి పెరుగుతున్న గులాబి మొక్క, ముళ్ళ మొక్క ఉన్న ఉద్యానవనానికి తీసుకు వెళ్ళి చెప్పాడు.
"ఇవి నీ ఉపాధ్యాయులు. నీవు తెలుసుకోవాలనుకున్న వాటిని ఇవి బోధించ గల్గుతాయి."
ఆ మనిషి ఆశ్చర్యపడ్డాడు.
"మీరేమంటున్నారు, మాస్టర్?" అతడు అడిగాడు.
గురువు చెప్పాడు.
"ఐదు సంవత్సరాల నుంచి, ఒకదాని పక్క ఒకటి ఈ గులాబి మొక్క, ముళ్ళ ముక్క ఉంటున్నాయి. కాని ఒకసారి కూడా గులాబి మొక్క ముళ్ళమొక్కతో తనను పోల్చుకుని ముళ్ళ మొక్కలా తాను కావాలని కాని, ముళ్ళమొక్క గులాబి మొత్కతో తీల్చుకుని తాను గులాబి మొక్కలాగా అవ్వాలని కాని అనటం నేను వినలేదు."
మీతో పోల్చతగింది ఏదీ లేదు!
ఫర్యాదు లేకుండా, పోల్చుకోకుండా ఈ రెంటిలో ప్రతి ఒక్కటి తన యాథార్థ్యాన్ని అంగీకరించింది. నీ అస్తిత్వాన్ని నీవు అంగీకరించు.
అప్పుడు మాత్రమే నీవు పూర్ణత్వాన్ని పొందుతావు, పూర్ణుడవుకా.
నీవు ప్రత్యేకతను పూర్ణత్వాన్ని సంతరించుకున్నప్పుడు, ఇతరులతో పోల్చుకోవలసిన అవసరం దానంతట అదే పోతుంది.
బుద్ధుడు అత్యంత ప్రాధాన్యంకల వాక్యాన్నిచ్చాడు. ఆయన చెప్పాడు: సంబంధంలో తప్ప మరేదీ ఉండదు. ప్రతీది పరస్సర సంబంధం కలది, వేరే దానితో దాని సంబంధాన్ని బట్టి మాత్రమే దాని అర్హం ఉంటుంది.
మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్పుకోవటానికి ఉపయోగించే పదాలేవి? అందమయిన, పేద, తెలివయిన, దురదృష్టమయిన, యౌవనంకల, బలహీనమయిన మొదలయినవి. ఇప్పుడు, నీవు తప్ప మరెవ్వరూ లేని గ్రహాన్ని ఊహించండి. అందంగా ఉన్నావా లేదా అందవిహీనంగా ఉన్నావా? పొడుగ్గా ఉన్నావా లేదా పొట్టిగా ఉన్నావా? ధనికుడుగా ఉన్నవా లేదా దరిద్దుడుగా ఉన్నావా? పోలిక లేకుండా, ఈ పదాలు సహజంగా తమ అర్థాల్ని కోల్పోతాయి. ఎందుకంటే అవి మనస్సు సూతీకరించిన భావనలు మాత్రమే, వాటికి వాస్తవమయిన ఉనికి లేదు.
దీన్ని ప్రయత్నించండి: కొన్ని క్షణాలు మీ కళ్ళను మూసుకోండి. ప్రపంచంలో మీరొక్కరే ఒంటరిగా ఉన్నట్లు ఊహించండి. మీలో మీరు కురూపంతో ఉన్నట్లా లేదా సుందరంగా ఉన్నట్నా? అనే అనుభూతిని పొందగలరా? తెలివి తక్కువ వారా లేదా తెలివయిన వారా? అప్పుడు ఈ భావనలన్నీ ఎక్కడ ఉన్నాయి? మీరున్నారన్న సత్యమే మిగులుతుంది, ఎందుకంటే అది మాత్రమే సత్యం. మిమ్మల్ని ఇంకొకరితో పోల్చుకోవటం తెలివి తక్కువతనం. ఎందుకంటే మీరింకొకరు ఎప్పుడూకారు ఇంకొకరు మీరుకారు!
వినోద విషయం, మనం మనల్ని పూలతో, లేదా పక్షులతో, లేదా పర్యతాలతో పోల్చుకోము - మనం మనల్ని ఇతర ప్రజలతో ఎందుకు పోల్చుకుంటాము? కోయిలను చూసి అసూయపడే గాయకుడు, నాట్యంలో నెమలిగా మారాలనుకునే నాట్యకత్తె, నాకు ఇంకా తారసపడాలి! ప్రకృతిలోని మిగిలిన సౌందర్యాన్నంతటినీ నిజంగా స్వాగతించి ఆనందించ గల్గుతున్నప్పుడు పరస్సర ప్రత్యేక ప్రేమిను ఎందుకు ఆనందించలేకపోతున్నాము?
ఇతరుల సౌందర్యం చేత లేదా ఇతరుల ఐశ్వర్యం చేత లేదా ఇతరుల వైపుణ్యం దేత మనమెందుకు తీవ్రంగా బెదిరించబడాలి?
ఇది సాధారణ సాంఘిక వర్గన మాత్రమే. పోటీ ప్రపంచంలో పెంచబడి, ఇంకా ఇంకేదో లభించిందని మనకేదో తక్కువయిందని మనం ఊహించుకుంటూ ఉంటాము!
దలైలామా మనోహరంగా పరిశీలించారు:
"చాలామంది ప్రజలు ప్రపంచంలో పరిమిత మొత్తంలో ఆనందం లభ్యమవుతుందని ప్రదర్శిస్తుంటారు! ఇంకొకరు సంతోషంగా ఉంటే, మనం మన సంతోషంలోని వ్యక్తిగత భాగం తగ్గిపోయినట్లుగా భావిస్తుంటాం! శూన్య దృక్కులతో మన గురించిన లోతైన అనుభూతితో మనం వెళ్తూంటాం. దీనికి విరుద్ధంగా, ఇతర వ్యక్తిదేన్నయినా పొందిన ప్రతిసారి మనం ఆనందాన్ని అనుభవిస్తే మన సంతోషం మొత్తం ప్రపంచ జనాభాచేత కోట్ల రెట్లు అవుతుంది."
పోలిక రెండు రకాలుగా ఉంటుంది. నిర్మాణాత్మక పోలిక, విధ్వంసాత్మక పోలిక. నిర్మాణాత్మక పోలిక ఆవశ్యకం, వాంఛనీయం.
వాస్తవ ప్రపంచంలో, మిమ్మల్ని మీరు కొలుచుకోవటానికి అది కొలబద్దగా ఉపయోగ పడుతుంది. అది ప్రేరేపించే ముల్లును - అభివృద్ధి పరచటానికి ఉద్దీపకంగా
మీతో పోల్చతగింది ఏదీ లేదు!
సమకూరుస్తుంది. పోల్చకుండా మిమ్మల్ని గూర్చిన వాస్తవ ప్రశంస మీకు ఎలా కలుగుతుంది?
వాస్తవాన్ని అంగీకరించటానికి చూపే అశక్తత నుంచి విధ్యంసాత్మక పోలిక ఉద్భవిస్తుంది. ఈ మహా విస్తృత ప్రపంచంలో, మీరు చేసేది ఏమయినప్పటికి ఎవరో ఒకరు నిశ్చయంగా నీకంటె మేల్తరమయిన వారుంటారు. 99.99% పాళ్ళు మీరు ప్రపంచంలో శ్రేష్ఠతములయిన గణిత శాస్త్రజ్ఞులుకారు, అత్యంత వేగవంతమయిన పరుగెత్తేవారు కారు లేదా అత్యంత నైపుణ్యం కల చిత్రకారులు కారు. దాని అర్థం ఈ విషయాలను మీరు ఏమయినా తక్కువ ఆనందిస్తున్నారా?
మీకు లోపించింది అనే దానిపై కేంద్రీకరించటమనే దాని సామాన్యార్ధం మీరు న్యూనతాభావ మార్గంలో పయనిస్తున్నారన్నమాట - వీటిలో ఒకటి ఎవరికి అవసరం. మీ చుట్టూ చూడండి. సరిగా మీలాగే మరెవరయినా ఉన్నారేమో మీకు తెలుసా? మీరెంత ప్రత్యేకమో మీరు చూశారా? మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుని దైన్యాన్ని భావిస్తే, కేవలం మిమ్మల్ని మీరు తగినంత ప్రశంసించుకోవటం లేదని అర్ధం. చిన్నకథ:
ఒక జెన్ మాస్టర్‌కు తెలివయిన, శ్రద్ధాళువయిన, నిజాయతీపరుడయిన శిష్యుడున్నాడు. జ్ఞానోదయాన్ని పొందటానికి దీర్ఘకాలిక శ్రమ సాధ్య విధానాలను అవలంభించటానికి కావలసిన ఓర్పు అతనికి లేకపోవటం మాత్రమే అతని సమస్య.
ప్రతిరోజు మాస్టర్ దగ్గరకు వచ్చి అడుగుతుండేవాడు. "నేను బుద్ధుడిలాగ ఎప్పుడవుతానో చెప్పండి మాస్టర్!" మాస్టర్ కేవలం నవ్వి ఊరుకునేవారు, జవాబిచ్చేవారు కాదు. మాస్టర్ సూచనమేరకు పగలు, రాత్రి, ప్రతి విధానాన్ని అభ్యసిస్తూ ఉన్నప్పటికి ఇంకా సమాధానం రాకపోయేసరికి, శిష్యుడు జ్ఞానోదయంకోసం దప్పికతో వెర్రిక్కిపోయాడు. తుదకు, ఒకరోజు అన్వేషణకు విలువలేదని నిర్ణయించుకున్నాడు. అతడు మాస్టర్ దగ్గరకు వెళ్ళి అభ్యర్థించాడు,
"నేను మిమ్మల్ని విడిచి వెళ్ళేముందు నాకో విషయం చెప్పండి, నేను ఎప్పటికయినా బుద్దుణ్ణి కాగలనా లేనా?"
సమాధానంగా, మాస్టర్ శిష్యుణ్ణి కోపంతో ముఖం మీద కొట్టాడు.
తత్ క్షణం, శిష్యుడు తన వాస్తవ ప్రకృతిని తెలుసుకున్నాడు.
అరచేతి దెబ్బవల్ల మాస్టర్ ఏమి ఉద్దేశించాడు?
అత్యధికంగా ఆశించాడని అతడు శిష్యుడిపై ఆగ్రహించాడా?
కాదు. శిష్యుడు ముందే బుద్ధుడయ్యాడు అనే జాగృతిని శిష్యుడికి కలిగించటానికి మాస్టర్ ఆవిధంగా శిష్యుణ్ణి ప్రేరేపించవలసి వచ్చింది! ముందే అయి ఉన్న మీరు మళ్ళి అలా ఎలా అవుతారు?
మీరు వాస్తవంగా ఎంత అసాధారణమైన వారో మీరు మరచిపోయేటంతగా మీ అంతరాత్మతోడి సంపర్కం లేకుండా ఉన్నారు. ఒకసారి మీరు దీన్ని తెలుసుకుంటే, పోల్చుకోవలసిన అవసరం సహజంగా పోతుంది. మీరు పోల్చుకోవాలని మీరు అనుకున్నా, ప్రతివ్యక్తికి విభిన్నంగా నిర్దేశ సామాన్యాంశమెక్కడ?
కాబట్టి పోలిక దృక్పథాన్ని విడనాడండి.
జ్ఞాపకముంచుకోండి, మీరు వాస్తవంగా ప్రత్యేకంగా - సరిగా వేరే ప్రతి ఒక్కరిలాగానే!
(ప్రశ్న: స్వామీజీ మీరు విగ్రహారాధనను అంగీకరిస్తారా?
మొట్టమొదట, బాగా స్పష్టంగా ఉండండి. మనమనే 'విగ్రహారాధన' విగ్రహాల ఆరాధన కాదు!
అవి విగ్రహాల ద్వారా ఆరాధన.
స్పష్టంగా, విగ్రహారాధకుడెవడూ విగ్రహాన్నే ఆరాధించటంలేదు. అతడు దృశ్యరూపంలో ఉన్న విగ్రహాన్ని దైవంగా భావించి ఆరాధిస్తున్నాడు.
అది తెలివి తక్కువ విషయమా?
ఈ విషయాన్ని లోతుగా వీక్షించండి.
మనకు తెలిసినట్టుగా, జీవితమంతా ఒకే మూలం నుండి వస్తుంది. విశ్వంలోని ప్రతి వస్తువు ఒక రకమయిన ముడి పదార్ధంలా నుంచి సృష్టింబడుతుంది. విశ్వానికి సమానమయిన అంతర్నిర్మాణముంది. మనం ఉపరితల వైవిధ్యాలను మాత్రమే చూస్తున్నాము కాబట్టి దీని గురించి మీకు తెలియకపోవచ్చు. విశ్వంలో భాగంగా మనం విశ్వం యొక్క ఖచ్చితమయిన రచనా నిర్మాణాలను ప్రతిబింబించే అద్దాల లాగా ఉంటాము. ఈ భావనను స్పష్టంగా అర్థం చేసుకోండి.
లోని ప్రతి వస్తువు సంబంధించి ఉంటుంది. విశ్వం అయిదు మహామూలకాల తోను, అయిదు మహాశక్తులతోను - నేల, నీరు, నింగి, నిప్ప, గాలి - కూర్చబడింది.
ఈ మూలకాలన్నీ (సంస్కృతంలో పంచభూతాలని వీటిని వ్యవహరిస్తారు) దైవంగా లేదా పరాశక్తిగా మనం అభిభాషించే విశ్వశక్తి వ్యక్తీకరణలు.
మానవుడు తాను (ఆత్మ) బ్రహ్మ లక్షణాలను ప్రతిబింబిస్తాడు. మనుష్యుడు కూడా ఈ అయిదు మహాశక్తుల నుండి ఏర్పడ్డాడు, అతడు కూడా పంచభూతాల నుండి నిర్మించబడ్డాడు. అతడు ఈ మూలకాల నుండి ఉద్భవించాడు, ఈ మూలకాలలో జీవిస్తున్నాడు, తుదకు ఈ మూలకాలలోకి తిరిగి వెళ్ళిపోతాడు. సహజంగా, జీవిత కాలమంతా మనుష్యుడు తన అసలు ఉత్పత్తి స్థానానికి తిరిగి వెళ్ళటానికి తహతహ లాడుతుంటాడు, కాబట్టి అతడు తాను ఈ మహాశక్తులతో కలిసి సమగానం చేయటానికి ప్రయత్రిస్తాడు.
మతం మనుష్యుడు ఈ కీలక శక్తుల మధ్య జరిగే సమ్మేళన సృజన ప్రక్రియ మాత్రమే.
విశ్వశక్తి సాంద్రరూపం భూమి. మనిషిలో, అది మన శరీరంలో ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. దైవంతో తాను సమెక్యం కావటానికి మొదటి మెట్టుగా మనిషి తన స్వరూపంలో ఉన్న మట్టి విగ్రహ స్వరూపంలో ఉన్న భూమితో సంబంధాన్ని అన్వేషిస్తు న్నాడు. మనిషికి ఈ రూపం దైవంతో సంభాషించటంలో సాయపడటానికి అవసరం.
ఆధ్యాత్మిక యాతలో ఉన్న ప్రారంభకుడికి, అమూర్తంగా ఉన్న దైవాన్ని ఊహించటం కూడా కష్ఠం. దానికి రూపాన్నిచ్చినప్పుడు, అతడు అర్థం చేసుకోగలిగే, అన్వయించుకోగలిగే మూర్త పదార్థ విశేషంగా దైవం రూపొందుతుంది. విగ్రహంతో, అతడు తనకు పరిచయమున్న భాషలో దైవంతో సంభాషించగల్గుతాడు.
వందలకొద్ది ఉన్న హిందూదేవతలు దైవ వ్యక్తీకరణలు మాత్రమే, అయినా ఎవరైనా వాటితో మాట్లాడవచ్చు, వాటితో ఆడుకోవచ్చు, ఓదార్పును అన్వేషించవచ్చు లేదా కృతజ్ఞతలు సమర్పించుకోవచ్చు.
భయమయిన అనిర్వచనీయమయిన మొత్తం దైవ ప్రకృతి విగ్రహరూపంలో సుఖ నిష్పత్తులలో ఉండేటట్టు తగ్గించబడింది. అది ఈ విధంగా ఉండాలి. సాధారణ మనసుకు నిరాకారుడయిన భగవంతుడు కేవలం భయంకరమయిన భావన.
గాఢతర సూక్ష్మతరస్థాయిలో, ఇంకో సందేశం ఉంది :
మీముందున్న విగ్రహం మీ రూపంలాగానే ఉంది.
అయినా అది దేవుడు.
మీ గురించి అది ఏమి చెప్తాంది? దాని గురించి ఆలోచించండి. కాబట్టి విగ్రహాలు మొదటి మెట్టుగా ఖచ్చితంగా అవసరం, సహాయకారులు. విగ్రహం ఆధ్యాత్మికతలో ప్రవేశించటానికి దూకే బల్లలాంటిది.
మీరు ఆధ్యాత్మికంగా వికసించేకొద్దీ, ధ్యాననిమగ్నులుగా మీరు మీముందు ఏ భౌతిక రూపం లేనప్పటికి మీరు దైవంతో చక్కగా సంభాషించగల్గుతారు. పిల్లలు వయసు పచ్చిన తర్వాత ఆట వస్తువులతో ఆడటం మానివేసినట్లు, సమయం వచ్చినప్పుడు, మీ అంతట మీరు విగ్రహారాధన మానివేస్తారు. ఇది మతం యొక్క అంతిమ లక్ష్యం.
- *
ప్రశ్న: స్వామీజీ! మీరు కాషాయ వస్త్రాలనెందుకు ధరిస్తారు?
ప్రతిరోజు కనీసం పదిసార్లు నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వస్తోంది. భారతంలో ముఖ్యంగా కాషాయ వర్ణం హిందుత్వంతో గాఢ సంబంధం కలిగి ఉంది.
నా కాషాయవస్తం (వాస్తవంగా అది జేగురురంగు వస్త్రం) గురించి సంశయాత్ములు ముఖ్యంగా యువతీ యువకులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు.
నూతనంగా ఆవిర్భవిస్తున్న వర్ణ చికిత్సా క్షేత్రం గురించి విన్నారా?
రంగులు మీ మానసిక స్థితిపై గాఢ ప్రభావం కలిగించే సూక్ష్మ లక్షణాలను కలిగి ఉంటాయనే వాస్తవంపై ఆధారపడి వర్ణ చికిత్స ఉంది. మీకు తెలిసినా, తెలియక పోయినా, భిన్న భిన్న వర్ణాలు, భిన్న భిన్న ఆలోచనలను, భావోదేకాలను పుట్టిస్తాయి.
దీనికి ఖచ్చితంగా శాస్త్రీయ వివరణ ఉంది :
మనం పదార్థం యొక్క వర్ణం అనేది అది ప్రతిబింబించే కాంతి తరంగ దైర్ఘ్యం మాత్రమే. మన చుట్టూ అద్భుశ్య విద్యుదయస్కాంత క్షేత్రం ('కాంతి పుంజం' లేదా 'జీవుదవ్యశరీరం' అని విదితం) మనకు ఉంది కాబట్టి మన సొంత అయస్కాంత క్షేతం 'అనుభూతులు' లేదా 'భావోదేకాలు'గా మనం అన్యయించే చలనాన్ని లేదా ప్రతిచర్యను సృష్టించటానికి భిన్నవర్ల తరంగాలతో ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు, ఒక రంగు యొక్క తరంగ దైర్ఘ్యం, వ్యక్తి క్షేత పౌనఃపున్యం పరస్పరం సరిపోతే, అది క్రమబద్ధత, శాంతి భావాన్ని కల్గిస్తుంది.
వేర్వేరు వ్యక్తులు రంగులకు భిన్న రీతులలో స్పందిస్తారు, కాని చాలా సాధారణ పరిస్థితులున్నాయి. లషర్ వర్ల పరీక్ష బాసెల్ పటంలో 25 రంగులను చూపింది. ఈ పరీక్ష చాలామంది ఖచ్చితమయిన భిన్న 'వ్యక్తిత్వాలు' కలవారు ఒకే రకమయిన రంగులను ఎంచుకున్నారు. ఈ ప్రతిస్పందనలు భావోదేకం కాదు, మనం మానసిక మార్పుగా కూడా వీటిని చూడవచ్చు. చాలా తరచుగా, అది ఒక రంగు ప్రమాదకరమయినదిగా, పశాంతమయినదిగా, సంతోషమయినదిగా… అన్వయించ టానికి మనల్ని ప్రేరేపించే శరీరంలోని శారీరక పరిణామం.
నీరుపు రంగుకు గురి చేయబడ్డప్పుడు చాలామందికి శ్వాస క్రియ సూచి పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, రక్తపోటు అధికం కావటం జరిగింది - కాబట్టి సహజంగా, మనం ఎరుపు భావోదేకాన్ని లేదా ప్రమాదాన్ని కల్గిస్తుందని భావిస్తాము.
శుద్ధ నీల వర్ణాన్ని చూచినప్పుడు, శరీర ప్రతి క్రియ తద్భిన్నంగా ఉంటుంది - నీలం సామాన్యంగా ప్రశాంత పరిచే రంగుగా మనం అనుభూతి చెందుతుంటాము.
ప్రతి తల్లికి తెలుసు - తన బిడ్డకు నిదపట్టకపోతే, గదిలో నీలం రంగు బెడ్‌లైట్‌లో సుఖనిద్ద తన బిడ్డకు పడుతుంది. (తల్లికి కూడా బాగా నిద్దపడుతుంది!) ఈ కారణంగా కొన్ని నిర్ధిష్ట రంగులు సాంప్రదాయికంగా నిర్ధిష్ట గుణాలతోను భావోదేకాలతోను సంబంధం కలిగి ఉన్నాయి. దానికి పేరు పెట్టకుండానే, శతాబ్దాల తరబడి మనం వర్ణ చికిత్సను అభ్యసిస్తున్నాము. భారతలో, ఆహారం నుంచి మానవ ప్రకృతి వరకు ప్రతి వస్తువును దాని సహజ లక్షణాలను బట్టి మూడు విధాలుగా వర్గీకరించారు: సాత్వికం (ప్రశాంతం), రాజసికం (క్రియాత్మక మయినది), తామసికం (విధ్వంసక మయినది). రంగులను కూడా ఈ విధంగా విభజించవచ్చు: ఉదాహరణకు, ఎరుపు రంగు రాజసికం : ఇది మెదడులోని కార్యకలాపాన్ని ఉత్తేజరుస్తుంది. ఆ కారణంగా ఎరుపురంగు ప్రమాదకరమయిన రంగు - ప్రేమ రంగు! తెలుపు సాత్విక వర్ణం: మీరు తెలుపు ధరించినప్పుడు, శక్తి ప్రసారం బాగుంటుంది. తెలుపు రంగు మిమ్మల్ని ఇతోధికంగా ప్రశాంతంగా గ్రహణశీలిగా ఉంచుతుంది. తెలుపు సమాచారాన్ని అధిక ప్రభావవంతంగా గ్రహించేటట్లు మీకు సాయపడుతుంది. ఆ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా, తెలుపు పాఠశాల దుస్తులుగా ఎంచుకోబడుతుంది!
ఇదే విధంగా కషాయంరంగు (జేగురురంగు)కు మీమనస్సుకు ఓదార్పు కల్లించే శక్తి ఉంది. అది మీ కీలక శక్తిని ఉత్తేజపరుస్తుంది. తెలుపు దుస్తులను ధరించే వారిని మాత్రమే కాకుండా తెలుపును చూసే వారిని కూడా మనోధ్యాన స్థితిని స్పష్టిస్తుంది. ఈ కారణంచేతనే భారతలో ఆధ్యాత్మిక ఆచార్యులు సాంప్రదాయికంగా కాషాయ వస్తాలను ధరిస్తున్నారు. హిందుత్వానికి దీనికి సంబంధం లేదు!
బాగా స్పష్టంగా ఉండండి: ఈ పురాతన ఆచారాలన్నిటికి వారికి నిర్ణీత శాస్త్రీయ ఆధారం ఉంది. ఆచారాలు వందల వేల సంవత్సరాల వివేకాన్ని జ్ఞానుల తపస్సును కాచి వడపోస్తే లభించాయి. కాలం గడిచేకొద్దీ ఆచారాల వాస్తవ అర్థం జన సామాన్యంలో మరుగుపడిపోయిన కారణంగానే, నేడు ఆచారాలు విశ్వసనీయతను కోల్పోయాయి. ఆచారం గుల్త మాత్రమే మిగిలి ఉంది. ఆత్మవదిలి వెళ్ళిపోయింది.
ఈ రోజు, నిర్ణీత రంగులు, ధ్వనులు, చర్యలు మీ మానసిక స్థితిపై ప్రభావం చూపగలుతాయి, మీ మెదడులోని వాంఛిత ప్రదేశాలను ఉత్తేజపరచగల్గుతాయి, మీ చేతనను వ్యాప్తి పొందిస్తాయి - ఈ విషయాల్ని శాస్త్రం ఒప్పకొంటుంది. ఆచారాల వెనక ఉన్న శాస్త్రీయత మీకు తెలియనంత మాత్రం చేత వాటి ప్రాముఖ్యాన్ని నిర్లక్ష్యం చేయటం సూక్ష్మక్రిములను మీరు చూడనంత మాత్రం చేత వాటి ఉనికిని నిరాకరించటంలా ఉంటుంది!
నేడు అవి మీకు అసందర్భమనిపించినా ఆచారాల వాస్తవ శక్తిని తక్కువ అంచన వేయువద్దు. ఆచారాలను సరయిన మార్గంలో నిర్వహించినప్పుడు, వాటి ఊహాతీతమయిన జాగృతి, పరిణామ స్థాయిల్ని కల్పించే అద్భుతశక్తి ఉంది.