KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/బ్రహ్మచారి :Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

బ్రహ్మచారి :

బ్రహ్మచారి సంస్కృత పదం. దీని అర్ధం బ్రహ్మ+ఆచారి. అంటే ఎవరయితే (ఆచారి) సర్వాంతర్యామి (బ్రహ్మ) యొక్క శృతిలో, అదేవిధంగా ఉండగలరో అతనే బ్రహ్మచారి. దీని అర్ధం ఏమిటంటే, బ్రహ్మచారి ఎటువంటివి, ఏమీ ఆశించకుండా జీవించుతాడు. కానీ ఈరోజులలో దీనిని చాలా తప్పగా అర్ధం చేసుకున్నారు. బ్రహ్మచారి అంటే అవివాహితుడు అనే అర్ధాన్ని ఇస్తున్నారు.

రామానుజాచార్యులు ఆ యువకుడితో ఇలా చెబుతారు "ముందుగా నీవు వెళ్ళి ఎవరినైనా (ప్రేమించు : నీవు ఎవరినైనా (ప్రేమించినప్పుడు నీకు ఏమనిపిస్తుందో గమనించు. ఆ తరువాత నా దగ్గరకిరా, అప్పుడు నీకు భగవంతుని గురించి చెబుతాను. నీకు భక్తిని బోధిస్తాను".

సహజంగానే ఆ యువకుడు ఒక అడుగు వెనక్కి వేస్తాడు. గురుదేవుని మాటవిని ఆశ్చర్యపోతాడు. అతను రామానుజులు చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోలేక పోతాడు.

మీరు చూస్తున్న వ్యక్తి పట్ల (ప్రేమభావాన్ని అనుభవించకపోతే ఆ వ్యక్తి పట్ల (ప్రేమ చూపకపోతే మీరు ఎప్పుడూ చూడని వ్యక్తిని ఎలా (ప్రేమించగలుగుతారు. మీరు ప్రతిరోజు చూడగలుగుతున్న మనుషులని (ప్రేమించలేనప్పుడు, అసలు ఎప్పుడూ చూదని భగవంతుడిని ఎలా (ప్రేమించగలుగుతారు? రామానుజులు చెప్పినది సత్యం. మనం ఒక విషయం అర్ధం చేసుకోవాలి. మనం నివసించే పరిసరాలలో (ప్రేమని వెదజల్లలేకపోతే, మనం భగవంతుడయిన ఈ సర్వలోకాన్ని, మనపైన ఉన్న విశ్వాన్ని, ఎలా (ప్రేమించగలం?

నేను మరలా మరలా చెబుతున్నాను. ఈ ప్రపంచాన్ని (ప్రేమిస్తున్నాను అని చెప్పటం చాలా సులభం. కానీ మీరు మీ భార్యని (ప్రేమించటం చాలా కష్టం. ఈ ప్రపంచం మొత్తాన్ని (ప్రేమించటం చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ మీరు చేయటానికి ఏమీ లేదు. మీరు చేసేదంతా కేవలం, నేను ఈ ప్రపంచాన్ని (ప్రేమిస్తున్నాను అని చెప్పటమే. అదే మీ భార్యని (ప్రేమించుతున్నాను అని చెబితే మీదృక్సధం మార్చుకోవాలి. మీ మైండ్‌ని మార్చుకోవాలి. మీ మాటలని మార్చుకోవాలి. మీరు చేసి చూపించగలిగే పనులు చేయాలి.

మీరు మీతో జీవితాన్ని గడిపేవారిని నిజంగా (ప్రేమించాలి అని అనుకుంటే, మీరు ముందుగా 'నేను' 'నాది'అనే వాటిని పూర్తిగా వదిలివేయాలి.మీ భార్యని మీ సొంత ఆస్తిగా చూసినంతకాలం మీ హృదయంలోనూ, మీ మనస్సులోనూ ఉండేది హింసా ప్రవృత్తి మాత్రమే. అంతేకాని అది (ప్రేమ కాదు. మీరు ఎదుటివారిని కంట్రోలు చేయాలనుకుంటారు. మీరు వారిపై అధికారి, సొంతదారుడు అని నిరూపించాలని ప్రయత్నిస్తుంటారు. నేను చెబుతున్నాను. నిజ‌మ‌యిన (ప్రేమ అంటే (ప్రేమని పొంది ఆధీనపరచుకోవాలి అనే అలోచనని వదిలి వేయాలి.

లెబనాన్ తత్త్వవేత్త, కవి కలిల్ జిబ్రాన్ (ప్రేమ గురించి అతని ప్రసిద్ధ గ్రంధంలో ఇలా చెబుతారు. మీ భార్యతో బ్రెడ్‌ని పంచుకోండి. కానీ అందులో నుంచి మీరు తినవద్దు. మీరు తాగేది మీ భార్యతో పంచుకోండి. కానీ ఆ కప్పులోనిది మీరు తాగవద్దు. మీరు ఒకరిపై ఒకరు సొంతగా అధికారులు కాదు.

మీలో చాలా మంది మీ భార్య లేదా భర్తతో ఏమి చెబుతారు. మీరు ఏం చెప్పాలను కుంటారో అది చెప్పేసారు. ఏమి అనాలనుకుంటారో ఆ మాట అనేస్తారు. అలా అనే హక్కు మీకు ఉన్నది అని అనుకుంటారు. ఎవరయినా ఆ హక్కు మీకు లేదు. అని అంటే మీరు చాలా బాధపడతారు. అవును కదా? లేకపోతే ఇలా అనుకుంటారు : ఇవే మాటలు కొత్తవారితో అనే ధైర్యం ఉంటుందా? లేదు మనం సమాజ మర్యాదలని పాటించాలి. కానీ ఆ మర్యాదలు భార్య/ భర్త విషయంలో వర్తించవు. దానికి మీరు చెప్పే కారణం మీరు వారిని (ప్రేమిస్తున్నాను అని. మీలో ఎంతమంది మీ భార్యలతో మాటలో మాటలో ఏభైశాతం ఏ నిబంధనలూ, షరతులూ లేని (ప్రేమనుంచి వస్తున్నాయి అని చెప్పగలరు. మీ గుండె మీద చేయచేసి చెప్పండి.

కానీ మీరు మీ భార్యని నిజంగా (ప్రేమించగలగినప్పుడే మీరు ఈ ప్రపంచాన్ని ఎలా (ప్రేమించాలో తెలుసుకుంటారు. మన వివాహ పద్ధతిలో ఉండే మంత్రాలు, ప్రమాణాల ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ఎందుకు వివాహ బంధాన్ని ప‌విత్ర బంధం అంటారు? ఎందుకంటే, ఇద్దరి మధ్య (ప్రేమ బంధాన్ని సృష్టించి వారి మిగతా జీవితామంతా కలసిమెలసి ఉంటే అందులో వారు పొందే అసుభవాలు, అనుభూతులే సత్యం. కాబట్టి ఈ సత్యమే మిమ్మలని సర్వమానవులను (ప్రేమించే దిశగా తీసుకువెళుతుంది. వారి ఇద్దరి మధ్య నిజమయిన (ప్రేమ లేనప్పుడు,వారి ఇద్దరిలో ఏఒక్కరయినా సర్వమానవులకి (ప్రేమించగలిగే విషయంలో ఎలా (ప్రతిభ సాధించగలరు.

అటువంటి సచేతన స్థితిలో స్థిరపడి దానిని సర్వ విశ్వానికి వెల్లడి చేసే విషయంలో ఇద్దరూ ఒక్కటే. ఎప్పుడయితే ఒక వ్యక్తి దీనిలో ఐక్యమయిపోతాడో, ఎప్పుడయితే అతను దీనిలో స్థిరపడతాడో, అప్పడు అతను అ(ప్రయత్నంగానే (ప్రేమని వెదజల్లగలుగుతాడు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఎప్పుదయితే (ప్రేమ అనేది జరగదో, ఎప్పుడయితే దానిని వెల్లడి చేయలేరో, ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక అనుభవం కాలేదు అని అర్ధం.

ఎప్పుడయితే నిజమయిన అనుభవం సంభవించుతుందో, అది అ(ప్రయత్నంగానే వెల్లడి అవుతుంది. అనుభవం అనే దానిని మీరు స్వాధీనం చేసుకొని మీ బీరువాలో దాచలేరు. అనుభవమే మిమ్మలని స్వాధీనపరచుకుంటుంది. అది మిమ్మలని దాని లోపలికి ముంచి వేస్తుంది. అది ఎంపికలేని విధంగా పొంగి ప్రవహించుతుంది.

ఒక జెన్ బౌద్ధ గురువుని అతని శిష్యుడు ఈ విధంగా అడుగుతాడు గురుదేవా, జ్ఞానోదయమయిన వ్యక్తి మాట్లాడతాడా?

ఆ ప్రశ్నకు గురుదేవులు ఇలా చెబుతారు "లేదు. జ్ఞానోదయమయిన వ్యక్తి ఎప్పుడూ మాట్లాడడు. ఎవరికైతే ఏమీ తెలియదో అతనే మాట్లాడతాడు".

అప్పుడు శిష్యుడు ఇలా అడుగుతాడు " అంటే జ్ఞానోదయమయిన వ్యక్తి మౌనంగా ఉంటాడా?"

గురువు వెంటనే "లేదు. జ్జానోదయమయిన యోగి అసలు మౌనంగా ఉండలేడు. అతను అలా మౌనంగా ఉంటే స్పష్టంగా అర్ధం చేసుకో, అతనికి జ్ఞానోదయం కలుగలేదు అని అర్ధం.

శిష్యుడు చాలా అయోమయంలో పడిపోతాడు. "గురుదేవా! మీరు అతను మాట్లాడడు అంటున్నారు. అతను నిశ్శబ్దంగా ఉండడూ అని అంటున్నారు. మరి ఆయన ఏమి చేస్తాడు?

శిష్యుడి ప్రశ్నకు గురువు ఇలా జవాబు ఇస్తాడు " అతను పాట పాడతాడు. అతని ఉనికి మొత్తం పాడుతుంది. అతను మాట్లాడడు.అతను మౌనంగా ఉండడు. జ్ఞానోదయమయిన వ్యక్తి యొక్క ఉనికి మొత్తం ఒక సంగీత వాహినిలా సాగుతుంది".

ఇలా ఎందుకు జరుగుతుందంటే అనుభవాన్ని మీరు స్వాధీనం చేసుకోలేరు. అనుభవమే మిమ్మలని స్వాధీన పరచుకుంటుంది. ఎప్పుడయితే అనుభవం మిమ్మలని స్వాధీన పరచుకుంటుందో మీరు ఏమి చేసినా అది మధుర గానంలా ఉంటుంది. మీ నుంచి వచ్చే ప్రతి మాట ఒక చక్కని గీతంలా ఉంటుంది. మీ ఉనికి మొత్తం lప్రకాశంవంతంగా ఉంటుంది. మీ నడక నాట్యంలా మనోహరంగా ఉంటుంది. మీ ప్రతి శరీర కదలిక, శరీభాష మీలోని అద్భుత సోయగాలని వ్యాపింపచేస్తుంది. మీరు వెల్లడి చేసే ప్రతిదీ ఒక సేవగా మారతాయి. అదే సమాజానికి దొరికే అద్భుతమయిన సేవ. బౌద్ధగురువు చాలా అందంగా చెప్పారు. జ్ఞానోదయమయిన వ్యక్తి మాట్లాడడు, మౌనంగా ఉండడు, అయన పాడతాడు అని.

ఈ కారణం వలననే గీతని ఒక మధుర గీతంలా ఒక పాటలా చెప్పారు. గీత పాఠం రూపంలో ఉండదు. ఇది ఒక మధుర సంగీత భరితమయిన పాట. గొప్పగొప్ప సత్యాలని తర్శంతో హేతుబద్ధంగా వివరించలేము. వాటిని కవిత రూపంలో, పాటల రూపంలో మాత్రమే వెల్లడి చేయగలం. పాఠం తర్శంతో కూడుకున్నది. అది గట్టిగా స్థిరపడి ఉంటుంది. కాని పాటలు, కవితలు అంటే భావాలు. అది (ప్రేమ. అది ప్రవహించుతూ ఉంటుంది.

శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతాడు. ఏ వ్యక్తి అయితే సచేతన స్థితిలో స్థిరపడతాడో అతను చాలా గొప్పవాడు. అయితే ఏ వ్యక్తి తన ఆధ్యాత్మిక అనుభవాలని వెల్లడి చేయగలుగుతాడో, ఎవరయితే అ అనుభవాలని అందరికీ పంచగలుగుతాడో, ఎవరయితే తనలోని (ప్రేమని అ(ప్రయత్నంగా అన్ని దిశలకీ వెల్లడి చేయగలుగుతాడో ఆ వ్యక్తి సచేతన స్థితిలో స్థిరపడిన వ్యక్తికంటే చాలా గొప్పవాడు. అయితే సత్యమేమిటి అంటే సచేతన స్థితిలో స్థిరపడిన వ్యక్తి, ఆ అనుభూతులని, (ప్రేమని వ్యాపింప చేస్తాడు. అతను మధురగీతాలని అలపించుతాడు. పాట పాడతాడు.

నేను మీకు వారణాసిలో నివసించే ఒక భక్తుని కథ చెబుతాను అతను గొప్ప కృష్ణభక్తుడు. అతని దగ్గర చిన్న భగవద్గీత పుస్తకం ఉండేది. అదే ఆయన సర్వస్వం. అది ఆయనకి ఉన్న సర్వ సంపద. ప్రతిరోజు ఉదయం ఆయన గంగానదిలో స్నానం చేసి, ఆ తరువాత భగవద్గీతని చదివేవాదు. అలా శ్రీకృష్ణని సందేశమయిన భగవద్గీతని భక్తి పారవశ్యంతో చదివే వాడు. ఆయన ఆ రోజంతా కూర్చొని శ్రీకృష్ణనిపైన ధ్యానం చేసేవాడు. అతను నిరంతరం శ్రీకృష్ణ భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఉండేవాడు. అతను కృష్ణ భక్తిని నిరంతరం వెదజల్లుతూ ఉందేవాడు. అతని భక్తి, ప్రేమ నిరంతరం కృష్ణని వైపు ప్రవహించుతూ ఉండేది.

అయితే అటువంటి వ్యక్తులని మీరు భరత్ లోనే చూడుగలరు. చాలామంది అలా కూర్చోని భక్తి పారవశ్యంలో పూర్తిగా నిమగ్నమయి పోయి ఉంటారు. సమాజం వారిని, వారి నిశ్చలతని భంగం చేయదు. ఎవరూ వారి జోలికి వెళ్ళరు. వాళ్ళ బాగోగులు సమాజం చూసుకుంటుంది. అదే మరే దేశంలోనైనా అయితే వాళ్ళని అనాధలుగా గుర్తించి వాళ్ళని దానికి సంబంధించిన హోమ్స్‌కి పంపించి వేస్తారు. వాళ్ళని సమాజం చిన్న చూపు చూస్తుంది. పోలీసులు, ప్రజలు వారిని అలా ఉందనీయరు. అయితే హిందూ సంస్కృతి చాలా అందమయినది అద్భుతమయినది. మీరు ఏమీ చేయకుండా అలా కూర్చున్నా భక్తి పారవశ్యంతో ఉన్నా మిమ్ములని గౌరవించుతుంది. మిమ్మలని ఆరాధిస్తుంది.

ఈ కృష్ణ భక్తుడు కృష్ణుని పేరు స్మరించుతూ, కృష్ణని ధ్యానం చేస్తూ అటువంటి భక్తి పారవశ్యంలో ఉంటాడు. అతను నిరంతరం శ్రీకృష్ణుని పై ధ్యానం చేస్తూ, క్బష్టనామాన్ని స్మరిస్తూ ఉంటాడు. అతను పూర్తిగా శ్రీకృష్ణుని సచేతన స్థితిలో తనను తాను పోగొట్టుకునేవాడు.

ఒకరోజు ఒక బిక్షగాదు అతని దగ్గరికి వచ్చి "స్వామీ! దయచేసి నాకు ఏమయినా ఇవ్వండి. నేను భోజనం చేసి మూడు రోజులయింది" అని అడుగుతాదు. భక్తునికి ఏమి చేయాలో తెలియదు. అతనే ఒక బిక్షగాదు. అతనికి ఉన్న ఒకే ఒక ఆస్తి భగవద్గీత. అంతకుమించి అతని దగ్గర ఏమీ లేవు. అతను నిరంతరం భక్తి పారవశ్యంలో ఉంటాడు. ఎవరయినా ఏమయినా ఇస్తే తింటాడు. లేకపోతే క్సష్టనామాన్ని స్మరించుతూ ఆ ఆనందంలో మునిగి ఉంటాడు. అతనికి వున్న ఒకే ఒక ఆస్తి గీతా పుస్తకం.

ఆ పరిస్ధితిలో ఒక బిక్షగాడు వచ్చి, తాను మూడ రోజుల నుంచీ ఏమీ తినలేదని ఏమయినా ఉంటే ఇవ్వమని అడుగుతాదు. భక్తుడు చాలా బాధపడతాడు. చుట్టూ చూస్తాదు. అతనికి ఏమీ కనిపించవు. ఒక్క భగవద్గీత పుస్తకం తప్ప. ఆ పుస్తకాన్ని అతను ఎన్నో సంవత్సారాల నుంచి దాచి వుంచాడు. అతను రోజూ దానిని పూజిస్తాడు. అది అతనికి ఉన్న ఒకే ఒక ఆస్తి. అదే అతనికి దైవం. అదే అతని సర్వస్వం.

ఆకస్మాత్తుగా అతను ధైర్యం తెచ్చుకుని ఆపుస్తకాన్ని చేతో పట్టుకుని ఆ బిక్షగానితో "అయ్యా ! నాదగ్గర ఏమీ లేదు. నీకు నిజాయితీగా చెబుతున్నాను. నాదగ్గర ఈ పుస్తకం తప్ప ఏమీ లేవు. అయితే నేను నీకు ఒక విషయం చెబుతాను. నీవు పట్టణంలోనికి వెళ్ళి ఈ పుస్తకాన్ని నేను నీకు ఇచ్చానని చెప్పి అమ్ముకో. దీనిని ఎవరయినా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఎందుకంటే చాలామందికి నేనంటే చాలా గౌరవభావం ఉన్నది. వాళ్ళు నా భక్తులు. శ్రీకృష్ణని దీవెనలు దీనికి ఉన్నాయి. నీవు బజారుకి వెళ్ళి ఈ పుస్తకాన్ని అమ్ముకో. ఆ డబ్బుతో ఏదయినా కొనుకొని దాంతో సంతోషంగా ఉండు" అని అంటాడు.

బిక్షగాదు ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మర్నాదు భక్తుదు శ్రీకృష్ణుని పేరు స్మరించుతూ గీత చదివే సమయంలో చెబుతాదు "శ్రీకృష్ణా ! నేను నీ మాటలు నిలబెట్టటానికి నీ మాటలని ఇచ్చివేసాను." శ్రీకృష్ణని మాట ఏమిటి? భక్తిని ప్రేమని మీ జీవితం వెదజల్లమని, సేవని వ్యాపింపచేయమని, అందుకే ఆ భక్తుదు' నీమాట నిలపటానికి, నీ మాటలని ఇచ్చేసాను' అంటాడు

ఇతను నిజమయిన భక్తుడు. అతను సత్యాన్ని చూడగలిగాదు. ఆయన సత్యాన్ని అసుభవించాడు. ఆ అనుభూతుల్ని వెల్లడి చేయగలిగాడు. అతను శ్రీకృష్ణుని ప్రేమని, సేవా మార్గాన్ని, భక్తిని తన తోటివారికి వెల్లడి చేయగలిగాదు.

భగవద్గీతని తన దగ్గరే ఉంచుకోవటంకంటే కృష్ణుని మాటలు నిలబెట్టటం చాలా ముఖ్యం. అందుకే ఆ భక్తుడు కృష్ణని మాట నిలబెట్టి, కృష్ణుని మాటలని ఆయన గీతాన్ని ఇచ్చేయడం ద్వారా ఆయన మాట నిలబెట్టాడు.

నిజానికి మీరు ఆ పుస్తకాన్ని నిజంగా మీ దగ్గరే ఉంచుకొని, దానిని నిజాయితీగా ఉపయోగించ గలిగితే, మీరు తప్పకుండా ఆ మాటల్ని అనుభూతి చెందుతారు. అప్పుదు శ్రీక్షస్థుని మాటలని మీరు అన్ని దిశలకూ వ్యాపింప చేయగలుగుతారు. ఎప్పడయితే మీరు ఆయన పుస్తకాన్ని నిజంగా మీ దగ్గర ఉంచుకోలేకపోతారో పోగొట్టుకుంటారో ఆయన మాటలను నిలబెట్టలేకపోతారు. ఆతని మాటలని మీ దగ్గర పెట్టుకునే అవకాశం కూడా పోగొట్టుకుంటారు.

భగవానుడు ఇలా కొనసాగిసాడు

శ్లోకం 12.3 - 12.4

```Sanskrit యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ (12:3) సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః (12:4) ```

అర్థము: ఏ=ఎవరయితే : తు= కాని : అక్షరం = నాశనములేని : అనిర్గేశ్యం = నిర్వచించలేనిది (ఇది అని చెప్పలేనిది) : అవ్యక్తం = వ్యక్తం చేయలేని (వివరించలేని) : పర్యుపాసతే = ధ్యానించుచున్నారో, ఆరాధించుచున్నారో : సర్వతగం = అంతటా వ్యాపించినది : అచిన్యం = ఊహించలేనిది : చ = కూదా : కూటస్థమ్ = నిర్వికారమైనది : స్గిరమయినది : అచలమ్ = చలించనిది : ధృవం = స్దిరముగా ఉన్నది (నిత్యమయినది) :

సంనియమ్య = స్వాధీనపరచుకొన్నది : ఇందియాగ్రామమ్ = ఇందియమముల సమూహం : సర్వతా = అంతటా : సమబుద్ధి = సమాన భావము కల : తే = వారు : ప్రాపున్యువంతి = సాధించి : మామ్ = నేను : ఏవ = ఒక్కటే : సర్వభూత వితే = సమస ప్రాణులయందు మంచి చేయాలనే సంకల్చం కలవారు : రాతః = నిమగ్నమయి ఉన్నారు.

ఎవరైతే నాశనం లేని పరుబహ్మను, నిర్వచింపలేని దానిని, ఇందియ గోచరము కానిది, సర్వవాప్తి అయినది, ఇది అని నిరూపించలేని, స్గిరమయినది, మార్పు లేనిది, శాశ్వతమయిన పరబ్రహ్మను, ఎవరయితే ఇంద్రియ నిగ్రగహముతో ఆరాధించుతారో, ఎవరయితే నిష్పాక్షిక బుద్ధితో సర్వమానవాళి హితం కోసం పని చేస్తారో వాళ్ళు కూడా నన్ను పొందుతారు.

శ్రీకృష్ణుడు సుగుణ బ్రహ్మ. అతను విశ్వం యొక్క భౌతిక రూపం. ఆ రూపాన్నే ఆయన విశ్వరూప సందర్శనంలో అర్హనునికి చూపించుతాదు. కృష్ణుడు నిర్ధుణ బ్రహ్మకూడా ఆయన రూపంలేని సచేతన స్థితి. ఆయన రూపంతోను, రూపంలేని స్థితిలోనూ ఆయన శ్రీకృష్ణదే. ఆయన దైవమే. ఆయన దివ్య చేతనస్దితి గలవాడే.

అక్షరం అంటే నాశనం లేనిది. అదే దైవత్వంలోని శాశ్వతత్త్వం. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి పదార్గం వస్తుంది,పోతుంది. కనిపించుతుంది. మాయమవుతుంది. కానీ దైవం, దివ్యత్వం శాశ్వతమయినవి. అవి ఎల్లకాలం ఉంటాయి. అనిర్దేశ్యం అనేది చాలా ప్రత్యేకమయినది. దానిని మరి దేనితో కూడా పోల్చలేము. అది అత్యున్నతమయినది. అవ్యక్తం అంటే వ్యక్తపరచలేనిది. దానిని ఏస్పర్శచేత కూడా వ్యక్తపరచలేము. అచింత్యం అంటే ఒక వ్యక్తి యొక్క శరీరం, మైండ్ తనకు జరిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని దైవదర్శనాన్ని, దాని అనుభవాలని ఎందుకు వ్యక్తం చేస్తుందో అదే అచింత్యం.

సర్వ త్రాగం అంటే సర్వాంతర్యామి. అన్ని చోటులలో ఉండగలిగే దివ్యత్వం. దైవం లేని చోటు ఉండదు. ఆయన సర్వాంతర్యామి.

రాక్షసరాజయిన హిరణ్యకశపుని కుమారుదు ప్రహ్లాదుడు. అతను ప్రహ్లాదుని హరినామ జపం చేయవద్దని అంటాదు. అప్పుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశపునితో "నారాయణుడు అన్ని చోటులలో ఉంటాదు. ఆయన ఈ కొమ్మలో ఉంటాదు, ఈస్తంభంలో ఉంటాడు" అని అంటాడు.

ప్రహ్లాదుడు ఈవిషయాన్ని చెప్పే సమయానికి శ్రీమన్నారాయణుడు, ఆయననే విష్ణుమూర్తి అని కూడా అంటాము, ఆయన వైకుంఠంలో లక్ష్మీదేవితో ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చాలా హడావిడిగా బయలుదేరతాడు. అప్పుడు అందరు భార్యలూ అడిగినట్లే లక్ష్మీదేవి కూడ విష్ణుమూర్తిని " ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరారు" అని అడుగుతుంది. జగన్మాత ప్రశ్నకు విష్ణుమూర్తి ఇలా సమాధానం ఇస్తాడు " నాభక్తుడు ప్రహ్లాదుడు నన్ను పిలవబోతున్నాడు. అతను తన వేలిని ఎటువైపు చూపిస్తాదో నాకు తెలియదు. అది చెట్లు కొమ్మ అయినా అవుతుంది లేదా రాతి సంభమయినా అవుతుంది. అతను ఎక్కడ చూపించితే నేను అక్కడ ప్రత్యక్షమవ్వాలి. నేను అతనిని ఈ విషయంలో భంగపరచను".

నిజమయిన భక్తుడు తన స్వామినీ, తనదైవాన్ని ప్రతి చోట చూడగలుగుతాదు. రామకృష్ణ పరమహంస నిజమయిన భక్తుని యొక్క ప్రేమ గురించి ఈ విధంగా చెబుతాదు. భార్యకి భర్తపట్ల ఉన్న పవితమయిన ప్రేమ వంటిది, పిసినారికి తాను దాచిన ఐశ్వర్యం పట్ల ఉన్న వ్యామోహం లాంటిది. లౌకిక సుఖాలపట్ల ఒక మామూలు వ్యక్తి ఉన్న ఆశలాంటిది, ఇవన్నీ ఒకదానిలో కలిస్తే, అవన్నీ భగవంతుని వైపు ప్రయాణిసే అదే భక్తి

పరబ్రహ్మ మారనివాదు. స్ధిరమయినవాడు, కదలనివాదు. అతను రూపంలేని వాదు, రూపంకలవాడు.నిజమయిన భక్తుడు చేతన స్ధితిలో, తన సర్వేంద్రింగ్రియాలని భగవంతుని మీద కేంద్రీకరించి, ఆయన అనుభవాలని పొందుతాదు. అలాగే సర్వ మానవులకు సేవచేసూ అతను శాశ్వతానందపు అనుభూతులని పొందుతాదు. అటువంటి భక్తులు, భగవంతుని తాను కలసిన అందరిలోనూ చూడగలుగుతాదు. అతనికి తన స్వామి యొక్క అనుభవాలే అతను వెల్లడి చేసే ప్రేమ అవుతుంది.

రాధ ఒకసారి గోపికలతో ఇలా చెబుతుంది. "నాకు ఏమయిందో తెలియటం లేదు. నా మీదకి ఏమి వచ్చిందో తెలియదు. నేను అందరిలోనూ కృష్ణుణ్ణి మాత్రమే చూడగలుగుతున్నాను. అందరూ నాకు శ్రీకృష్ణుని లాగానే కనిపిసున్నారు. నాకు ఏం జరుగుతుందో తెలియటం లేదు".

ఒక గోపిక ఇలా చెబుతుంది "రాధా! నీకు ఉన్నది భక్తి. భక్తి నీకంటికి కాటుకలా ఉన్నది".

ఇది ఈ విధంగా ఉంటుంది. మీరు కళ్ళకి నల్లటి కళ్ళద్దాలు పెట్లుకుంటే, సమస్త్రం మీకు నల్లగా కనిపిస్తుంది. అలాగే ఆకుపచ్చ అద్దాలు పెట్టుకుంటే అంతా ఆకుపచ్చగా ఉంటుంది. అదే విధంగా మీరు భక్తి అనే కాటుకని పెట్టుకుంటే, మీరు ఎవరిని చూసినా వాళ్ళు శ్రీకృష్ణునిలా ఉంటారు. అందరూ భగవత్ స్వరూపులుగానే అనిపించుతారు.

ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమి చెబుతాదంటే :ఎవరయితే అత్యున్నతమయిన చేతన స్ధితిలో స్తిరపడతారో,ఎవరయితే భక్తిని వెదజల్లుతుంటారో ఈ ఇద్దరూ ఒకటే. వాళ్ళు రెండు వేరు వేరు గ్రూపులు కాదు.

అర్థం చేసుకొండి. శ్రీకృష్ణదు రెండు గ్రూపులని తయారు చేయటంలేదు. అర్జునుడు తాను చూసిన నిజంని రెండు గ్రూపులుగా చెబుతున్నాడు. వాళ్ళే. ఒకరు చేతనిస్థితిలో స్గిరపడిన వారు : ఒకరు భక్తిని ప్రేమని వెల్లడిచేసేవారు. ఇక్కడ శ్రీకృష్ణదు ఈ ఇద్దరూ ఒక్కటే అని చెబుతున్నాడు. ఆయన వారిని రెండు గ్రూపులుగా చేయటం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్దం చేసుకోండి.

శ్రీకృష్ణుడు ఏమని చెప్పాదు. ఎవరయితే చేతనస్థితిలో స్గిరపడతారో అతను ప్రేమని వెదజల్లుతాదు, అన్ని దిశలలో వ్యాపింపచేస్తాడు. భక్తుడు ఎవరయితే భక్తిని, ప్రేమని వ్యాపింపచేస్తాదో సచేతన స్థితిలో స్దిరపడతాదు. నేను ఇంతకుముందు చెప్పిన శాశ్వత ధర్మచక్రం ఇదే .

రామకృష్ణ పరమహంస ఇలా చెబుతారు. "విప్పుడయితే గంట కొదతామో ప్రతి గంటకీ దాని శబ్దం దానికి ఉంటుంది. అలా గంట కొట్టటం ఆపిన తరువాత కూడా ఆశబ్దం మనకి వినిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు అదే విధంగా రూపంతోనూ, రూపం లేకుండా మనకి కనిపించుతాడు.

భజగోవిందంలో శంకరాచార్యులు ఈ విధంగా చెబుతారు.

భజగోవిందం

```Sanskrit గురుచరణామ్బుజ నిర్భరభక్తః సంసారాదచిరాద్భవ ముక్తః సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ ```

ఎవరయితే తన ఇందియాలని నిగ్రహించుతాదో, తన మనస్సుని పూర్తిగా గురువు మీద కేంద్రీకరించుతాదో, ఎవరు పూర్తిగా గురువునకు ఆధీనమవుతాదో, అటువంటివ్యక్తి తన హృదయంలో భగవంతుని చూడగలుగుతాడు.

శ్రీ కృష్ణుడు ఇక్కడ మరొకసారి ఇలా చెబుతాదు. ఎప్పదయితే రూపరహితమయిన భగవంతుని శాశ్వతము, నాశనము లేని, నిర్వచించలేని భగవంతుని, ఇంద్రియనిగ్రహం కలవాడె తెలుసుకుంటాదో అతడు మానవుల మంచి కోసం పాటుపడతాడు.

రూపంలేని భగవంతుని యొక్క అనుభవం, రూపంతో ఉన్న భగవంతుని యొక్క అనుభవంలాంటిదే. రెండూ కూడా ఒకే సత్యం వైపు దారి తీస్తాయి. అదే సర్వ చేతనస్సితిలో ఒక భాగం

అలా తెలుసుకున్న విషయాన్ని వెల్లడి చేయటమే లోతయిన కరుణ, వినయం. ఇదే కృతజ్ఞత ఆధీనతారూపంలో ఉంటుంది. అప్పుదు అటువంటివారు విశ్వశక్తితోపాటు ముందుకి వెళ్ళగలుగుతారు. వారికి జీవితంలో ఎదురువచ్చే కెరటాలతో పోరాటం చేయవలసిన అవసరం ఉందదు.

చైనా తత్త్వవేత్త అయిన తావొ ఇటువంటి ప్రపాహం గురించి, ప్రవహించటం గురించి చక్కగా చెబుతారు. నీటిప్రవాహానికి తలవంచే నీటి మొక్క బతుకుతుంది. చక్కగా ఎదుగుతుంది. నిటారుగా ఉండే మొక్క ప్రవాహ ధాటికి వంగిపోయి, ఇరిగిపోతుంది. అది చివరికి లేకుండా పోతుంది. మనం చిన్న నీటి మొక్కలా పూర్తిగా ఆధీనమయినపోయి మన చుట్టుపక్కల వాటిని యధాతధంగా స్వీకరించగలిగితే మనం ప్రకృతితో పోరాదవలసిన అవసరం ఉండదు. అప్పుడు మనం నిరంతరం శాశ్వతానందంలో ఉందవచ్చు

ఎప్పుడయితే మనం అహంకారంతో నిండి ఉంటామో, మనం నియంత్రణలో ఉన్నట్టు అనుకుంటాము. ఈ ప్రపంచంలోని అల్లకల్లోలాలని ఒక క్రమ పద్గతిలో పెట్టగలమని అనుకుంటాము. ఈ భూమి ఈ విశ్వం మొత్తం మనం లేకపోయినా వాటిపని అవి నిరాటంకంగా చేసుకు పోతాయి అనే విషయం తెలుసుకోవటానికి ఒక్క క్షణం చాలు. కొన్ని కోట్ల నక్షతాలు, గ్రహాలు ఈ విశ్వంలో సృష్ణమయిన అవ్యక్త స్థితిలో (కల్లోల స్లితిలో) పనిచేస్తన్నాయి. ఈ సమస్త విశ్వం నిరంతరం అవ్యక్తస్థితిలోనే ఉంటుంది.

అహంకారం నిండిన మనం ప్రతీదీ ఒక క్రమపద్ధతిలో ఉండాలి అని అనుకుంటాము. నిజానికి మనమే ఒక క్రమం లేని స్గితిలో ఉంటాము. అసలు సత్యమేమిటంటే మనవేు కల్లోలంగా ఉంటాము. ఎప్పుడయితే మనం ఈ విశ్వశక్తికి ఆధీనమయిపోతామో, అప్పుడు మనం ఆ అవ్యక్తి స్గితిలో, ఆ కల్లోల స్గితిలో ఉండే అద్భుతమయిన క్ర‌మ ప‌ద్ద‌తిని చూడ‌గ‌లుగుతాము. మ‌నం ఎప్పుడ‌యితే కోరిక‌ల‌ని వదిలివేస్తామో, మనం కోరినవి పొందుతాము. మనం నిజంగా కోరుకున్నవి పొందినప్పుడు సర్వ మానవ జాతికి ఉపయోగపడగలుగుతాము. ఎందుకంటే మనం ఆధీనమయిపోయినప్పుడే శ్రీకృష్ణుడు మన బాధ్యత తీసుకుంటాడు.

భగవాన్ శ్రీకృష్ణుడు ఈ విషయం మీద ఇంకా ఇలా వివరిస్తాడు.

శ్లోకం 12.5

```Sanskrit క్లేశోఽధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే (12:5) ```

అర్గం: క్షేశో = కష్టములు : అధికతరః = అధికమయిన : తేషాం = వారిలో : అవ్యక్తాసక్త చేతసామ్ = ఎవరయితే నిర్గణ పరమాత్మాయందు మనస్సుని స్పిరపరచి ఉంటారో : అవ్యక్తా = నిర్మణమయిన : హి = ఏల అనగా : గతిః = మార్ధము : దుఃఖం = దుఃఖము : దేహద్భిః = దేహాభిమానం గలవారిచే : అవాప్యతే = పొందబడుచున్నది.

భావము : అవ్యక్త పరమాత్మ పై ఎవరు మనస్సుని స్దిరపరచి ఉంచుతారో వారు ముందుకుపోవటానికి ప్రయాస పడతారు. ఎందుకంటే రూపంలేని నిర్గుణపాస మార్గము దేహాభిమానం కలవారు అతికష్టం మీద పొందుతారు.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనలో చాలామంది సత్యం అనుకునే విషయం గురించి చెబుతాదు. తెలివితేటలు కలవారు భగవంతుని గ్రహించటానికి కష్టపడతారు.

ఒకసారి బ్రహ్మ, విష్ణవు వారిలో ఎవరు గొప్ప వారో తెలుసుకోవాలని అనుకుంటారు. వాళ్ళు ఇద్దరూ శివుడి దగ్గరకి వెళతారు. శివుదు లింగాకారంతో ఒక కాంతి పుంజంలా ఈ విశ్వమంతా వ్యాపించుతాదు. దానికి ఆది, అంతం ఉందవు. అప్పుడు శివుడు వారితో " మీలో ఎవరయితే నా చివరలు కనుగోనలుగుతారో వారే గొప్ప వారు" అని అంటాడు

అప్పుడు విష్ణుమూర్తి వరాహరూపంలో భూమిని తవ్వుతూ శివలింగం యొక్క కాంతి పుంజం చివర చూడాలని వెళతాడు. బ్రహ్మ హంస రూపంలో ఎగురుతూ పైభాగం చూదటానికి వెళతాదు. అలా చాలా సమయం గడిచాకా విష్ణువు, శివుని అంతం కాని, ఆది కాని తెలసుకోలేను అని అర్ధం చేసుకొని శివుని దగ్గరకి వచ్చి క్షమాపణ కోరతాడు.

బ్రహ్మ అలా వెళుతూ ఉంటాదు. అలా వెళ్ళేటప్పుడు బ్రహ్మ ఒక పూవు క్రిందికి రావటం గమనిస్తాడు. అది ఏమిటో కనుక్కుంటే ఆ పూవు శివుని శిరస్సునుంచి పడినట్టుగా తెలుస్తోంది. ఆ వ్రూవు అలా కొన్ని బ్రహ్మజీవితకాలాలపాటు పదుతూ ఉన్నది అని అర్ధం చేసుకుంటాడు. అప్పుడు బ్రహ్మ శివుని తల చివరి వరకూ వెళ్ళలేను అని నిర్ణయించుకుంటాడు. అతను ఆ పూవుని తనతోపాటు శివుని దగ్గరకి బలవంతంగా తీసుకువెళతాడు. తాను ఆ పూవ్వుని శివుని తల పై నుంచి తెచ్చినట్టు దానికి ఆ వూవుని సాక్ష్యం చెప్పమని చెబుతాడు.

బ్రహ్మ ఆ పూవుతో పాటు శివుని దగ్గరకి వెళ్ళి ఈ కథ చెబుతాదు. బ్రహ్మ అబద్దం చెప్పినందుకు శివునికి కోపం వచ్చి అతని ఒక తలను తీసేస్తాడు. బ్రహ్మ పూజకి అనర్శుడని శపించి, ఆ పూవుని తన పూజకి పనిరావని శపించుతాడు.

ఈ కథలోని అసలు అర్ధం ఏమిటి అంటే విష్ణమూర్తి ఐశ్వర్యానికి, బ్రహ్మ మేధస్పుకి ప్రతిరూపాలు. ఐశ్వర్యంతో ఉన్న శక్తి భగవంతుని చేరలేరు. దానికి ఆ విషయంలో అనుమానం లేదు. అయితే అతనికి తన లోపాలని ఒప్పుకునే వినయం అణకువా ఉంటాయి. అతను సత్యాన్వేషణలో అవసరమయితే తన ఐశ్వర్యాన్ని వదులుకోవాలంథే వదిలేస్తాడు. కాని మేధస్సు కలిగిన వ్యక్తి సత్యాన్వేషణలో తన అహంకారం వదులుకోడు. అందుకే అతను ఎప్పటికీ భగవంతుని కనుక్కోలేడు, భగవంతుని చేరలేదు.

సత్యాన్వేషణలో రూపంలేని పరమాత్మని చేరే మార్దంలో మేధావులయిన సత్యాన్వేషికులు వారి మేధస్సు మీద ఆధారపడతారు. వారి అన్వేషణలో అహంకారం వారికి అడ్డుగా ఉంటుంది. దానితో వారికి ఆ మార్గం కష్టంగా ఉంటుంది.

శరీరాభిమానం గలవారు, వారి శరీరంతో పాటు మైండ్‌ని కూడా తీసుకువెళతారు. ఆ మైండ్ తనతో పాటు అహంకారాన్ని తెస్తుంది. మైండ్ శరీరం ఉన్నతమయిన స్థితికి చేరనంతవరకూ ఆధ్యాత్మిక పురోగతి సాధ్యం కాదు. ఈ విషయాన్నే శ్రీకృష్ణుడు స్పష్టంగా వివరించుతాదు.

అహంకారాన్ని వదిలివేయటమనేది మైండ్, శరీర వ్యవస్దకి చాలా కష్టమయిన పని. అహంకారం ఈ వ్యవస్గకి ఒక ఆధారాన్ని గుర్తింపుని ఇస్తుంది. ఫ్రెంచ్ తత్త్వవేత్త అందుకే ఈవిధంగా అంటారు. నేను ఆలోచించుతాను అందుకే నేను' అని. ప్రపంచం ఈ రోజున కాని శ్రీకృష్ణుని రోజులలోకానీ ఆలోచనల శక్తి చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఆశక్తి జ్ఞానాన్ని సామర్యాన్ని ఇస్తుంది. అందుమూలంగానే ఒక వ్యక్తికి గుర్తింపు రావాలన్నా జీవితంలో ఒక స్థితికి చేరాలన్న ఈ వ్యవస్ద అవసరమవుతుంది

రామకృష్ణ పరమహంస అవతారమూర్తి. అయినా ఆయన ఎంతో వినయంతో అణకువతో ముగ్గురిని తన గురువులుగా స్వీకరించారు. అందులో సత్యం ఏమిటి అంటే ఆయన వారిలోని అహంకారాలు పోయేటటట్టుగా చేసారు.

భైరవి, రామకృష్ణునికి తాంత్రిక పద్ధతులని నేర్సించినది. ఆమె రామకృష్ణునికి శిష్యురాలుగానే ఉండిపోయింది. రామకృష్ణుని సహాయంతో ఆమె తనలోని అహంకారం పోగొట్టుకోవటానికి కొన్ని సంవత్సరాలు కష్టపడింది.

తోటపూరి గొప్ప అధ్వైత పండితుడు. ఆయన ఎక్కడా కూడా మూడు రాత్రులకి మించి ఉండడు. ఆయన రామకృష్ణకి భగవంతుని యొక్క అద్వెత తత్వాన్ని నేర్పించాలని అనుకుంటాడు. అప్పుడు రామకృష్ణ ఎంతో సామాన్యునిలా అమ్మ అనుమతి తీసుకువస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తోటపూరి ఆశ్చర్యపోయి రామకృష్ణ వెనుకనే వెళతాడు. అక్కడ రామకృష్ణ కాళీమాత విగ్రహంతో మాట్లాడటం చూస్తాడు. అప్పుడు తోటపూరి రూపంలేని దైవం మీద ధ్యానం చేయమని చెబుతాడు. దానికి రామకృష్ణ అమ్మని వదలనంటాడు. తోటపూరి కోపంగా ఒక గాజుముక్కని రామకృష్ణ కనుబొమ్మల మధ్య ఆయన మూడవ కన్ను దగ్గర గుచ్చి కాళీమాతని ముక్కలుగా చేయమంటాడు. అప్పుడు రామకృష్ణ సమాధి స్థితి (మైండ్‌లేని స్థితి)కి వెళ్ళిపోయి అలా మూడు వారాలపాటు ఉండిపోతాడు. తోటపూరి ఇంతవరకూ ఎవరినీ అంతకాలం సమాధి స్థితిలో చూడలేదు. అంతకాలం సమాధిలో ఉండి తిరిగి మైండ్, శరీరం చేతనస్థితికి వచ్చిన వారిని చూడలేదు. అతను రామకృష్ణతో చాలాకాలం ఉండిపోయాడు.

రామయిత్ బాబా అనే జఠధారి వైష్ణవుడు. ఆయన రామ్‌లాల, అంటే శ్రీరామచంద్రుని చిన్నతనపు విగ్రహంతో రామకృష్ణ దగ్గరకి వస్తాడు. ఆయనకి రామ్‌లాల విగ్రహం కాదు. ఆయన దృష్టిలో బాలుడయిన శ్రీరాముడే. అతను రామలాలకు స్నానంచేయించి, భోజనం పెట్టి ఆ విగ్రహంతో మాట్లాడతుంటాడు. కొన్ని రోజులు రామకృష్ణ దగ్గర ఉన్న తరువాత ఆయనకి రామలాల ఎక్కువ సమయం రామకృష్ణతో గడుపుతున్నట్లు తెలుస్తుంది. అతనికి కోపం వస్తుంది. ఆయన దక్షిణేశ్వరంలో చాలాకాలం ఉంటాడు. ఎందుకంటే రామలాలకి రామకృష్ణ అంటే ఇష్టం కాబట్టి. జటధారి చివరికి ఒకరోజు రామకృష్ణని వదలి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకుంటాడు. అతను రామకృష్ణతో "రామ్‌లాల మీతో ఉండటానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. రామలాల నిన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తృప్తిగా ఉన్నది. చివరికి రామలాల్ నాకు కనిపించాడు. అది నీ వలన జరిగింది. రామలాలని నీ దగ్గర వదిలివెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎంతో పరమానందంలో ఉన్నాను " అని చెబుతాడు. అప్పటినుంచి రామలాల రామకృష్ణ దగ్గర ఉండిపోతాడు.

రామకృష్ణ పరమహంస ఎంతో సామాన్యస్థితిలో ఉంటూ, సమాధి స్థితిలో ఉంటూ గొప్పగొప్ప పండితులకి వారి అహంకారం వదిలే విధంగా చేయగలిగాడు. మైండ్ శరీర స్థితిలో అటువంటి వ్యవస్థలో అహంకారం వదలటం అనేది చాలా కష్టమయిన పని. ఇది ముఖ్యంగా ఎవరయితే తమ మేధస్సు మీద ఆధారపడతారో, తమ జ్ఞానం మీద కేంద్రీకరించి ఉంటారో వారికి అహంకారాన్ని వదలటం చాలా కష్టంగా ఉంటుంది.

శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతాడు :

యే తు సర్వాణి కర్మాణి మయి సన్నుస్య మత్సరాః అనన్యేవైవ యోగేన మాం ధ్యాయన ఉపాసతే (12:6) తేషామహం సముద్ధర్తా మృత్య సంసార సాగరాత్ భవామి న చిరాత్పార్ల మయ్యావేశిత చేతసామ్ (12:7)

అర్ధం : ఏ= ఎవరు :తు = కానీ : సర్వాణి = సమస్తములయిన : కర్మాణి = కర్మములు : మయి = నాయందు : సన్నృస్య = సమర్పించి : మత్సరాః = నన్నే తమ అత్యున్నత గతిగా తలచి : అనన్యేన = పూర్తిగా నిలిపి : ఏవ = అయినా : యోగేన = యోగము చేత : మామ్ = నన్నే : ధ్యాయంతః = ధ్యానం చేస్తున్నారో: ఉపాసతే = ఆరాధించుచున్నారో

తేషామ్ = అట్టివారికి : అహమ్ = నేను : సముద్ధర్తా = రక్షించేవాడిని : మృత్య సంసారసాగరాత్ = జనన మరణాలు అనే సముద్దం నుంచి: నచిరాత్ = శీఘ్రముగా: పార్దా = అర్జునా! మయి = నాలో : అవేశిత చేతసామ్ = ఉంచబడిన మనస్సు గల

అర్జునా! ఎవరయితే సమస్త కర్మలని నాయందే వుంచి, ఒకే ఆలోచనతో అనన్య చిత్తముతో నన్నే ధ్యానించి పూజించుచున్నారో, నన్నే పరమగతిగా తలచుకున్న వారై ఉన్నరో. ఎవరు నాయందు మనస్సు లగ్నం చేసారో అట్టి వారిని జనన మరణాల అనే సంసార సముద్రం నుంచి శీఘ్రముగా బయటకి తీసుకువస్తాను.

భగవానుడు ఇక్కడ ఒక ప్రస్తూణం చేస్తాడు.

శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయంగా, నిస్పందేహంగా ఇలా చెబుతాడు. నేను వారిని ఈ లౌకిక ప్రపంచం నుంచి విడుదల చేస్తాను. అదే సంసార సాగరం నుంచి, జనన మరణాల చక్రం నుంచి వారిని నేను బయటకి తీస్తాను.

ఇదంతా చేయటానికి ఆయన తన భక్తులని అడిగినది ఒక్కటే. వారు వారిని తనకు సమర్పించుకోవాలి. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు. మీరు నాకు ఆధీనులయిపోతే, మీరు చేసే పనులు (కర్మలు) వాటి ఫలితాలని కూడా నా ఆధీనం చేయండి. నా సేవ చేయంది. నా మీద ధ్యానం చేయండి. నా సచేతన స్థితి మీద ఒకే ఒక మనస్సుతో ఉండండి. నేను మిమ్మలని అన్నింటి నుంచి బయటకి తెస్తాను. మీకు ఈ చక్రబంధాలనుంచి స్వేచ్ఛని ఇస్తాను. మీకు మోక్షం ప్రసాదించుతాను. మీరు తిరిగి జన్మించకుండా చేస్తాను.

ఇది ఒక సింహగర్జన. ఇది ఈ విశ్వానికి మహారాజయిన వాని గర్జన. నాకు ఆధీనలుకండి, బంధాల నుంచి విముకులని చేస్తాను. నన్ను సేవించండి మీకు స్వేచ్ఛని ప్రసాదించుతాను.

ఒక నాస్తికుడు, భగవంతుని మీద నమ్మకంలేని వ్యక్తి, ఒక లోయలోనికి పడిపోతాడు. అలా జారిపోతుండగా అతను ఒక చెట్టు వేళ్ళలో చిక్కుకు పోతాడు. అతను ఆ వేళ్ళను అతికష్టం మీద పట్టుకొని వేలాడుతుంటాడు. అప్పుడు అతనికి భగవంతుడు ఉన్నాడా అని నమ్మాలా, వద్దా అనే ప్రశ్న వస్తుంది. అతనికి ఇప్పుడు ఉన్న బలమయిన కోరిక బతకాలని, అతనిని ఎవరైనా రక్షించాలి. అప్పుడు అతను గట్టిగా ఇలా అరుస్తాడు. "భగవంతుడా నువ్వు ఉన్నది నిజమే అయితే నన్ను రక్షించు"

అతనికి జవాబుగా ఒక గొంతు వినిపిస్తుంది. "సరే. నేను ఉన్నాను. నేను నిన్ను రక్షించుతాను. నీవు ఆ చెట్టు వేళ్ళని వదిలివేయి. అప్పుడు నేను నిన్ను రక్షించుతాను. నేను నిన్ను పట్టుకుంటాను"

అప్పుడు నాస్తికుడు " అయ్యో! భగవంతుడా! నన్ను రక్షించటానికి ఇంకా ఎవరయినా ఉన్నారా?" అని అరుస్తాడు.

మనకి భగవంతుని మీద ఉన్న నమ్మకం పైపైనదే. అన్నింటికంటే కూడా మనలో చాలామందికి భగవంతుడు అంటే అదొక కల్పన, భావము. మనం ఆ భావననే ఆరాధించుతాము. మన ఆరాధనలోచాలా సమయం మనం అడిగే విషయం మీదనే ఆధారపడి ఉంటాము. మనం చేసే ప్రార్ధన. నాకు ఇది ఇవ్వు భగవంతుడా! నాకు అది ఇవ్వు ప్రభూ! మన ప్రార్ధనకి భగవంతుడు జవాబు ఇచ్చీ ఇవ్వగానే మరొకటి మొదలుపెడతాము.

మన ప్రార్ధనలకి భగవంతుడు జవాబు ఇస్తున్నంతకాలం, మనం అడిగివన్నీ గురువులు నెరవేరుస్తున్నంతకాలం వారిమీద మన నమ్మకం అలానే ఉంటుంది. ఎప్పుడయితే మన ప్రార్ధనకి జవాబురాదో వెంటనే మన నమ్మకం కరిగిపోతుంది. అప్పుడు మనం మరొక దేవుడి వైపు వెళతాము. మరొక గురువు దగ్గరకి వెళతాము. మనం ఈ విధంగా అడుగుతాము. "ఇంకా అక్కడ ఎవరయినా ఉన్నారా? ఎవరయినా నా ప్రార్ధనకి జవాబు ఇవ్వగలరా? నేను అడిగిన విధంగా చేయగలరా?"

మనం ఒక విషయం అర్ధం చేసుకోము. భగవంతుడు మన మీద అంతులేని కరుణతో, ప్రేమతో మన మంచి కోసం కొన్ని ప్రార్ధనలకి జవాబు ఇవ్వడు. కానీ మనలోని అజ్ఞానంతో మనం అలా అడుగుతూనే ఉంటాము. అలా ఎటువంటి నిలుపుదలా లేకుండా బిక్ష అడుగుతుంటాము. మనం ఈ ప్రార్ధనలన్నింటికీ భగవంతుడు జవాబు ఇస్తే ఏమవుతుంది అని కనీసం ఆలోచించము. దీనివలన మన పరిస్థితి బాగుంటుదా లేకపోతే మనకి ఇంకా కష్టం వస్తుందా? అందుకే అంటుంటారు. అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగండి. మీరు అడిగినది పొందవచ్చు అని. ఆ భగవంతుడిది అంతులేని మేధస్సు. భగవంతుడు ప్రతిసారీ మన కోరికలని ఒక ప్రక్కన పెడతారు. మనం ధనవంతులు అవ్వాలని, పిల్లలు కావాలని ఇలా ఎన్నో కోరికలు. భగవంతుడు మన మంచి కోసం జవాబు ఇవ్వకపోతే, వెంటనే మరొక దేవుడి దగ్గరకి వెళతాము.

భగవంతునికి ఆధీనమవటం అనేది నిబంధన కాదు.అది సంపూర్తిగా ఉండాలి. దానిలో 'అయితే' 'కానీ' అనేవి ఉండకూడదు. నీవు నా కోరిక తీరిస్తే, నేను నీ భక్తునిగా ఉంటాను అనే పద్ధతి ప్రార్ధనలో ఉండకూడదు. అలా అంటే అది వ్యాపారమవుతుంది. మనలో చాలా వరకు భగవంతునితో సంబంధం వ్యాపార వ్యవహారంలా ఉంటుంది.

ఆధీనమవటం అనేది మూడు రకాలుగా ఉంటుంది.

మొదటి రకం ఆధీనత అనేది మేధస్సుని ఆధీనపరచటం. మనలో చాలా మందికి ఇది చేయడం సులభమే. విశ్వశక్తి అనేది చాలా గొప్పది. అది మన కంటే చాలా గొప్పది అని మనం అర్ధం చేసుకున్నప్పుడు మనం అత్యున్నతమయిన ఆ దివ్యశక్తిని ఒప్పుకుని ఆ శక్తికి మన తెలివితేటల దశలో ఆధీనులమయిపోతాము. కనీసం మీరు' నేను ఆధీనమయ్యాను' అని అనవచ్చు. అందుకే చాలామంది గుడిలో భగవంతుని ముందు, గురు దేవులముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. దాని అర్ధం పూర్తిగా ఆధీనులవటమే. ఆక్షణంలో మన అహంకారం వెళ్ళిపోతుంది.

ఆ తరువాత ఆధీనత భావాత్మక దశలో జరిగేది. భగవంతుడు లేదా గురుదేవుని స్మరించగానే కరిగిపోతారు. మన హృదయాలలోంచి ప్రేమ కృతజ్ఞతాభావం పొంగి ప్రవహిస్తుంది. కళ్ళలో నీరు క్రిందికి ప్రవహిస్తుంది. అప్పుడు మనం భక్తులుగా అయిపోతారు.

రామకృష్ణ పరమహంస ఈ విధంగా చెబుతారు. మీరు భగవంతుని కానీ, గురుదేవుని కానీ స్మరించగానే మీ కళ్ళలో నీరు వస్తే, స్పష్టంగా తెలుసుకోండి, ఇది మీకు చివరి జన్మ అని, మీరు స్వేచ్ఛ పొందటానికి సిద్ధంగా ఉన్నారు అని అర్ధం.

ఇక్కడ మనం సిద్గంగా ఉన్నాము. కానీ స్వేచ్ఛని పొందలేము. ఆ స్వేచ్ఛ మనం మూడవదశకి చేరినప్పుడు దొరుకుతుంది. ఈ దశలో మనం మన స్పర్శేంద్రియాలని ఆధీనపరిచేస్తాము. ఈ స్థితిలో చేసే ఆధీనత సంపూర్ణ ఆధీనత. ఇది నిబంధనలు లేని, అప్రయత్నంగా, సహాజంగా జరిగే ఆధీనత.

మహాభారతంలో వ్యాసుల వారు శ్రీకృష్ణుదు అర్జునిని గురించి ఒక సంఘటనని వివరించుతారు.

కృష్ణుడు అర్జునుడు నడుస్తుంటారు. ఆకస్మాత్‌గా కృష్ణుడు చెట్టు మీద ఉన్న కాకిని చూపించి "అర్జునా! ఆ ఆకుపచ్చని కాకిని చూసావా?" అంటాడు.

అప్పుడు అర్జునుడు, "అవును కృష్ణా నేను ఆకుపచ్చని కాకిని చూసాను అంటాడు".

వాళ్ళు ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాక, కృష్ణుడు మరొక కాకిని చూపించి "అర్జునా! ఆ నల్లని కాకిని చూడు" అంటాడు.

దానికి అర్జునుడు, అవును కృష్ణా ! నేను నల్లని కాకిని చూసాను" అంటాడు. కృష్ణుడు అర్జునిని వైపు తిరిగి "అర్జునా! నీవు మూర్ఖుడివిగా ఉన్నావు. నేను నిన్ను తెలివయినవాడిని అని అనుకున్నాను. కాకి ఎలా ఆకుపచ్చగా ఉంటుంది? మొదటి నేను చూపించిన కాకి నల్లగా ఉన్నప్పుడు నీవు ఎలా దానిని ఆకుపచ్చ కాకి అని అన్నావు? నీవు నన్ను ఆనందపరచాలని చూస్తున్నావా?" అని అంటాడు.

అప్పుడు అర్జునుడు "కృష్ణా! నీవు చూపించి అకుపచ్చని కాకి అని అన్నప్పుడు నాకు ఆకుపచ్చని కాకి కనపడింది. నేను ఏం చేయను. నేను అప్పుడు నల్లటి కాకిని చూడలేకపోయాను. నా స్పర్శేంద్రియాలు నన్ను మోసం చేసాయి" అని అంటాడు.

అర్జునుడు స్పర్శేంద్రియాలు అతనిని మోసం చేయలేదు. అవి గురువుకి, భగవంతునికి ఆధీనమయిపోయాయి. ఒక్కసారి ఆ స్థితికి చేరితే ఇక వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. ఇదీ సంపూర్ణమయిన ఆధీనత అంటే.

కృష్ణుడు ఇలా చెబుతాడు "మీరు నా ఆధీనులయిపోతే మీకు స్వేచ్ఛని ప్రసాదించుతాను". ఆయనకి చేరటానికి మనం పూర్తిగా ఆధీనులమయిపోవాలి. మన స్పర్శేంద్రియాలని ఆధీన పరచాలి. మన పూర్తి చేతన స్థితి, మన తెలుసుకునే తత్వం సర్వం ఆయనే అయివుండాలి, అంతే కాని మరేది ఉండకూడదు. దీనికి మీరేం చేయనవసరం లేదు. ఇది చాలు చిన్న పద్ధతి. గురుదేవులు ఇలా చెబుతారు. "నాకు ఆధీనలవ్వండి. నేను మిమ్ములని రక్షించుతాను ఎటువంటి ఆలస్యం లేకుండా మిమ్ములని రక్షించుతాను, అని కానీ మనం ఏం చేస్తాం ఇంకా ఎవరయినా ఉన్నారా? అని ప్రశ్నించుతాము.

ఇది చాలా సామాన్యమయినది, సులభమయిన పద్ధతి. భగవంతుడు దానిని చాలా చిన్న పద్ధతిగా చేసాడు. అయినా అది మనకి కష్టంగా ఉంటుంది. భగవంతుడిని నమ్మటం మనకి చాలా కష్టంగా ఉంటుంది.

ఈ ప్రపంచంలోని పరమానందాన్ని చూసే వరకు ఈ లోకాన్ని విడిచి పెట్టవద్దని ప్రజలకు నేను ఎల్లప్పుడు చెపుతూ ఉంటాను. పరమానందం వైపు పనిచేయండి, దాన్ని విడుచుట ఎప్పుడు చేయకండి. ఎప్పుడైతే పరమానందం తటస్థిస్తుందో పూర్తిగా విడిచిపెట్టడం అనేది తనంత తానే నీలో సంభవిస్తుంది.