KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/అర్జున ఉవాచ : యేవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః (12:1)Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

అర్జున ఉవాచ : యేవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః (12:1)

అర్థం : అర్జున ఉవాచ = అర్జునుడు ఈ విధంగా అడిగాడు. ఏవం = ఈ [ప్రకారంగా సతతా = ఎల్లప్పుడూ : యుక్తా : = నిమగ్నమయిన : ఏ = ఎవరయితే : భక్త = భక్తులు : త్వం = నీవు : పర్యుపాసతే = ఉపాసించుచున్నరో : ఏ = ఎవరెతే : చ= మరియు : అపి = కూడా : అక్షరం = నాశనం లేనిది : అవ్యక్తం = ఇంద్రియములకు గోచరం కాని : తేషాం = ఆ ఇరు తెగల వారిలో : కే=ఎవరు : యోగ–వి–తమః = యోగమును బాగుగా తెలుసుకున్నవారు.

అర్జునుడు ఈ విధంగా అడిగాడు : ఈ [ప్రకారం ఎల్లప్పుడు నీయందే మనస్సుని నెలకొల్పిన వారై ఏ భక్తులు నీ రూపాన్ని పూజించుతారో లేదా ఎవరయితే నాశనం లేని, కనిపించని రూపం లేని నిన్ను పూజించుతారో : ఈ ఇద్దరిలో ఎవరు యోగ్యులు.

[పేమే మీ జీవితం

చూడండి : అర్జునుడు [ప్రశ్నించే పద్ధతి మాట్లాడే విధము పూర్తిగా వేరుగా ఉంటుంది. అతని దృక్పధం, పద్ధతిలో పూర్తిగా మార్పు ఉంటుంది.

అర్జునుడు ఈ విధంగా అడుగుతాడు " భగవాన్, ఎవరు పాటించే పద్దతి మంచిది : ఎవరు భక్తిభావంతో నిన్ను, నీ రూపాన్ని పూజిస్తూ ఉంటారో వాళ్ళ పద్దతి మంచిదా? లేకపోతే ఎవరయితే రూపంలేని అనంత బ్రహ్మాండమయిన విశ్వశక్తి, విశ్వ ఆత్మలో,విశ్వచేతనస్ధితిలో విలీనమయిపోతారో వాళ్ళ పద్దతి మంచిదా? వీళ్ళ ఇద్దరిలో ఎవరి పద్ధతి మంచిది?"

స్పష్టంగా అర్ధం చేసుకోండి : ఇక్కడ అర్జునుడు తన కోసం అడగటం లేదు.ఇక్కడి నుంచి భగవానుని [ప్రవచనం చిన్న సంభాషణలా ప్రారంభమవుతుంది. ఇది ఒక సత్యాన్ని రాబోయే కాలం కోసం రికార్డు చేయటానికి ప్రయత్నించటమే. ఇక్కడి నుంచి వచ్చే [ప్రశ్నలు అన్నీ కూడా అనుమానాలు కాదు. అలాగే విచారణ (ఎంక్వయిరీ) కాదు. ఆ సత్యం మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ కిందికి తెచ్చి రాబోయే కాలంలో నుంచి పొంగిపోరలే [పేమ. ఇది అర్జునుని యొక్క దివ్య అనుభవాన్ని వెల్లడి చేయటమే. ఇదంతా ప్రశ్నల రూపంలో వెల్లడి చేసి భగవంతుని దగ్గర నుంచి వచ్చిన జవాబులని రాబోయే కాలం కోసం రికార్డు చేయటమే.

అర్జునుడు కృష్ణుడిని ఇలా అడుగుతారు. నీలో సంపూర్ణంగా స్థిరపడిన వ్యక్తి ఎవరు? అతను నీ భక్తుడా? లేక జ్ఞానోదయం పొందిన వ్యక్తా? ఎవరు?

ఇక్కడ మనం రెండు విషయాలు అర్ధం చేసుకోవటానికి [ప్రయత్నించాలి. మతాన్ని ఆచరించే వ్యక్తులు, సామాన్యులు ఈ శ్లోకంలోని అర్ధాన్ని సరిగ్గా అర్ధంచేసుకోలేదు. వాళ్ళు కొంచెం అయోమయపడ్డారు. వాళ్ళు అర్జునుడి [ప్రశ్నని వేరుగా అర్ధంచేసుకుంటారు. అర్జునుడు శ్రీకృష్ణుని "నీ రూపాన్ని పూజించటం మంచిదా లేకపోతే రూపంలేని నిన్ను పూజించటం మంచిదా?" అని అడిగినట్లు అర్ధం చేసుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఎంత అయోమయంలో ఉంటారంటే అసలు

వాళ్ళకి ఏది సరియైనదో, ఏది తప్పో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు తమకి ఉన్న తెలివితేటల అహంకారంతో తప్పు సమాచారాన్ని ఇచ్చి అందరినీ అయోమయంలో పడేసారు. అలా

కానీ నేను మీకు చెబుతున్నాను, అర్ధం చేసుకోండి, అర్జునుడి [ప్రశ్నలో అర్ధం అది కాదు. మీరు శ్రీ కృష్ణుడు ఇచ్చిన జవాబులని గమనించితే ఈ విషయం మీకు అర్ధమవుతుంది.

అర్జునుడు ఈ విధంగా అడుగుతాడు. చేతన స్థితి యొక్క అనుభవంలో స్థిరపడి, అక్కడ ఉండి, ఆ స్థితినుంచి పొంగి ప్రవహించే శాశ్వత ఆనందాన్ని పొందటం మంచిదా? లేకపోతే విశ్వచేతన స్థితిలో కలిగిన అనుభవాన్ని [పేమ, కృతజ్ఞతారూపంలో [ప్రపంచంలోని ప్రతి [ప్రాణి పట్ల వెల్లడి చేయటం మంచిదా? ఏది సరియైన పద్ధతి? దేనిని పాటించాలి?

చూడండి. కొంతమందికి అటువంటి ఆధ్యాత్మిక అనుభవం కలిగాక అదే స్థితిలో కళ్ళు మూసుకొని ఉండిపోతారు. అంతే. వాళ్ళు కళ్ళు మూసుకుని మాత్రమే భగవంతుని చూస్తారు. వాళ్ళు కళ్ళు తెరవటానికి అసలు ఇష్టపడరు. వాళ్ళు స్పర్శావయవాలని ఉపయోగించటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారిలోని బ్రహ్మానందం చాలా గొప్పది. ఎంతో అందమయినది. వారు స్పర్శేంద్రియాల ద్వారా పొందే ఏ ఆనందం ఆ పరమానందానికి సాటిరాదు.

కాని కొంతమంది భగవంతుని ద్వారా కళ్ళు తెరచి, తమలోని శాశ్వతానందపు అనుభవాన్ని అందరికీ వెల్లడి చేయాలి అని చూస్తారు. కొంతమంది పండితులు సవికల్ప సమాధి, నిర్వి కల్ప సమాధి విషయంలో అంతులేని వాదనలు చేస్తుంటారు. సవికల్ప సమాధి స్థితిలో వారి అనుభవం నిరంతరం సాగుతూ ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో ఆ అనుభవాన్ని వెల్లడి చేయటం ప్రారంభమవుతుంది. సవికల్ప సమాధి అనేది క్రింది స్థితి. అది దాని తరువాతది, ఉన్నత స్థితిలో ఉండే నిర్వికల్ప సమాధి గురించి పనిచేస్తుంది. ఈ విధంగా రెండు స్థితులూ జరుగుతాయి అనేది కొంతమంది విషయంలో నిజమే అవుతుంది. అలా జరగవచ్చునేమో నాకు తెలియదు. కానీ నా విషయంలో ఈ రెండు స్థితులు ఒకేసారి జరిగాయి. నేను ఈ రెండు స్థితులని వేరు వేరుగా సాధించలేదు. నాకు ఇవి ఒక్కసారే జరిగాయి. నేను నా అనుభవాలని వెల్లడి చేసే స్థితికి చేరాను.

ఇదంతా భగవంతుని (పరాశక్తి) సంకల్పం. ఒక విషయం అర్ధంచేసుకోండి. వీళ్ళు ఈ స్థితిలో ఉండాలి అనేది వాళ్ళు ఎంపిక కాదు. ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందినవారికి ఇటువంటి ఎంపిక చేసే అవకాశం ఉండదు. సామాన్య ప్రజలకి అలా ఎంపిక చేసుకునే స్వేచ్చ ఉంటుంది. దానికి వారు కర్మని (తీరని కోరికల వృత్తం) అనుసరించుతారు. కానీ ఎవరయితే సర్వాంతర్యామి అయిన విశ్వశక్తి (పరాశక్తి) అనుభవాన్ని పొందుతారో వాళ్ళు ఆ ఎంపిక అనే స్థితికి అతీతంగా వెళ్ళిపోతారు. వాళ్ళు వేసే ప్రతి అడుగూ భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అదే విశ్వ శక్తి, అదే శ్రీకృష్ణుని ఉన్నతమయిన చేతనస్థితి. ఆ విషయంలో వారికి ఎంపిక అవకాశం ఉండదు. వాళ్ళు కళ్ళుమూసుకుని కూర్చోవాలా లేకపోతే కళ్ళు తెరచి సర్వమానవాళికి మంచి చేయాలా అనే నిర్ణయం వాళ్ళ చేతులలో ఉండదు.

ఈ విషయం అర్జునుడికి తెలియదు అని కాదు. ఆయనకి భగవంతుని దివ్య అనుభవం అయిన తరువాత ఈ ఎంపిక లేని స్థితిని పూర్తిగా అర్ధం చేసుకున్నాడు. అటువంటి అనుభవం అయిన అందరికీ ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అర్జునుడికి తన విషయంలో ప్రతి నిర్ణయం స్పష్టంగా అర్ధమవుతుంది. అర్జునుడికి తన విషయంలో ప్రపతి నిర్ణయం చేసేది శ్రీకృష్ణుడే కాని తాను కాదు అని తెలుసు, కానీ ఆయన శ్రీకృష్ణని అన్నీ అడుగుతాడు. ఈ విధంగా ఈ విషయాలన్ని అందరికీ తెలియచేయాలనేది అర్జునుని కోరిక.

ఈ కారణంతోనే భగవద్గీతని ఈరోజుకి సజీవంగా నిలిచి ఉన్న పవిత్ర గ్రంధంగా చెప్పవచ్చు. ఈ కారణం వలననే అందులోని మాటలు ఇప్పటికీ ప్రతి ధ్వనిసుంటాయి. ఇందులోని ప్రతి సంభాషణా సత్యాన్వేషణ చేసే అన్వేషికి వచ్చే ప్రశ్నలన్నింటికీ జవాబులని ఇస్తుంది. ఈ సందర్శంలో అర్జునుని పాత్ర ఆధ్యాత్మిక అన్వేషకుల ప్రతినిధి.

అర్జునుడు ఏమని అడిగాడు. కళ్ళు మూసుకొని కూర్చున్న వ్యక్తి గొప్ప వాడా లేకపోతే కళ్ళు తెరచి ప్రతి ఒక్కరిలోనూ ప్రతిప్రాణిలోనూ భగవంతుని చూడగలిగిన వ్యక్తి గొప్పవాడా?

అర్ధం చేసుకోవటానికి [ప్రయత్నించండి : ఆయన రూపాన్ని ఆరాధించటం గొప్పదా? రూపంలేని భగవంతుని ఆరాధించటం గొప్పదా అని అదగలేదు. కాకపోతే మత సంబంధమయిన మతాధికారులు చేసిన వాఖ్యానం ఇది. వాళ్ళే శంకరాచార్యులకి, రామానుజునికి మధ్య సమస్యలని సృష్టించినది కూడా.

శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గాన్ని అనుసరించారు. రామానుజులు భక్తి మార్గాన్ని అనుసరించారు. జ్ఞాన మార్గ రూపంలేని భగవంతుని మీద కేంద్రీకరింపబడి ఉంటుంది. అదంతా విజ్ఞానదాయకమయిన ప్రశ్నలతో నిండి ఉంటుంది.

భక్తి మార్గం పూర్తిగా భక్తి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది భగవంతుని రూపాన్ని ఆరాధిస్తుంది. భగవంతుని ప్రాణమున్న రూపంలో చూసారు. ఎవరయితే శంకరాచార్యులు తత్వాన్ని, రామానుజల తత్వాన్ని లోతుగా తెలుసుకుంటారో, వారు రామానుజునిలోని జ్ఞానము,శంకరాచార్యులులోని భక్తిని తెలుసుకోగలుగుతారు. రెండూ కూడా కలసిపోయి ఉంటాయి. ఒకటి లేకుండా రెండవది పని చేయదు.

సౌందర్యలహరి చదివిన ఏ వ్యక్తి అయినా ఆ మహాయోగికి జగన్మాత మీద ఉన్న [పేమకి కదిలిపోకుండా ఉండలేరు. ఈ కావ్యంలో అద్భుతమయిన ఆది భౌతిక తత్వపు [ప్రాముఖ్యత వేదాంతపరంగా చెప్పబడి ఉంటుంది. ఇది శంకరాచార్యుల రచనలన్నింటిలోనూ ఉంటుంది. కానీ ఆయన అందంగా భక్తితో వర్ణించిన రూపానికి ఎంతో కదలిపోతారు.ఆయన జగన్మాతని తల నుంచి కాళ్ళ వేళ్ళ వరకూ ఆమె తన ముందు నిలడి ఉన్నట్లే వర్ణించుతారు. ఇది చిత్రాలతో కూడిన వర్ణన. [పేమతో నిండిన వర్ణన. ఆయనలో పొంగి ప్రవహించే భక్తిని వెల్లడి చేసే వర్ణన.అదేవిధంగా రామానుజాచార్యుని వేదాంత జ్ఞానం యొక్క లోతులు ఆయన అందించిన సూత్రాల పై వాఖ్యానాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన చూపించిన పద్ధతులు, ఆయన రాసిన పవిత్ర గ్రంథాలు గొప్ప జ్ఞాన సంపదలు. శంకరాచార్యుని రచనలకి ఏమాత్రం తగ్గవు. అందుకే అంటాను జ్ఞానం లేకుండా నిజమయిన భక్తి ఉండదు. భక్తి లేకుండా నిజమయిన జ్ఞానం ఉండదు.

అయితే ఈ వాదనలు అలా జరుగుతూఉంటాయి. కానీ మీరు జవాబులని గమనించితే అర్జునుడు అడిగిన [ప్రశ్న ఇది కాదు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అర్జునుడు అడిగిన విషయం, తాను తనకి కలిగిన ఆధ్మాత్మిక అనుభవంలోనే స్థిరపడిపోవాలా లేకపోతే తనలో జరుగుతున్న కృతజ్ఞతాభావాన్ని వెల్లడి చేయాలా అని మాత్రమే.

తనలో జరిగిన ఆధ్యాత్మిక అనుభూతి, కృతజ్ఞతా భావాన్ని వెల్లడి చేయటమే భక్తి, అనుభవంలో ఆనందాన్ని పొందుతూ, ఆ అనుభవంలో ఉండటాన్ని జ్ఞానం అంటారు. అంతే.

ఈ [ప్రశ్నకి శ్రీకృష్ణుడు చెప్పిన జవాబు ఈ రెండూ ఒక్కటే.

ఈ రెండు మార్గాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. మొదటి మార్గం రెండవదానిలోనికి, రెండవ మార్గం మొదటి దానిలోనికి దారితీస్తుంది. మీరు ఛేదించలేని వృత్తం గురించి విని ఉంటారు. అందులో మొదటి నుంచి రెండవదానికి, దాని నుంచి తిరిగి మొదటి దానికీ వెళుతూనే ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు ఈ సందర్భానికి మరొక కొత్త పదాన్ని చెబుతాను. అది వాస్తవమయిన ధర్మచక్రం, ఛేధించలేని చక్రం తక్కువ స్థితికి తీసుకువెళుతుంది. వాస్తవమయిన ధర్మచక్రం ఉన్నత స్థితిలోని శక్తికి దారి తీస్తుంది. అది ఉన్నత స్థితిలోని చేతనస్థితికి చేరుస్తుంది. ఈ చక్రంలో పరమానందం, కృతజ్ఞత : పరమానందం భక్తి : కృతజ్ఞత, పరమానందం అనే రెండు రూపాలు ఈ వృత్తాన్ని తయారు చేస్తాయి. ఇది మనని అత్యున్నతయిన చేతనస్థితికి తీసుకువెళుతుంది.

పరమానందం లేదా నిత్యానందం అంటే మీలోని కృతజ్ఞతా భావాన్ని, సేవాభావాన్ని వెల్లడి చేయటమే. అలా వెల్లడి చేసినప్పుడు ఆ సేవా భావం కృతజ్ఞతా భావం మనలో పరమానందాన్ని కలిగిస్తాయి. ఒకటి మరొకదానిలోనికి దారి తీస్తుంది. తిరిగి రెండవది మొదటి దానిలోనికి వస్తుంది. అందుకే దీనిని virtuous circle లేదా ధర్మచక్రం అనవచ్చు.

మామూలుగా మనందరం ఈ చేధించలేని వలయంలో చిక్కుకుని ఉంటాము. భయం నుంచి అత్యాశకి, అత్యాశ నుంచి భయానికి తిరుగుతూ ఉంటాము. భయం ఎప్పుడూ అత్యాశకి దారి తీస్తుంది. ఎక్కువ భయం అత్యాశకి దారి తీస్తుంది. అధికమయిన ఆశ అధికమయిన భయానికి దారి తీస్తుంది. దీనినే ఛేదించలేని చక్రం అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ధర్మచక్రాన్ని ఆవిష్కరించాడు. శాశ్వతమయిన ఈ చక్రాన్ని ఆయన ధర్మం అని, న్యాయం, నీతి అని అంటారు. ఇది సత్యమార్గాన్నే అనుసరిస్తుంది.

ఈ ధర్మచుక్రం ఉన్నతమయిన చేతనస్థితి నుంచి, అత్యున్నతమయిన చేతనస్థితికి తీసుకువెళుతుంది. ఇది ఉన్నతమయిన అనుభవాల నుంచి, అత్యున్నతమయిన అనుభవాలకు దారి తీస్తుంది. సచేతన స్థితి, పరమానంద స్థితి తిరిగి సచేతన స్థితిని, పరమానందాన్ని వెల్లడి చేస్తాయి. అవి మరలా ఉన్నతమయిన అనుభవాలకి దారి తీస్తాయి.

ఇప్పుడు భగవానుడు శ్రీకృష్ణని జవాబు ఏమిటో విందాము :

శ్రీ భగవానువాచ : మయ్యా వేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే [శ్రద్ధయా పరయోపేతాస్తేమే యుక్తతమా మతాః (12:2)

అర్ధం : శ్రీ, భగవానువాచ = శ్రీ భగవంతుడు చెప్పెను.

మయి = నాయందు : ఆవేశ్య = నిలిపి : మనః = మనస్సును (మైంద్) : నిత్య = నిరంతరం (శాశ్వతంగా) : యుక్తా = నిమగ్నమై : ఉపాసన = ఆరాధించుతారో : [శ్రద్ధయా = [శ్రద్ధతో, నమ్మకంతో : పరమా = మిక్కిలి ఉన్నతమయిన : ఉపేతాః = కూడుకొనినవారై : తే= అటువంటి వారు : యుక్తా తమః = ఉత్తమ యోగులు : మే = నా యొక్క : మతాః = అభి(ప్రాయం.

భగవానుడయిన శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. ఎవరైతే నాయందు మనస్సు నిలిపి నిరంతరం మిక్కిలి శ్రద్ధతో, నమ్మకంతో నన్ను ఆరాధించుతారో అటువంటి వారిని ఉత్తమయోగులుగా నేను అంటాను. వారేనాలో ఐక్యమయిపోగల వారు.

భగవానుడు ఈ విధంగా చెప్పాడు : ఎవరయితే సచేతన స్థితిలో కృతజ్ఞతని, భక్తిని వెల్లడిచేయగల స్థితిలో స్థిరంగా ఉంటారో, వారే నిరంతరం నాయందు నిమగ్నమై ఉంటారు మరియు ఎవరైతే వారి నమ్మకాన్ని వారి ఆధ్యాత్మిక అనుభవం మీద కేంద్రీకరించుతారో వారు నాయందు నిమగ్నమై ఉంటారు. ఈ రెండూ కూడా అంతిమమయినవి. ఈ రెండు రకముల వారు కూడా నాలో ఐక్యమయిపోతారు.

సంస్కృతం చాలా అందమయిన భాష. మీరు ఏ పదంనుంచయినా ఏ రకమయిన అర్గానయినా పొందవచ్చును. ఈ కారణం వలననే భగవద్గీత మీద కొన్ని వేల వాఖ్యానాలు వచ్చాయి. భగవద్గీత మీద గురువులు, యోగులు ఎంతోమంది వ్యాఖ్యానాలు చెప్పారు. గీత మీద ఉన్నన్ని వాఖ్యానాలు మరి ఏ గ్రంధానికీ లేవు. ప్రతి ఒక్కరూ వారికి అర్గమయిన రీతిలో గీతకి అర్గాన్ని ఇవ్వటానికి ప్రయత్నించారు.

తిరిగి నేను మళ్ళీ నొక్కి చెబుతున్నాను. ఆధ్యాత్మిక అనుభవం లేని వ్యక్తి విషయాలని వివరించటం, ఉపన్యసించటం మొదలుపెడితే అతను సహజంగానే సమస్యలలో చిక్కుకుంటాడు. అలాగే ఎదుటివారికి కూడా సమస్యలని స్పష్టిస్తారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక అంధుడు మరొక అంధునికి దారి చూపిస్తే, ఆ ఇద్దరూ ఏవిధంగా సమస్యలలో చిక్కుకుంటారో ఇది అలానే ఉంటుంది. అదే విధంగా ఆధ్యాత్మిక అనుభవం లేని వ్యక్తి మాట్లాడినా వాఖ్యానం ఇచ్చినా అతను చేసే పని గ్రంధాన్ని చిత్రహింస చేయటమే.

ఎప్పుడయితే ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక అనుభవం అవుతుందో, ఎప్పుడయితే అతను తన అంతరంగపు మాటల నుంచి స్వేచ్ఛ పొందగలుగుతాడో, అప్పుడు అతను తనకి తాను అలాగే ఎదుటి వారికి నిజమయిన వ్యక్తిలా ఉండగలుగుతాడు. అప్పుడే ఆ వ్యక్తి స్పష్టంగా, నిజాయితీగా దేనినైనా విదుటివారి గురించి ఆలోచించకుండా భరించుతాడు. ఎప్పటివరకూ అంతరంగపు మాటల ఉంటాయో అంతవరకూ ఆ మాటలని వడపోస్తుంటారు. దానిని తిరిగి అనటం చేస్తుంటారు. మనలో నిరంతరం జరిగే అంతరంగపు మాటలని బయటకి మాట్లాడే ధైర్యం చేయం. ఎందుకంటే బయటికి అనే మాటలని ఎవరూ స్వీకరించరని భయపడతాము. కాబట్టి మనం మన జీవితాలని పూర్తిగా అబద్దాలతో నిం పేస్తాము.

ఈ చిన్న ఉదాహరణని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. నేను ఇప్పుడు మీకు ఈ బొమ్మ చూపించి వివరిస్తున్నాను. కొన్ని రోజుల అయ్యాక మీరు ఈ కార్యక్రమం మీద ఆడియో సి.డి.ని మీ స్నేహితునికి వినిపిస్తారు. అతను ఈ ప్రోగ్రూంకి రాలేదు. మీకు ఆధ్యాత్మిక అనుభవం లేదు. అప్పుడు మీరు అతనికి ఎంత వివరించగలరు. మీరు కేవలం నా అనుభవాన్ని అనువాదం చేస్తారు. నా అనుభవాన్ని మీరు ఎంతవరకూ వివరించగలరు? దానిని ఎంత బాగా వివరించుగలరు? మీ స్నేహితుడు ఎంత అర్ధం చేసుకోగలడు? మీరు సరిగ్గా వివరించలేరు. పూర్తిగా వెల్లడించలేరు. ఎందుకంటే ఆ అనుభవం మీది కాదు.

నేను మీకు ఈ బొమ్మ చూపించి వివరిస్తున్నాను. మీరు దీనిని చూడగలిగితే, వినగలిగితే విషయాన్ని అర్ధం చేసుకోగలగుతారు. అప్పుడు కూడా సత్యాన్ని అర్ధం చేసుకోవటం కష్టం. కాబట్టి మీరు మీ స్నేహితుడుకి ఒక ఆడియో సి.డి. ఇస్తే, అతను ఈ కార్యక్రమానికి రాకుండా దానిని వింటే, అతను విషయాన్ని ఎంతవరకూ అర్ధం చేసుకోగలగుతాడు. అదే విధంగా ఆ సి.డి. విని అందులో విషయాల మీద అతను వేరే వారికి ఉపన్యాసం ఇవ్వాలి అని అనుకుంటే అది ఎంతవరకూ కచ్చితంగా ఉంటుంది.

అదే విధంగా ఈ కార్యక్రమానికి రాకుండా దీనిని ఒక పుస్తకంలో లేదా ఆడియో సి. ది. ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే అతనికి ఏమీ అర్ధం కాదు. భగవద్దీత కూడా ఒక ఆడియో రికార్డు మాత్రమే. ఇది తిరిగి వ్రాయబడిన ఆడియో మాత్రమే. ఇది పూర్తి ఆడియో రికార్డింగ్ కూడా కాదు. మీరు ఆడియో రికార్డింగ్‌ని వింటే కనీసం కొన్ని విషయాలు మీరు అర్ధం చేసుకోగలుగుతారు. ఇక్కడ మాటలలో, కంఠస్యరంలో ఉండే మార్పులు కూడా ఏమీ మీకు తెలియదు. ఎందుకంటే అది ఆడియోని విని తిరిగి వ్రాసి రికార్డు చేయబడిన సి.డి. దానిని మీరు ఎంతవరకూ అనువాదం చేయగలరు. దానిపై ఎంతవరకూ వ్యాఖ్యానించగలరు?

అందుగురించే స్వామి వివేకానంద మరీ మరీ చెప్పేవారు : "వ్యక్తిగతంగా మీరు సత్యాన్ని అనుభవించకుండా, దాని గురించి చదవకండి. ఆ అనుభవం పొందని వ్యక్తి చెప్పినప్పుడు దానిని వినకండి.

మరీ ముఖ్యంగా ఆయన ఇలా చెప్పేవారు. "ఏమిచెబుతున్నారో పట్టించుకోవద్దు. ముందుగా ఎవరు మీకు చెబుతున్నారో ఆ విషయం పట్టించుకోండి" అని ఆయన ఎప్పడూ వ్యక్తిగత అనుభవానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవారు. ఆయన ఈ విధంగా చెప్పేవారు. "ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాలలో ఉండే అన్ని పుస్తకాలు మిమ్మలని సత్యం వైపుకు తీసుకు వెళ్ళవు. మీరు సత్యాన్ని తెలుసుకున్న తరువాత మీకు పుస్తకాలతో అవసరం వుండదు."

అర్ధం చేసుకోవటం, మేధస్సుతో అర్ధం చేసుకోవటం అనుభవం కాదు. అర్ధం చేసుకోవటం అనేది మైండ్ చేసే పని. అది అహంకారం యొక్క ఉపవస్తువు by product మనం ఏదయితే అర్ధం చేసుకున్నామో అది మైండ్, అహంకారం వడపోయగా మిగిలిన విషయం మాత్రమే. ఈ పద్ధతిలో మైండ్ ఏవిధంగా ఒక విషయాన్ని చూడగలుగుతుంది?దానిని ఏ విధంగా అర్ధం చేసుకోగలుగుతుంది? ఒక వ్యక్తి తాను పొందిన అనుభవమే సత్యం. అనుభవం ముఖ్యంగా ఆధ్యాత్మిక అనుభవం మనలోని అహంకారాన్ని, మన మైండ్‌ని పూర్తిగా మార్చి వేస్తుంది. అదే స్పష్టమయినది రంగులు లేనిది, శాశ్వతమయినది.

మనం అర్ధం చేసుకున్న విషయాన్ని చెప్పగలిగితే ఏవో కొన్ని నిజాలని, విషయాలని, అభి(ప్రాయాలని మాత్రం వెల్లడి చేయగలం. కానీ అసలు సత్యాన్ని ఎప్పటికీ సత్యాన్ని ఎప్పటికీ వివరించలేము. సత్యాన్ని వెల్లడి చేయాలన్న, వివరించాలన్న దాని అనుభవాన్ని పొందాలి. అయితే మేధస్సుతో అర్ధం చేసుకోగలగితే మనం సత్యం గురించి చేసిన నిర్ణయాలని బలపరచుకోవచ్చు. ఇది ఆధ్యాత్మిక అనుభవం కావాలి అనే కోరిక ఉన్నవారికి అవసరం.

ఇక్కడ భగవానుడు ఇలా చెప్పాడు : మయ్యావేశ్య మనో యేమా నిత్యా యుక్తా ఉపాసతే [శ్రద్ధయా పరయోపే తాస్తేమే యుక్తతమా మాతాః (12:2)

ఎవరయితే తమలోని అనుభవాల అనుభూతిని భక్తి రూపంలో వెల్లడి చేస్తారో దానికి ఉపయోగించిన పదం 'ఉపాస్తే'. ఉపాసన అనే పదాన్ని చాలా విధాలుగా అనువాదం చేయవచ్చు. ఎప్పుడయితే ప్రతి ఒక్కరిలోనూ మీరు భగవంతుని చూడగలుగుతారో, ఎప్పుదయితే మీలోని ఆధ్యాత్మిక అనుభవాన్ని వెల్లడి చేయగలుగుతారో అప్పుడు మీరు ఏది చేసినా అది ఉపాసన.

స్పష్టంగా అర్ధం చేసుకోండి. మీరు భగవంతుడిని అందరిలో చూడలేనప్పుడు మీరు భగవంతుడిని విగ్రహాలలో చూడలేరు. లేదా ఆయనని గురువులో కూడా చూడలేరు. కాబట్టి మీరు భగవంతుడిని [ప్రతి[ప్రాణిలో చూడలేనప్పుడు మీరు సర్వాంతర్యామిని దేవుడిలో చూడలేరు గురువులో కూడా చూడలేరు.

ఒకసారి ఒక వ్యక్తి రామానుజులవారి దగ్గరకి వెళతాడు. రామానుజులు గొప్ప గురువు. అయితే అయన దృష్టిలో దక్షిణభారతదేశం పూర్తిగా ఆధ్యాత్మికతను కోల్పోతుంది. శంకారాచార్యులు ఉత్తర భారత దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు. ఆయన దక్షిణ భారతదేశంలో పుట్టి పెరిగినా ఎక్కువభాగం ఉత్తర భారతదేశంలోనే ఉన్నారు. రామానుజాచార్యులు మూలంగా ఆధ్యాత్మికత దక్షిణ భారతదేశంలోనే తిరిగి తన వైభవాన్ని తెచ్చుకున్నది. ఆయన చివరివరకూ దక్షిణభారతదేశంలోనే ఉన్నారు. అంతేకాకుందా శంకారాచార్యులు ముప్పయిరెందు సంవత్సరాలే జీవించారు. కానీ రామానుజులు ఈ భూమి మీద చాలాకాలం జీవించారు. కొన్ని వేల మందిని ఆధ్మాత్మికరంగలో ఉత్తేజపరిచారు.

ఒక యువకుడు రామానుజుల దగ్గరకి వెళ్ళి "గురుదేవా ! దయచేసి భక్తిని ఎలా సాధించాలో చెప్పండి. భక్తి మార్గాన్ని ఎలా పొందాలి? భగవంతుణ్ణి ఎలా పొందాలి?" అని అడుగుతాడు. రామానుజులు ఆ యువకుడిని " నీవు జీవితంలో ఎవరినైనా (ప్రేమించావా?" అని అడుగుతారు. దానికి ఆ యువకుడు కదిలిపోతాడు. ఆ యువకుడు "గురుదేవా ! నేను బ్రహ్మచారిని. మీరు నన్ను ఆ ప్రశ్న ఎలా అడిగారు? నేను మీ దగ్గరకి భగవంతుని గురించి తెలుసుకోవాలనే కోరికతో వచ్చాను. మీరు నన్ను ఇటువంటి ప్రశ్న అడిగారు" అని అంటారు.