భగవద్ధిత - అధ్యాయం 12
ప్రేమే మీ జీవితం, ప్రతిష్ఠశాల
మీ మనస్సుని అత్యున్నతమయిన విశ్వాత్మనెన నాలో నిమగ్నం చేయండి. మీ మనస్సు, శరీరం, స్పర్శేంద్రియాలు అన్నింటినీ నాలోనే స్థిరపరచండి. అప్పుడు మీరు నాలో నివసించుతారు. ఈ విషయంలో మీకు ఎటువంటి సందేహం వద్దు (న సమస్య)
ఇప్పుడు శ్రీకృష్ణుడు పద్ధతి దగ్గరకి వచ్చాడు. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ధర్మచక్రం ప్రారంభం కావాలి. ముందుగా ఆయన ధర్మచక్రాన్ని వివరించుతాడు. ఆ తరువాత పద్ధతిని చెబుతాడు.
ఒక విషయం అర్ధం చేసుకోండి. ప్రేమ అంటే ఒక మూడ్ mood కాదు. అది కేవలం ఒక భావావేశం కాదు. అది మీ ఉనికి. అది ఎంత కాలం ఒక మూడ్లా ఉంటుందో అది వస్తుంది, పోతుంది. ప్రేమ రెండు రకాలు. సమాంతరపు (horizontal) ప్రేమ, ఊర్ధ్వ (లేదా) నిలువుగా ఉన్న (verticle) ప్రేమ.
దీనిని మీకు వివరించుతాను : సమాంతరపు ప్రేమ, సమాంతర రేఖలా అడ్డంగా ఉంటుంది. అది కాలానికి సంబంధించిన ఉంటుంది. అది ప్రారంభమవుతుంది. ముగిసిపోతుంది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఏదైనా ప్రారంభమయితే అది ముగిసి తీరుతుంది. అది ముగింపుకి రావటానికి ఎక్కువ సమయం పడితే దానిని శాశ్వతం అని అనుకోవద్దు. ఏదైనా ప్రారంభమయితే ముగిసితీరాలి. దానికి కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలూ పట్టవచ్చు. కానీ అది చివరికి వస్తుంది. అది శాశ్వతం కాదు. కాలపరిమితికి లోబడి ఉంటుంది. దీనినే సమాంతర ప్రేమ అనవచ్చు.
సమాంతర ప్రేమ కాలానికి సంబంధిన ఉంటే, ఊర్ద్వ ప్రేమ చేతనస్థితికి సంబంధించినది. ఈ ప్రేమ ప్రారంభంకాదు, ముగింపుకి రాదు. దీనికి వేరే భావం ఉండదు. ఇది మీ సహజలక్షణం. అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ప్రేమించటంలో భేద భావం చూపించితే స్పష్టంగా తెలుసుకోండి. దానిని ప్రేమ అనరు. అది మోహం మాత్రమే. ఎదుటి వ్యక్తి మీ భావాల ప్రేమలో పట్టగలిగినంత కాలం, మీ ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడయితే ఆ వ్యక్తి అందులో సరిపడదో, మీ ప్రేమ మాయమవుతుంది. ఆ ఆర్థిక
మా ధ్యాన కార్యక్రమాలలో మొదటి క్లాసులో నేను అందరినీ వాళ్ళు ప్రేమించే వ్యక్తుల పేర్లు వ్రాయమంటాను. వాళ్ళని నిజాయితీగా వ్రాయమని చెబుతాను. వాళ్ళు జీవితాలలో వాళ్ళు నిజంగా ప్రేమించిన వ్యక్తుల పేర్లు, కనీసం ఇద్దరి పేర్లయినా వ్రాయమంటాను. మామూలుగా ప్రారంభంలో వాళ్ళు చాలా పెద్ద లిస్టు తయారుచేస్తారు. భార్య, భర్త, తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఇలా చాలా పేర్లు ఉంటాయి. వీళ్ళంతా ఎవరినయితే వీరు ఆనంద పరచాలనుకుంటున్నారో లేదా ఎవరయితే వీరిని ఆనంద పరుస్తారో వాళ్ళు పేర్లు ఈ లిస్టులో ఉంటాయి. రాజ
నేను ఎప్పుడయితే నిజమయిన ప్రేమ గురించి మాట్లాడతానో, వాళ్ళంతా ఆ లిస్టులో ఒక్కొక్కపేరు కొట్టేస్తారు. అలా జరిగినప్పుడు స్పష్టంగా తెలుసుకోండి, అది ప్రేమ కాదు. అయితే చాలామంది తమ కూతురు, కొడుకుల దగ్గరకి వచ్చేటపుటికి ఆగిపోతారు. నేను చెబుతున్నాను అర్ధం చేసుకోండి. మీ ప్రేమంతా మూడు కారణాలతో ఉంటుంది. ఆర్ధిక ఉపయోగాల కోసం, రెండవది మానసిక ఆధారం కోసం అంటే మీ కుటుంబం, మీ సమాజం, మీ వర్గం ఈ విధంగా మీకు ఏదయినా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు మీకు ఆధారంగా ఉంటారు. దీనినే మానసిక ఆధారం అంటారు.
మూడవ కారణం, మంచి వ్యక్తి అనే సర్టిఫికెట్ కోసం. మనకి తెలియకుండానే ప్రతి ఒక్కరూ దీనిని ఆశించుతారు. కొన్ని సార్లు మనం ప్రేమని చూపించుతాము. ప్రేమని పంచుతాము. ఇది ఆర్ధికపరమయిన ఉపయోగాల కోసం కాదు లేదా.