KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/భగవద్దిత - అధ్యాయం 12Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

భగవద్దిత - అధ్యాయం 12

ప్రేమే) మీ జీవితం తిరిగిస్తుంది

మానసిక ఆధారం కోసం కాదు. మనం ఎదుటివారి నుంచి మంచి వ్యక్తి అనే సర్టిఫికేట్‌ని ఆశించి చేస్తాము. ఎదుటి వారి శ్రద్ధని ఆశించే ఆకర్షణ ఇందులో ఉన్నది. మనం ప్రేమని వ్యక్తం చేయటంలో ఎదుటివారిపై ఆధారపడే అవసరం అందులో ఉంటుంది. అటువంటి ప్రేమ షరతులు, నిబంధనలతోఉన్న ప్రేమ.

కొంతమంది నాతో అంటుంటారు. స్వామీజీ నేను నా పిల్లలని ఈ మూడు కారణాల వలన ప్రేమించటం లేదు అని. అప్పుడు నేను వాళ్ళతో సరే! అకస్మాత్‌గా మీ అబ్బాయి అన్నీ తన ఇష్ట ప్రకారం చేయటం మొదలు పెట్టాడనుకోండి. ప్రతిదీ తన నిర్ణయం ప్రకారం చేస్తున్నాడనుకోండి. అతను మీ పరిధిలోంచి వెళ్ళిపోయాడనుకోండి, అతను మీ మాట వినటం లేదనుకోండి, మీ రూల్స్ ప్రకారం నడచుకోవటం లేదనకోండి, అప్పుడు మీకు అతని మీద ఉండే ప్రేమ అలానే ఉంటుందా?

నిజాయితీగా ఆలోచించండి. సహజంగానే లేదు అంటారు. వారి ప్రేమ యొక్క నాణ్యతలో చాలా మార్పు వస్తుంది.

దీని అర్ధం ఏమిటి? మనం మన తరువాత తరం వారు మన జీవితాన్ని వారు జీవిస్తున్నంత కాలం ప్రేమిస్తాము. వారు మన జీవితాలకి చిన్న పొడిగింపులా ఉన్నంతకాలం ప్రేమిస్తాము. మన కోరికలని వారి ద్వారా తీర్చుకోవాలని చూస్తుంటాము. మన జీవితాలని వారి ద్వారా జీవించుతాము. మనం సాధించాలి అని అనుకున్నవన్నీ వాళ్ళ ద్వారా సాధించాలని చూస్తాము. వాళ్ళు మన జీవితంలో ఉన్నంతకాలం వారితో మన సంబంధాలు చాలా బాగుంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడయితే వారి నిర్ణయాలు వారే చేసుకుంటారో, వాళ్ళు ఎప్పుడయితే మీరు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని అనుకుంటారో, వాళ్ళు నిలబడి 'లేదు' 'కాదు' అని చెప్పటం మొదలుపెడతారు. అప్పుడు మీ సంబంధ బాంధవ్యాలు మొత్తం మారిపోతాయి.

పిల్లలు పెద్దవారికి లేదు అని చెప్పినపుడు వారు పెద్దవారయినట్లుగా అనుకొంటారు. ఇది చాలా సహజమయిన విషయం. లేదు అని చెప్పినప్పుడే మీరు ఒక వ్యక్తిని అని అనుకుంటారు. వాళ్ళు మీరు ఏమిచెబుతున్నారో పట్టించుకోరు. వాళ్ళకి తెలిసింది 'లేదు' 'కాదు' మాత్రమే. వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. వాళ్ళు లేదు, కాదు అని చెప్పినప్పుడు చాలా బలవంతులు అయినట్లు అనుకుంటారు. ఈ కారణంమూలానే ప్రపంచంలో యువత ఎదిరిస్తూ ఉంటారు. అది తూర్పు లేదా పశ్చిమదేశాలు కానీ, ఏ సంస్కృతిలోనైనా యువకులు 'లేదు', 'కాదు' అని చెబుతారు. ఎందుకంటే వాళ్ళు లేదు, కాదు అని చెప్పినప్పుడే చాలా గొప్పవారిగా, శక్తికలవారిగా అనుకుంటారు. కాదు అనేమాట వాళ్ళకి చాలా శక్తిని ఇస్తుంది.

మీకు ఒక విషయం చెబుతాను. మీ ప్రేమ ఔను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఔను, సరే అనే మాట వచ్చినంతకాలం మీ ప్రేమ కూడా సరే. ఎప్పుడయితే మీరు లేదు, కాదు అనే వాటిని వినవలసివస్తుందో అప్పుడు మీ ప్రేమ కూడా లేదు, కాదు అవుతుంది. ఎందుకంటే ఇది సమాంతర ప్రేమ. అది ఏదో ఒక కారణంతో ముగుస్తుంది. అదే ఊర్ధ్వ ప్రేమ అయితే దానికి చివర లేదు. ఎందుకంటే దాని మొదలు ఉండదు. అది ప్రారంభం కాదు. దానిని మీరు ఆకస్మాత్‌గా గుర్తిస్తారు. మీరు ఎలా అయితే మీ శరీరంలో ఉన్నారో, అదేవిధంగా మీరు ప్రతి శరీరంలోనూ ఉన్నట్టుగా గురిస్తారు. అదే ప్రేమ.

ఉపనిషత్తులలో ఒక చక్కని ఉదాహరణ ఉన్నది. ఒక గురువుగారు తన శిష్యుడిని ఈ విధంగా అడుగుతాడు. నీవు నీ స్పర్శేంద్రియాలతో పూర్తిగా ఆనందాన్ని పొందుతున్నావా?" అని శిష్యుడు అవును అని సమాధానం చెబుతాడు. అప్పుడు గురువు 'నీ స్పర్శేంద్రియాలలో ఒకదాని కోల్పోతే, నీకు అదే ఆనందం ఉంటుందా?" అని అడుగుతాడు.

ఆ ప్రశ్నకు శిష్యుడు "లేదు. అది ఇరవై శాతం తగ్గుతుంది. అలాగే రెండింటిని కోల్పోతే నలభై శాతం ఆనందం తగ్గుతుంది " అని జవాబు ఇస్తాడు.

అకస్మాత్‌గా గురువు ఈ విధంగా అడుగుతాడు " నీకు మరొక ఐదు స్పర్శేంద్రియాలు అదనంగా ఉంటే ఏమవుతుంది?"

అప్పుడు శిష్యుడు "సహజంగానే నా ఆనందం నూరుశాతం పెరుగుతుంది. అలాగే నాకు ఇంకొక శరీరం ఉంటే ప్రతిది రెట్టింపు ఆనందాన్ని పొందగలుగుతాను. లేదా నాకు ఐదు శరీరాలు ఉంటే ఐదురెట్లు ఆనందం పొందుతాను అంటాడు.

మీరు ప్రపంచంలోని ప్రతి శరీరంలో జీవిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు ఆ అనుభవం ఎంత ఆనందాన్ని ఇస్తుంది? మీకు ఎంత పారవశ్యం కలుగుతుంది. లెక్కకట్టలేనంత ఆనందం అది. అది శాశ్వతమయినది. అంతిమయినది. అవును కదా!

ఈ ఆనందాన్నే జ్ఞానోదయమయిన యోగులు పొందేది. వాళ్ళు ఈ విశ్వమంతా ఉన్నారు అనే అనుభవాన్ని పొందుతారు. వాళ్ళు ప్రతి శరీరంలో ఉంటారు. అందుకే అద్భుతమయిన పారవశ్యంలో ఉంటారు. వాళ్ళు శాశ్వతమయిన నిత్యానందంలో ఉంటారు. అందుకే వాళ్ళు బయట ప్రపంచం నుంచి ఏమీ ఆశించరు.

ఒకసారి మా కార్యక్రమం అయిపోయాక ఒక పెద్దాయన నా దగ్గరకి వచ్చి, నాకు చాలా సానుభూతిని చూపించుతూ, 'అయ్యో! ఇంత చిన్న వయస్సులో మీరు యోగిగా అయిపోయారు. మీరు జీవితంలో చాలా కోల్పోయారు" అని అన్నారు.

ఆయన తన జాలిని చూపించాడు. ఆయన నేను ఏదో కోల్పోయాననుకుంటున్నాడు. నేను అతనితో ఇలా చెప్పాను "మీరు నా మీద సానుభూతి చూపించనవసరం లేదు. నిజానికి నేనే మీ పట్ల జాలి చూపించాలి. అరవై సంవత్సరాలు వయస్సు వచ్చి కూడా మీరు స్వేచ్ఛని పొందలేక పోయారు. ఈ వయస్సులో కూడా మీరు సంసార బంధాలలో కష్టపడుతున్నారు. కాబట్టి మీరు నాకు సానుభూతి చూపవద్దు. నాకే మిమ్ములని చూస్తే జాలిగా ఉన్నది అన్నాను.

మీరు పారవశ్యాన్ని, పరమానందాన్ని మీ అంతరంగంలో అనుభవించగలిగితే, మీరు బయట ప్రపంచంలో ఏదీ కోల్పోరు. మీకు ఇంకా ఈ బయట ప్రపంచంలో ఏమీ అవసరం ఉండవు.

మీరు ప్రపంచాన్ని వదలటం (సన్యసించటం) నిజమయిన సన్యాసం కాదు. అది నిజంగా వదులుకోవటం కాదు. ప్రపంచం మిమ్ములని వదిలివేయాలి. మీ అంతరంగంలో పరమానందం, పారవశ్యం, ఆనందం ఉన్నప్పుడు మీరు అప్రయత్నంగా వాటిని అన్ని వైపులకి వ్యాపింపచేస్తారు. అప్పుడు మీరు ఏదో కోల్పోయాము అని అనుకోరు.

నేనెప్పుడూ చెబుతుంటాను. మీరు మీ అంతరంగంలో అటువంటి పారవశ్యాన్ని పొందేవరకూ ఈ ప్రపంచాన్ని వదలకండి. దేనినీ వదలవద్దు. ఆ పారవశ్యపు అనుభవాన్ని సాధించే దిశగా పనిచేయండి. ఎప్పుడయితే ఆ పారవశ్యపు అనుభవాన్ని పొందుతారో, మీలో ప్రపంచాన్ని సన్యసించటం అనేది అప్రయత్నంగా జరుగుతుంది.

స్పష్టంగా అర్థం చేసుకోండి. మీ లోపల మీ ప్రపంచాన్ని ఏర్పరచుకోకుండా మీరు బయట ప్రపంచాన్ని వదిలివేస్తే, మీరు మానసిక వ్యధకి లోనవుతారు.

నేను చాలామంది సన్యాసులని చూసాను. వారు వారి అంతరంగపు ప్రపంచాన్ని సాధించకుండా, ప్రపంచాన్ని వదిలేసే మార్గంలో ఉంటారు. వాళ్ళే సమాజసేవ అనేదానిలో పడి అక్కడి నుంచి మానసిక కుంగుబాటుకు లోనవుతారు. అటువంటి వాళ్ళు నలభై, నలభైఐదు సంవత్సరాల వయస్సులో ఇటువంటి మానసిక కుంగుబాటుకి లోనవుతారు. వాళ్ళు లోతయిన మానసిక వ్యధలో ఉండి ప్రపంచంలో

వాసనలూ ఆహరమే. మీరు ఆనందించే స్పర్శ ఆహారం. కాబట్టి మీరు ఐదు స్పర్శేంద్రియాల ద్వారా లోపలికి తీసుకునేవన్ని ఆహారమే. అవి పరిశుభ్రంగా, స్వచ్చంగా ఉండాలి. అప్పుడే మీరు స్వచ్ఛతని అన్ని వైపులకీ వెదజల్లుగలుగుతారు. అప్పుడే మీరు పరమానందాన్ని, పారవశ్యాన్ని దివ్యమేధస్సుని వెదజల్లగలుగుతారు. దానిని అన్ని దిశలకూ వ్యాపింపచేయగలరు. అర్ధం చేసుకోండి. మీరు మీ ఆహారాన్ని స్వచ్చంగా, పరిశుభ్రంగా ఉంచకపోతే, మీకు కలిగే జ్ఞాపకాలను స్వచ్చంగా ఉంచలేరు.

నేను అదృష్టం కొద్ది పల్లెటూరులో పుట్టాను. ఆరోజులలో అక్కడ టి.విలు లేవు. నన్ను కొంతమంది అడుగుతుంటారు. "స్వామీజీ, మీరు విషయాలని అంత త్వరగా ఎలా గ్రహించగలుగుతారు? " అని. మీకు ఒక విషయం చెప్పాలి. నేను రెండు సంవత్సరాల క్రితమే ఇంగ్లీషు మాట్లాడటం నేర్చుకున్నాను. నేను ఇంగ్లీషు చదివాను కానీ నా చదవంతా నా మాతృభాష తమిళంలోనే జరిగింది. నేను ఆగష్టు 2003లో మొదటి సారి అమెరికా వచ్చినప్పుడే ఇంగ్లీషు మాట్లాడటం మొదలు పెట్టాను.

అందరూ అడుగుతుంటారు. నేను అంత త్వరగా ఎలా నేర్చుకోగలిగాను అని. కొంతమంది అడుగుతుంటారు, మీరు అన్ని పుస్తకాలు అన్ని పేజీలు ఎలా చదవగలుగుతున్నారు అని. ఎందుకంటే నేను ఎప్పుడూ టి.వి. చూడను. టి.వి. తిన్నగా వెళ్ళి మీ చేతనస్థితిని నాశనం చేస్తుంది. అర్థం చేసుకోండి. టి.వి. చూడటం వలన మీ కళ్ళని, మీ చేతన స్థితిని పాడు చేసుకుంటారు.

మీకు ఒక ముఖ్యవిషయం చెబుతాను. ఈ ఉదాహరణకి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు ఏదో కారు లేదా స్కూటర్ మీద ప్రయాణం చేస్తున్నారనుకోండి. మీరు గంటకి 40 మైళ్ళ స్పీదుతో వెళుతున్నారనుకోండి. మీర రోడ్డు మీద బోర్డులని, అన్నీ చూడవచ్చు. రోడ్డు మీద ఉన్న వాటినన్నింటినీ మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఒక వేళ మీరు గంటకి 100 మైళ్ళ వెళుతుంటే,

మీరు ఏమైనా చూడగలరా?

మీరు ఏమీ చూడలేరు. దేనినీ స్పష్టంగా చూడలేరు. ఎందుకంటే మీరు సెకండ్‌కి ఎక్కువ ప్రేమలని చూస్తున్నారు కాబట్టి. అందుకే మీరు దేనినీ స్పష్టంగా చూడలేరు. మామూలు స్థితిలో మీ కళ్ళు దేనినైనా సరే చూడాలన్నా, దానిని విశ్లేషించి, రికార్డు చేయాలన్నా సెకండ్‌కి ఆరు ప్రేమల స్పీదు మాత్రమే ఉండాలి. అంటే సెకండ్‌కి ఆరు ఫ్రేముల చొప్పున మీ కంటి ముందు ఏదైనా మారుతుంటే దానిని, అందులోని విషయాన్ని సందేశాన్ని మీ కన్ను చూడగలుగుతాయి. దానిని విశ్లేషించి, విభజించి తిరిగి దానిని మీ చేతనస్థితికి చేర్చగలుగుతాయి. కానీ ఆ మార్పు సెకండ్‌కి ఆరు ఫ్రేములని మించితే మీలోని తర్కం గతి తప్పుతుంది. బాలెన్స్ చేయలేదు. టి.వి.లో మీరు కనీసం సెకండ్‌కి పదహారు ఫ్రేములని చూస్తారు. అందులోని విషయం మీలోపలికి నేరుగా బలవంతంగా నెట్టబడుతుంది.

స్పష్టంగా అర్ధం చేసుకోండి. అది ఈ విధంగా ఉంటుంది. మీ ఇంటిముందు వాచ్‌మెన్ ఉంటాడు. ఒక దొంగ మీ వాచ్‌మెన్‌ని కొట్టి చంపి తిన్నగా మీ ఇంటిలోనికి వచ్చేస్తాడు. టి.వి. చూస్తున్నప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది.

తర్కం అనేది మీ కాపలాదారుడు (వాచ్‌మెన్), అతను మీకు కాపలా కాస్తూ నిలబడ్డాడు. అక్కడ తర్కం నిలబడి ఉంటుంది. మీ దగ్గరకి ఏవిధమయిన సమాచారం వచ్చినా, అది దానిని విశ్లేషించుతుంది. ఇది నిజము, ఇది అబద్ధము, ఇది బొమ్మ, ఇది నిజమయిన మనిషి ఇలా వివరాలు ఇస్తుంది. సమాచారాన్ని విశ్లేషణ చేసి దానిని రికార్డు చేస్తుంది. మీరు సినిమా చూసినప్పుడు సెకండ్‌కి పదహారు ఫ్రేములు మారుతుంటాయి. అలా సమాచారం మీ దగ్గరకి బలవంతంగా నెట్టబడినపుడు, మీ తర్కం తన శక్తిని కోల్పోతుంది. అది వచ్చిన సమాచారాన్ని విశ్లేషించే నైపుణ్యాన్ని పోగొట్టుకుంటుంది. అప్పుడు సమాచారం నేరుగా మీ చేతన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆ సమాచారం మీ లోపలికి చొచ్చుకుని వెళుతుంది. ఇది ఎలా

ప్రేమే మీ జీవితం ప్రతిష్ఠను

అంటే దొంగ మీ కాపలదారుని చంపి నేరుగా మీ ఇంటిలోనికి ఎలా వస్తాడో అలా లోపలికి వెళ్ళిపోతుంది.

మరొక విషయం : సమాచారం నేరుగా మీకు చేరుతుంది. దాంతో మీరు తార్కికంగా ఆలోచించే శక్తిని పోగొట్లుకుంటారు. మీ భావావేశాలు కూడా అదుపు తప్పుతాయి. అకారణంగానే, సినిమాలో వాళ్ళు నటించుతున్నారు, అని తెలిసి కూడా వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు. ఆ పాత్ర చనిపోతే ఆ నటించే వాళ్ళు బతికే ఉన్నారని తెలిసి కూడా మీరు బాధపడతారు. అది నిజంగా జరగటం లేదు అని, అది అంతా నటన అని మీకు తెలుసు. అయినా వాళ్ళు నవ్వితే మీరు నవ్వుతారు.వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు.

అక్కడ జరిగే సీన్ ప్రకారం మీ మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. అక్కడ మానసిక వ్యధతో ఉన్న సీన్ వస్తే మీరు కుంగిపోతారు. ఎందుకు? మీరు చదువుకున్న వారు, అదంతా కేవలం నటన అని మీకు తెలుసు. అందులో నటీనటులు బ్రతికే ఉన్నారు అని తెలుసు. వాళ్ళని మీరు చూసి ఉంటారు కూడా. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం మీరు బాధపడతారు ఎందుకు? ఎందుకంటే, సమాచారాన్ని విశ్లేషణ చేసే తర్కాన్ని మీరు పక్కన పెట్టేస్తారు. అది నిజమా, అబద్దమా అనే విషయం విశ్లేషించే అవకాశం ఉండదు. సమాచారం తిన్నగా, మీలోనికి చేరిపోతుంది. అది మీ వ్యవస్థలోనికి చేరిపోతుంది. అది మీ అచేతన స్థితిని చేరుతుంది. అప్పుడు మీ అచేతన స్థితి దానితో ప్రభావితం అవుతుంది. అందుకే స్పష్టంగా తెలుసుకోండి. మీకు మానసిక వ్యధ కలిగించే ఏవీకూడా చూడకండి.

అలా కాకుండా సరదాగా ఉండి మీకు సంతోషాన్ని కలిగించి, మిమ్మలని నవ్వించే కార్యక్రమాలు చూడటం మంచిదే. అవి మిమ్మలని బాధపెట్టవు. అవి మీ చేతనస్థితిని డైరెక్ట్గా బాధించవు. కాకపోతే దీని వలన మీకు సమయం వృధా (టైం వేస్ట్) అవుతుంది. అలాంటి కార్యక్రమాలు చూస్తూ తిన్నారనుకోండి. కొంచం భోజనం ఎక్కువ చేస్తారు. దానితో మీకు బరువుపెరిగే సమస్య రావచ్చు. లేకపోతే మరే సమస్యలేదు.

ఒక సర్వే ప్రకారం ఎనభై శాతం మంది టి.వి. చూస్తూ భోజనం చేస్తారు. దానితో బరువు పెరిగే సమస్యని ఎదుర్కొంటున్నారు. అయితే ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ మీ మనస్సుకి బాధ కలిగించేవి, మానసిక కుంగుబాటును తెచ్చేవి, అటువంటి కార్యక్రమాల మాత్రం చూడకుండా ఉండటమే మంచిది.

ఈ సందర్భంగా నేను మీకు మరొక మరొక ముఖ్యమయిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. నన్ను చాలా మంది అడుగుతుంటారు. "స్వామీజీ, ఎక్కడయినా దెయ్యాలు, భూతాలు అనేవి ఉంటాయా? ఈ ప్రశ్న నన్ను చాలా సార్లు అడిగారు. మీకు స్పష్టంగా వివరించుతాను. అసలు దెయ్యాలు అనేవి లేవు. అలాగే భూతాలు, ఆత్మలు ఇవేవి లేవు. స్పష్టంగా తెలుసుకోండి. మీరు వెయ్యి ఉదాహరణలు, రెఫెరెన్సులు చెప్పవచ్చు. నాకు తెలుసు, మీ మైండ్స్ ఇప్పటికే చాలా సంఘటనలని పోగు చేస్తుంటాయి. మీరు చూసిన సినిమాలలో, మీరు పుస్తకాలలో చదివిన విషయాలోంచి మీ మైండ్ కొన్ని రిఫరెన్సులని పోగు చేస్తుంటుంది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఒక్కసారి మీ అచేతనస్థితి దెయ్యాలు ఉన్నాయి అని నమ్మితే అది మీ ముందుకు ఆ భావాలని తెస్తుంది. మీరు దానిని చూస్తారు. మీ అచేతన స్థితి ఏవిషయాన్ని నమ్మితే, ఆ విషయాన్ని మీ ముందుకి తెస్తుంది. అది మీరు నమ్ముతారు.

ఇప్పుడు హిప్నాటిజమ్ మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు వాళ్ళు చాలా గొప్ప గొప్ప సత్యాలతో ముందుకి వస్తున్నారు. ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి అతని చేతికి మండే మంటని ఇచ్చి నువ్వు గులాబీలని పట్టుకున్నావు అని ఆ హిప్నటైజ్ చేసే వ్యక్తి చెబితే, అతను నిజంగా చేతిలో గులాబీలు ఉన్నాయనే అనుకుంటాడు. అంతేకాదు చేతిలోంచి మంటను తీసేసాక చూస్తే చేయి గులాబీల

ప్రేమే మీ జీవితం ఎం.ఎస్

వాసన వస్తుంది. అంతే కాదు చేతిలో మంటని పట్టుకున్న చేయి కాలదు. హిప్పటిజమ్‌కి చాలాశక్తి ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే మీ అచేతనస్థితికి అంతశక్తి ఉన్నది అని. మీకు తెలియని అచేతనస్థితిలో మీకు దెయ్యాలు ఉన్నాయి అని చెబుతారు. అది హిప్నటైజ్ చేసినట్టుగా ఉంటుంది. దాంతో మీరు దెయ్యాలని చూడగలుగుతారు. అలా మీకు ఒకసారి అనుభవమయితే దానిని మీరు చాలా నమ్ముతారు. అదే ఒక ధృఢమయిన నమ్మకమై పోయిపోతుంది.

ఇంతకంటే కూడా బాగా కలవరపెట్టే విషయాన్ని కనుక్కున్నారు. అమెరికాలోనే, క్రిందటి దశాబ్దంలో పిల్లలు తల్లిదండ్రుల చేతిలో లైంగిక హింసకి గురి అయి కష్టాలు పడినట్లు బయటకి వచ్చింది. ఈ విషయాలని వాళ్ళు పెద్దవారయ్యక (టీనేజ్‌కి వచ్చాక) కనుగొనగలిగారు. ఇలాంటి విషయాలు హిప్పటిజమ్ ద్వారా కనుక్కోగలిగారు. ఆ తరువాత పోలీసులు, అధికారులు ఈ కేసుల మీద కొంత పనిచేశారు.

అధికారులు, పోలీసులు కొంత పరిశోధనలు చేసాకా అసలు అటువంటి హింస జరగలేదు, ఇవన్నీ కూడా తీర్పులని తామే చేసేసి దాని ప్రకారం పేషెంట్స్‌ని ట్రీట్ చేసిన సైక్రియాటిస్టులు చేసిన పని. వాళ్ళే ఈ యువకుల మైండ్‌లోకి ఇటువంటి విషయాలని వెళ్ళేలా చేసారు అని తెలిసింది. మానసిక గాయాలని వ్యధని తమ చికిత్స ద్వారా బాగుచేయవలసిన సైక్రియాటిస్టులు, వాళ్ళని మరింత బాధలని గురిచేసారు. .

మీరు దయ్యాల సినిమాలు, హరర్ సినిమాలు వరుసగా మూడు రోజులు చూస్తే, మీకు దయ్యాలు కనిపిస్తాయి. కిటికీలకి, గుమ్మంకి కట్టిన కర్టెన్ కదిలినా అది దయ్యంలా కనిపిస్తుంది. మీ భార్య గదిలోనికి వస్తున్నా, దెయ్యం లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది. దీని గురించి మీరు దెయ్యాల సినిమాలు చూదనవసరం లేదు. ఎందుకంటే మీ చేతనస్థితిలో మీరు ఈ విషయంలో కలతతో ఉంటారు. సరే! మీ చుట్టూ ఏమి జరిగినా దానిని భూతాలతో సంబంధం పెట్టేసారు.

ఉదాహరణకి మీరు ఒక హరర్ సినిమా చూస్తున్నారనుకోండి. మీకు దాహం వేసి అప్పుడు మంచినీళ్ళు తాగాలని వంటింటిలోనికి వెళతారు. అప్పుడు అనుకోకుండా పిల్లి కిటికీలోంచి దూకిందనుకోండి. అంతే! సీన్ మొత్తం పూర్తి అయిపోతుంది. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి అనే నమ్మకం చాలా ధృఢంగా ఏర్పడుతుంది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఇది పూర్తిగా మీ అచేతనస్థితి మాత్రమే. ఎందుకంటే మీరు నమ్మటం మొదలుపెట్టినప్పటి నుంచీ, మీరు దానినే చూస్తుంటారు. అప్పుడు మీ నమ్మకం చాలా బలపడిపోతుంది. ఇది ఒక చేధించలేని చక్రంలా తయారవుతుంది.

మీ దగ్గరకి ఏ దయ్యం, భూతం ఈ భౌతిక శరీరంతో రాలేవు. చూడండి. మీకు మూడు శరీరాలు ఉంటాయి. భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కేవల శరీరం. ఒక వేళ దెయ్యాలు నిజంగా ఉండి ఉంటే వాటికి భౌతిక శరీరం ఉండదు. అసలు దెయ్యాలు అనేవి లేనే లేవు. ఉంటే అనే ప్రశ్న లేదు. కాకపోతే మనం విషయాన్ని తార్కికంగా అర్ధం చేసుకోవటం కోసం, నేను చెప్పే మాటలు మీకు అర్ధమవటానికి, అవి ఉండి ఉంటే అని అనుకుందాం. మీ అందరి వాదనలని తీసుకుంటాను. అలాంటప్పుడు దెయ్యాలు ఉండి ఉంటే వాటికి భౌతిక శరీరం ఉండదు. వాటికి కేవలం సూక్షుశరీరం, కేవలం శరీరం మాత్రమే ఉంటుంది. వాటికి భౌతిక శరీరం ఉండదు.

మీ దగ్గరకి ఏ దయ్యం, భూతం భౌతిక శరీరంతో రాలేవు. మహా వస్తే మీ భార్య లేదా మీ భర్త రావాలి అంతే. దీని అర్ధం ఏమిటి అంటే వాటికి 66% శక్తి మాత్రమే ఉంటుంది. మీకు మూడు శరీరాలు ఉంటాయి. అది వందశాతానికి సమానం. దీని అర్ధం ఏమిటంటే అవి మీకంటే చాలా తక్కువ శక్తి కలిగి ఉన్నాయని, వాటికంటే మీరే శక్తివంతులు అని. కాబట్టి అవి నిజంగా ఉండివుంటే మీరు వాటి విషయంలో అసలు భయపడనవసరం లేదు.

ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి. అవి నిజంగా ఉన్నా మీరు వాటికి భయపడనవసరం లేదు. అవి మీకంటే తక్కువ ప్రాణులు. మీకంటే చాలా తక్కువ దశలో జీవించే జీవాలు. ముందుగా చెప్పాలి అంటే అసలు అవిలేవు. మనవాదనకి అనువుగా ఉంటుంది అని అవి ఉన్నాయి అవి అనుకున్నా, అవి చాలా చిన్న ప్రాణులు. మనకంటే శక్తిలేనివి. అందుకే మీరు వాటిని చూసి భయపడనవసరం లేదు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. దెయ్యాలతో మాట్లాడటం, మీడియాలద్వారా ఆత్మలతో మాట్లాడటం, చనిపోయిన మీ బంధువులతో మాట్లాడటం, ఇవన్ని కేవలం కధలే. ఒక కథ పుడుతుంది దాని మీద మరొక కథ అల్లుతారు. ఆ తరువాత ఇంకొక కథ. ఇది కేవలం కల్పన.