ఒక చిన్న కథ :
ఒకామె ఆత్మలతో మాట్లాడించే మీడియం దగ్గరికి వెళ్ళి కొద్దికాలం క్రితం చనిపోయిన ఆమె భర్తతో మాట్లాడాలనుకుంటుంది. ముందు ఆ మీడియం ఎదురు చూస్తుంది. గొణిగినట్లు వస్తుంది. ఆ తరువాత మాట్లాడటం మొదలు పెడుతుంది.
ఆమె అడుగుతుంది "ఏమండీ! మనకి డబ్బులు ఇవ్వవలసిన వారి వివరాలు చెప్పండి. మీరు డబ్బు ఎక్కడ ఎక్కడ పొదపు చేసారో పెట్టబడిపెట్టారో చెప్పండి" అంటుంది. ఆమె భర్త జవాబు ఇస్తాడు " మన పాలుపోసే అతను మనకి ముప్పై అయిదువేలు బాకీ ఉన్నాడు"
ఆమె ఇలా అడుగుతుంది "ఇంకా ఎవరు ఇవ్వాలి"
మీడియం ఇలా చెబుతుంది. "నేను రెండు లక్షలు మన బ్యాంక్‌లో డిపాజిట్ చేసాను దానిని తీసుకో మన ప్రక్క ఇంటి వాళ్ళు మనకి లక్షరూపాయలు ఇవ్వాలి. అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకో.
ఇలా చాలా చెబుతుంటాడు. ఆమె సంతోషంగా వింటుంది. ఆకస్మాత్‌గా భర్త ఇలా అంటాడు. "లక్ష్మీ, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను నా స్నేహితుడికి పది లక్షలు ఇవ్వాలి. అతనికి అవి తిరిగి ఇచ్చేసేయి"
అకస్నాత్‌గా భార్య మీడియంతో ఇలా అంటుంది " ఈ గొంతు నాభర్త గొంతులా అనిపించటం లేదు ఇతను నా భర్త కాదు"
స్పష్టంగా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీకు ఏ పనులకి ఆధారంగా ఉంటూ, సహాయపడుతున్నంతవరకూ ఇటువంటి భావనలన్నీ బాగానే ఉంటాయి. ఆ తరువాతే సమస్య. కాబట్టి ఇలాంటి మీడియం అనే వాటిని నమ్మకండి. మీకున్న సమయాన్ని ఇలాంటి మాటలు మాట్లాడుతూ వృధా చేయకండి. చనిపోయిన వారితో మాట్లాడుతూ మీ సమయాన్ని వృధా చేయకండి.
మనం మనచుట్టూ జీవించి ఉన్న వారితో మాట్లాడటానికే కుదరదు. సమయం సరిపోదు. అటువంటప్పుడు చనిపోయిన వారితో మాట్లాడి సమయం ఎందుకు వృధా చేసుకుంటారు. ముందుగా మనం మన వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులతో మన జీవితాలతో సంబంధాలు పెంచుకున్న వ్యక్తులతో మాట్లాడదాము. ముందుగా వారితో పనిచేద్దాము. ఎందుకు అనవసరమయిన విషయాలతో సమయం వృధా చేస్తారు.
ఇటువంటి భయంకరమయినవి జరగకుండా చూదండి. మీ చేతన స్థితిలోనికి మిమ్ములని బాధపెట్టే విషయాలు వెళ్ళనీయకండి. అప్పుడు మీ మేధస్సు భగవంతునిలో నిమగ్నమవుతుంది. మీ లోపలికి వెళ్ళే మీ ఆలోచనలు మీలో చాలా ముఖ్య పాత్రని పోషించుతాయి. ఈ విషయాన్నే శ్రీ కృష్ణుడు మాట్లాడతాడు. ఈ విధంగా చెబుతాడు " మీ మేధస్సుని నాలో నిలపండి. " అర్ధం చేసుకోవటానికి