భగవద్గిత - అధ్యాయం 12
్రపేమే మీ జీవితం ఎన్నిఎస్
ప్రయత్నించండి మీరు లోపలికి తీసుకునేది ఏదయినా అది మీ ఆహారం కానీ, ఏదయినా కానీ మీ మైండ్ని అక్కడ స్థిరపరచాలి. అందుకే మీరు లోపలికి తీసుకునే ఆహారం స్వచ్ఛంగా ఉండాలి. మీలో ఆహారశుద్ధి జరగాలి. అప్పుడు అప్రంగానే మీ సచేతన స్థితి భగవంతునిలో స్థిరపడుతుంది.
మీరు మళ్ళీ మళ్ళీ పదే పదే ఈ భావాలని బాగా గ్రహించండి. ఈ భావాలని మీలోపలికి చొచ్చుకుపోనీయండి. అంతేకాని మీకు మానసిక వ్యధ కలిగించేవి, మిమ్మలని కుంగదీసే ఆలోచనలని, భావాలని లోనికి రానీయకుండి. ఉదాహరణకి గత పదకొండు రోజులుగా మీరు ఈ భావాలని వింటున్నారు.ఇప్పుడు మీకు ఏదయినా సమస్య వచ్చిందనుకోండి. మీరు వెంటనే గురుదేవులు ఈవిధంగా చెప్పారు అని గుర్తు తెచ్చుకుంటారు. మీరు ఇలా చెబుతారు "నేను ఈ ఐడియాని విన్నాను. నేను దీనిని ఇప్పుడు అర్ధం చేసుకోవాలి". అనుకోకుండా అప్రయత్నంగా ఇది మీలో జరగటం ప్రారంభమవుతుంది.
ఇది గనుక బయటకి రావటం మొదలుపెడితే, మీరు నేను చెప్పిన విషయాలు విన్నట్లే. అలా కాకుండా ఉంటే దాని అర్ధం మీరు నిశ్శబ్దశ్రోత అని.
నిశ్శబ్దశ్రోత అంటే ఇక్కడ ఉండి మరేదో విషయం గురించి సీరియస్గా ఆలోచించే వాళ్ళు. మీరు నిశ్శబ్దశ్రోతనా లేక నిజంగా ఈ ప్రవచనాలని విన్నారా అనే విషయం తెలియాలి అంటే, మీ లోనికి నామాటలు ఎన్నిసార్లు మీ నేపధ్యంలో వినిపిస్తాయో అదే మీరు విన్నారా లేదు అనే విషయం కొలవగలిగే స్కేలు.
నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీరు వినే మాటలు ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి దగ్గర నుంచి వస్తుంటే అవి మీలోనికి చొచ్చుకుపోతాయి. అప్పుడు అవి మీకు సహాయం కావాలి అనుకున్నప్పుడు అప్రయత్నంగానే మీ మైండ్లోనికి వస్తాయి.
కొంతమంది నన్ను అడుగుతుంటారు "స్వామీజీ ఇన్ని విషయాలని మేము ఎలా గుర్తుపెట్టుకోగలం, వాటిని ఎలా సాధన చేయగలం"అని నేను మీకు చెబుతున్నాను. ఈ విషయం గురించి మీరు అసలు పట్టించుకోవద్దు. కేవలం వినండి, అది చాలు. నేను ఈ మాటలని, మీకు నా అనుభవంతో చెబుతున్నాను. అవి సహాజంగానే మీ అంతరంగంలోనికి, మీ ఉనికిలోనికి చొచ్చుకుని పోతాయి.
మీకు అవసరం కలిగినప్పుడు మీరు వీటిని గుర్తుపెట్టుకోనవసరం లేదు. ఆ మాటలే మిమ్మలని గుర్తుపెట్టుకుంటాయి. మీరు గుర్తించుకోవాలి అని అనుకోవద్ద. అవే మిమ్మలని గుర్తుంచుకుంటాయి. మీకు ఎప్పుడు అవసరమయితే అప్పుడు అవే మీ దగ్గరకి వస్తాయి. అవి మీ చేతనస్థితిలో స్థిరపడతాయి, అవసరమయినప్పుడు పైకి వస్తాయి. అవి మీకు మార్గాన్ని చూపించుతాయి. కాబట్టి మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం వినండి. మీ అంతరంగం నుంచి, మీ ఉనికి నుంచి వినండి. ఈ మాటలని పదే పదే వినండి. అప్పుడు సహజంగానే మీ చేతనస్థితి భగవంతునిలో స్థిర పడిపోతుంది.
శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు : మీ మనస్సుని (మైండ్) పూర్తిగా నాలో నిమగ్నం చేయండి. మీ పూర్తి ఏకాగ్రతని నా మీద చూపండి. ఎటువంటి సందేహం లేకుండా మీరు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితికి చేరతారు అని.
###
అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్తిరమ్ అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనుంజయ (12:9) అభ్యాసే ప్యసమర్ధో సి మత్కర్మపరమో భవ మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధిమ వాప్స్యసి (12:10)
అర్ధం : ధనుంజయా = అర్జునా : అధ = ఇక (అయితే) : చిత్తం = మనస్సును : సమాధాతుం = నిలుపుటకు : న=లేదు : శక్నోషి = శక్తుడువు (చేయగలవాడవు) మయి = నాయందు : స్తిరమ్ = స్తిరముగా : అభ్యాసయోగేన = యోగ సాధనలో : తతః = అప్పుడు : మామ్ = నన్ను : ఆప్తుమ్ = పొందుటకు : ఇచ్చ = కోరుము
అభ్యాసే = చేయుటయందు : అసమర్ధ : అసి = సమర్ధత లేనివాడైన చో : మత్కర్మ = నాపని : పరమః = ఆసక్తి కలవాడవై , ఆధీనుడవై : భవ = అగుము : మత్ అర్ధం = నా కొరకు : అపి = అయినా : కర్మాణి = పనులు : సిద్దమ్ = చక్కగా : అవాప్యపి = పొందగలవు.
ఓ అర్జునా! ఒక వేళ ఆ ప్రకారం మనస్సుని నాయందు స్తిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో యోగమును క్రమం తప్పకుండా సాధన చేసి నన్ను పొందుటకు ప్రయత్నించుము. ఒక వేళ అభ్యాసము చేయుట యందును నీకు శక్తి లేకపోయినచో నాకు సంబంధంమైన పనులు చేయుట యందు ఆసక్తి కలవాడివై వాటిని నా ఆధీనము చేయి. ఆవిధంగా నీవు సిద్ధిని సాధించగలవు.
శ్రీకృష్ణుడు ఇక్కడ అభ్యాసయోగము గురించి మాట్లాడతాడు. అభ్యాస యోగము అంటే ఏమిటి?
అభ్యాస యోగము అంటే యోగా పద్ధతులని సాధన చేయటమే. ఇది మైండ్ని నిరంతరం భగవంతునిలో నిమగ్నమయిన స్థితిని సాధన చేయటమే. ఇది శ్రీకృష్ణుని సచేతన స్థితిలో పూర్తిగా నిమగ్నమయిపోవటం.
ఎందుకు శ్రీకృష్ణుడు అభ్యాసయోగం గురించి మాట్లాతాడు? ఎందుకంటే విశ్వదర్శనమప్పుడు శ్రీకృష్ణుడు విశ్వచేతన స్థితి యొక్క దర్శనాన్ని కొద్ది క్షణాలు అర్జునునికి ఇచ్చాడు. కానీ అక్కడ అర్జునుడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. పాత సంస్కారాల మూలంగా ఉండే భయంతో పాత జ్ఞాపకాల, కోరికల వలన అతను భయపడతాడు. అర్జునుడు మామూలు స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు అతను సచేతన స్థితి నుంచి జారిపోతాడు. అందుకోసం కృష్ణుడు ఇప్పుడు అభ్యాసయోగం గురించి మాట్లాడతాడు. అటువంటి సచేతనస్థితిలో తమని తాము ఎలా స్థిరపరచుకోవాలో చెబుతాడు. అందుకే భగవానుడు సాధన గురించి మాట్లాడతాడు.
ఓ!అర్జునా! నీవు నీ మనస్సుని భక్తితో నామీద స్థిరపరచలేనప్పుడు మామూలుగా ఉండే భక్తి సూతాలని పాటించు. ఈ విధంగా చేయటం వలన, ఇటువంటి అభ్యాసంతో సాధనతో నీవు నాలో నిమగ్నమవ్వగలవు.
ఇక్కడ శ్రీకృష్ణుడు మన జీవితానికి భరోసా ఇవ్వటానికి చాలా చక్కని దృఢమయిన దారి ఏర్పరచుతాడు. దీనితో మనం ఆయన చేతనస్థితిలో స్థిరపడగలుగుతాము. మనం మన సాధారణ జీవితంలో నిరంతరం, పదే పదే ఈ భావాలని ఈ ఐడియాలని లోపలకి తీసుకుందాము. ఆ భావాలని మన చేతనస్థితిలో కలసి పోయేటట్లుగా చేద్దాము. మనలోని అంతరంగపు ప్రదేశమంతా ఈభావాలతో నింపుదాము. ఈ విషయంలో మనం కొన్ని క్షణాల సమయాన్ని కూడా వృధా
భగవద్గీత - అధ్యాయం 12
ప్రేమే మీ జీవితం
చేయవద్దు. మన అంతరంగం మొత్తం ఈ అద్భుతమయిన ఆలోచనలతో నింపుతాము. ఆ విధంగా మనం మన చేతన స్థితిలో స్థిరపడగలము.
శ్రీకృష్ణుడు వెదజల్లి వ్యాపింపచేయటానికి చాలా చిట్కాలు చెబుతాడు. శ్రీకృష్ణుడు తరువాత నాలుగు శ్లోకాలలో మనకి సూచనలని ఇవ్వటం మొదలుపెడతాడు. ఆయన మనకి చాలా ప్రత్యామ్నాయాలు ఇస్తాడు. అన్ని కూడా ఒక దశ తరువాత ఒకటి, ఒక క్రమపద్ధతిలో ఇస్తాడు. భగవానుడు ఇలా చెబుతాడు. మీరు ఇలా చేయలేకపోతే ఆవిధంగా చేయండి. మీరు ఆవిధంగా చేయలేకపోతే అప్పుడు ఇది చేయండి. లేదా ఇంకొకటి ఈవిధంగా శ్రీకృష్ణుడు మనకి చాలా ప్రత్యామ్నాయాలు ఇస్తాడు. అలాగే చాలా సూచనలని ఇస్తాడు.
ఆయన ముందుగా ఇలా చెబుతాడు :
ఓ! ధనంజయా నీ మనస్సుని నాయందు లగ్నం చేయి. క్రమం తప్పకుండా సాధన చేస్తూ, నన్ను పొందటానికి ప్రయత్నించు. అలా నీవు చేయలేనప్పుడు, నా కోసం కొన్ని పనులు చేయి.
రామకృష్ణ పరమహంస దగ్గరకి ఒకామె వచ్చి ఎంత ప్రయత్నం చేసినా తాను కాళీమాత మీద మనస్సు నిమగ్నం చేయలేకపోతున్నాను అని అంటుంది. అలా చేయమని రామకృష్ణ ఆమెకి చెబుతాడు. ఆమె ఆయన సలహాని అనుసరించి ఎన్నో సార్లు ఎంతగానో ప్రయత్నించింది. కానీ ప్రతిసారి ఆమె నిశ్చలత సడలిపోయేది. ఆమె రామకృష్ణ దగ్గరికి చాలా నిరుత్సాహంతో, ఇక ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేననే నిరాశతో వచ్చింది.
రామకృష్ణ ఆమెని ఆమె ఏకాగ్రత మరొక దాని మీదకి ఏమైనా మళ్ళిందేమో అని విచారణ చేస్తాడు. ఆమె తన చిన్న మేనల్లుడి గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఆమెకి ఆ బాబు అంటే చాలా ఇష్టం. అప్పుడు రామకృష్ణ ఆమెని ఆ బాబు మీద ఏకాగ్రత నిలపమని, అతనిపైనే ధ్యానం చేయమని చెబుతాడు.
ఆమె కొన్ని వారాలయిన తరువాత రామకృష్ణ దగ్గరికి వస్తుంది. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె తాను చాలా ఇష్టపడే ఆ చిన్న బాబు మీద ధ్యానం చేయటం మొదలుపెడుతుంది. అప్పుడు ఆమె బాగా ధ్యానం చేయగలుగుతుంది. ఒక్కసారి ఆమె ధ్యానం చేయగలను అనుకున్న తరువాత ఆమె ఏకాగ్రతని కాళీ మాతపైన పెట్టగలుగుతుంది. ఇప్పుడు కాళీమాత మీద ఆమె ధ్యానం చేయగలుగుతుంది.
మన మెండ్ మంచి శిక్షణని ఇవ్వగలము. అయితే ఇక్కడ ముఖ్యమయిన విషయం ఏకాగ్రతని నిలపగలగటం. ఒక్కసారి మనం మన ఏకాగ్రతని ఏదో ఒకదానిమీద పూర్తిగా నిలపగలిగితే, అప్పుడు మైండ్ని ఒకే ఒక పాయింట్ మీద ఉంచవచ్చు. దానిని ఒక లేజర్ కిరణంలా ఉపయోగించవచ్చు. లేజర్ కిరణాన్ని ఒక దాని నుంచి మరొకదాని మీదకి చాలా సులభంగా ఒకే పద్ధతిలో చాలా చక్కగా విజయవంతంగా మార్చవచ్చు.
వివేకానందుడు ఈ విధంగా చెబుతాడు. "ఒక్కసారి మీరు మీ పూర్తి ఏకాగ్రతని నిలిపి గుప్పెడు మట్టి గురించి తెలుసుకోగలిగితే, అప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్న మట్టి గురించైనా తెలుసుకోగలుగుతారు".
ఏదైనా ఒకపనిలో ఒకటి సాధించాలి అని అనుకుంటే దానికి క్రమశిక్షణ, సాధన అవసరం. మనం మన ప్రతి లక్ష్యానికి, మన ప్రాపంచిక లక్ష్యాల కోసం ఇదే పద్ధతిని అనుసరించగలిగితే మనం మన ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం కష్టాలు బాధలు అనుభవిస్తాము. మనం ఏమనుకుంటామంటే ఆధ్యాత్మిక అనుభవం దానంతట అదే వస్తుందని అనుకుంటాము. ఇప్పుడు మీరు భగవంతుని మాటలు విన్నారు కదా! అది అలా జరగదు అని.
శ్రీకృష్ణుడు ఈ సందర్భంగా ఏమని చెబుతాడంటే, నిరంతరం క్రమం తప్పకుండా ధ్యానం చేయటం ద్వారా మైండ్ని నియంత్రించవచ్చు. ధ్యానం యోగాలో ఒక సాధన పద్ధతి. ధ్యానం అంటే ప్రతిరోజు కళ్ళుమూసుకొని అరగంట సేపు కూర్చోవటం కాదు. ఇలా ప్రతిరోజు కానీ, లేదా మనకి టైమ్ దొరికినపుడు కానీ చేయటం కాదు. ధ్యానం అంటే పూర్తిగా భగవంతుని మీద స్థిర భావంతో నిరంతరం ధ్యానం చేయాలి. ధ్యానమే జీవితం కావాలి.
శ్రీకృష్ణుడు ధ్యానాన్ని మనకి ఒక మార్గంలా చెప్పాడు. మనం మన మనస్సుని అతనిపైన (భగవంతుని) ప్రేమతో భక్తితో హృదయపూర్యకంగా నిలపలేకపోయినప్పుడు ధ్యానం అనేది ఒక ప్రత్యామ్నాయ పద్దతిగా మనం ఎంచుకోవాలి. ఆయన ఏమని చెబుతాడంటే మీ మనస్సుని నాపై స్థిరపరచలేకపోతే, దీనిని ప్రయత్నించండి. ధ్యానం ద్వారా నాలో కలసిపోవటానికి పదే ప్రయత్నించండి.
ఈ రెండు పద్ధతులూ కూడా సాధ్యం కాకపోతే, భగవానుడు మనకి మరొక పద్ధతిని చెబుతాడు. నీవు ఏది చేయగలిగితే అది చేయి. నీవు చేయవలసిన పనులు, నీవు చేయగలిగిన పనులు నీవు చేయి. అయితే నీవు చేసే పనులన్నీ నా ఆధీనం చేయి. నీవు ఏం చేసావో, ఏమి చేస్తున్నావో నాకోసం చేయి.
మనం పూర్తి విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో ఆయనకి సంపూర్తిగా లోతుగా ఆధీనమయిపోయిన భావంతో పనులు చేస్తే, మనం ఆయనని చేరగలం.
శ్రీకృష్ణుడు ఇలా చెప్పటంలో రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. మొదటిది ఏమిచేసినా అది ఆయనకి ఆధీనులమయ్యే ధృక్పధంతో చేయాలి. మనం చేసే అన్ని పనుల ఫలితాలు ఆయనకే చెందుతాయి. మన బాధ్యత కేవలం చేయటం. చేసే పనిని బాగా చేయటం మన భాద్యత. మనకి ఉన్న హక్కు కేవలం పనిచేయటమే
కానీ దానికి మనం సొంతదారులం కాదు. భగవంతుడే అన్నింటికి అధికారి, సొంతదారుడు. మన చేసే ప్రతి పనికి వచ్చే ఫలితాలకి కూడా ఆయనే అధికారి. ఆయన ప్రేమ మీద మనం చేసేవన్నీ ఆయన సొంతం.
ఎప్పుడయితే మనం ఇలా చేయటం నేర్చుకుంటామో, మనం అప్రయత్నంగా ఫలితాల మీద ఆశపెట్టుకోవటం మాని వాటితో ఎటువంటి సంబంధం లేకుండా ఉండగలం. ఏమి జరుగుతున్నది అనేది ఆయన చేతులలో ఉంటుంది. మన చేతులలో ఉండదు. అటువంటప్పుడు మనం వెళ్ళవలసిన మార్గం మీద ఏకాగ్రతని నిలుపుతాము అంతేకాని గమ్యం మీద కాని, మన లక్ష్యాల మీద కాదు. మనం పని చేసే పద్ధతి మీద మన దృష్టిని పెదతాము. అంతేకాని చివర వచ్చే ఫలితం మీద కాదు. ఇలా చేయగలగినప్పుడు మనం ఇంకా బాగా చేయగలుగుతాము. ఎందుకంటే ఎలా జరుగుతుందో ఏమవుతుందో అనే వత్తిడి మన మీద ఉండదు. చివరికి ఫలితం ఎలా ఉంటుందో అనే భయం ఉండదు. దాంతో మనం బాధపడదం మానేస్తాము. ఎందుకంటే దాని ఫలితం చాలా జాగ్రత్తగా ఆయన రక్షణలో ఆయన చేతిలో ఉన్నది. ఏమి జరిగితే అదే అందరికీ మంచిది. మనం తెలుసుకునే తత్వంతో ఏమార్గాన్ని నిర్ణయించుకున్నా ఏ గమ్యాన్ని మనం చేరినా, అది సరియైన గమ్యమే.
తమిళంలో పెరియపురాణం అరవైమూడు మంది గొప్ప యోగులు జీవితాలగురించి వివరంగా చెప్పబడి ఉంటుంది. వీరంతా జ్ఞానోదయం పొందిన జ్ఞానులు. మనం వారి జీవితాల గురించి చదివితే వాళ్ళు జీవితంలో ఏమిచేయలేదు అని అనిపిస్తుంది. వారు దైనందిన కార్యక్రమాలు మనలా మామూలుగానే చేసేవారు, కాకపోతే భగవంతుణ్ణి అత్యధికమయిన చేతనస్థితిలో వారికి తెలిసే స్థితిలో పూజించేవారు.
వాళ్ళు పూజకి పూలు కోసటప్పుడు కేవలం భక్తి అనే ఒక దృష్టితో కోసే వారు,
మరింకే ఆలోచనా ఉండేవి కావు. వాళ్ళు ప్రార్ధన చేసినా పాటలు పాడినా వారి మనస్సు, హృదయం వారి అంతరంగం అన్నీ పూర్తిగా వారు అనుభవిస్తున్న ఆనందంలో కలసిపోయేవి. వాళ్ళు అంతరంగంలో రూపంలేని భగవంతుని రూపాన్ని చూడగలిగే వారు. రాతివిగ్రహాలు,పంచ లోహ విగ్రహాలు వారితో మాట్లాడేవి. అది వారిలో ఉండే చేతనస్థితి.
మనం పూజలు, ప్రార్ధనలు చేసే సమయంలో ఏమవుతుంది? మన పూజ మొత్తం యాంత్రికంగా తయారవుతుంది. ఈ మహారుషుల విషయంలో వారుచేసే పని ప్రార్ధన, పూజ అయ్యేవి. పూజులు, వ్రతాలు చేసే వారిని గమనించండి. త్వరగా పూర్తి చేసేయాలి అనే ఆత్రుత కనిపిస్తుంది. తొందరగా పూర్తి చేసి వెళ్ళాలి అని ఉంటుంది. వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి? భగవంతునికి దూరంగా ఎక్కడకి వెళ్ళగలుగుతారు.
ఇటువంటి పూజల దగ్గర మనకి మోసగాళ్ళు, కపటమయినవారు కనిపిస్తుంటారు. వాళ్ళ దృష్టిలో పూజలు, ప్రార్ధనలు అనేవి వ్యాపార వ్యవహారాలు. భగవంతుడు అంటే అమ్మకానికి పెట్టిన వస్తువు. వాళ్ళు వ్యాపారవేత్తలు. వాళ్ళ దృష్టి అంతా హుండీలో ఎంత డబ్బులు వచ్చాయి అనే విషయం మీదే ఉంటుంది. స్వర్గం అనే మహా సామ్రాజ్యం, ఆర్ధికస్థితి వ్యాపారం, మొదటి తరగతి రేట్లుతో వస్తుంది అని అనుకుంటారు. మీరు జాగ్రత్తగా ప్రయత్నించితే స్వర్గానికి వెళ్ళటానికి ఉండే రేటులో డిస్కౌంట్ కూడా దొరుకుతుంది.
బాలీ ద్వీపంలో ప్రజలు హిందూ మతాన్ని అనుసరించుతారు. వాళ్ళకి కులవ్యవస్థ కూడా ఉన్నది. అయితే పూజారి మాత్రం జన్మతః బ్రాహ్మణ కులంలో జన్మించటం వలన పూజారి అవ్వదు. పూజారి అవ్వాలంటే దానికి తగిన యోగ్యతని పొందాలి. ఆ ద్వీపంలో ప్రజలకి భగవంతుని ఆరాధించటమే జీవితం. ప్రతి ఒక్కరూ, స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ ఇళ్ళలో పూజలు చేస్తారు. అలాగే బయట గుడికి వెళ్ళి అక్కడా పూజలు చేస్తారు. వాళ్ళు దేవుడికి పూలు, ఏదైనా నైవేద్యం సమర్పించుకుంటారు. మతము, ఆధ్యాత్మికత అనేవి వారి జీవితంలో ఒక భాగంలా ఉంటుంది.
ఎప్పుడయితే ఆరాధన మన జీవితమయితే, ఆధ్యాత్మికత అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగమయిపోతే, అప్పుడు భగవంతునికి ఆధీనమయిపోవటం అనేది మన ధృక్పధం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏమి జరిగినా అది మనమంచికే అని అనుకుంటారు. అందరికీ మంచి జరిగేది ఏదయినా అది ప్రతి ఒక్క వ్యక్తికీమంచే అవుతుంది. అది మన ప్రక్కింటిలోవారికి కూడా. మనకి ఉన్నవన్నీ ఉన్నాయి అనే విషయం అసలు పట్టించుకోము. నిజానికి ప్రక్కింటివారికి అన్నీ ఉన్నాయని సంతోషపడతాము.
మనం ఆశించటం మానేస్తాము. ఆశించటం అంటే మనం ఏది పొందాలి అని ఆశపడుతున్నామో అది. ఆధీనమవటం అనేది జరిగినప్పుడు ఇక ఇది పొందాలి అనే దానికి మనం ఎంచుకున్న మార్గం ఎటు తీసుకువెళితే అదే సరియైన గమ్యం. ఎప్పుడయితే మనదృష్టి గమ్యం మీద ఉంచకుండా, మనమార్గం మీద ఉంటుందో, ఆశించటాలు, ఆశపడటం అనేవి పూర్తిగా మన నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమి జరిగినా అది మంచిదే అవుతుంది.
దేనినీ ఆశించకపోవటం, దేనితో సంబంధం పెంచుకోకుండా ఉండగలగటం అనేదే కర్మయోగానికి ప్రమాణము, ఒక గుర్తు. అతనే తన ప్రతి చర్యని భగవంతునికి అర్పిస్తాడు.
శ్రీకృష్ణుడు చెప్పినదానిలో మరొక విషయం కూడా ఉన్నది. ఆయన మనని తన సేవ చేయమన్నాడు. ఆయన మనందరినీ తన లక్ష్యం వైపుగా పనిచేయమన్నాడు. ఆయన ఈ విధంగా చెబుతాడు " మీరు చేసే ప్రతి పనీ నా తరువున చేయండి. అప్పుడు మీరు నన్ను పొందుతారు".
నేను ఎప్పుడూ చెబుతుంటాను. నేను మీతో భౌతికంగా ఉన్ననా లేదా అని ఆలోచించకండి. మీరు నా సమక్షంలో లేము అని బాధపడకండి. నేను మిమ్ములని వదిలి వేరొక చోటికి వెళ్ళేటప్పుడు కలత పడకండి. దుఃఖపడకండి. మీరు నావెంట పడితే మీరు నాతో ఎప్పుడూ ఉండలేదు.
మీరు నా లక్ష్యం వైపు పనిచేయండి. నా మిషన్ కోసం పనిచేయండి. మీరు ఏవిధంగా చేయగలిగితే ఆవిధమయిన పనులు అందరి మంచి కోసం చేయండి.నా తరుపున పనిచేయండి. అప్పుడు మీరు నాకోసం రానవసరం లేదు. నేనే మీ కోసం మీ వెంట వస్తాను. నేను నిరంతరం మీతోనే ఉంటాను.
భగవంతుని లక్ష్యసాధనకోసం పనిచేయండి. మీరు తప్పకుండా భగవంతుని చేరగలుగుతారు.