KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/అథైతదప్యశక్తో సి కర్తుం మద్యోగ మాశితః సర్వ కర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. (12:11)Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

అథైతదప్యశక్తో సి కర్తుం మద్యోగ మాశితః సర్వ కర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. (12:11)

అర్ధం : అథ = ఇక : ఏతత్ అపి = దీనిని కూడా : ఆశక్తః : అసి = చేయిలేకపోలేవు : కర్తుం = ఆచరించుటకు : మత్ యోగం = నాగురించి, నా సంయోగం గురించి : ఆశ్రితః = ఆశ్రయించిన వాడవై : సర్వ కర్మా = అన్ని పనుల యొక్క : ఫల్ = ఫలితాలను : త్యాగమ్ = విడిచిపెట్టము : తతః = తరువాత : కురు = చేయి : యతాత్మవాన్ = మనస్సుని నియంత్రించగలవాడవై .

నీవు ఈ విధంగా కూడా చేయలేకపోతే నీ పనులని, నిన్ను నాకు ఆధీనము చేయి. ఫలితాలను నాకు వదిలివేయి. అన్నీ ఎటువంటి అహంకారం లేకుండా, నీమనస్సుని నియంత్రిస్తూ నాకు వదిలిపెట్టు.

శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా ప్రత్యామ్నాయాలని ఇస్తాడు. ఒకదాని తరువాత ఒకటి, ఇది కాకపోతే అది, ఇలా ఎన్నో చెబుతాడు. అర్జునుడి ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో శ్రీకృష్ణుడు చూపించే కరుణ, దయ హద్దులు లేనివి. నీవు ఈ విధంగా చేయలేవా! సరే అయితే ఆవిధంగా చేయి. లేదా కనీసం ఈ పద్ధతిలో చేయి. ఇలా చెబుతూనే ఉంటాడు. చివరి నాలుగు శ్లోకాలలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ప్రత్నామ్నాయాలు చెబుతూనే ఉంటాడు.

కృష్ణుడు ఇలా మొదలుపెడతాడు. నీ మనస్సుని నా యందు మాత్రమే స్థిరపరచు నాలో జీవించు. ఒక వేళ అర్జునుడు ఈ పని చేయలేకపోతే అనుకొని అర్జునుడికి మరొక పద్దతి చెబుతాడు. నీవు నాయందు నీ ఏకాగ్రతని, నీ మనస్సుని నిలపలేకపోతే, దానిని తిరిగి పదే సాధన చేయి. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెబుతాడు. ఒక వేళ నీవు పదే పదే సాధన చేయలేకపోతే ఇది నీకు కష్టం అనిపించితే, అప్పుడు నా మిషన్ పని, నా లక్ష్యసాధనకి కృషి చేయి. నీవు ఏమి చేసినా నా కోసం చేయి.

ఇప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు. ఒకవేళ ఇది చేయటం కూడా నీకు సాధ్యం కాకపోతే, అంటే నాలక్ష్యసాధనకి పనిచేయలేకపోతే అప్పుడు కనీసం నీ అహంకారాన్ని వదిలి నీవు చేసే పనుల ఫలితాలని నాకు వదిలివేయి.

కృష్ణుడు అర్జునుడికి అతని దృష్టిలో చెప్పే విషయమేమిటి అంటే, కేవలం కృష్ణుని పనుల మాతమే చేయాలి అని. ఇక్కడ శ్రీకృష్ణుడు అనుకునేది ఏమిటంటే, ఏవో కొన్ని పరిస్థితుల మూలంగా అర్జునుడు తన సమయాన్ని మొత్తం కృష్ణుని పనికి కేటాయించలేకపోవచ్చు.

చూడండి, శ్రీకృష్ణుని బోధ ఎంత సమంజసంగా ఉన్నదో కదా! అది ఇప్పటి రోజులకి కూడా చక్కగా సరిపోతుంది. మనలో ఎవరూ కూడా ఖాళీగా కూర్చొని ఎవరో మన సంగతి చూసుకుంటారులే అని అనుకోము. మనందరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేటట్లుగా చూసుకుంటాము. మన దైనందిన నిజ జీవితంలో [పతి ఒక్కరు భగవంతుని లక్ష్యసాధనంవైపు మాత్రమే నిరంతరం పని చేయలేరు. వారు కొంత సమయాన్ని నిస్వార్ధపు పనులకి, సంఘ సేవకి, మానవజాతి మొత్తానికి ఉపయోగపడే పనులు అలాగే ఆధ్యాత్మిక సంబంధమయిన పనులు చేయగలుగుతారు. కాకపోతే కొంతమంది [పాపంచిక విషయాలకి సంబంధించి చాలా సమయాన్ని ఏదో [పపంచపు భౌతికమయిన అవసరాలు, లాభాలు కోసం పనిచేయవచ్చు. వసులాభం కోసం మాత్రమే ఒకరితో ఒకరు సంబంధాన్ని ఏర్సరచుకోవచ్చు.

దీని వలన మీరు ఏమీ పొగొట్టుకోరు అని మనకి భగవంతుడు భరోసా ఇస్తాడు.

శ్రీకృష్ణుడు భగవద్గీతలోని అతి ముఖ్యమయిన 'వదిలివేయటం' అనే విషయాన్ని ఇక్కడ [పసావించుతాడు.

భగవంతుడు ఇలా చెబుతాడు. నీవు ఏది చేయాలని అనుకున్నావో, ఏది చేయగలవో దానిని చేయి. ఆ పనులని నాకు అధీనదవయ్యి చేయి. ఆ పనుల ఫలితాలని మాత్రం పూర్తిగా నాకు వదిలివేయి. ఇలా చేసేటప్పుడు నీ మనస్సు మీద, నీ అహంకారం మీద పూర్తి నియంత్రణతో చేయి.

మనం నిరంతరం మనం చేసే పనుల ఫలితాలకు బాధ్యులం అని అనుకుంటాము. మనం చేసే పనులలో విజయం సాధించినా,అపజయం పొందినా మనదే భాధ్యత అని అనుకుంటాము. అలా మనం గర్యంగా అయినా సంతోషంగా అయినా లేదా

బాధపడుతూ అయినా లేదా అపరాధ భావంతో అయినా అనుకుంటాము. మనలో ఉండే అహంకారం మనలని బాధ్యులని చేస్తుంది. మనం మనకి మనం చేసే పసులలోను, వాటి ఫలితాలలో మాత్రమే గుర్తించగలుగుతాము. విజయము, అపజయము అనేవి మన విషయంలో గొప్ప తేదాని చూపించుతాయి. ఎదుటివారు మనని చూసే విధానంలో కూడా ఆమార్పు చాలా తేడాతో ఉంటుంది. దానితో మన సంబంధాల విషయంలో మనకి ప్రాపంచికమయిన కీర్తి [పతిష్ణల విషయంలోనూ ఆ భేదం కనిపిస్తుంది. దానిని మనం అలానే అన్వయించు కుంటాము.

ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు. నేను నీకు చెప్పినవన్నీ చేయలేకపోతే, కనీసం ఇదయినా చేయి. నీ అహంకారాన్ని వదిలివేయి నీవు చేసే పనుల ఫలితాలని వదిలివేయి. వీటనన్నింటినీ నాకు వదిలివేయి.

భగవానుదు మనకి ఇచ్చిన సలహాల ఫలితంగా మనం పొందే స్వేచ్చ నిజమయిన స్వేచ్చ. ఎప్పుడయితే ఈ విషయాన్ని మనం తెలుసుకుంటామో ఇక మనం మన గమ్యానికి అధికారులం కాదు. మనం చేసే పనుల ఫలితాలని నిర్హయించే అధికారులం కాదు. మనం మన భుజాల మీద బరువుని తీసేసిన అనుభూతిని పొందుతాము. ఇప్పుడు మనం చేసే పనుల ఫలితాలకు బాధ్యత తీసుకునేది భగవంతుడే. మనం కేవలం పనులు చేసే వారమే, కాని వాటిపైన అధికారులం కాదు.

మీరు ఈ విషయంలో కొంత అశ్చర్యపోవచ్చు. ఈ ప్రపంచంలో, మనిషిని మనిషే దోచుకునే ప్రపంచంలో, అత్యంత పోటీ ఉండే ఈ పోటీ ప్రపంచంలో (రాట్ రేస్) ఇటువంటి ధృక్సధంతో మనం ఎలా ఉండగలం? అని అనుకోవచ్చు.

గుర్తుంచుకోండి. మీరు ఈ రాట్ రేస్‌లో గెలిచినా మీరు రాట్(ఎలుక) గానే

మిగిలిపోతారు. మన పనులు వాటి ఫలితాలను నిర్ణయించుతాయి అనేది కేవలం మన మనస్సు కల్పించే ఒక (భమ మాత్రమే. అలా అది కొంత వరకూ చేయవచ్చునేమో! మనం చేసే ప్రతీపనీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. వీటి విషయంలో, అవి ఏమి చేస్తున్నాయో అనేదాని మీద మన నియం(తణ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సమయాలలో అవి మన నియం(తణలో ఉండవు. మన పనులు ఫలితాలను మనం నిర్ణయించుతాము అనేది కేవలం ఒక కల్పన, ఒక (భమ.

మనం మన తరువాత శ్వాస తీసుకునే వరకూ జీవించి ఉందగలం అని నమ్మకంగా చెప్పలేము. మన జీవితమే మన చేతులలో లేదు. అప్పదు ఏ అహంకారంతో, ఏ గర్వంతో మనం ఈ బయట ప్రపంచపు విషయాలని మనం నియంత్రించగలమనే ఊహ ఎంత గర్వం, అహంకారమో కదా! ఏమయినా మనం ఒక్కసారి ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగితే, ఒక్కసారి మనకంటే చాలా గొప్పశక్తి ఇవన్నీ నిర్ణయించుతుంది అని అర్గం చేసుకోగలిగితే అప్పుడ మనం ఆ దివ్యశక్తి యొక్క మేధస్సుని నమ్ముతాము అప్పుడు మనకి చాలా కొత్త అనుభవాలు జరగటం ప్రారంభమవుతుంది.

మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ విశ్వశక్తి, ఆ పరాశక్తి, శ్రీకృష్ణుడు, భగవంతుడిని మీ విషయంలో నిర్ణయాలు తీసుకోనీయటమే . మనకి ఏది మంచిదో ఆ నిర్ణయాలు భగవంతుదే చేస్తాడు. మనం చేసే ప్రపతి పని యొక్క ఫలితాన్ని ఆ భగవత్‌శక్తికి వదిలివేయటమే. అప్పుడు ఏమి జరిగినా అది మంచిదే. అది మనకు మంచిది, అలాగే అది అందరికీ మంచిది అవుతుంది.

మన మేధస్సుకి ఇది ఒక కొత్త అనుభవం. ఈపద్ధతి మన తెలివితేటల మైంద్‌కి విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకాలం మనం చదివిన చదువులు, నేర్చుకున్న జ్ఞానం మన పనులకి మనమే బాధ్యులం, వాటి ఫలితాలకి కూడా