యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ద ధాన మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః (12.20)
అర్థం : యేతు = ఎవరైతే : శ్రద్దధానాః = శ్రద్ధవంతులై : మత్పరమాః = నన్నే పరమాత్మగా నమ్మినవారై : ఇదమ్ = ఈ : ధర్మ్యామృతమ్ = అమృతరూపమగు ధర్మమును : యథోక్తమ్ = ఈ ప్రకారం : పర్యుపాసతే = అనుసరించుతారో : తే భక్తాః = అట్టి భక్తులు : మే = నాకు : అతీవ = మిక్కిలి : ప్రియాః = ప్రియమయిన వారు
ఎవరైతే శ్రద్ధవంతులై, నన్నే పరమగతిగ నమ్మి, ఈ అమృత రూపమగు (నాశనము కాని) ధర్మమును విశ్వాసంతో అనుసరించుతారో అట్టి భక్తులు నాకు చాలా ప్రియమయిన వారు.
శ్రీకృష్ణుడు భగవంతునిలో భక్తితో విలీనం అయ్యే భక్తియోగం అనే ఈ అధ్యాయాన్ని ఈ మాటలతో ముగించుతున్నాడు. అంతా శుభం
ధర్మం అంటే అధ్యాత్మిక నీతి. దీనికి సమాజం చెప్పే నీతినియమాలకి, రూల్స్‌కి ఏమీ సంబంధం లేదు.
రూల్స్‌ని పాటించకపోవటం మానవుల లక్షణం. స్పీడు తక్కువగా వెళ్ళాలి అని రూల్ ఉంటే, అక్కడ పోలీసు లేకపోతే స్పీడుగా కారు డ్రైవ్ చేస్తూ వెళుతారు. రూల్స్ అంటే మన స్వేచ్ఛని అణిచేస్తాయి అనే ఒక ఆలోచన ఉంటుంది.
సమాజపు రూల్స్ మన స్వేచ్చని తగ్గించి, మనని అన్ని రకాలుగా వెల్లడి చేయనీయవు. రూల్స్ అనగానే అవి ఎదుటి వారికే కానీ, మనకి కాదు అని అనుకుంటారు.
మతపరమైన రూల్స్ ఇంకా ఘోరమయినవి. అవన్నీ ఆశ, భయం అనే సూత్రాల మీద తయారు చేయబడ్డాయి. వాటిని కేవలం అందరినీ నియంత్రించాలనే ముఖ్య ఉద్దేశంతో తయారు చేసారు. సమాజంలోని నాయకులలా తమకి రాజ్యాంగపరమయిన అధికారాలు లేవు అని మతాధికారులకి తెలుసు. కాబట్టి వాళ్ళు చాలా సూక్ష్మంగా రూల్స్ తయారుచేసారు. ఇవన్నీ అందరినీ తమ గుప్పిటలో పెట్టుకోవటానికే. అందులో ఒకటి పాపం.
పాపంతో పాటు మతం. స్వర్గం నరకం అనేవాటిని కూడా సృష్టించినది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. స్వర్గం, నరకం అనేవి ఎక్కడా లేవు. అవి మీ మెంద్స్లో ఉంటాయి. మీరు పాపం ఎందుకు చేస్తారంటే, మీరు మానసికమయిన నరకంలో ఉంటారు కాబట్టి. అంతే కానీ మరొకటి కాదు. మీరు పాపం చేసాక నరకానికి వెళ్ళరు.
అయితే మతం అనేది బతకాలి కదా! బతకాలి అంటే అందరినీ కంట్రోల్ చేయాలి. వాళ్ళు మిమ్మలని భగవంతుడే, భగవత్ స్వరూపాలే అని తెలుసుకోగలిగితే, వాళ్ళు మిమ్మలని ఎలా నియంత్రిస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఉండగలిగే (జీవించే) అవకాశం తగ్గిపోతుంది. మతాధికారులు అలా నిలబడాలంటే, వాళ్ళు మిమ్మలని 'పావులు' అని అనాలి. వాళ్ళు మిమ్మలని మతం మాత్రమే మోక్షమిస్తుంది అని నమ్మించాలి. మీలో పాపాలు పోవు అని చెబుతారు. ఎందుకంటే మీరు పుట్టుకతోనే పావులు అని అంటారు.
అర్ధం చేసుకోండి. మీరు పావులు కాదు. మీలో భగవంతుడు ఉన్నాడు. మనలో ఉండే ఒకే ఒక పాపం మనలోని భగవంతుడిని గుర్తించలేకపోవటమే. కాబట్టి మనం మోక్షం కోసం పాట్లు పడనవసరం లేదు. మీ లోపలి భగవంతుడిని తెలుసుకోండి.
హిందూ పవిత్ర గ్రంధాలలో ఆధ్యాత్మిక సత్యాలని 'యామా' అంటారు. అవి : సత్యం, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ : బ్రహ్మచర్యం ఇవన్నీ టెన్ కమాండ్ మెంట్స్ వంటివే.
సత్యం : సత్యం అంటే నిజము. ఆలోచనలలో మాటలలో మనం చేసే పనులలో సత్యం ఉండాలి. మన అంతరంగంలో ఏముందో అదే బయటకి ప్రదర్శించాలి. సత్యాన్ని ప్రకటించాలి అంటే మనం వర్తమానంలో ఉండాలి. ఎప్పుడయితే, మనస్సు, అహంకారం అనేవి ఈ విషయంలో కల్పించుకోవో, అప్పుడు మనం బయటకి చెప్పేవాటిని వడపోయము. అప్పుడు మన అంతరంగంలో ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పగలము.
అహింస : మన ఆలోచనలు, మాటలు పనులలో అహింస అనేది పూర్తిగా ఉండాలి. అహింస అనేది మనం సామూహిక చేతన స్థితిని అర్ధం చేసుకున్నప్పుడు దానిని పాటించగలము. సామూహిక చేతనస్సితిలో మనందరం ఈ విశ్వంలో ఒక భాగం, అందరం ఒక్కటే అని తెలుసుకుంటాము. ఎప్పుడయితే ఈ విషయాన్ని తెలుసుకుంటామో, ఎవరినైనా బాధపెడితే అది మనని మనం బాధపెట్టుకోవటం అని తెలుస్తుంది. అప్పుడు హింస కరుణగా మారుతుంది.
ఆస్తేయ అంటే తనది కాని దానిని కోరుకోక పోవటం, అత్యాశ లేకపోవటం. సామూహిక చేతనస్థితిలో తన ప్రత్యేకతని తెలుసుకోగలగటం మరొకరికి సంబంధించిన వాటిని కోరకుండా ఉండగలగటం.
అపరిగ్రహ అంటే సామాన్య జీవితాన్ని గడపటం. కేవలం మనకి అవసరమయిన అవసరాలు మాత్రమే తీర్చుకొని, కోరికలు లేకుండా ఉండటం, దేనిపై అత్యాశ చూపకుండా ఉండటం.
బ్రహ్మచర్యం అంటే నిజములో ఉండటం. బ్రహ్మచర్య అనే మాటని తప్పు అర్ధంతో చెబుతారు. మామూలుగా వివాహం కానివారికి చెబుతారు. మనలో ఉండే కల్పనలకి, ఊహలని, (భ్రమలని, ఆశించటాలని వదిలివేసి విప్పారిన జీవితం గలవారు, బ్రహ్మచారులు.
అయితే ఈ ఐదు సూత్రాలు ఈ రోజులలో కచ్చితంగా పాటించటం కష్టం. సన్యాసులు ఈ ఐదు ప్రమాణాలు చేస్తారు. అవి పాటించటానికి కష్టపడతారు. అలాంటిది సామాన్య మానవులకి దైనందిన జీవితంలో వీటిని పాటించటం చాలా కష్టం
నా అనుభవంతో నేను చెబుతున్నాను. ఈ ఐదు సూత్రాలు జ్ఞానోదయానికి మార్గాలు కాదు. జ్ఞానోదయం పొందాక మనకు దొరికే విషయాలు ఇవి. ఆధునిక యుగంలో శ్రీకృష్ణుడు బోధించిన : ఆయనను చేరే ధర్మమార్గం, ధ్యాన మార్గమే. ఎప్పుడయితే ధ్యాన మార్గాన్ని అనుసరించుతారో మీరు అప్రయత్నంగా ధర్మచక్రంగా పడతారు. అది మిమ్ములని శ్రీకృష్ణుని యొక్క చేతనస్థితికి తీసుకువెళుతుంది.
ధ్యానం అంటే మన మనస్సుని నిశ్చలంగా చేసి దానిని ఆపటం అంటే మైండ్ లేని స్థితి అప్పుడు అహంకారం పోతుంది. ఎప్పుడయితే అహంకారం పోతుందో, మనం భగవంతునిలో ఈ అనంత విశ్వాత్మలో ఒక భాగమే, మనలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకునే దారిలో ఉండే అద్దంకులు పోతాయి. అప్పుడు మనం ఏమిటో మనకి తెలుస్తుంది. మనం భగవంతునిలో ఒక భాగమే. మనమూ భగవంతుడు ఒక్కటే అని తెలుసుకోగలుగుతాము.
ప్రశ్నలు - సమాధానాలు :
చాలా అధ్యాయాలకి సంబంధించి, చాలా ప్రశ్నలు వచ్చాయి. వీటిలో కొన్ని ప్రశ్నలకి జవాబులు ఇస్తాను. తరువాత ఈ సెషన్ ముగించుదాము.
ప్ర : స్వామీజీ ! సంస్కృతంలో డైవోర్స్ (విడాకులు) అనే మాట లేదు అని అన్నారు. కానీ పశ్చిమ దేశాలలో ఇది సత్యం. ఆధ్యాత్మికంగా విడాకులు సాధ్యమేనా?
జ : స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఆధ్యాత్మికులు అయితే విడాకులు అవసరం లేదు. మీరు విడాకులు కావాలి అని అనుకుంటే ఏదో ఒక పెద్ద సమస్య ఉండి ఉంటుంది. అర్ధం చేసుకోండి. నిజమయిన ఆధ్యాత్మికత మిమ్మలని ఒక మంచి భర్త, మంచి భార్యగా తయారు చేస్తుంది. మీరు అబ్బే! లేదు నా భర్త అసలు ఆధ్యాత్మికంగా ఉండడు, అతను నా పంధాలో నడవడు ఇలాంటి ఫిర్యాదులు చేయవద్దు. మీరు ఎందుకు ఫిర్యాదులు చేస్తారంటే మీరు ఏదో ఆశించుతారు. అందుకే.
మన సంస్కారాలు, అంటే మన పాత జ్ఞాపకాలమీద ఆధారపడి ప్రస్తుతం మన చుట్టు ప్రక్కల ఉన్న వాటిని చూస్తాము. మనం ప్రతి ఒక్కరం మనకి అనువైన మూసలని తయారు చేసుకుంటాము. ఆ మూసలో, ఆ ప్రేమలో మాత్రమే మన జీవిత భాగస్వామిని చూస్తాము. మనం జీవిత భాగస్వామిని వెతుక్కోవటం అనేది ప్రకృతి సహజంగా జరిగే ఒక ప్రక్రియ. దీనివలననే మానవజాతి అనేది ఈ భూమి మీద నిలవగలుగుతుంది.
మనం చూసేది మనకి దొరకదు. మనం ఒక అందమయిన దృశ్యాన్ని చూసి, అది అందమయినది అనుకొని ప్రేమలో పడతాము. అర్ధం చేసుకోండి. మనం ఎప్పుడూ
భగవద్గీత - అధ్యాయం 12
ప్రేమే మీ జీవితం, ప్రాథమిక
ప్రేమలో లేచాము అని అనం. మనం ఎప్పుడూ ప్రేమలో పడాము అని అంటాము. అది కిందికి రావటమే కాని, ఎప్పటికీ ఉన్నతస్థితికి చేరటం కాదు. ఎప్పుడయితే మనం దగ్గరవుతామో, అలాగే కలసి ఉండే సమయం ఎక్కువగా ఉంటుందో, మనం చూసిన దృశ్యాలలోని రంగులు మారిపోయి అందమయిన గులాబి రంగు మురికి పసుపు రంగుగా మారిపోతుంది. అదే వివాహం.
ఒక వ్యక్తి తన స్నేహితునికి పెళ్ళి కానుకగా ఒక కుక్కపిల్లని ఇచ్చాడు. ఆరు నెలలయ్యాక తన స్నేహితుణ్ణి కలసి ఎలా ఉంది జీవితం అంటాడు. దానికి స్నేహితుడు 'కొత్తలో కుక్కపిల్ల అరిచేది, నాభార్య పేపరు తెచ్చి ఇచ్చేది. ఇప్పుడు కుక్కపిల్ల పేపరు తెస్తుంది. నాభార్య అరుస్తుంది" అని జవాబు ఇస్తాడు.
మనందరం ఎన్నో ఆశలు, ఆశించటాలతో నిండిపోయి ఉంటాము. మనం ఊహలు, కల్పనలలో ఉంటాము. దాంతో ఎదుటి మనిషిని అసలు ప్రశంసించలేము. భార్య లేదా భర్తని మెచ్చుకోలేము. మనందరినీ భగవంతుడు సృష్టించాడు. మనం భగవంతుడు సృష్టించిన మనిషిని అంతకంటే గొప్పగా చేయగలమా? అది అసాధ్యం కానీ మనం ఏమి చేస్తాం. ఒక బ్రష్, రంగులు తీసుకొని ఆ వ్యక్తికి తిరిగి మనం ఊహించిన, మన కల్పనలలో ఉన్న రంగులని వేయటానికి ప్రయత్నించుతాము. లేదా ఉలి, సుత్తి తీసుకొని ఆ మనిషిని మన ఊహలకి తగినట్లు చెక్కటం ప్రారంభించుతాము. అందుకే వివాహ జీవితాలలో రక్తం ప్రవహించుతుంది.
శివ సూత్రాలలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఈ విధంగా అడుగుతుంది "స్వామీ! ఏవి భార్యా భర్తలని సంతోషంగా ఉండేలా చేస్తాయి?".
ఆదిగురువు పరమేశ్వరుడు ఇలా జవాబు ఇస్తాడు " ప్రతి వివాహం లోనూ నలుగురు మనుషులు ఉంటారు. భర్త, అతని ఊహలలో స్త్రీ, భార్య ఆమె ఊహలలోని పురుషుడు. ఎప్పుడయితే భార్య, భర్త తమ ఊహలలోని రూపాలని వదిలిస్తారో అప్పుడు ఇద్దరే ఉంటారు. వాళ్ళ వివాహ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.
నేను మీకు ఒక విషయం చెబుతాను. మీరు దేనినైతే ప్రొజెక్షను చేస్తారో దానినే చూస్తారు. ఇది మీ అహంకారాన్ని గాయపరచవచ్చు. కానీ మీరు లోపలకి చూడండి. మీరు కూడా సమస్యకి కారణమే అని తెలుస్తుంది. ఎవరూ మిమ్మలని మీ అనుమతి లేకుండా బాధపెట్టరు. ఎవరూ మీ అంగీకారం లేకుండా మీ నిశ్చలతని భంగం చేయరు. ఎవరూ మీ అనుమతి లేకుండా మిమ్మలని ఆధీనపరచుకోరు.
మీకు ఏదో స్వార్ధం ఉండి ఆ వ్యక్తిని మీ జీవితం లోనికి రానిస్తారు. మీకు సరిపడని వ్యక్తిని ఆకర్షించి మీ జీవితంలోనికి రానివ్వటం అసలు ఆధ్యాత్మికత కాదు. అంటే మీ అంతరంగంలో మీ అసలయిన ఉనికి దగ్గర ఏదో సమస్య ఉన్నది. దానిని వెతకండి. దానికి చికిత్స చేయండి. అప్పుడు అన్నీ స్పష్టమై శుభ్రపడతాయి.
ప్ర : నేను మరణానికి సమీపంగా వెళ్ళిన వ్యక్తుల మరణ అనుభవాన్ని చదివాను, వారి దగ్గర విన్నాను. అది శరీరం బయట జరిగి అనుభవం. అందరూ కూడా దానిని చాలా అందమయిన అనుభవం అని చెప్పారు. మరి దానిని గీత ఎందుకు బాధతో కూడిన విషయంలా చెబుతుంది. వెయ్యి తేళ్ళుకుట్టిన బాధ అని ఎందుకు అయింది?
జ : అర్ధం చేసుకోండి. నేను మరణ అనుభవం గురించి మాట్లాడింది, ఒక సామాన్య మానవుని యొక్క మరణ అనుభవం. కానీ ఇక్కడ మీరు చెప్పినది 'నేను మరణాన్ని సమీపించిన వారి అనుభవాన్ని చదివాను విన్నాను' అని ఎప్పుడయితే మీరు 'నేను చదివాను' అని అంటారో మీరు చదివింది వారి అనుభవాన్ని. మీరు విన్నది కూడా మధ్యవర్తుల ద్వారా వినటమే, లేదా ఆధ్యాత్మిక సంబంధమయిన వ్యక్తుల ద్వారా వినటమే. అందుకే వారికి అనుభవం అయ్యి తిరిగి వెనక్కి వచ్చారు.
నేను చెప్పే విషయం మరణించిన వారి సంగతి. వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయిన వారే. మీరు చెప్పేది వారు అనుభవమయ్యాక వెనక్కి వచ్చిన వారి సంగతి. అనుభవం
భగవద్గీత - అధ్యాయం 12
అయ్యి వెనక్కి వచ్చారు అంటే అది ఆధ్యాత్మిక అనుభవం. అది మరణ అనుభవం కాదు. కానీ నేను మీతో చెప్పినది నిజమయిన భౌతికమయిన మరణం గురించి, అంతేకాని సచేతన స్థితిలో జరిగే మార్పు గురించి కాదు.
రమణ మహర్షికి జరిగిన అనుభవం ఆయన చేతనస్థితిలో జరిగింది. కానీ నేను మీకు వివరించినది మామూలు వ్యక్తికి సంభవించే భౌతిక మరణం. ఆ తేడా అర్ధం చేసుకోండి. ఇది ఒక సాధారణమయిన మనిషికి సంభవించే మరణం.
నా అనుభవమయిన సత్యం ఏమిటి అంటే, మరణ సమయంలో ఆత్మ ఏడు శక్తి దశలు (పొరలను) దాటి, వాటి గుండా వెళుతుంది. అప్పుడు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అక్కడ ఆత్మ తిరిగి గుర్తు చేసుకుంటుంది. అన్ని సంఘటనలు వివరాలతో సహా చూడగలుగుతుంది. అప్పుడు ఆత్మ యొక్క ఉనికి బాధలని, ఆనందాన్ని, అపరాధ భావాన్ని కోరికలని అన్ని రకాల భావావేశాలని బయటకి చూపిస్తుంది. అదే మీరు నరకం, స్వర్గం ద్వారా వెళ్ళటం అంటే.
అప్పుడు అనుభవించే బాధనే వేయి తేళ్ళు ఒకేసారి శరీరాన్ని కుట్టిన బాధ, శరీరం మొత్తాని కొట్టిన బాధ. ఈ బాధ నుంచి తప్పించుకోవాలి అంటే మీకు అంతిమ సత్యం యొక్క క్షణ దర్శనం జీవితంలో ఒక్కసారియినా జరగాలి. దానిని మీరు ధ్యానం ద్వారా సాధించగలరు.
నిత్యానంద స్పురణ కార్యక్రమంలో నేను మిమ్మలని మరణ సమయంలో ఆత్మ వెళ్ళే ఆ ఏడు శక్తి మార్గాల గుండా తీసుకువెళతాను. మిమ్మలని మీ సంస్కారాల (పాత జ్ఞాపకాల) మీద ధ్యానం చేయమంటాను. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. అప్పుడు మీలోని సంస్కారాలన్నీ కరిగిపోతాయి. దాంతో మీకు బాధలేని మరణం సంభవిస్తుంది. మీకు పునర్జన్మ ఉండదు.
ప్ర : స్వామీజీ, శ్రీకృష్ణుడు తన భక్తులు ఎప్పటికీ నశించరు అని అన్నారు కదా.
మరి ప్రతిదీ భగవంతుడయినప్పుడు, ఇక నశించేది ఏమిటి? అంటే శ్రీకృష్ణని ఉద్దేశం తన భక్తులు నశించరు కాని మిగతారు నశిస్తారు అనేనా? దయచేసి ఈ విషయాన్ని వివరించి నా అనుమానాన్ని నివృతి చేయండి.
జ. అర్ధం చేసుకోండి. మీరు ఏక్షణాన అయితే నాశనం అవ్వము అని తెలుసుకుంటారో, అప్పుడే మీరు కృష్ణునికి భక్తులవుతారు. ఎక్కడా కృష్ణభక్తులు, మరొకరు అనే గ్రూపులు లేవు. అలాగే కృష్ణభక్తులు నాశనం కారు, మిగతా వారు అవుతారు అనేది ఎక్కడా లేదు. ఎవరయితే తాను నాశనం లేనివాడిని అని అనుకుంటారో అతను కృష్ణ భక్తుడే. మీరు ఏక్షణాన ఈ విషయం అర్ధం చేసుకుంటారో అప్పుడు మీరు భక్తుడుగా మారిపోతారు. ఆయన భక్తుడిగా అవుతారు. స్పష్టంగా తెలుసుకోండి. ప్రతిదీ భగవంతుడే అయినప్పుడు, ఏదీ కూడా నాశనం కాదు.
'నమే భక్తా ప్రణశ్యతి.' భగవానుడు ఇలా చెబుతాడు, నా భక్తునికి నాశనం ఉండదు. ఇది పోల్చి చెప్పే మాట. మీరు ప్రతిదీ భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు, ఏదీ నశించదు అని తెలుస్తుంది. మీరు ఆ దశని అర్ధం చేసుకున్నప్పుడప్పుడు, ఆ దశని చేరినప్పుడు, ఈ మాటలు మీ కోసం కాదు. ఇది సామాన్య మానవులకి చెప్పే మాట. ఎవరయితే భక్తి దారిలో (మార్గంలో) ఉన్నారో, ఎవరైతే దీనిని అర్ధం చేసుకోలేదో ఇది వారికోసం. ముఖ్య విషయం ఏమిటంటే మీరు ప్రతిదీ భగవంతుడే అనే విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకొని ఉంటే మీరు అసలు ఈ మాటలు పట్టించుకోనవసరం లేదు.
తరువాత విషయం, ఎప్పుడయితే మీరు ఏదీ నాశనం చేయలేనిది అని తెలుసుకుంటారో అప్పుడు మీరు కృష్ణభక్తులవుతారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ ఏ మాటలూ పక్షపాతంతో అనేవి కాదు. ఆయన ఎవరి పక్షపాతంతో అనేవి కాదు.
భగవద్గీత - అధ్యాయం 12
ఆయన ఎవరి పక్షం మాట్లాడటం లేదు. ఆయన కేవలం ఇలా చెప్పాడు. 'నా భక్తులకు నాశనం అనేది ఉండదు' అన్నాడే కాని ఆయన "నా భక్తులకి నాశనం లేదు, కానీ వేరే భక్తులు నశించుతారు" అని అనలేదు.
ఆయన ఆవిధంగా అనలేదు. ఆ మాటలలో ఆ అర్ధం లేదు. ఎవరయితే ఈ తత్వాన్ని అర్ధం చేసుకుంటారో వారు నశించరు. ఎవరికైతే ఈ శాస్త్రం అర్ధమవుతుందో వారికి నాశనం అనేది ఉండదు. ఇదంతా అర్ధమయిన తరువాత కూడా మీరు కృష్ణుని మురళికి లేదా నెమలి ఈకకి భక్తులు కాకపోయినా మీకు నాశనం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని పట్టించుకోకండి.
మీరు ఎప్పుడైతే కృష్ణుడు అనగానే మురళి, నెమలి ఈక అని అనుకుంటారో ఈ సమస్య, ఈ ప్రశ్న వస్తాయి. శ్రీకృష్ణుడు మురళి, నెమలి ఈక వీటన్నింటికీ అతీతుడు అని అర్ధం చేసుకోగలిగితే మీకు ఈ అనుమానం రాదు. నా భక్తులకి నాశనం ఉండదు, అన్ని శ్రీకృష్ణని మాటలతో అర్ధం చేసుకుంటే ఆవ్యక్తికి క్షీణదశ ఉండదు. అదే శ్రీకృష్ణుని సందేశంలో అర్ధం.
శ్రీకృష్ణుడు అంటే మీరు చూసే శ్రీకృష్ణుడు కాదు. ఆయనది మీరు చూసే ఒక రూపం కాదు. ఆయనది అత్యున్నత చేతనస్థితి. విశ్వ చేతనస్థితి. ఆయనే విశ్వశక్తి, పరాశక్తి.
శ్రీకృష్ణని భక్తులు కొందరు నా కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళు నన్ను ఈవిధంగా అడిగారు : మీరు గీత గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడతారు. మీరు కృష్ణుణ్ణి నమ్ముతారా?
నేను "అవును, నమ్ముతాను" అని అన్నాను.
దానికి వాళ్ళు "అలా అయితే మీరు మిగతా దేవుళ్ళ గురించి, దైవం గురించి ఎలా మాట్లాడతారు. మీకు ఆశ్రమంలో దక్షిణామూర్తి గుడి ఉన్నది అని విన్నాము, అది ఎలా సాధ్యం? మీరు అలా ఎలా చేసారు? శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతాడు, నేనే సర్వస్వం అని వేరే ఏదీ లేదు అని" అన్నారు.
అప్పుడు నేను వారికి ఈ విధంగా వివరించాను. మహాభారత యుద్ధం తరువాత అర్జునుడు, శ్రీకృష్ణుడు బయట విహ్యాళికి వెళతారు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణనితో " శ్రీకృష్ణా! యుద్ధ ప్రారంభంలో నీవు నాకు చాలా విషయాలు చెప్పావు. కానీ నాకు ఏమీ గుర్తులేదు. దయచేసి నాకు మరొకసారి ఆ విషయాలు చెప్పగలవా?"
కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ! అర్జునా! నేను కూడా మర్చిపోయాను. అయ్యో! ఏమీ అనుకోవద్దు. నేను ఆ విషయాలన్నీ మరిచిపోయాను. " అని అంటాడు.
అర్జునుడు కొంచం కలవరపాటు పడి ఇలా అడుగుతుంది. "కృష్ణా అది ఎలా సాధ్యం".
ఆ ప్రశ్నకి శ్రీకృష్ణ ఈ విధంగా జవాబు ఇస్తాడు. "నేను నీకు యుద్ధ భూమిలో ఆ విషయాలు చెప్పినప్పుడు, నేను అత్యున్నత చేతనస్థితి కలిగిన పరుబహ్మ శ్రీకృష్ణదిని. ప్రస్తుతం నేను మామూలు వసుదేవ కృష్ణుణ్ణి. రూపంలేని విశ్వశక్తిగా ఉండి నేను నీకు ఏమి చెప్పానో నాకు గుర్తులేదు.
అయితే కరుణామూర్తి, ప్రేమమూర్తి అయిన శ్రీకృష్ణుడు మరొక సారి అర్జునునికి తన బోధలలోని ముఖ్యమయిన విషయాలు చెబుతాడు. దానినే మనం అనుగీత అంటాము.
ఎప్పుడయితే శ్రీకృష్ణుడు దివ్యచేతనస్థితి అని అర్ధం చేసుకుంటారో అదే దైవత్వం. అది ఏ రూపంలో అయినా ఉంటుంది, దానిని మనం ఏ రూపంలో అయినా పూజించవచ్చు అని చెప్పాను. వారు తృప్తి చెందారు.
శ్రీకృష్ణుడు " నా భక్తులకు నాశనం ఉండదు 'అని చెప్పినప్పుడు ఆయన పరిబ్రహ్మ శ్రీకృష్ణ. ఆ స్థితిలో ఆయన మనందరిలో ఉంటాడు. ఎప్పుడయితే ఆ సత్యాన్ని మనం అర్ధం చేసుకుంటామో, మనం ఆయన భక్తులు అవుతాము. మనం కూడా కృష్ణులం అవుతాము. మనం శ్రీకృష్ణని చేతనస్థితిలో ఒక భాగం అవుతాము. మనకి నాశనం ఉండదు.
ప్ర. స్వామీజీ! దయచేసి సంస్కారాలని (మనలో ఉండిపోయిన జ్ఞాపకాలని) ఎలా పూర్తిగా వదలగమో, ఎలా సర్వస్వం వదిలి అధీనులం అవ్వగలమో వివరించండి.
జ. మీరు సంస్కారాలని, సర్వస్వాన్ని ఎలా వదిలి ఆధీనులు అవ్వాలో అడుగుతున్నారు. మీరు రేపు ఎల్లుండి క్లాసులకి రండి. ఆ వివరాలు చెబుతాను. తరువాత రెండు రోజులూ ఉపన్యాసమంతా సంస్కారాల మీద ఉంటుంది. మనం మన ప్రతి సంస్కారం మీద చాలా లోతుగా పనిచేస్తాం. కోరికల సంస్కారాలు, అపరాధభావ సంస్కారాలు, వ్యధ ఇలా ఒక్కొక్క దాని మీద పనిచేస్తాం.
అప్పుడు ఉపన్యాసమే కాదు మీరు ఏదయినా అడగవచ్చు, చెప్పవచ్చు. మనందరం కలసి సంస్కారాల మీద కొంత పని చేస్తాము. ముఖ్యంగా గుణాతీత యోగా అధ్యాయలలో మనం పూర్తిగా సంస్కారాల గురించే నేర్చుకుంటాము. మనం వీటి గురించి చూస్తాము. (ఈ అధ్యాయాలు వేరే పుస్తకాలలో ఉన్నాయి)
ప్ర. పనికి వస్తుందా? లేక మేము కూర్చొని మాత్రమే ధ్యానం చేయాలా?
జ. మీరు పడుకుంటే నిద్దపోతారు. నిజానికి కూర్చొని కూడా నిద్దపోతారు. సహజంగానే పదుకోగానే నిద్దపోతారు. కాబట్టి పదుకుని ధ్యానం చేయకండి. మీరు నిద్రపోయేటప్పుడు ధ్యానం చేయండి కాని మీరు ధ్యానం చేసే సమయంలో నిద్రపోకండి. మీరు నిద్రపోతూ ధ్యానం చేయవచ్చు. కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు నిద్రపోతే మీలో ఏదో పొరపాటు ఉంటుంది. కాబట్లి ధ్యానం చేయటానికి శవాసనం వేయకండి. మీరు శవాసనం వేసినప్పుడు ధ్యానం చేయండి.