KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/ప్ర. స్వామీజీ, శివరాత్రి రోజున, లేదా మరే పవిత్రమయిన రోజన మరణించితే ఆత్మ తిన్నగా స్వర్గానికి వెళుతుందా?Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

ప్ర. స్వామీజీ, శివరాత్రి రోజున, లేదా మరే పవిత్రమయిన రోజన మరణించితే ఆత్మ తిన్నగా స్వర్గానికి వెళుతుందా?

జ. నేను ఈ ప్రశ్నకి ఒకసారి జవాబు ఇచ్చాను అని అనుకుంటున్నాను. దక్షిణాయన (సూర్యుడు దక్షిణం వైపు చేసే ప్రయాణం, జూన్ 22 నుంచి డిసెంబర్ 22 వరకు) ఉత్తరాయణ (సూర్యుడు, ఉత్తరం వైపు చేసే ప్రయాణం డిసెంబరు22 నుంచి జూన్ 22 వరకూ) ఇవన్నీ మానసిక మయినవే కాని కాల క్రమమైనవి కాదు. నేను ఉత్తరాయణ అని చెప్పినా, శ్రీకృష్ణుడు ఉత్తరాయణ అని చెప్పినా, దాని అర్ధం ఆ సమయంలో మీలోని శక్తి ఉన్నతస్థితివైపు ప్రయాణించుతుంది. అదే ఉత్తరాయణం. ఎప్పుడుయితే మీరు మీతో చాలా హాయిగా ఉండగలరో అదే ఉత్తరాయణం.

స్పష్టంగా తెలుసుకోండి. ఇది కేవలం మానసికమయిన ఊహ. అటువంటిది ఏమీ లేవు. డిస్నీ ఓల్డ్ ఎందుకంటే అప్పుడు ఎక్కువమంది ఉందరు. అందుకే ఆ రోజులలో స్పెషల్ ఆఫర్ ఇస్తారు. కానీ స్వర్గానికి అలాంటి డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్స్ ఉండవు. మీ జీవితంలోని నాణ్యత వాటిని నిర్ణయించుతుంది. అంతేకాని ఎటువంటి ఆఫర్స్ ఉండవు.

శివ. శివ అంటే పవిత్రమయిన. పవిత్రత అనేది అప్రయత్నంగా వస్తుంది. దానికి కారణం ఉండదు. అది సహజంగా వస్తుంది. దైవం పవిత్రమయినది. రాత్రి అంటే తీవ్రమైనది అని, అంతేకాని అది కేవలం రాత్రి మాత్రమే కాదు. శివరాత్రి లేదా మహాశివరాత్రి అంటే పవిత్రత అత్యున్నత స్థాయిలో ఉన్న సమయం అని అర్ధం. మీరు నిజాయితీగా తెలుసుకునేతత్వంతో చేసే ప్రార్ధనలను ఆ భగవంతుడు స్వీకరించి మీకు జవాబు ఇస్తాడు. ఆ పూజలు, ప్రార్ధనలు అందరికీ మంచి చేసేవిగా ఉంటే ఆ ప్రార్ధనలకి భగవంతుడు సమాధానం ఇస్తాడు.

నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. స్వర్గం అనేది లేదు. అది కేవలం మతాల డిక్షనరీలలోనే ఉన్నది. అది ఏదో ఒక స్థలం కాదు. అది మీ మైండ్‌లో ఉన్నది. మీరు చేతనస్థితిని చేరితే పరమానందాన్ని పొందగలుగుతారు. అప్పుడు మీరు స్వర్గంలోనే ఉంటారు.

ప్ర. ఒకవేళ ఎవరికైనా ఏ లక్ష్యం లేదనుకోండి. అప్పుడు పరమానందాన్ని పొందటం అనేదే ఒక లక్ష్యం అవ్వదా? దయచేసి దీనిని నేను అర్ధం చేసుకోవటానికి సహాయం చేయండి.

జ. పరమానందాన్ని పొందటం అనేది మీ లక్ష్యంగా చేసుకోకండి. అలా చేస్తే మీరు దానిని కోల్పోతారు. అంతా గందరగోళం అయిపోతుంది. మీ గోల్స్‌ల (లక్ష్యాలన్ని)న్ని వదిలి వేయండి. అప్పుడు పరమానందం మీలో జరుగుతుంది. మీరు పద్మాన్ని వికసించేలా చేయలేరు. మీరు దానికి అనుకూలమయిన పరిస్థితులు కల్పించి, అది వికసించే వరకూ ఎదురు చూడాలి. అప్పుడు ఆ పద్మం దానంతట అదే వికసించుతుంది. మీరు ఈ విషయంలో ఏమీ చేయలేరు. మీరు రేకులని బలవంతంగా విప్పితే ఆ పుష్పం చనిపోతుంది. అది జీవంలేని పుష్పం. మీరు జీవం లేని ఆనందాన్ని అతికించిన నవ్వుతో పొందటానికి ప్రయత్నించవద్దు. మీ చిరునవ్వు మీ అంతరంగం నుంచి రావాలి. అది మీలోని సంతోషంతో ఉప్పొంగి ప్రవహించాలి.

మీరు ఒక మొక్కని నాటితే దానికి కావలసిన సరియైన పరిస్థితులని కల్పించాలి.

అప్పుడు అది చిగిర్చి, మొగ్గలు వేసి పూలు పూస్తుంది. అలా కాకుండా మీరు విత్తనాన్ని బయటకి తీసి చూస్తే అది మొక్కగా పెరగదు. మీకు ఏమీ దొరకదు.

మీకు ఒక కథ చెబుతాను. మూడు కోతులకి ఒక మామిడి పండు దొరుకుతుంది. అవి దానిని పంచుకోవటానికి ఇష్టపడవు. ఎవరు దానిని తినాలో అవి నిర్ణయించుకోలేకపోతాయి. ఈ సమస్యని వాళ్ళ గురువయిన మరొక కోతికి చెబుతాయి. ఆ గురువు కోతి ఇలా చెబుతుంది. "ఈపందుని నేను తింటాను. మీరు విత్తనాన్నితీసుకువెళ్ళి నాటండి. అది చెట్టుగా పెరిగి చాలా కాయలు ఇస్తుంది. అప్పుడు చాలా పళ్ళు ఉంటాయి. మీరు హాయిగా తినవచ్చు" అని అంటుంది.

కోతులు ఒప్పుకుంటాయి. గురువు కోతి కాయ తిన్నాక మూడు కోతులూ విత్తనాన్ని నాటుతాయి. ఒక కోతి రోజు నీరు పోసేది, ఒక కోతి దానికి ఎరువులు వేసేది, మూడవది విత్తనానికి కాపలా కాసేది. చాలా కాలం అయ్యాక కూడా మొక్కరాదు. అవి గురువు దగ్గరకి వెళ్ళి "నీవు మా కాయ తినేసావు. మమ్మలని విత్తనం నాటమన్నాను. కానీ మొక్కరాలేదు. నీవు మమ్మలని మోసం చేసావు అని ఫిర్యాదు చేస్తాయి".

గురువు కోతి ఎవరు ఏ పని చేసారో అడుగుతుంది. మొదటి కోతి క్రమం తప్పకుండా నీరు పోసాను అని చెబుతుంది. రెండవది ఎరువులు వేసాను అని చెబుతుంది. మూడవది ఆ విత్తనం ఎవరూ తీసుకెళ్ళకుండా జాగ్గత్తగా కాపాలాకాసాను అంటుంది.

అప్పుడు గురువు కోతి ఎలా కాపాలా కాసావు అని అడుగుతుంది. అప్పుడు మూడవ కోతి "నేను రోజూ ఆ విత్తనాన్ని బయటకి తీసి ఉన్నాదా లేదా అని చూసి మరలా లోపలపెట్టే దాన్ని " అని చెబుతుంది.

భగవద్గీత - అధ్యాయం 12

కాబట్టి మీరు జరుగుతుందా లేదా అని పరీక్ష చేసుకున్నంత కాలం ఏమీ జరగదు. మీరు పరమానందం నా లక్ష్యం అనే భావనని వదలటమే కాదు, దానిని గురించి ఆలోచించటం కూడా మానేసేయాలి. మీరు ధ్యాన మార్గాన్ని అనుసరించండి. అప్పుడు పరమానందం దానంతట అదే వస్తుంది. మీరు ప్రతిరోజు మీ మైండ్‌లోనికి వెళ్ళి, పరమానందం వచ్చిందా రాలేదా అని చూసే అది మీకు జరగదు.

ప్ర. ప్రియమయిన స్వామీజీ, ఒక వ్యక్తి జీవితాంతం డబ్బు గురించే ఆలోచిస్తూ గడిపాడనుకోండి, అతను తరువాత జన్మలో ఎటువంటి జీవితాన్ని గడుపుతాడు? ధనవంతుడా లేక పేదవాడిగానా?

జ. అది మీ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత బాధ్యత తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో దాని మీద నిర్ణయించబడుతుంది. మీకు బాధ్యత తీసుకోగలిగే తెలివితేటలు ఉంటే వచ్చే జన్మసంగతి ఆలోచించకండి. ఈ జన్మలోనే మీరు ధనవంతుడిగా జీవించవచ్చు. మీకు భాద్యత తీసుకునే వివేకం లేదనుకోండి, దాని గురించి పని చేయరనుకోండి, ఈజన్మలోనే కాదు ఏజన్మలోనూ ధనవంతుడిగా జీవించలేరు. మీరు ధనవంతునిలా జీవించటానికి కావలసినవన్నీ సమకూర్చుకోగలిగితే ధనవంతునిగానే జీవిస్తారు.

చూడండి. ఒక కూర చేయాలంటే దానిలో చాలా వస్తువులు కలపాలి. అప్పుడే రుచికరమయిన కూర తయారవుతుంది. ఇది కూడా అంతే. ఏదో కొన్నిసార్లు అది వేరుగా అవుతుంది. అది వేరే విషయం.

ఒకామె ఏదో వండుతుంటుంది. ఆమె భర్త వచ్చి ఏమి వండుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆమె ఇంకా పేరు పెట్టలేదు. అది తయారయ్యాక దానికి పేరు పెడతాను అంటుంది.

కాబట్టి ఒక్కొక్కసారి వంటలో అన్నీ వేసినా అది మనం అనుకున్నట్లుగా తయారవదు. కానీ ఒక కూర చేయాలంటే దానిలో చాలా రకాల వస్తువులు వేయాలి. అలాగే ధనవంతునిలా జీవించాలి అంటే మీరు చాలా విషయాలను జీవితానికి కలపాలి. భాధ్యత, నిర్ణయాలు చేయగల నైపుణ్యం, ధైర్యం, జీవితాన్ని ఎదుర్కొనగల నేర్పు, ఇలాంటివన్నీ మీ జీవితంలో కలపగలిగితే, మీరు ధనవంతులుగా జీవించవచ్చు, దాని కోసం మీరు వేరే జన్మవరకూ చూడనవసరం లేదు.

కొంతమంది నన్ను అడుగుతుంటారు. 'ఎవరూ కూడా బిక్షగాళ్ళుగా జన్మించాలి అని అనుకోరు : అది అసాధ్యం. అప్పుడు ఎందుకు బిక్షగాళ్ళు ఉంటారు?

జీవితంలో చాలా ధనవంతుడయిన వ్యక్తి, చాలా ఆస్తి కూడ బెట్టి ఉండవచ్చు. ఇప్పుడు అతని ఆత్మకి ఇంక ఆస్తి మీద కోరిక లేకపోవచ్చు. అతనికి ఏమాత్రం బాధ్యతలు లేని జీవితం కావాలనిపించవచ్చు. దానినే వాసన అంటారు. ఆ ఆత్మ, మైండ్ అలా అయిపోయి అది ఆత్మలో ఉండి ఉంటుంది. అందుకే ఆత్మ బిక్షగాని జీవితాన్ని, ఎటువంటి బాధ్యతలూ లేని జీవితాన్ని కోరుకున్నది.

ప్ర. నేను మీ శిష్యుడిగా ఉండవచ్చునా? నేను మిమ్మలని అనుసరించ వచ్చునా?

జ. అర్ధం చేసుకోండి. నేను ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చాను. మీరు రూపం లేని రూపంలో భగవంతుని ఆరాధించేవారయితే నన్ను తేలికగా అర్ధం చేసుకుంటారా? నాతో అనుబంధం పెంచుకో గలరా? నేను చెప్పాను. నేను నా శిష్యులకి స్పష్టమైన సూచనలు ఇస్తాను. వాళ్ళు నా రూపం మీద ధ్యానం చేయకూడదు. అలా చేయలేరు. వాళ్ళు చేతనస్థితిలో అనుభవం లోనికి వెళ్ళగలగాలి. వాళ్ళు నా రూపంతో ఆగిపోకూడదు. అక్కడ చిక్కుపడిపోకూడదు. నా రూపమే కాదు ఏ గురువు రూపంలోనూ చిక్కి ఉండిపోకూడదు.

మీలో చాలామందికి భగవంతుడు అంటే ఒక భావన, ఒక కల్పన. కానీ జ్ఞానోదయమయిన యోగులకి భగవంతుడు ఒక సత్యం. ఒక జ్ఞానోదయమయిన గురువు, దేవుడి కంటే గొప్ప. ఎందుకంటే ఆయన మీకు సత్యము. ఆయన కల్పన కాదు. గురువు ఉన్నా లేకపోయినా, ఆయన సమక్షం పనిచేస్తూ ఉంటుంది.

నేను మీ ముందు ఉన్నప్పుడు నేను ఉన్నాను అని అనుకోవద్దు. అలాగే మీరు నా సమక్షంలో లేనప్పుడు, నేను మీ దగ్గర లేను అని అనుకోవద్దు.

నేను నా శిష్యులకి చెబుతుంటాను. మీరు నా ముందు కూర్చొని నా వైపు ఆరాధనతో చూస్తూ ఉండవద్దు అని. మీరు నా వెంటపడితే అది పనిచేయదు. మీరు నా లక్ష్యసాధనకి పని చేయండి. అప్పుడు నేను మీ వెంట పడతాను. నేను మీ హృదయాలలో ఉంటాను.

అది శ్రీకృష్ణని అత్యున్నత చేతనస్థితి యొక్క సందేశం.

ప్ర. ఎందుకు జ్ఞానోదయం పొందిన యోగులు తిరిగి జన్మించుతారు? దాని అర్ధం ఏమిటి?

జ. కరుణతో, ఈ ప్రపంచానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పరాశక్తి (విశ్వశక్తి) కొంతమంది జ్ఞానోదయం పొందిన వారిని భూమి మీదకి పంపిస్తుంటుంది. పరాశక్తి కొంతమంది జ్ఞానోదయమయిన వారిని ఈ భూమి మీద సహాయపడటం కోసం పంపిస్తుంది. ఇది ఆమె నిర్ణయం. దీనిని గురించి మనం ఏమీ చేయలేము. ఆమె దేని ఆధారంగా నిర్ణయించుతుందో కూడా తెలియదు. మనం ఆమెకి అప్లికేషన్ పెడతాం. అంతే, అది ఎలా వస్తుందో తెలియదు. ఎందుకు వస్తుందో తెలియదు. అది ఎందుకు రాదో కూడా తెలియదు. ఇది అమెరికా వీసా లాంటిది. మీరు అప్లికేషన్ ఇచ్చి, ఎదురు చూడటమే. అది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు అనే విషయాలు ఏమీ తెలియవు. దీని గురించి మనం ఏమీ చేయలేము. అదే విధంగా పరాశక్తి నిర్ణయం కూడా మనకి ఏమీ తెలియదు.

జ్ఞానోదయమయిన యోగికి సంస్కారాలన్నీ కరిగిపోతాయి. ఆయనకి వాసన (కోరిక)లు ఉండవు. పునర్జన్మ ఉండదు. తిరిగి పుట్టాలి అనేది ఆయన నిర్ణయం కాదు. ఇక్కడ ఏదో ఉండి అది గర్బంలోనికి లాగుతుంది.

నేను పుట్టినప్పుడు అక్కడ ఒక కాంతి ఉన్నది. అదే అరుణాచలం. ఆ కాంతి నా శక్తికి దారి చూపించినది.

రామకృష్ణ పరమహంస తన పునర్జన్మ గురించి ఇలా చెబుతారు. జ్ఞానోదయమయిన కొందరు యోగుల మధ్య పసిబిడ్డ కనపడతాడు. ఆ పసిబాలుడిని వారంతా దీవించుతారు. ఆ బాబు రామకృష్ణ. ఆయనే తిరిగి మానవునిగా జన్మించుతారు. ఆయనని దీవించిన ఒక యోగి వివేకానందుడు. జ్ఞానోదయం పొందిన యోగులు సృష్టించే శక్తివలయమే దైవం. అంతా పరాశక్తి నిర్ణయం.

ప్ర. గౌరవనీయులయిన స్వామీజీ, ప్రతి రోజు నేను ఇక్కడికి వచ్చి చాలా చక్కని విషయాలు నేర్చుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. వెనక్కి వెళ్ళాక కొంచం అయోమయంగా ఉంటుంది. అసలు ఏమి జరుగుతుంది.

జ : మీకు సరియైనదే జరుగుతుంది. దీని గురించి బాధ పడవద్దు. మీలో ఏమి జరుగుతుందో అది సరియైన విషయమే. ముందు దశలలో ఇలానే ఉంటుంది. మీరు అయోమయాన్ని, మానసిక వ్యధని లెక్కించండి. మీ దీవెనలని లెక్కించండి. చూడండి, చంద్రుడు తన వెన్నెల కాంతిలో మచ్చలు చూపించుతాడు. అదేవిధంగా ఎందుకు అయోమయంలో ఉన్నారు అని తెలుసుకోవచ్చు. మీరు మానసికంగా

భగవద్గీత - అధ్యాయం 12

వ్యధ చెందుతున్నారు. మీరు అయోమయంలో ఉన్నారు అని తెలుసుకున్నారు అంటే మీరు తెలివైనవారు అని అర్ధమవుతుంది. అది మీ తెలివితేటలలో చక్కని వృద్ధిని సూచించుతుంది. ఆ ప్రకాశం వ్యాపించటం మొదలయింది.

మీకు ఆలోచనలు లేనప్పుడు మీలో అయోమయం ఉండదు. మీకు ఉన్నతస్థితికి చేరే క్లూ దొరకదు. మీరు మీ పనులలో, అంటే తినటం, ఆడుకోవటం, పనిచేసుకోవటం వీటితో చాలా సంతోషంగా ఉంటారు. ఆలోచనలు లేనివారు వారి పద్ధతిలో వారు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆలోచించరు. వారు మనుషులులా ఆలోచించరు. వాళ్ళు వెతికే ఆనందం, పశుపక్ష్యాదులు వెతికే సంతోషం అది. వాళ్ళు ఆ దశలో ఉండే ఆనందంతో తృప్తిపడతారు. ఆ విధంగా జీవించి మరణించుతారు.

ఎప్పుడయితే మీరు ఆలోచించుతారో, మీకు సమస్యలు ప్రారంభమవుతాయి. మీరు ఇక్కడ ఉండి చేయవలసిన పని చేయటం లేదు అని తెలుసుకోగలుగుతారు. మీరు ఒక ఉద్దేశం కోసం వెతుకుతారు. మీరు అయోమయంలో ఉంటారు. స్పిరంగా ఉండలేరు. కొంతకాలం మీరు ఎంతోకాలంగా అనుభవిస్తున్న సుఖాలకి ఆకర్షింపబడతారు. తరువాత వాటిని తిరస్కరించుతారు. అవి మీకు ఆనందాన్ని ఇవ్వవు అని తెలుసుకుంటారు. ప్రకాశాన్ని చూస్తారు. క్రమంగా, నెమ్మదిగా, చాలా నెమ్మదిగా చీకటి నుంచి వెలుతురు వైపు వెళతారు. అక్కడ మీకు గురువు దొరుకుతాదు. అక్కడ నుంచి ఆయన మిమ్మలని అజ్ఞానం అనే చీకటి నుంచి సత్యం అనే వెలుగు వెపు తీసుకువెళతాదు.

అప్పుడు మీరు మైండ్ లేని స్పితికి చేరతారు. అప్పుడు ఆలోచనలు ఉండవు. అది మీకు అంతకుముందు ఉన్న ఆలోచనలు లేని స్పితి కాదు. అది దైవత్వంతో కూడిన స్థితి. ఇది ఆత్మపభోద స్టితి. ఆలోచనల స్పితి తార్కికమయిన మానవస్థితి.

భగవద్గీతలోని సంభాషణలు మొత్తం అర్హనుని అయోమయం వలన వచ్చినవే. అర్లునుడు మామూలు ఆలోచనలు ఉన్న మనిషిగా అడిగిన అనుమానాలే. వాటిని శ్రీకృష్ణుడు ఆలోచనలు లేని స్లితి నుంచి నివృత్తి చేస్తాడు. అదే శ్రీకృష్ణుని అత్యత్తమ చేతనస్గితి. అనుమానాలు, అయోమయయం మనుషుల లక్షణం. అవన్నీ కూడ ఆలోచనలు లేని స్గితి నుంచి అసలు ఆలోచన అనేది ఉండని (నో మైండ్) ఉత్తమ స్టితికి వెళ్ళే సమయంలో జరిగే విషయాలు.

ప్రశ్న గౌరవనీయులయిన స్వామీజీ, నాకు ఒక ప్రశ్న ఉన్నది. మీరు మెడిటేషన్ మీద లాస్ యాంజిల్స్‌లో ఏవైనా కార్యక్రమాలు చేయబోతున్నారా?

జవాబు గీతా జ్ఞాన యజ్ఞం అయ్యాక ఆరోగ్య స్పురణ కార్యక్రమం ఉంటుంది. అది ఆరోగ్యం గురించి ఉంటుంది. అది మీశరీరం, మనస్సు, ఆత్మలని ఆరోగ్య దిశగా తీసుకువెళుతుంది. అది మీ శరీరానికి, మనస్సుకి, ఆత్మకి చక్కని చికిత్సా పద్దతిని ఇస్సుంది.

నాదృష్టిలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత రెండూ ఒక్కటే. ఎప్పుడు మీరు నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే, మీరు చాలా ప్రత్యేకమయిన ఆరోగ్యాన్ని అన్ని దశలకూ వ్యాపింపచేస్తారు. అది మీ శరీరానికి అతీతంగా ఉంటుంది. శరీరం అనారోగ్యమయం, అందుకే ఇంక ఏవిధమయిన అనారోగ్యం దానిమీద దాడి చేయలేదు. శరీరమే అనారోగ్యం కాబట్టి నా దృష్టిలో మీరు ఎప్పుడయితే హద్దులు లేని స్వేచ్ఛని పొందుతారో, అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

ఈ రెండు రోజుల కార్యక్రమం మీరు హద్దులులేని చేతన స్గితిని పొందటానికి, హద్దులు లేని స్వేచ్చని పొందటానికి సహాయం చేస్తుంది. సహజంగానే అది మన శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం ధ్యానపీఠం ఆచార్యులు నిర్వహించుతారు. నేను రెండు సెషన్స్‌కి మాతం ఉంటాను. అయితే నేను పూర్తిగా ఆరోగ్య స్సురణ కార్యక్రమం తీసుకుంటాను. నేను అమెరికాలో నిత్యానంద స్సురణ కార్యక్రమం చేయటం లేదు. ఒకటి మాత్రం వేంకోవర్‌లో చేస్తాను.

నేను మా ఆశ్రమంలో ఉండేవారికి మాత్రం పూర్తి శిక్షణని ఇస్తున్నాను. దీనిలో హీలర్స్ కూడా పాల్గొనవచ్చు. మీరు హీలరుగా నాచేత నియమించబడితే, మీరు ఈ క్లాసుకి రావచ్చు. నేను గీతా జ్ఞాన యజ్ఞం అయ్యాక రాత్రిపూట క్లాసులు తీసుకుంటున్నాను. ఉదయం క్లాసులకి ఎవరయినా రావచ్చు. కానీ సాయంత్రం క్లాసు మాత్రం కేవలం హీలర్స్‌కే. ఎందుకంటే అందులో ధ్యానం చాలా లోతుగా, తీవ్రంగా ఉంటుంది. నేను ఆశ్రమం వారితో ఎక్కువ సమయం ఉండాలి కాబట్టి నేను వేరే కార్యక్రమలు చేయటం లేదు. కేవలం ఆరోగ్య స్సురణ కార్యక్రమం ఒకటే చేస్తున్నాను.

ప్రశ్న యుద్దం చేసారు. ఎందుకు?

జవాబు మహాభారత యుద్ధం మొదలులో అందరూ ధర్శాన్ని అనుసరించారు. అందరూ నీతి మార్గంలో ఉండేవారు. ఆ తరువాత ఆధర్మం మొదలయింది. అవినీతితో, రాతిపూట చంపటం ఇలా జరగటం మొదలయింది. ఉప పాందవులని నిద్దపోయే సమయంలో చంపేసారు. అర్హునుడు కర్ణుణ్ణి, చేతిలో ఆయుధాలు లేని సమయంలో చంపాదు. అభిమన్యూణ్డి, చేతిలో ఆయుధం లేని సమయంలో అందరూ కలసి చంపారు. అప్పుడు అతను చాలా చిన్నవాడు. అతనిని అతని తాత కళ్ళముందే బంధువులే చంపేసారు.

మీరు అడిగిన ప్రశ్న సరియైనదే. అసలు అప్పుడు ఏమి జరిగిందంటే యుద్ద ప్రారంభంలో ధర్మం ఉండేది. క్రమంగా కౌరవులు అధర్మం మొదలు పెట్టారు.

అలాగే పాండవులు కూడా ధర్మం వదిలారు. అలా ఒకరి తరువాత ఒకరు అధర్మదారులలో యుద్ధం చేసారు.

పదవరోజు వచ్చేసరికి నిబంధనలని వదిలేసారు. అది క్రూర యుద్ధంగా మారింది. అవినీతి యుద్ధంలా మారింది. ఇక అది ధర్మక్షేతం కాదు. భీష్ముడు బతికి ఉన్నంత వరకూ ధర్మం ఉన్నది.ఆయన చనిపోగానే అధర్మం మొదలయింది. అది యుద్ధభూమి కాదు క్రకూర యుద్ధ భూమి. అధర్మ భూమి అయింది.

ప్రశ్న స్వామీజీ, ప్రతి నిద్ద పోవటం, మేలుకొనటం, మరణం, జీవమయితే, మనం జన్మించినప్పుడు లౌకిక జీవితాన్ని సృష్టించుతాము. ప్రపతి మేలుకొలుపు కొత్త జీవితానికి ఒక అవకాశమేనా?

జవాబు అవును. ప్రతిరోజు మీరు భౌతికంగా, మానసికంగా మారటానికి ఒక అవకాశం. మీకు వివరంగా చెబుతాను. మీరు మీ శరీరాన్ని కూడా మార్సవచ్చు. మీ మనస్సునే కాదు, మీ శరీరాన్ని కూడా మార్చవచ్చు. ఎందుకంటే మీ మైండే మీ శరీరాన్ని తయారు చేస్తుంది. స్పష్టంగా తెలుసుకోండి. ప్రతీ రోజు మీరు మారటానికి మీకొక అవకాశం ఇస్తుంది. ప్రతీ నిద్దా మరణం. ప్రతి మేలుకొలుపు పునర్దన్మ. ఇది జనన మరణం అని స్పష్టంగా తెలుసుకోండి. ప్రతిరోజు మీరు మారటానికి ఒక అవకాశం.

మీరు ఎప్పుడయితే మేలుకుంటారో అప్పుడు మీ సూక్తు శరీరం మీ శరీరంలో సర్శుకుంటుంది. అప్పుదు మీకు ఉండే అలోచనలు, మీ మానసిక స్గితి, మీ మూడ్ అన్నీ మీరు ఆ రోజు చేయబోయే పనులని ప్రభావితం చేస్తాయి.

మీరు నిద్దలేచినప్సుడు, మంచం మీద పదుకునే, మీ చేతులతో మీ శరీరాన్నంతా, తల దగ్గర నుంచి కాలివేళ్ళ వరకూ తడమండి మీ చేతులు తల దగ్గర ఉన్నప్పుడు, నాకు చాలా అందమయిన తల ఉన్నది అని అనుకోండి. మీ జుట్టు చాలా

అద్భుతంగా ఉన్నది అనుకోండి. మీకు నిజంగా ఉన్నదా లేదా అనే విషయం పట్టించుకోవద్దు. అలా చేయండి. అంతే. అప్పుడు సర్వాంతర్యామికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు అంత అందమయన తలని, జుట్టుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ విధంగా మీరు మీ శరీర భాగాలన్నింటినీ స్పృసించి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి.

ఇలా చేయటానికి మీకు 10 నిముషాల సమయం పట్టవచ్చు. ఇది చాలా శక్తివంతమయిన సుఫీ పద్ధతి. ఇలా చేస్తే మీ మూడ్ బాగా ఉదంటమే కాదు, మీ మీద మీకు ప్రేమ పెరుగుతుంది. ఇలా చేసినప్పుడు మీకు ఇతరులన్నా కూడా ప్రేమ కలుగుతుంది. అవును. ప్రతి మేలుకొలుపు మీ జీవితాన్ని మార్చుతుంది. అయితే అలా మారాలి అంటే, మీరు దానిని ఎలా మార్చాలో తెలుసుకొని, దానిని మారనీయాలి.

మనందరం పరబ్రహ్మ శ్రీకృష్ణని ప్రార్గించుదాము. ఆయన మనవి భక్తియోగంలో సత్యాలని మనకి అనుభవం కలిగేలా చేయమని, ప్రతి ఒక్కరినీ మనం ప్రేమించగలిగే శక్తినివ్వమని ప్రార్ధించుదాము. మనందరికి సచేతనమయిన భక్తిని ప్రసాదించమని, ప్రేమని ఇవ్వమని శాశ్వతానందమయిన నిత్యానందాన్ని దాని అనుభవాలని వ్యాపింప చేయుదురు గాక. నిత్యానందం.

ధన్యవాదాములు.

శ్లోకం

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం.

వసుదేవ పుత్రా, కంసచాణూరలని వధించిన దేవాది దేవా,

దేవకీ మాతకి పరమాంనందాన్ని ఇచ్చే శ్రీకృష్ణా, జగద్గురువైన నీకు వందనములు దీనితో 12వ అధ్యాయమయిన భక్తియోగం అనే శ్రీకృష్ణార్జునుల మధ్య సంభాషణ సంపూర్ణం. ఇది బహ్మ విద్యా యోగ శాశ్రస్తమయిన భగవద్గీత అనే ఉపనిషత్తు నుంచి తీసుకొనబడినది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM:

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ రోజు మన మధ్యఉన్న ఒక అద్భుతమయిన మహాయోగి, పరమపావన గురు దేవులు. ఆయన శాశ్వతానంద స్థితిని చేరాలి అనే ఒకే ఒక సిర సంకల్సంతో అతి చిన్న వయస్సులోనే తీవ్రవమయిన తపస్పు చేసారు. స్వామీజీ భరత దేశమంతా పాదచారియె తిరిగారు.

ఆయన భారతదేశం, నేపాల్ లోని గొప్పగొప్ప యోగులు, రుషుల దగ్గర యోగా, తంత్రము, తూర్పుదేశాలకి సంబంధించిన వేదాంతా ఆది భౌతిక తత్త్య శాస్త్రాలు మొదలయిన విద్యలని సశాస్త్రీయంగా అభ్యసించారు. ఆయన అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలను లోతుగా, గాధంగా తెలుసుకున్న గొప్ప యోగీశ్వరుడు

స్వామీజీ యొక్క ప్రత్యేక లక్ష్యం ప్రతీ వ్యక్తి తనలో దాగి ఉన్న అద్భుత శక్తిని తెలుసుకునే విధంగా వారికి సహాయం చేయటం. ఆచరణాత్మకమయిన కరుణతో కూడిన ద్సక్సదంతో స్వామీజీ ప్రతి వ్యక్తీ యొక్క అంతరంగంలోనికి ఆత్మసాక్షాత్రార జ్ఞానాన్ని కలిగించాలి అని నిరంతరం వారిని తన ఆత్మీయ స్పర్శతో ప్రోత్సహించుతూ, ప్రపంచ నలుమూలలా లక్షల మందిలో అనూహ్యమయిన మార్పుని తెచ్చి వారి జీవిన విధానంలో పెనుమార్పుని తెచ్చారు.

స్వామీజీ, తన దివ్య ఆరోగ్య చికిత్సా స్పర్శతో నిత్య ఆధ్యాత్మిక చికిత్నా పద్ధతిని ప్రపేశ పెట్టారు. ఇది ఒక సశాస్త్రీయమయిన ఆధ్యాత్మిక చికిత్స పద్దతి. ధ్యానం ద్వారా అనారోగ్య లక్షణాలని బాగుచేసి ఆరోగ్యమంతులని చేసే పద్ధతి. స్వామి ప్రత్యక్షంగా తన దివ్య స్సర్శతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ఆరోగ్యవంతులని చేసారు. స్వామీజీ చేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన హీలర్స్ అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యవంతులుగా చేసే పుణ్యకార్యంలో నిరంతరం నిమగ్సమయి ఉంటారు. స్వామీజీ, ఆయనచే నియమించబడిన హీలర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో నిమగ్నమయి, తలనొప్పి వంటి చిన్న వ్యాధులు నుంచి కేన్సర్ వంటి భయంకరమయిన వ్యాధుల వరకు బాగుచేస్తున్నారు.

స్వామీజీ యొక్క ముఖ్య సందేశమైన ధ్యానము, శాశ్వతానందం (నిత్యానందం) అనే విషయాలని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన నిత్యానందా ఫౌందేషన్ సంస్థ ద్వారా అందరికీ అందేలా చేస్తున్నారు. ఈ విష్లవాత్మకమయిన కార్యక్రమాల ఆధ్యాత్మిక ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉన్నది. అదే విధంగా పశ్చిమ దేశాలలో జరిగే కార్యక్రమాల ప్రధాన కార్యాలయం లాస్ ఏంజిల్స్ ఉన్నది. ఈ కార్యక్రమం మొత్తం కేంద్రాల ద్వారా దేశాలలో నిరంతరం కొనసాగుతూ ఉన్నది. ఈ మొత్తం కార్యకలాపాలు ప్రతి వ్యక్తిలో మార్సుని తెస్తూ దాని ద్వారా సమస్త మానవ జాతిలో మార్పుని తేవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పని చేస్తున్నాయి.

స్వామీజీ ధ్యాన పద్గతుల గురించే ఇచ్చే స్పష్టమయిన, ప్రయోగాత్మకమయిన వివరణ ప్రపతి వ్యక్తీ భౌతికంగా మానసికంగా, ఆధ్యాత్మకంగా వికసించటానికి ఎంతో సహయం చేస్తుంది. ఈ విషయంలో కొన్ని వేల మంది ఆనందసేవకులు ప్రపంచం అంతటా నిరంతరం పనిచేసున్నారు.

స్వామీజీ తనకుతాను ఒక ప్రయోగశాలగా మారి, ప్రపంచవ్యాప్తంగా శాశ్వంజ్ఞలతో కలిసి పనిచేస్తూ పశ్చిమదేశాల సాక్ష్యాధారమయిన హేతువాదానికి, ప్రాచీన తూర్పుదేశాల అద్భుత మర్మయోగాకి మధ్య వారధి నిర్మిస్తూ సర్వ మానవాళి శ్రేయస్సు కోసం, వారి ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం స్వామి నిరంతరం కృషి చేస్తున్నారు.

శా స్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు మధ్యవారధి

పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వైద్యులు, శాశ్రస్త్రజ్ఞలతో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించి దాని ద్వారా మనవాతీత ఆధ్యాత్మిక విషయాలపై ప్రయోగాత్మక విశ్లేషణ చేసారు. ఆయన తన నాడీ వ్యవస్థపై (ముఖ్యంగా మెదడు యొక్క పని తీరు) అధ్యయనం చేసి వాటి ఫలితాలను వైద్యశాస్త్రంలోని రహస్యాలను అధ్యయనం చేయటానికి ఉపయోగించారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా, కొన్ని రకాల వ్యాధులకు, ముఖ్యంగా కాన్సర్, ఆర్గటీస్, మత్తుపానం వంటి వ్యాధులను తగ్గించే అవకాశం, అది సాధించే మార్గం ఉన్నాయి అని శా స్తజ్ఞులు అనుకుంటున్నారు. అంతేకాకుండా, ఈ ప్రయోగాల ఫలితంగా వారు మానవ మెదడుకి తన శరీరంలోని వ్యాధులను బాగుచేయాలి అని నిర్ణయం చేయగల శక్తి ఉన్నది అని చెప్పారు.

కొన్ని శతాబ్దాలుగా శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము మానవాళికి అత్యవసరమయిన ఈ విషయాలను వెల్లడి చేయటానికి పోరాదుతున్నాయి. ఆధ్యాత్మిక గురువులు ఎన్నోసార్లు, మైండ్‌లేని స్టితి అనే విషయం సత్యం అని, ప్రతి ఒక్కరు కచ్చితంగా ఆ స్గితిని సాధించగలరు అని చెబుతున్నా, శాస్ట్రజ్ఞలు మాతం ఆ విషయాన్ని ఆధారాలు లేవు అనే వాదనతో అంగీకరించలేదు.

ఈ శతాబ్దంలో మొట్లమొదటిసారి, అసాధారణమయిన అద్భుతాలు, శాస్త్రీయ వివరణకు అతీతమయిన విషయాలను శాస్త్ర విజ్ఞానానికి నిరూపించగలిగే తాకంచెవి వారికి దొరికింది. ఆధ్యాత్మికంగా అద్భుతాలు సాధించిన వ్యక్తికి చాలా శక్తులు ఏ విధంగా ఉంటాయో వెద్యపరమయిన నిరూపణలతో, సశాస్త్రీయమయిన వివరణ, స్వామీజీ పై చేసిన ప్రయోగాల ద్వారా దొరికినది. స్వామీజీ యొక్క మెదడు పనితీరుపై చేసిన పరిశోధనల ఫలితాలను ఈ క్రింది పేజీలలో వివరించబడినది. స్వామీజీ అమెరికాలో ఉండగా ఈ ప్రయోగాలు జరిగాయి

అద్భుతమయిన ఒక యోగీశ్వరుని మెండ్ :

డా. మురళీకృష్ణ, పెసిదెంట్, COO, INTEGRIS మెంటల్ హెల్త్ & జేమ్సా, ఎల్.హాల్ Jr. సెంటర్ ఫర్ మెంద్, బాడీ & స్పిరిట్, ఒక్షహామా వారు ఇచ్చిన నివేదిక ఈ విధంగా ఉన్నది.

A Mind Matters Column™ The Mind of a Mystic By R. Murali Krishna, M.D. President COO, INTEGRIS Mental Health & James L. Hall, Jr. Center for Mind, Body and Spirit

పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చక్కని ఆరోగ్యం కలిగిన యువకుడు. ఆయన చామనఛాయ శరీర ఛాయ కలిగి, భుజాల వరకూ పెరిగిన జుట్టుతో ఉన్న సౌమ్యత కలిగిన అందమయిన యువకుడు. ఆయన చాలా విశాల భావాలు కలిగి, చాలా కుతూహలం ఉన్న వ్యక్తి. ఆయన చూడటానికి అమెరికాలోని ఒక కాలేజీ విద్యార్ధిలా ఉంటారు. కాకపోతే ఆయనతో పోల్చినప్పుడు అమెరికాలోని కాలేజీ విద్యార్థి కొన్ని విషయాలలో వేరుగా ఉంటాడు. అమెరికాలోని కాలేజీ విద్యార్థి కాషాయ వస్త్రాలు ధరించరు, తలపాగ కట్టుకోరు. అతనికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం వంటి అనుభవాలు లేవు. ఆ విద్యార్షిని ఎవరూ గురువుగా, హీలర్‌గా, అద్భుతమైన యోగిగా ప్రపంచంలో అన్ని మూలల నుంచి లక్షల మంది గుర్తించరు.

అద్భుతమయిన యోగి అనే మాట స్వామీజీకి సరీగ్గా సరిపోతుంది. ఇటువంటి యోగులు భగవంతునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారు, అనే విషయం యోగీ సంస్మృతి తెలియజేస్తుంది. యోగులు అంతిమ సత్యాలని పొంది ఉంటారు అని చెబుతారు. అది ఏవిధంగా ఉంటుంది అనేది తెలియదు. యోగీశ్వరుదు అని మనం అసుకోగానే మన ముందు నిత్యానందం తో నిందుగా ఉండే వ్యక్తి, ఉన్నతమైయిన, మహత్తరమయిన ఆలోచనలతో ఉండి మనలో ఎవరికీ లేని ఆత్మసాక్షాత్మారం పొందిన వ్యక్తియొక్క చిత్రం మన కళ్ళముందు ఉంటుంది. అటువంటి యోగీశ్వరుని గురించిన ఆలోచన మాత్రం చేత మనలో గొప్పశాంతి సౌఖ్యం కలుగుతుంది.

ఇదంతా కూడా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పూర్తిగా సరిపడే వివరణ. స్వామి 27 సంవత్సారాల, దక్షిణ భరత వ్యక్తి, స్వామీజీ దగ్గరికి ప్రపంచం అన్ని మూలల నుంచి లక్షలాది మంది తమలో ఉన్న వ్యాధుల నివారణ కోసం వస్తుంటారు. ఆధునిక వైద్యం పరిష్కరించలేని సమస్యలతో వారు స్వామీజీ సమక్షానికి వస్తారు. ఆయన తన దివ్య స్సర్శతో వ్యాధులని నిర్మూలించుతారు. స్వామీజీ జీవిత చరిత్ర అంతా అద్బుతాలతో నిండియున్నది. ఆయన చిన్న వయస్సులో ఇల్లువదలి, భారతదేశంలో అనేక ఆశ్రమాలలో ఉండి, వేదాంత విషయాలు, ఆధ్యాత్మిక విద్యలు విస్తృతంగా చదివి, ధ్యాన పద్ధతులని శాస్త్రీయంగా మలచి ఆ సాధనలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారు.

ఈ మధ్య స్వామీజీ ఒక్లహామా పట్టణం గుండా ప్రయాణిస్తూ అక్కడ ఆగారు. అప్పదు నేను ఆయనని కలిసి, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులలో ఆయన ధ్యానం చేసే సమయంలో మెదడుని పరిశీలించి అధ్యయనం చేయాటానికి అనుమతి అడిగాను. నా ఉద్దేశం ఏమిటంటే ధ్యానం అనే అద్భుతం జరిగే సమయంలో

మెదడులో జరిగే విషయాలను అర్ధం చేసుకొని, వాటి పరిమాణం లెక్కకట్ట తెలుసుకోవాలి. స్వామీజీ ధ్యానం అనేది శాశ్త్రీయ ప్రపక్రియ అని నమ్ముతారు ఆయన

ఈ ప్రయోగానికి వెంటనే ఆనందంగా ఒప్పుకున్నారు.

స్వామీజీ పాల్గొన్న ఈ ప్ర‌యోగంలో ఒక్షహామాలోని పేరు, అనుభవం ఉన్న దాక్టరు, శాగ్రస్తజ్ఝలు కూడా ఉన్నారు. వాళ్ళు దా॥ ఫోర్టీస్, డా॥ రువే, డా॥హిగ్గిన్స్ వీరందరూ జిమ్ తోర్సే రిహాబిలిటేషన్ సెంటర్, న్యూరోసైకాలజీ డిపార్షుమెంట్‌కి సంబంధించిన వారు. దా॥ చాకో, PET సెంటర్, ఒక్లహామాకు చెందినవారు వీరంతా ఈ ప్రయోగాన్ని పరిశీలించి అధ్యయనం చేసారు. వారు స్వామీజీని అధ్యయనం చేయటానికి సాధారణంగా పేషెంట్లకి ఉపయోగించే సాంకేతిక పద్ధతులనే ఉపయోగించారు.

అధ్యయన ఫలితాలు "చాలా కచ్చితంగా ఇది అసాధారణ స్గితి అని నిర్ధారించాయి"

మెదడు యొక్క చర్యల చిత్రాలు

స్వామీజీ మెదడు యొక్క మొదటి దృశ్యాలని Positron Emssion Tomography పరికరం సహయంతో చూసారు. సాంప్రదాయ పరికరాలయిన X-rays, CT స్మానింగ్‌లా కాకుండా MRI, PET పరికరం మెదడులోని కణాల జీవరసాయన క్రియ ద్వారా మెదడులో జరిగే చర్యలని చిత్రాలుగా చూపించుతుంది. గూక్షోజ్ లాంటి పదార్ధన్ని రేడియో యాక్షివ్ PET ట్రేసర్‌కి అతికించారు. అప్పుడు PET స్కానర్ మెదడులోని జీవరసాయన చర్యలని ఎప్పుడు అవసరమయితే అప్పుడు చూపించేది.

స్వామీజీ విషయంలో దేనిని మెదడులో అయిన మెలకువగా, తెలివి కలిగిన స్థితిలోన్నప్పుడు మెదడులోని అతి చురుకుగా ఉన్న ప్రాంతాలని గుర్తించటానికి ఉపయోగించారు. దీనిని వాళ్ళు స్వామీజీ ధ్యానం ప్రారంభించిన ఆ సమయంలో ఆ తరువాత పూర్తిగా లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు మెదడులోని చర్యలని గుర్తించటానికి ఉపయోగించారు.

PET స్కానర్ పరీక్షల ఫలితాలు చూసి వారు నిర్ఘాంతపోయారు. ముందుగా నొసటివెపుగా ఉండే భాగాలతో మెదడు యొక్క చర్యలు అత్యంత చురుకుగా ఉన్నాయి. అవి ధ్యానం ప్రారంభ దశలో కూడా చాలా చురుకుగా ఉన్నాయి. ఆ చర్యలు సాధారణ వ్యక్తుల మెదడులో జరిగే చర్యలకంటే చాలా రెట్లు, అధికమయిన చురుకుతనంలో ఉన్నాయి. మెదడులోని ఈభాగం తెలివితేటలు, lశ్రద్ధ చూపటం, వివేకం, నిర్ణయాలు చేయటం మొదలయిన పనులని చేస్తుంది.

మేము స్వామీజీన గాధమయిన, లోతయిన ధ్యానంలోనికి వెళ్ళమని కోరినప్పుడు రెండు విశేషమయిన ఫలితాలని కనుగొన్నాము.

అందులో మొదటిది స్వామీజీ మెదడులోని అత్యధిక భాగం 90% నిశ్దుబ్ద మయిపోయింది. అది పూర్తిగా తన చర్యలని నిలిపివేసింది. అది ఎలా ఉంది అంటే స్వామి మెదడు అన్ని పాక్ చేసుకొని శలవలకి వెళ్ళిపోయిందేమో అనిపించేటట్టుగా ఉన్నది. అది పూర్తిగా నిశ్నబ్దంగా, విశ్చలంగా, పూర్తి ప్రశాంతతతో ఉంది. ఇది అంతా స్వామీజీ చేయాలి అని కల్పించిన పరిస్ధితి

రెండవ ఆశ్చర్యకరమయిన పరిశీలన ఏమిటంటే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM గాధమయిన లోతయిన ధ్యానంలో ఉన్నపుడు ఆయన మెదడులోని ముందు వైపు క్రింది భాగం చాలా ‌ప్ర‌కాశ‌వంతంగాను, స్ప‌ష్టంగా ఉన్న‌ది. ఈ భాగం అద్భుత‌మ‌యిన మూద‌వ‌క‌న్నుకి సంబంధిన భాగం

మేము తరువాత THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని ఆ సమయంలో మీరు ఏమి చేసారు అని అడిగినప్పుడు అయిన తన మూడవ కన్ను తెరచినట్లు చెప్పారు.

మూడవ కన్ను అనేది ఆత్మ యొక్క స్థానమని, ఇది విశ్వజ్ఞానం అంతరంగ జ్ఞానం యొక్క కలయికతో ఏర్సదే [పదేశం అని, ఇది స్పష్టతకి [పశాంతతకి నిలయమని అంటారు. లోతైన ధ్యానంలో ఉంటే మెదడులో తెరవబడే భాగం బహుశః సర్వాంతర్యామితో సంబంధం ఏర్సరచవచ్చు. అలాగే విశ్వశక్తితో సంభాషించే అవకాశం కల్పించవచ్చు అని అనుకోవచ్చు. ఈ భాగం ద్వారా యోగి తన అంతరంగ లోతులలోనికి, అక్కడ జరిగే అద్భుతాలలోనికి చూడగలుగవచ్చు. PET స్కాన్ చూపించిన ఈ భాగానే నేను మెదడులోని డి ప్రాంతం D-Spot అంటాను. డి అంటే దైవం కావచ్చు. అనందం కావచ్చు లేదా దొపామైన్ అనే ఒక పదార్గం కావచ్చు. (డొపామైన్ అనే పదార్గం శరీరానికి ఆసందాన్ని ఇస్తుంది) అంటే ప్రారంభదశరోని గుర్తుల [పకారం ధ్యానం ఆ ఆనందాన్ని [పేరేపించవచ్చు

మెదడులోని తరంగాలని కొలవటం (QEEG)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMపై చేసిన మరొక అధ్యయనం(QEEG) ని తెలుసుకోండి. QEEG అనేది మెదడులోని విద్యుత్ తరంగాలని లేదా మెదడులోని తరంగాలుని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది

మానవ మెదడులో నాలుగురకాల తరంగాలు ఉంటాయి. ఒక్కొక్క తరంగం ఒక్కొక్క వేగాన్ని కలిగి ఉండి మెదడు యొక్క వివిధ స్గితులను సూచిస్తుంది. ఉదాహరణికి బీటా తరంగాలు చిన్నవి, వేగంగా ఉండి అవి మెదడులోని మెలకువ స్గితిని సూచిస్తాయి. అల్పా తరంగాలు నెమ్మదిగా ఉండి పెద్గగా ఉంటాయి. అవి మనం బాగున్నాము. అనే ఆలోచనలకు సంబంధించి ఉంటాయి. తీటా తరంగాలు మన చేతన స్గితిని తెలియజేస్తాయి. అవి నిద్ధావస్గకి దగ్గరగా ఉంటాయి. ఈ స్థితిలో నిశ్శబ్దంగా నిశ్చలంగా, ప్ర‌శాంతంగా ఎటువంటి చుర‌క‌యిన ఆలోచ‌న‌లు లేని స్లితిని తెలియచేస్తాయి.

ఒక రోజులో చాలా మంది వ్యక్తులు ఈ నాలుగురకాల తరంగాలకదలికలని

భగవద్గీత - అధ్యాయం 12

(పేమే మీ జీవితం

కలిగిఉంటారు. అయితే ఒకదానిలోంచి మరొక తరంగంలోనికి వెళ్ళటం అనేది వారి ఆధీనంలో ఉండదు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM (QEEG) ఆధారంగా చూస్తే మెదడులోని తరంగాల కదలిక మీద పూర్తి నియం(తణ ఉన్నది అని నిరూపణ జరిగింది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM గాధమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మెదడు అతి మృదువుగా ఒక స్గితి నుంచి మరొక స్పితికి మారగలిగింది. ఎటువంటి అడ్డంకు అనుమానం లేకుండా మెదడులోని ద్రదవ పదార్ధం ఒక స్గితి సుంచి మరొక స్గితికి మారుతుండేది. అది ఎలా అంటే ఎంతో నెపుణ్యం గల పియానిస్ట్ ఒక [శుతి నుంచి మరొక [శుతిలోనికి మారినంత అద్భుతంగా మారుతుంది. (QEEG) మెదడులోని తరంగాలని అయిదు రంగులలో చూపిస్తుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని గమనించినప్పుడు ఇంధ్రనస్సులోని రంగులు ఒక దాని నుంచి మరొకటి కదులుతున్నట్లుగా అనిపించింది.