భగవద్గీత - అధ్యాయం 12
ప్రేమే మీ జీవితం ఉద్దేశం
రావణుడు వ్యాసుణ్ణి నగరంలోనికి తీసుకెళ్ళి అంతా చూపించుతాడు. ఎంతో గర్వంగా తన వైభవాన్ని చూపిస్తాడు. ఆ తరువాత రావణుడు వ్యాసమునిని "నీవు కూడా నీ కోసం ఒక భవంతిని నిర్మించుకోవచ్చు కదా!" అంటాడు.
అప్పుడు వ్యాసముని చిరునవ్వు నవ్వి "రావణా! నా జీవిత కాలం నాలుగు కల్పాలే. నాకు అంత సమయం లేదు. ఇల్లు కట్టుకుంటూ ఉన్న ఈ కొంచం సమయాన్ని నేను వృధా చేయలేను. ఇక్కడ నేను ఉండేది కేవలం నాలుగు కల్పాల కాలం మాత్రమే. ఎందుకు నేను ఇల్లు కట్టి సమయం వృధా చేసుకోవాలి?" అని అంటాడు.
రావణుడు జీవించినది కేవలం ఒక కల్పమే. దాని కోసం అతను అంత పెద్ద భవంతిని నిర్మించుకున్నాడు. వ్యాసుడు నాలుగు కల్పాలు జీవించాడు. రావణుడి కంటే నాలుగు రెట్లు ఎక్కువ కాలం జీవించాడు. అయినా కూడా ఇల్లు కట్టుకోవటం సమయాన్ని, తన జీవితంలో ఒక భాగాన్ని వృథా చేయటమే అని అనుకున్నాడు.
కాబట్టి ఎవరయితే తనకోసం ఇల్లు కట్టుకోవాలి అని ఏమాత్రం అనుకోని వ్యక్తి, పూర్తిగా భక్తితో నిండి ఉండే వ్యక్తి నాకు ప్రియమయిన వాడు అని శ్రీకృష్ణుడు చెబుతాడు.
ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలి. నేను భక్తుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారు నన్ను అడుగుతుంటారు "స్వామీజీ! ఇది కొత్త స్థలం. ఇల్లు మీకు కొత్త కదా! మీకు నిద్రపట్టిందా?"
నేను వాళ్ళకి చెబుతాను, ఎప్పుడయితే మీకు ఒక ఇంటితో మాత్రమే సంబంధం ఉంటే, అప్పుడు కొత్త చోటికి వెళ్ళినపుడు కష్టపడతారు. మీకు ఏ ఇంటితో ఎక్కువ అనుబంధం లేకపోతే మీరు ఎక్కడికి వెళితే అదే మీ ఇల్లు అనుకుంటారు.
ఆశ్రమ రికార్డుల ప్రకారం గత రెండేళ్ళలో నేను కొన్ని ఇళ్ళకి వెళ్ళాను. కొన్ని సార్లు భరత్ లో ఒకేసారి కొన్ని ఇళ్ళకి కూడా వెళతాము. కొన్నిసార్లు ప్రతి ఇంటిలో పాదపూజ చేస్తారు. నేను అలా ఇంటికి వెళ్ళి వారిని దీవించి వస్తుంటాను. నేను ప్రపంచమంతా కొన్ని వందల ఇళ్ళల్లో ఉన్నాను. నేనెప్పుడూ ఎక్కడా ఇది కొత్త ప్రదేశం అని అనుకోలేదు. ఉండటానికి కష్టపడలేదు. నాకు ఎక్కడ ఉన్నా అది నా ఇల్లే అనిపించేట్లు ఉంటాను. మర్నాడు వారు నన్ను అదుగుతుంటారు "స్వామీ! మీకు సౌకర్యంగా ఉన్నదా! మీరు బాగా నిద్రపోయారా?" అని
నేను వారికి చెబుతాను, ఇందులో ఏముంది, నేను చేయి చాపితే భోజనం వస్తుంది. కాలు జాపితే నిద్రవస్తుంది. అంతే. అదే జీవితం. అంతకుమించి ఏమీ లేదు. మీరు ఏ ఒక్క ఇంటితో అనుబంధం పెంచుకోకుండా ఉంటే, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతిగా ఉండగలుగుతారు.
కొంతమంది నన్ను అడుగుతుంటారు. నిరంతరం నేను ఎలా ప్రయాణాలు చేయగలుగుతున్నాను అని.
ఈ ప్రశ్న ముఖ్యంగా వ్యాపార విషయంపై బాగా ప్రయాణాలు చేసే వారి దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు ఇలా చెబుతారు. "మేము ఒకటి రెండు చోట్లకి వెళితే, తిరిగి వచ్చాక వారంరోజులకి కానీ పూర్తిగా సర్దుకోలేము. అప్పటికి కానీ మేము మా రోజు వారి పనిలోనికి పూర్తిగా వెళ్ళలేము. సౌకర్యంగా ఉండలేము. మీరు ఎలా అలా నిరంతరం ప్రయాణాలు చేస్తూనే ఉంటారు?"
నేను ఒక వారం కంటే ఎక్కువగా ఎక్కడా ఉండను. ఇప్పుడు లాస్యాయాంజిల్స్ లో ఆశ్రమం వచ్చాక అక్కడ మాత్రం నేను ఒక వారం కంటే ఎక్కువ ఉంటున్నాను. లేకపోతే ఎక్కడా ఒక్క వారం మించి ఉండను.
నేను ఇలా ప్రయాణాలు చేస్తూ సౌకర్యంగా ఉండటంలో గల రహస్యం ఏమిటంటే నేను ఏ ఇంటితో కూడా అనుబంధం పెంచుకోను. అప్పుడే మనం ఈ ప్రపంచం మొత్తంతో అనుబంధం పెంచుకోగలం. అటువంటప్పుడు మీరు ఎక్కడ ఉన్నా విశ్రాంతిగా ఉండగలరు. ఆనంద పారవశ్యంలో ఉండగలరు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు, ఎవరియితే ఏ ఇల్లుని పట్టించుకోదో, అటువంటి వ్యక్తి భక్తితో ఉంటాడు. అతనే నాకు చాలా ప్రియమయిన వ్యక్తి.
ఎవరయితే ఏదో ఒక ప్రాంతానికి స్థిరపడిపోడో అతను తన మైండ్లో (మనస్సుతో) స్థిరపడగలడు.
ఎప్పుడయినా ఎవరయినా రమణమహర్షి దగ్గరకి వచ్చి ఎలా ధ్యానం చేయాలి అని అడిగితే ఆయన అరుణాచలం కొండ మీద ఏకాగ్రతని నిలిపి దాని చుట్టూ ప్రదక్షణ చేయమనే వారు (తిరగమనేవారు). దానికి వారు ఆశ్చర్యపోయేవారు. ఆయన ఎందుకు అలా చెప్పాడు? అలా అయితే ధ్యానం ఎలా చేస్తాం. నడుస్తూ చేయం కదా! ధ్యానం అంటే నేల మీద కూర్చొని చేసేది కదా! అని అనుకునే వారు.
అది కాదు. అర్ధం చేసుకోండి. ఎప్పుడయితే శరీరం కదులుతూ ఉంటుందో, మనస్సుని స్థిరంగా ఉంచటం తేలిక. మా చక్రా ధ్యాన కార్యక్రమం, లైఫ్ బ్లిస్ కార్యక్రమాలలో ఒక ధ్యానం చేయించుతాము. ఆ ధ్యానం విశుద్ధి చక్రం మీద (గొంతు దగ్గర ఉండే చక్రం) చేయించుతాము. ఆ ధ్యానంతో చాలా చురుకుగా శరీరాన్ని కదపాలి. అలా కదుపుతూ (నడుస్తూ) విశుద్ధి చక్రం మీద ధ్యాస ఉంచాలి. ఇది శక్తిని ఇచ్చే చాలా గొప్ప ధ్యాన పద్ధతి. ఎప్పుడయితే శరీరం కదులుతూ ఉంటుందో, మనస్సుని స్థిరంగా ఉంచటం చాలా సులభం.
ఎప్పుడయితే ఎవరయినా పూర్తి వర్తమానంలో ఉంటారో, ఎప్పుడయితే తెలుసు కోగల స్థితిలో ఉంటారో, ఎప్పుడయితే వారి చేతనస్థితి విప్పారి ఉంటుందో, అప్పుడు వారిలో ద్వైత్వం ఉండదు. అప్పుడు ఆత్మ పరమాత్మలో, విశ్వాత్మలో లీనమయిపోతుంది. మనం భగవంతునితో ఒకటిగా అయిపోతాము. అప్పుడు అందరూ మనవారే అయిపోతారు. అప్పుడు స్నేహితులు, శత్రువులు అనే తేడా ఉండదు. మనం ప్రకృతిలో ఒకటి అయిపోతాము. అప్పుడు చలి, వేడి అని అనుకోము కదా! దానితో అసౌకర్యంగా ఉండే ప్రశ్న లేదు. ఈ అనంత విశ్వంలో మనమూ ఒక భాగమయినప్పుడు అంతా ఒక్కటే అని అనుకున్నప్పుడు ఇంకా గౌరవం అగౌరవం అనే మాట ఉండదుగా. గౌరవం, అగౌరవం ఎవరి నుంచి? ఎవరితో? అనుభవమూ, అనుభవం పొందే వ్యక్తి ఇద్దరూ ఒక్కటే. అనుభూతిని వెల్లడి చేయటం, అనుభవము అన్నీ ఒక్కటే.
శ్రీ కృష్ణుడు మన అందరినీ ఒక స్థితికి తీసుకువెళుతున్నాడు. అదే శ్రీకృష్ణుని యొక్క చేతనస్థితి. అదే భగవంతునిలో ఒకటిగా విలీనమయ్యే స్థితి. ఆ భగవంతుని లోనే ద్వైత్వం అంతా విలీనం అయిపోతుంది.