KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/సత్సంగత్యే నిశ్చంగత్వం నిస్పంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిSign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

సత్సంగత్యే నిశ్చంగత్వం నిస్పంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తి

ఇది శంకరాచార్యులు రచించిన భజగోవిందంలోని ఒక ప్రసిద్ధి అయిన పాట.

ఈపాటలో శంకరాచార్యులవారు ఈ విధంగా చెబుతారు. అన్నిరకాల సంబంధాలని వదిలివేయటం ద్వారా కోరికలని పూర్తిగా తొలగించవచ్చు. కోరికలు లేని స్థితి మనలని నిశ్చలం, ప్రశాంతమయిన మనః స్థితిని కలిగిస్తుంది. ప్రశాంతత పరమానందాన్ని నింపుతుంది. పరమానందం మనకి ముక్తిని ప్రసాదించుతుంది.

శ్రీకృష్ణుడు సంతోషం లేనిస్థితి అని చెప్పినదానికి అర్ధం శాశ్వతమయిన సంతోషం. అది మన సంస్కారాల వలనకలుగుతుంది. అటువంటి సంతోషం వస్తుంది, పోతుంది. అది సంస్కారాలతో మనకి ఉన్నసంబంధాల వలన వస్తుంది. దానికి భ్రమలు, కల్పనలు శక్తిని ఇస్తాయి. మనం ఎప్పుడయితే ఇటువంటి సంతోషానికి అతీతంగా సంతోషం యొక్క శిఖరాగ్రానికి చేరతామో అదే పరమానంద స్థితి.

మనం పరమానంద స్థితికి చేరాలంటే సంతోషం, విచారం అనేస్థితికి అతీతంగా, సర్వోన్నత స్థితిని చేరాలి.

ఆదుర్దా లేదా ఆతృత అనేది మన ఆత్మకి ఉన్న కాన్సర్. మనం ఎప్పుడయితే ఆలోచించగల స్థాయికి చేరతామో, మనం ఆదుర్దాలో ఉండటం మొదలుపెడతాము. దీనితో వ్యధ చెందుతాము. మనం నిరంతరం బాధపడుతుంటాము. బాధపడటం, ఆదుర్దా పడటం. ఒత్తిడి అనేవి మన జీవితానికి ఊతకుర్రలు వంటివి.

ఆదుర్దా అనేది మనం అనుకున్నది చేయలేమేమో అనే భయం వలన కలుగుతుంది. మనకి మన కోరికలు ఆశలు ఉంటాయి. మనకి తెలిసిన మన నైపుణ్యం, శక్తి మనకి ఉంటాయి. కానీ చాలా సార్లు మన కోరికలు మనశక్తికి మన నైపుణ్యానికి సరిపడా ఉండవు. అవి నిజంగా సాధించగల దిశలో ఉండవు. అక్కడ కొంత ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్రదేశమే వ్యధ, బాధగా రూపాంతరం చెందుతుంది.

మనం కళ్ళుమూసుకొని ఒకదానిమీద కాని ఒక సంఘటన మీద కాని ఏకాగ్రత నిలపాలి అని అనుకోగానే, మన ప్రయత్నాన్ని ఆలోచనలు అడ్డుకుంటాయి. మనం దేనిమీద అయితే ఏకాగ్రత నిలపాలనుకుంటామో అది తప్ప మిగతా ఆలోచనలు వస్తాయి. అదే మన మనస్సు మన అంతరంగంలో నిరంతం మాట్లాడే వ్యర్ధపు మాటలు (chatter) దీనినే బుద్ధుడు 'కోతి వంటిమనస్సు' 'మనస్సు కోతి' (monkey mind) అని అంటాడు.

ఈ అంతరంగలోని మాటలు అనేవి మన మైండ్ అస్థిరంగా మన భూత, భవిష్యత్‌ల మధ్య తిరుగుతూ ఉండటం వలన జరుగుతాయి. ఇది మన మనస్సు మనకి జరిగిపోయిన అనుభవాలు మనం జాగ్రత్తగా నిలువచేసిన జ్ఞాపకాలు వీటికి, మనకు తెలియని మన ఆశలు, ఆశించటాలు జరగబోయేవి ఊహించే విషయాలకి మధ్య ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా స్థిరం లేకుండా మనస్సు చేసే ప్రయాణాన్నే ఆలోచనలు అంటాము.

ఆదుర్దా అనేది ఎప్పుడయితే మనం ఆశించినది జరగదు అని మన మైండ్ తెలుసుకుంటుందో అప్పుడు కలుగుతుంది. ఇది అసలు జరగని ఏదో ఒక దానికి

భగవద్గిత - అధ్యాయం 12

సంబంధించిన నష్టం. ఇది పూర్తిగా ఒక ఊహ. అది మనలోపల తీవ్రమయిన భావావేశాలని సృష్టిస్తుంది. మనం ఏదో ఒక భయంకరమయినది జరగబోతున్నది అని ఆదుర్దాతో చూస్తాము. అయితే అసలు ఏదీ జరగకముందే మనం ఆచెడు జరిగే దాని గురించి చూస్తామ. ఆతరువాత తీవ్రమయిన కోపంతో అది జరిగేదాకా ఎదురు చూసాము.

చాలాసార్లు మీరు చెడు జరుగుతుంది, అని అనుకున్నది జరిగిపోయాకా చాలా విరామంగా అయిపోతారు. ఎప్పుడయితే భవిష్యత్ వర్తమానంలోనికి వస్తుందో మీలో ఆదుర్దా అనేది ఉండదు.

ఆదుర్దా అనేది భవిష్యత్‌కి సంబంధించినది : దాని మూలం మన అహంకారం. అహంకారం ఆశలు, ఆశించటాలు వంటి వాటిని సృష్టిస్తుంది. అవే 'నేను' 'నాది' అనేవి ఆశించినది జరగదేమో అనే భయం. దీనితో పాటు వస్తుంది. ఆదుర్దాని దాటిపోవాలి అంటే మనం వర్తమానంలో ఉండాలి.కేవలం వర్తమానం అనే ఆ పాయింట్ దగ్గరే మన అంతరంగంలోని మాటలు ఆగిపోయేది. ఎప్పుడయితే ఆ మాటలు ఆగిపోతాయో అప్పుడే ఆదుర్దా అనేది మాయం అవుతుంది.

శ్రీకృష్ణుడు 'ఎవరయితే ఆదుర్దా లేకుండా ఉంటారో, వారే నన్ను పొందగలగుతారు' అని అంటాడు. ఈ మాట అర్ధం ఏమిటంటే ఎవరియితే వర్తమానంలో, అంటే ఈ క్షణంలో ఉంటారో వారే నా దగ్గరకి రాగలరు అని. వర్తమానంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు మనం మన ఉనికిలోని సత్యాన్ని స్పష్టంగా చూడగలుగుతాము.అదే శ్రీకృష్ణుని చేతనస్థితి. అప్పుడే మనం అతనిలో ఒకటిగా అయిపోగలం.

కోపాన్ని పోనివ్వు. ఎవరికైతే కోపం ఉండదో అతను నన్ను చేరగలడు అని భగవానుడు అంటాడు. పై మాటలని యథాతథంగా అర్ధం చేసుకుంటే మనం ఎవరం కూడా శ్రీకృష్ణని చేరలేము.

మనందరం ఎప్పుదో ఎక్కడో ఏదో ఒక సందర్భంలో కోపాన్ని ప్రదర్శించినవారమే. కోపం అనేది అనుకూలమయిన శక్తి సంపద (positive energy) కోపాన్ని ప్రదర్శించటం అనేది చాలా అనుకూలమయిన మంచి విషయం. ఇది కోపాన్ని ప్రదర్శించిన వ్యక్తికి, దానిని తీసుకున్న వ్యక్తికీ ఇద్దరికీ మంచి చేస్తుంది. ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు.

చాలా సందర్భాలలో కోపం అనేది అపరాధ భావంతో బయటకి వస్తుంది. ఎప్పుడయినా భార్యకాని భర్తగాని ఎవరయినా తప్పు చూపించితే మనం మనని సమర్థించుకోవటం ప్రారంభిస్తాము. మనం చేసిన తప్పును తెలుసుకోగానే, మనలో అపరాధ భావం బయటికి వస్తుంది. అయితే ఆ విషయం మనం ఒప్పుకోము. దాని బదులు కోపం తెచ్చుకుంటాము. మనం చేసిన తప్పు దాచాలి అని చూస్తాము. దానిని ఎవరైనా బయటకి తీసి చూపించితే మనకి ఇష్టం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే చిరుతపులి తన మచ్ఛలని దాచి పెట్టటానికి ప్రయత్నించినట్లుగా ఉంటుంది.

ఇటువంటి కోపం మనపైకి గురిపెట్టబడి ఉంటుంది. మనలోని అపరాధభావం అంతరంగంలో మన బలహీనతల మీద కోపంగా మారుతుంది. అపరాధభావం అనేది మనం చేసే ఒక పెద్ద పాపం. మనం ఏ పని చేసినా ఆ సమయంలో మన తెలివితేటలతో, తెలుసుకో గల స్థితిలో ఉండి ఆ సమయానికి సరిపడే విధంగా చేసాము. ఒకసారి మనం ఏమిచేయాలనుకున్నాయో దానిని చేసేసాక, ఇక ఎట్టి పరిస్తితులోను దానిని మార్చలేము.

'కదిలే చేయి వ్రాస్తుంది, వ్రాయబడిన తరువాత ముందుకి కదులుతుంది' అని ఉమర్ కయ్యాం అంటారు. అది వ్రాసాక కదులుతుంది. ఆతరువాత మీ కన్నీరు కాని, మీ సానుభూతి కాని దానిని వెనుకకి తేలేవు. జరిగిపోయిన దానిని తిరిగి మార్చలేము. కాని అపరాధ భావాన్ని మార్చవచ్చు. ఆ భావాన్ని వదిలివేయవచ్చు.

భగవద్గిత - అధ్యాయం 12

మీరు చేసిన దానిని ఒప్పుకోండి. అంతే ముందుకి సాగండి. మీరు చేసిదానిని ఒప్పుకోను అని చెప్పి, ఆ విషయాన్ని ఒప్పుకుని ముందుకు సాగండి. మీరు అపరాధ భావాన్ని మీ నుంచి వెళ్ళిపోనీయండి. దానిని వదిలివేయండి.

ఎప్పుడయితే మనం అపరాధ భావాన్ని వదిలివేస్తామో, మన కోపం కూడా పోతుంది. ఎప్పుడయితే అపరాధ భావాన్ని వదిలివేస్తామో, మనలో అణిచివేయబడిన కోపం, పశ్చాత్తాపం, సమర్థించుకోవటం, లోపల లోపల కోపంతో మండిపోవటం ఇటువంటి భావావేశాలన్నీ వాటంతట అవే మాయమయిపోతాయి. అణచివేయబడిన కోపం వలన కాన్సర్ రావచ్చు. ఎవరయితే కోపాన్ని అణిచేసుకుని, నిశ్చలంగా శాంతంగా ఉంటూ, దానిని బయటకి వెల్లడి చేయరో వాళ్ళు ఆటంబాంబు మీద కూర్చున్నట్టే. అది ఎప్పుడైనా అనుకోకుండా పేలిపోతుంది. దాంతో అది కోపం ఉన్నవారికి, ఎదుటివారికి కూడా కష్టాన్ని నష్టాన్ని మిగుల్చుతుంది. లేదా అది అణగారిపోయి కాన్సర్‌లా బయటపడుతుంది.

మలేషియన్ సంస్కృతిలో చిన్నతనం నుంచీ పిల్లలని కోపం, దుఃఖం మొదలయిన వ్యతిరేకపు భావావేశాలు బయటకి ప్రదర్శించ కూడదు, అని నేర్పిస్తారు. ప్రతి ఒక్కరూ నిశ్చలంగా, శాంతంగా ఉండాలి అని చెబుతారు. కానీ ఎప్పుదో ఆకస్మాత్‌గా అగ్నిపర్వతం బ్రద్ధలవుతుంది. దాంతో వాళ్ళు పూర్తిగా అదుపు తప్పి చాలా కల్లోలాలు రేపుతారు. భావావేశాలని నియంత్రించటానికి ప్రయత్నించితే, మనం మన మీద పూర్తి నియం(తణని పోగొట్టుకుంటాము.

అప్పుడు మీరు అడగవచ్చు. ఈ బయటపడే కోపం సంగతి ఏమిటి? కోపాన్ని వెల్లడి చేసినప్పుడు బయటపడే హింసాత్మక కల్లోలం సంగతి ఏమిటి? ఒక్కసారి కోపాన్ని దానంతట అదేగా పోనిస్తే అప్పుడు బయటపడే కోపం, అంతరంగంలో కోపం ఇలాంటివి ఏవీ ఉండవు. మనం ఆవేశాలని సీసాలో పెట్టి గట్టిగా మూసేస్తాము. అది బద్దలవుతుంది. మన అంతరంగంలో కోపం మన చిన్నతనం

నుంచి అలా పేరుకుపోతూ ఉంటుంది. అది ఏవేవో చాలా కారణాల వలన గుట్టలుగా ఏర్పడిపోతుంది. మనం మనలోని వ్యతిరేకపు ఆలోచనలని సమాజానికి వ్యతిరేకంగా మనలో నింపుతుంటాము. సమాజపు నిబంధనలననుసరించి మనం వాటిని వెల్లడి చేయలేము. అలా చేయటం సంస్కారం కాదు కాబట్టి, బాగుండదు కాబట్టి వెల్లడి చేయము. అయితే అది ఎప్పుదో ఒకప్పుడు ఆకస్మాత్‌గా పేలిపోతుంది.

మనం కోపాన్ని మనుషుల మీద చూపించే కంటే విషయాల మీద చూపించటం నేర్చుకోవాలి. కోపం మనుషుల మీద వచ్చినప్పుడు దానిని వెంటనే కోపకారణమయిన అసలు సంగతి మీదకి మరలించాలి. అంతేకాని అది మనుషుల మీద ఉండకూడదు. వ్యక్తులు కేవలం కోపానికి మీరు చూపే కారణం మాత్రమే. అలా మనుషుల మీద కోపం వెల్లడి చేస్తే, అసలు విషయం లోతుగా ఎక్కడో కప్పబడిపోతుంది. అది ఎప్పుదో ఒక ప్రమాధికారిగా తిరిగి వస్తుంది. అది ఒక ఛేదించలేని విషవలయంలా తయారవుతుంది.

ఏదిఏమయినా మనం కోపాన్ని వెల్లడి చేయాలి. దాన్ని పూర్తిగా ఆ సంఘటన మీద చూపించండి. అంతేకాని దానికి వ్యక్తులకు సంబంధాన్ని పెట్టవద్దు. మనం మనకి కాని, ఎదుటి వారికి కానీ హాని కలుగకుందా కోపాన్ని వెల్లడి చేసి దానిని వదిలించుకోవాలి. అది సంభవమే. దీనికి కొంచెం సాధన చేయాలి. అంతే.

ఎప్పుడయితే కోపాన్ని వెల్లడి చేస్తామో దానికి సంబంధించిన జ్ఞాపకాలు కరిగిపోతాయి. ఇక కోపం ఉండదు. అలా కొంతకాలం గడిచే సరికి కోపం అనేది రాకముందే అది మాయం అయిపోతుంది.

శ్రీకృష్ణ భగవానుడు ఈ స్థితినే కోపానికి అతీతమయిన స్థితి అని అంటాడు. ఆ స్థితికి చేరినవారు ఆయనని చేరగలరు.

ారాయ అనపేక్ష శ్నుచిర్లక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారమ్బ పరిత్యాగీ యో మద్మక్త స్ప మే (పియః (12:16)

అర్గం : అనపేక్ష = కోరికలు లేనివాడు : శుచిః = శుభ్రత గలవాడు : దక్షః = కార్యసమర్థుడు : ఉదాసీనః = తటస్తంగా ఉండేవాడు : గత వ్యధః = దిగులు, కలత లేనివాడు : సర్వారంభ పరిత్యాగి = సర్వకార్యములని పరిత్యజించిన వాడు : యః = ఎవడు : మద్భక్తః = నాయందు భక్తి కలవాడును : సః = అతడు : మే = నాకు : (పియః = (పియమయినవాడు

భావం : కోరికలు లేనివాడు, బాహ్యాంతరాలలో శుద్ధికలవాడు, కార్య సమర్థుడు, (సమయస్ఫూర్తి కలవాడు) తటస్నుడు, కలత లేనివాడు, సమస్త కార్యములయందు కర్మత్వమును త్యజించినవాడు, నాయందు భక్తి గలవాడు ఎవరు కలరో వారే నాకు (పియమయిన వారు.

ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా ఉన్నత స్థాయికి వెళతాడు. ఎప్పుడయితే మీరు సంతోషం, ఆతృత, కోపం వంటి భావావేశాలని వదిలివేస్తారో, మీరు ఒక విధమయిన నిశ్చలస్థితిని, శాంతి స్థితిని చేరతారు. ఆ నిశ్చలస్థితి మిమ్మలని భగవంతునికి దగ్గరగా తీసుకువెళుతుంది. దేనితోనూ సంబంధాలు పెంచుకోకుండా, భావావేశాలతో ఉన్న సంబంధం నుంచి కోరికలపై మమకారం తెంపుకునే స్థితికి మీరు చేరతారు.

మనం అవసరాలకి, కోరికలకి మధ్య తేదా తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం జీవించటానికి మనం మన అవసరాలని తీర్చుకోవాలి. అవి భోజనం, నిద్ర, ఇల్లు ఇలాంటివి. మహావీరుడు ఈవిధంగా చెబుతాడు. ఈ విశ్వశక్తి నీకు కావలసిన అవసరాలన్నింటినీ నీవు జన్మించినప్పుడే నీకు సమకూర్చింది.

మీరు కేవలం ఆ విశ్వశక్తిని (భగవంతుని) నమ్మితే చాలు. మనం ఈ భూమి మీద ‌బ‌త‌క‌టానికి కావ‌ల‌సిన‌వ‌న్నీ స‌మ‌కూరుతాయి. అంత‌కుమించి మ‌న‌కి ఏమీ కోరిక‌లు ఉండవు.

కానీ మనం ఇంకా కావాలి అని అడగటం మొదలుపెడతాం. మన అవసరాలు తీరటం మనకి సరిపోదు. మనం మన చుట్లు ప్రక్కల ఉన్నవారిని గమనించి, వాళ్ళు మన కంటే సౌకర్యాలతో జీవిస్తున్నారు అని అనుకుంటాము. ఎదుటివారు మనకంటే సంతోషంగా ఉంటే మనం భరించలేము. మనం ఎదుటివారు నిరంతరం బాధపడుతుంటే అప్పుడు ఆనందంగా ఉంటాము. ఎందుకంటే వారితో పోల్చితే మన దుఃఖం తక్కువగా అనిపిస్తుంది.

మన ప్రక్క ఇంటివారు కొత్త ఎ.సి. మెషిన్ కొంటే, మన ఇంట్లో వేడి పెరిగిపోతుంది. మన ఎదురింటి వారు రిఫ్రిజిరేటర్ ((ఫ్రిజ్) కొంటే, మన ఇంట్లో ఆహార పదార్దాలు పాడయిపోతుంటాయి. ఇవన్నీ మన మైండ్ ప్రారంభిస్తుంది. ఎదుటివారు కొత్తకారు

కొనగానే మనకారు స్లోగా అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కటి ఎదుటివారితో పోల్చుకోవటంతో సరిపోతుంది.

ఇది మనలో నిరంతరం 'తరువాత' ఏమిటి, తరువాత ఏమిటి? అని అనటమే మనం సాధించినది. సంపాదించిన కోరికని ఉపయోగించుకోవటం మొదలు పెట్టకుందానే, మన తరువాత కోరికకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. మనం పొందిన దానితో ఎప్పుడూ సంతోషపడటం. కోరిక వెనుక పరుగులు తీయటంలోనే ఆనందపడతాము. ఈ కోరిక వెనుక పరిగెత్తటానికి అంతం (చివర) ఉండదు.

మీరు మీ కుటుంబంలో అందరి కంటే ధనవంతులయితే, ఆ వీధికి ధనవంతులు అవ్వాలనుకుంటారు. ఆ తరువాత ఆ ఊరికి, దేశానికి ప్రపంచానికి ఇలా వెళుతూనే ఉంటారు. దీనికి చివర అనేది ఉండదు.

భగవాన్ రమణ మహర్షి చాలా అందంగా, ఆర్థంగా ఇలా చెబుతారు. " ఈ విశ్వం ప్రపంచంలో అందరి అవసరాలు తీర్చగలుగుతుంది : కానీ ఒక్క మనిషి కోరికలని మాత్రం తీర్చలేదు".

కోరికలకు అంతం ఉండదు. కోరికలు అంటే బాధలే. కోరికలు అనేవి మనం ఎదుటివారితో పోల్చుకున్నప్పుడు వస్తుంటాయి. అవసరాలు మనం ముందుకు పోగల శక్తిని ఇస్తాయి. మనకి దేనినైనా సాధించే శక్తిని ఇస్తాయి. కోరికలు మాత్రం బాధలని, కలతలని మోసుకువస్తాయి.వాటిలో మన బాధలు యొక్క విత్తనాలు ఉంటాయి.

నేను THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ కార్యక్రమం (NSP) లో క్లాసులు తీసుకున్నప్పుడు అందులో పాల్గొన్నవారిని శక్తి పొరల నుంచి ప్రయాణం చేయించుతాను. మనం చనిపోయినప్పుడు ఆత్మ మనలో ఉండే ఏడు శక్తి పొరలని దాటి వెళుతుంది. ఆ

క్రమంలో, బయటికి వెళ్ళిపోయే ఆత్మ తను ఆ శరీరంలో ఉన్నన్ని రోజులు జరిగిన వన్నింటినీ గుర్తు చేసుకుంటుంది. ఇది పాస్ట్రెరిప్లేలా ఉంటుంది. ఆ జీవిత కాలంలో జరిగిన ప్రతి సంఘటన, దాని జ్ఞాపకాలలో ఉంటుంది.

ఇలాంటి ఒక క్లాసులో నేను వారినందరినీ వారి కోరికలు అవసరాల గురించి వ్రాయమంటాను. వాళ్ళు కొన్ని పేజీలు నింపేస్తారు. నేను వాళ్ళని ఆ లిస్ట్ మళ్ళీ మళ్ళీ చూసి మార్పులు చేయిమంటాను. ఆ తరువాత వాళ్ళు ధ్యానం చేస్తారు. ధ్యానం చివరిలో నేను వారిలో ఆ లిస్టులోని కోరికలని గుర్తు తెచ్చుకోమని చెబుతాను. అయితే వాళ్ళు వ్రాసిన లిస్టులో కొంత భాగాన్నిమాత్రమే గుర్తు చేసుకోగలుగుతారు.

ఇది ఎలా వుంటుందంటే, వాళ్ళు వ్రాసిన లిస్ట్‌లోని కోరికలు ఒక పెద్ద వృక్షంలా ఉండి నిండా, కోరికలనే ఆకులతో ఉంటుంది. ధ్యానం చేసే సమయంలో ఆకులన్నీ పండిపోయి ఎండిపోయిన ఆకులులా అన్నీ రాలిపోతాయి. అవి ప్రాణంలేని ఆకులు. మిగిలిన కొంచం ఆకులు ఎంతో ప్రకాశంతో ఉంటాయి. అవి బంగారు ఆకులు.

వారి జ్ఞాపకాలలో మిగిలిన కోరికలే ప్రకాశంతో ఉంటాయి. ఆ కోరికలు అనుకున్నది సాధించటానికి కావలసిన శక్తిని తమలో నింపుకొని ఉంటాయి. ఇవే వారిలో ఉండే నిజమయిన కోరికలు.

ఈ క్రమాన్ని అంతా ఒక పద్ధతిగా జాగ్రత్తగా, పూర్తిగా తెలుసుకునే స్థితిలో చేస్తే, అవన్నీ కూడా నిస్వార్దపు కోరికలే ఉంటాయి. అవి ఆ వ్యక్తికి చాలా ఉపయోగపడతాయి. దానిలో అనుమానం లేదు. ఆ కోరికలు మానవజాతికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి నిస్వార్ధపు కోరికలు మాత్రమే నిరంతరం తమలో విశ్వశక్తిని నింపుకొని ఉంటాయి. అదే మన నిజమయిన తృప్తిని సాధించటానికి ఉపయోగపడతాయి.

భగవద్గీత - అధ్యాయం 12

(పేమే మీ జీవితం తీర్చిదిద్దుకోండి

ఎప్పుడయితే కోరికలు మన నిజమయిన కోరికలు అవుతాయో, అవి మన నిజమయిన అవసరాలని తీర్చగలగేటట్లు ఉంటాయో, ఎప్పుడయితే అవి మన అంతరంగంలోనికి శక్తిని వెల్లడి చేస్తుంటాయో, అప్పుడు మనం వాటిని సాధించటానికి ప్రయత్నించేసమయంలో మనం నిరాశ నిస్పృహలు పొందము. ఈ కోరికలు సహజంగా జరిగే ఒక క్రమంలో అవి తీర్చబడతాయి అని మనం తెలుసుకోగలుగుతాము. మనం పరుగులు తీయం. మనం సమస్యలలో ఉండం. అవి జరుగుతాయి అని మనం నమ్ముతాము. ఆ నమ్మకాన్ని ఒప్పుకాన్ని ఒప్పుకుంటాము.

శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ విధంగా ఓదార్పుతో చెబుతాడు. " నీ కోరికల బంధం నుంచి విముక్తుడవి అవ్వు. నిస్వార్ధంతో ఉండు అప్పుడు నీకు వ్యధలు ఉండవు. స్వేచ్చని పొందుతావు. అప్పుడు నీవు నన్ను చేరగలుగుతావు."

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభా పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియంః (12:17)

అర్గం : యః = ఎవరు : న హృష్యతి = సంతోషంతో ఉప్పొంగదో : నద్వేష్టి = ద్వేషింపదో : నశోచతి = శోకింపడో : న కాంక్షతి = కోరికలు కోరదో : యః = ఎవరు : శుభాశుభ పరిత్యాగి = శుభా అశుభములని వదిలివేస్తాడో : సః భక్తిమాన్ = అటువంటి భక్తుడు, మే = నాకు : ప్రియః = ప్రియమయినవాడు.

భావం : ఎవరయితే సంతోషింపదో, ద్వేషింపదో, శోకమును పొందడో, ఎవరయితే శుభాశుభములని వదిలివేస్తాడో, అట్టి భక్తుడు నాకు ప్రియమయినవాడు.

శ్రీకృష్ణుడు మన మనస్సుని నియంత్రించగల మరొక దశకి వెళతాడు.

ఇప్పుడు ఆయన ఎవరయితే ప్రేమించరో, ఎవరయితే ద్వేషించరో అని అంటారు. ఆయన ఎవరినీ ప్రేమించని వ్యక్తి గురించి మాట్లాడటం లేదు. మనం ప్రేమించినప్పుడు అందులో చాలా నియమ నిబంధనలు, షరతులు, అశించటాలు ఉంటాయి. మనం ఆశించేవి అన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నంతకాలం ఈ ప్రేమ బాగానే పని చేస్తుంది. ఎప్పుడయితే మనం ఆశించినదానికి కొంచెం వ్యతిరేకంగా ఏదయినా జరిగితే ఆ ప్రేమ సూర్యకిరణం పడిన మంచు బిందువులా మాయమవుతుంది. అప్పుడు ఆ స్థానంలోనికి ద్వేషం వస్తుంది.

ద్వేషం, ప్రేమ అనేవి ఒక నాణానికి ఉండే రెండు వైపులు. ఇది మన ప్రేమలో నియమ నిబంధనలు, ఆశించటం ఉన్నంత వరకూ ఈ రెండూ ఒకే నాణంలో ఉంటాయి. ఎప్పుడయితే మన ఆశలకి, ఆశించటానికి ఏదైనా సవాలు ఎదురైతే ప్రేమ కాస్తా ద్వేషంగా మారిపోతుంది. ఇటువంటి ప్రేమలో ఉండే సంతోషం కేవలం బయట సంతోషం మాత్రమే.

చాలాసార్లు మనం అనుకునే ప్రేమ కాలానికి, స్థలానికి సంబంధించి ఉంటుంది. ఎంతకాలం అయితే ప్రేమికుల మధ్య దూరం ఎక్కువగా ఉండి, వారు కలసి ఉండే సమయం తక్కువగా ఉంటుందో, అంతకాలం ఒకరిలో మరొకరికి లోపాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా చాలా చిన్నవిగా తక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఆశించటాలు తెలపటానికి సరిపడా సమయం ఉండదు. అవి ఏర్పడే అంతగా వారి మధ్య సంబంధం, సంభాషణలు జరగవు. ఎప్పుడయితే ఒకరికాకరు బాగా దగ్గరగా వచ్చి, చాలా సమయం కలసి ఉంటారో అప్పుడు ఒకరినొకరు చాలాసేపు చూసుకుంటారు. అప్పుడు వారిలోని చిన్న లోపాలు స్పష్టంగా కనపడతాయి. వారిలో చికాకు భావాలు మొదలవుతాయి. అది ప్రేమని ద్వేషంగా మార్చుతుంది. ప్రేమ, ద్వేషం అనేవి ఒకే విధమయిన భావాన్ని వెల్లడి చేసే వేరు వేరు పద్దతులు.

వాటిని మనం నిజాలు అనుకుంటాము. వీటిని మార్చాలి అంటే మనం ప్రేమలో ఆశించటాలు, నిబంధనలని వదిలివేయాలి.మనం అతిగా ప్రేమకి సంబంధాలు పెట్టుకోకూడదు. మనం నియమనిబంధనలు లేని ప్రేమని చూపించాలి.

మనం మన జీవితాలలో చాలా రకాలయిన సంబంధాల గుండా వెళుతాము. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం పూర్తిగా మన తల్లిదం(డుల మీద ఆధారపడతాము. మనం వారిచేత చాలా ప్రభావితం అవుతాము. ఈ ప్రేమలో నిబంధనలు ఉండవు. ఎందుకంటే మనకి ప్రత్యామ్నాయాలు ఉండవు. కాబట్టి జీవించాలి అంటే పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడవలసినదే. పిల్లల సహజలక్షణం, వారి ఏకాగ్రత వారి మీద మాత్రమే ఉంటుంది. వారికుండే భావావేశాలన్నీ వారి తల్లిదండ్రుల మీద వారి జీవనం కోసం ఆధారపడటం మీద ఉంటుంది. ఇది పూర్తిగా ఆధారపడే ప్రేమ.

మనం యుక్తవయస్సు వచ్చేటప్పటికి బయట ప్రపంచాన్ని చూస్తాము. మనం పిల్లలుగా తల్లిదంlదుల విషయాలలో అనుకున్న చాలా విషయాలని ప్రశ్నించటం మొదలుపెడతాం. అందుకే ఆ వయస్సులో వారు ప్రతి దానికి తిరగబడతారు. ఎదురించుతారు. వాళ్ళు ఆధారపడటం తగ్గించేస్తారు. వాళ్ళు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళు నిబంధనలని పట్టించుకోరు.

మనం పెద్దవారమయ్యాక మన జీవనం కోసం సమాజపు నిబంధనలు, కట్టణాట్లు అనుసరించుతాము. ఎందుకంటే మనం సమాజంతో కలిసి ఉండాలి కాబట్టి. అప్పుడు మనం కలసి బతికే సూతాలని నేర్చుకుంటాము. మనం అందరితో కలసి పని చేయటం నేర్చుకుంటాము. మనం వేరే వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటాము. లేకపోతే మనం ఈ సమాజంలో ఇమడలేము. పెద్దవారయ్యాక అందరూ నేర్చుకునే చాలా ముఖ్యమయిన పాఠం, అందులో అర్ధవంతమయిన

భగవద్గీత - అధ్యాయం 12

సంబంధ భాందవ్యాలని ఏర్పరచుకోవాలి. వీటిలో ముఖ్యమయినది భార్య భర్తల సంబంధం.

మనం పెద్దవారమయ్యే కొద్దీ మనకి ఆత్మాభివృద్ధి ముఖ్యం అనిపిస్తుంది. దానికి మనం ఇతరుల మార్గదర్శకత్వం తీసుకుంటాము. అప్పుడే మనం గురువుల కోసం వెతుకుతాము. గురువులతో ఉండే సంబంధం మన చిన్ననాటి సంబంధానికి వ్యతిరేకంగా ఉంటుంది. మనం మరొకసారి జీవనం గురించి ఆలోచించుతాము. అయితే ఈ జీవితం మన శరీరం, మనస్సు కాదు ఈ జీవితము ఆత్మకోసం మన ఆత్మయొక్క జీవనం కోసం మనం గురువులతో సంబంధాలని ఏర్పరచుకుంటాము. ఇది పూర్తిగా ఆధారపడే సంబంధం. అయితే ఈ ఆధారపడటం కొంచం వేరుగా ఉంటుంది. ఈ సంబంధాలు పనిచేయాలంటే, ఇది పూర్తిగా నిర్శందాలు లేనిది అయి వుండాలి.

గురువుతో, శ్రీకృష్ణునితో సంబంధం సజావుగా పని చేయాలంటే ఇక్కడ కావలసినది నియమనిబంధనలు లేని ప్రేమ. అది పూర్తి ఆధీనత. ఆధీనతలో ప్రేమ, ద్వేషం ఉండవు. ఆధీనత మాత్రమే ఉంటుంది.

ఎప్పుడయితే గురువుకి, సర్వాంతర్యామికి పూర్తిగా ఆధీనమయిపోతామో అప్పుడు మంచి చెడు, పాపం, పుణ్యం ఇలా ఏమీ ఉండవు. అన్ని మాయమయిపోతాయి.

ఆధ్యాత్మిక పరిధిలో ఆలోచించితే పాపం అనే మాట ఎక్కడా లేదు. మనపైన ఎవరూ కూర్చొని మన పాపాలని లెక్కలు కడుతూ పెన్సిల్, పేపర్ పట్టకుని ఉండరు. అసలు స్వర్గం, నరకం అనే స్థలాలే లేవు. నరకం, స్వర్గం అనేవి ఏవో కంటికి కనపడే స్థలాలు కాదు. మనం మానసికంగా మన మనస్సులో

ఏర్పరచుకున్నవి మాత్రమే. మనం పాపాలు ఎందుకు చేస్తాం అంటే మనం నరకంలో ఉంటాము కాబట్టి. అలాగే మంచిపనులు, ఎదుటివారికి మనకి హాని జరగని పనులు చేస్తున్నాము అంటే మనం మన స్వర్గంలో ఉన్నాము అని అర్ధం.

మతం మనని నియంత్రించటానికి స్వర్గం, నరకం అనే విషయాలని పాపం పుణ్యం అనే మాటలని తీసుకువచ్చింది. అర్ధం చేసుకోండి. పాపం, స్వర్గం, నరకం అనేవి ఎక్కడా లేవు. మిమ్మలని పాపులు అని ఎవరయినా అంటే వారే నిజమయిన పాపులు. వాళ్ళు మిమ్మలని అలా అన్నారు అంటే, వాళ్ళు మిమ్మలని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అన్ని మతాలు కూడా ప్రజలని భయం, ఆశ అనే వాటితో కంట్రోల్ చేయాలని చూస్తున్నాయి. దానినే కారెట్ స్టిక్ సూత్రం అంటారు. లేకపోతే మతం మనని తన గుప్పెటలో ఉంచుకోలేదు. అవి వ్యాపార సంస్ధలుగా బతకలేవు. ప్రస్తుతం అవి అలాగే వ్యవహరిస్తున్నాయి.

శ్రీకృష్ణుడు ఈ మూసని బ్రద్ధలు చేసాడు. ఆయన మనని మంచి చెడుకి అతీతంగా వెళ్ళమని చెప్పాడు. ఆయన అలా ఎందుకు చెప్పాడంటే అటువంటివి లేవు కాబట్టి. అవన్ని మన మైండ్‌లో మాటలే. ఎప్పడయితే మనం ఇది అర్ధం చేసుకుంటామో, మనం అతని దారిలో ఉన్నట్లే. అది ఆయన మనకు చేసిన ప్రబోధం

నమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః
శీతోష్ణ సుఖదుఃఖేఘ సమస్సజ్గవివర్జితః(12:18)
తుల్య నిన్ధాస్తుతి ర్యానీ సంతుష్టో యేన కేనచిత్
అని కేతః స్దిర మతిర్బక్రిమాన్మే (పియో నరః(12:19)

అర్ధం : శత్రౌచ = శత్రువు నందును : మిత్రేచ = మిత్రులయందు : తథా = అటులనే : మానవమానయోః = గౌరవము, అగౌరవమునందు : సమః = సమభావము కలవాడు : శీతోష్ణా = చలియందు, వేడియందు : సుఖ దుఃఖేఘ = సుఖదుఃఖము నందు : సమః = భావముతో ఉండువాడు : సంఘ వివర్జిత = దేనియందు ఆసక్తి లేక అన్ని సంబంధాలు విడిచినవాడు. : తుల్య = సమానముగా : నిన్దాస్తుతి: = నిందలను, ప్రశంసలను : మౌని = మౌనంగా ఉండువాడు : మేనకేనచిత్ = దేనితో నైనా (దొరకిన దానితో) : సంతుష్టః = తృప్తి పొందువాడు : అనికేతః స్థిరమయిన నివాసం లేనివాడు (గృహముల యందు ఆసక్తి లేనివాడు) స్థితివాతిః = నిశ్చయబుద్ధి కలవాడు : భక్తి మాన్ = భక్తిలో నిమగ్న మయినవాడు : మే = నాకు : ప్రియః = ప్రియమయిన వాడు : నరః = మనుష్యుడు

భావం : శత్రువుల యందును, మిత్రులయందును సమాన భావం కలవాడు, గౌరవం, అగౌరవాన్ని, చలి, వేడి పరిస్థితులని సమానంగా చూడగలిగిన వానిని, దేనియందు ఆసక్తి లేనివాడును, ప్రసంశలయందు విమర్శలయందు మౌనంగా ఉండువాడు, దేని చేతనైననూ సంతృప్తి పొందువాడు నిర్దిష్టంగా గృహమునందు ఆసక్తి లేనివాడు, నిశ్చయమగు బుద్ధికల వాడును, భక్తితో గూడి యుండువాడును అగు వ్యక్తి నాకు ప్రియమయిన వాడు.

నీవు ఒకే ఇంటితో అనురాగం లేక ప్రేమ కలిగి ఉన్నట్లయితే, వేరాక నీకు కొత్త ప్రదేశం అవ్వవచ్చు. దానివలన నీవు ప్రయాస పడవచ్చు. ఒకే ఇంటితోనే అనురాగం లేక ప్రేమ అనే ఆలోచనే నీకు లేనట్లయితే నీవు ఎక్కడికెళ్ళినా నీ ఇంటిలో ఉన్న భావనతోనే ఉంటావు.

భగవద్గీత - అధ్యాయం 12

శ్రీకృష్ణ భగవానుడు మరొకసారి "సంపూర్ణమయిన భక్తిలో ఉండే వ్యక్తి నాకు చాలా ప్రియమయిన వాడు" అని అంటాడు. ఆయన ఇక ఎటువంటి రూల్స్ చెప్పటం లేదు. అంటే ఆయన తన సూచనలనీయటం ముగించబోతున్నాడని అర్ధం. అయన ఇలా అంటాడు. ఈవిధంగా ఎవరయితే ఈ మార్గంలో ఉంటాడో అతనిని నేను ప్రేమిస్తాను. అంతే. నాకు మరి దేని మీదా ఆసక్తి లేదు.

శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు 'ఎవరైతే స్నేహితులని, శత్రువులని ఒకే విధంగా చూదగలదో, ఎవరయితే గౌరవం పొందినప్పుడు అగౌరవం పొందినప్పుడు ఒకేవిధంగా ఉండగలరో, ఎవరయితే వేడియందు, చలియందు ఒకే విధంగా నిలవగలిగితే, సంతోషం బాధ కలిగినపుడు ఒకే విధంగా ఉంటే, ఎవరయితే పొగడలకి, విమర్శలకి ఒకే విధంగా స్పందించుతారో, ఎవరైతే తనకు ఉన్నదానిలో సంత్సప్తిని పొందుతారో ఎవరైతే నిశ్చితమయిన మనస్సుతో ఉంటారో గృహమందు ఆసక్తి లేకుందా ఉంటారో అటువంటి వ్యక్తి, సంపూర్ణ భక్తితో నిండి ఉన్న వ్యక్తి, నాకు చాలా ప్రియమయిన వ్యక్తి.

ఇక్కడ ఒక చక్కని మాట ఉన్నది. ఎవరయితే ఎటువంటి ఇల్లు అనే దానిని పట్టించుకోదో, ఎవరయితే తన కోసం ఇల్లు కట్టుకోవాలి అని అనుకోదో....

మీకు ఒక కథ చెబుతాను. రావణాసురుడు ఒక కల్పకాలం (చాలా వేల సంవత్సరాలు) జీవించుతాడు. వ్యాసమునీంద్రులు నాలుగు కల్పాలు జీవించుతారు. రావణుడు లంకాపురిని కట్టుకుంటాడు లంకాపురిని శివుడు రావణునికి బహుమతిగా ఇస్తాడు. దానిని అతను బాగా అభివృద్ధి చేస్తాడు.

ఒకసారి వ్యాసుడు లంకాపురికి వస్తాడు. రావణుడు ఆయనతో "ఓ వ్యాసా! నా భవనం చూసావా! నాదేశాన్ని చూసావా! ఎంత గొప్పగా ఉన్నయో కదా!" అంటాడు. దానికి వ్యాసుడు "అవును నేను చూసాను" అంటాడు.