భగవద్గీత - అధ్యాయం 12
పెంచుకుంటాము. దానితో మనలో మనం ఒత్తిడి, వ్యధ అనే ఉపయోగంలేని వాటిని నింపుతాము. అవి మనం పనులని నాణ్యతతో చేయనీయవు. మనం బాగా చేయవలసిన పనులని తక్కువ నాణ్యతతో చేస్తాము.
మనం ఎప్పుడయితే పూర్తిగా మనం చేసే పని మీద, మనం నదుస్మన్న మార్ధం మీద ఏకాగ్రతని నిలుపుతామో, ఎప్పడయితే ఫలితాలగురించి కలతపడకుండా, మన గమ్యం గురించి ఆందోళన పడకుండా ఉంటామో అప్పుడు మనం ఏ పనిచేసినా చాలా అద్భుతంగా నాణ్యతతో త్వరగా, కచ్చితంగా చేయగలుగుతాము.
శ్రీకృష్ణని బోధనలు అన్నీ కేవలం ఆధ్యాత్మికమయినవి కాదు. అవి ఆరోగ్యకరమయిన జీవన పద్ధతులు. ఇవి కేవలం మన జన్మ తరువాత జరిగే విషయాలు కాదు, ఈ జీవితాన్ని అభివృద్ది చేసుకునే పద్దతులు.
శ్రీకృష్ణుడు శాంతి అనంతరం... అని అంటాడు. ఆయన ఈ విధంగా చెబుతాడు ఎవరయితే తాను చేసిన పనుల ఫలితాలని భగవంతునికి సంపూర్ణంగా సమర్సించుతారో (భగవంతునికి వదిలివేసారో) వారు శాశ్వతమయిన, శ్రీడ్రుమయిన శాంతి పొందుతారు. ఎవరయితే పనులని, వాటి ఫలితాల పైన అధికారాన్ని భగవంతునికి బదలాయించుతారో, వారు శాశ్వత శాంతి, పరమానందం అనే వాటిని పొందగలుగుతారు. చేసే పనుల ఫలితాల నుంచి బంధ విముక్తులవ్వగలిగితే, వారు సంపూర్ణమయిన స్వేచ్ఛని పొందుతారు. ఆ స్వేచ్ఛ మనం చేసే పనుల నుంచి మనం ఏమీ ఆశించనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తాను ఆక్షణంలో చేస్తున్న పనిమీద మాత్రమే పూర్తి ఏకాగ్రతని నిలుపగలుగుతాడు. ఎప్పుడయితే అతను వర్తమానంలో ఉంటాడో అప్పుడు అతను పశాంతంగా, పరమానందంలో స్వేచ్ఛలో ఉండగలడు. అదే మోక్షం అంటే.
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च। निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी।। (12:13) संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः। मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः।। (12:14)
అర్ధం : అద్వేష్యా = ద్వేషం, శత్బత్వం లేనివాడు : సర్వభూతానమ్ = సమస్శ ప్రాణుల పట్ల: మైతః = స్నేహ భావం కలవాడు : కరుణః = దయ : ఏవ = గలవాడు : చ = మరియు : నిర్మమః = మమకారం లేనివాడు, అధికారం చూపనివాడు : నిరహంకారః = అహంకారం లేనివాడు : సమ = సమానమైన : దుఃఖ= దుఃఖములో : సుఖః = సుఖములో : క్షమా = ఓర్పుగలవాడు.
సంతుష్ణ = సంత్పప్తి : సతతం = ఎల్లప్పుడు : యోగీ = యోగములో ఉందువాడు: యతాత్మా = ఆత్మనియంత్రణ కలవాడు : ధృడనిశ్చయః = ధృద నిశ్చయం కలవాడు: మయి = నాయందు : అర్పితా = అర్పించిన : మనః = మనస్సు : బుద్ధిః = బుద్ధి లేదా మేధస్సు : యః = ఎవడు (కలదో) మత్ భక్తాః = నాయందు భక్తి కలవాడును : సః = అతడు : మే = నాకు : ప్రియః = ప్రియమయిన వాడు.
సమస్త ప్రాణులు యెడల ద్వేషము లేనివాడును, అందరియెడలా స్నేహాభావము, కరుణ కలవాడును, అహంకారం లేనివాడును, సుఖదుఃఖములయందు సమ భావము కలవాడు, యోగయుక్తుడు, ఓర్పుకలవాడు, ఎల్లప్పుడూ సంతృప్తితో ఉందువాడు, మనస్సుని నియంత్రించగలవాడు, నాయందు భక్తి కలవాడును, ఈ విధంగా ఎవరయితే ఉంటారో అతను నాకు ప్రియమయిన వాడు.
ండి పెళ్ళికం డి అంత శర్
ప్రేమే మీ జీవితం
ఇంతకుముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునునికి నీవు ఇది చేయి లేదా అది చేయి అని చెప్పాడు. ఇప్పుడు ఇది చేయి అది చేయి అని చెప్పటం లేదు. ఆయన ఏమని చెబుతున్నాడంటే ఎవరైతే ఇవన్నీ చేస్తాడో అతనే నాకు ప్రియమయిన వాడు. ఒక వేళ నీవు అలా చేయకపోయినా పరవాలేదు. కానీ నీవు అలా చేయగలిగితే నాకు చాలా ప్రియమయినవాడివి అవుతావు. మరొక విధంగా చెప్పాలి అంటే ఆయన మానసికంగా బ్లాక్మైల్ చేస్తున్నాడు. అయితే అది డైరెక్టగా కాదు. తెలియకుండా ఇదంతా మన మంచి కోసమే.
ఎవరయితే ద్వేషబావం లేకుండా ప్రతి ప్రాణి పట్ల స్నేహభావంతో ఉంటారో ఎవరయితే తాను యజమానిని అని ఆలోచించరో, ఎవరికెతే అహంకారం ఉండదో, ఎవరయితే దుఃఖాన్ని సుఖాన్ని సమభావంతో చూడగలరో, ఎవరయితే నిత్యం తృప్తిగా ఉంటారో, మనస్సుని నియంత్రించి, దృఢ చిత్తంలో భగవంతుని సేవలో నిమగ్నమవుతారో, ఎవరయితే తమ మనస్సుని, మేధస్సుని నాపై నిమగ్నం చేసి ఉంటారో అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమయిన వాడు. అతనే నా ప్రియమయిన భక్తుడు.
ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఆయన ఈ విధంగా చెబుతారు. "ఎవరయితే ప్రతి ప్రాణి పట్ల ద్వేషభావం లేకుండా స్నేహభావంతో ఉంటాడో …." ఇవి చాలా విలువయిన లక్షణాలు. మనం మన మనస్సుని విశ్లేషించి చూద్దాము. మనం మన మనస్సుని నిజాయితీగా విశ్లేషించి చూస్తే మనకి ఒక విషయం అర్ధమవుతుంది. ఎప్పుడయినా ఎవరైనా మీ దగ్గరకి వచ్చి వాళ్ళు మిమ్ములని ప్రేమిస్తున్నారు, అని అంటే మీరు నమ్మరు. ముందుగా మీరు ఏమి ఆలోచిస్తారు. అతను ఏం కోరి, నా దగ్గర నుంచి ఏమీ ఆశించి అలా అన్నాడు అని. మిమ్ములని అతను ప్రేమించే అర్హత మీకు ఉన్నది అని మీరు నమ్మరు. తరువాత మరొక వ్యక్తి మిమ్మలని నిజాయితీగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మీరు నమ్మలేరు. ఎందుకంటే మీరు
నేను, నాది అనేవి వదలి వేయండి అని గురువు చెప్పినప్పుడు, వాటిని గురువు తీసేసుకుంటాడని ప్రజలు భయపడతారు. బహుశా ఆయన వాటిని తీసుకుంటే ఏం చేయాలి. వాటి అవసరం ఆయన కుందేమో అని ఆలోచిస్తారు.
ఎవరినీ నిజాయితీగా ప్రేమించలేదు కాబట్టి. మీరు ప్రతి విషయంలోనూ లెక్కలు కడతారు కాబట్టి అలాగే ఎదుటి వ్యక్తి కూడా లెక్కలు కడతాడని మీరు అనుకుంటారు. మన అందరి ప్రేమ పెపేని ప్రేమ
శ్రీకృష్ణుడు ఇక్కడ మరో విషయం చెబుతాడు. ఎవరయితే ప్రతి ఒక్కరి ప్రాణి పట్ల స్నేహభావంతో ఉంటాడో, ప్రతి ఒక్కరికి దయగల స్నేహితుడిగా ఉంటాడో, ఎవరైతే నిజాయితీగా సేవ చేసారో, ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటారో అబద్ధపు అహంకారపు లేకుండా ఉంటారో .... ఇక్కడ అబద్దపు అహంకారం అంటే ఏమిటో చూద్దాం. అహంకారం అంటే మీకు లేనిదానిని చూపించటం. అబద్దపు అహంకారం అంటే మీకు ఉన్నదానిని దాచిపెట్టటం.
అహంకారం రెండురకాలుగా ఉంటుంది. చురుకైన అహంకారం, నెమ్మది అయిన అహంకారం. చురుకైన అహంకారం అంటే మీకు లేనిదానిని చూపించటం, నెమ్మది అయిన అహంకారం ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది. "నేనేమి చేయగలను, నేను ఒకసామాన్యమయిన వ్యక్తిని. నేను ఏదీ సాధించలేను. నేను ఏ పనీ చేయలేను" ఇలా తనకి ఉండే న్యూన్యతా భావం (ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్) ఇది విధమయిన ఒక రూపంలో ఉండే అహంకారం.
స్పష్టంగా అర్ధం చేసుకోండి. తనను తాను గొప్పగా భావించే సుపీరియారిటీ కాంప్లెక్స్‌లో ఒక మంచి గుణం ఉన్నది. అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని గురించటం సులభం. దాంతో వారిని ఎదుర్కొనవచ్చు. సమాజం కూడా అటువంటి వారిని ఎదుర్కొంటుంది. వారికి తగిన సమాధానం ఇస్తుంది. అటువంటివారు తాము అహంభావంతో బాధపడుతున్నాము అని తెలుసుకోగలుగుతారు. అలా కాకుండా న్యూన్యతా భావంతో ఉండేవారిని అహంభావులుగా ఎవరూ గుర్తించలేరు. అది చాలా కపటంగా దాచిపెట్టబడి ఉంటుంది. అంతేకాదు ఆ భావం ఉన్నవారు దానిని గుర్తించలేరు కూడా. దాంతో న్యూన్యత వెనుక దాగిన మనిషి తను అహంకారంతో బాధపడుతున్నట్లు తెలుసుకోలేరు. దాంతో వీరు చాలా లోతుగా ఎక్కువగా ఆ బాధని అనుభవించుతారు.
ఏ వ్యక్తి అయితే పేరు ప్రతిష్టలకోసం ఎదురుచూస్తుంటాడో ఆ వ్యక్తి అలాగే ఎవరికైతే పేరు ప్రతిష్టలు అవసరం లేదో అటువంటి వ్యక్తి, ఇద్దరూ కూడా అహంకారులే. పేరు ప్రతిష్ఠలు కావాలి అనుకుంటే అది అహంకారమే. అది వద్దు అని అనటం కూడా అహంకారమే. ఎవరయితే ఏది జరిగితే దానిని జరగనీయి అని అనుకుంటాడో, ఎవరైతే విషయాలని జరిగేవి జరగనిస్తాడో అతను మాత్రమే అహంకారంలేని సత్యంలో జీవిస్తాడు.
శ్రీకృష్ణ భగవానుడు ఒక వ్యాఖ్య చేస్తాడు. "నీవు ఎవరో ఎవరికి తెలుసుకోవాలని ఉంటుంది? ఎందుకు నీవు గొప్పవ్యక్తిని అని అనుకుంటావు? ఎందుకు నీకు గొప్ప పేరు ఉందనీ, అందరికీ నీపేరు తెలుసు అని అనుకుంటావు? ఎందుకు అందరూ నీ పేరు అనుకుంటే సిగ్గుపడి వెళ్ళిపోతావు? ఎందుకంటే నీపేరు చాలామందికి తెలుసు అనుకొని సిగ్గుపడి వెళ్ళిపోతావు. అందుకే నీ పేరు అందరికీ తెలియటం నీకు ఇష్టముండదు. నేను చెబుతున్నాను. నీ పేరు ఎవరికీ తెలియదు. రిలాక్స్ అవ్వు. విరామంగా ఉండు " భగవంతుడు "నీ పేరు ఎవరికీ తెలియదు విరామంగా ఉండు " అంటాడు .
ఎవరికీ మన పేరు తెలియదు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. పేరు ప్రతిష్ఠలు కావాలి అనుకోవటం, అవి వద్దు అనుకోవటం రెండూ అహంకారమే. రెండు రకాల అహంకారం. న్యూన్యతతో ఉండే అహంకారం నెమ్మదిగా ఉండే అహంకారం. దానినే అబద్దపు అహంకారం అంటాం. మీరు రెండు అహంకారాల నుంచీ స్వేచ్ఛగా ఉండాలి. మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వెనుక (న్యూనతా భావం) దాగవద్దు.
ఒక చిన్న కథ :
ఒక గురువుగారు తన శిష్యుడిని పిలిచి కాళ్ళు పట్లమంటాడు. దానికి ఆశిష్యుడు "అయ్యో! గురుదేవా! నేను పాపిని. నేను ఏవిధంగా మీ పవిత్ర పాదాలు ముట్టుకో గలను " అని అంటాడు. అతను సోమరి. అతనికి పనిచేయ బుద్ధి వేయదు. అందుకే అలా అంటాడు.
ఆ మరుసటి రోజు ఒక భక్తుడు గురువుగారికి పక్కు, ప్రసాదం తెచ్చి ఇస్తాడు. ఆయన కొంచం నోట్లో వేసుకొని మిగతావన్నీ అలా ఉంచేస్తాడు. ఆ తరువాత చూస్తే ఆ ప్లేటులోఏమీ ఉండవు. ఆయన శిష్యుడిని పిలచి ప్లేటులో ఉండే పక్కు, ప్రసాదం ఏమయ్యాయి అని అడుగుతాడు.
అప్పుడు శిష్యుడు, "గురుదేవా! మీరు అంటే గురువుగారు వదిలిన ప్రసాదం పవిత్రమయినది. నేను దానిని అలాగే ఎందుకు పారేస్తాను. అందుకే ఆ మొత్తం ప్రసాదాన్ని తినేసాను" అని చెబుతాడు.
మైండ్ (మనస్సు) చూడండి. ఎంత చక్కగా అక్కడ సంఘటనలని తనకి అనుగుణంగా మార్చుకున్నదో. ఎక్కడ ఏవిషయంలో ఆడుకోవాలో అక్కడ దానితో ఆదుకున్నాడు. అదీ తనకి అనుకూలంగా ఉండే విధంగా చేసుకున్నాడు. అతనికి పని చేయి బుద్ధి వేయనప్పుడు నేను అర్హుడని కాదు, అందుకే మీ పాదాలు ముట్టుకోను అన్నాడు. తినాలనుకున్నప్పుడు అది గురుదేవుల ప్రసాదం అని మొత్తం తినేసాడు.
మనలో ఉండే భావాలకి ఆధారం కోసం మనం చాలా విషయాలని సేకరించు కుంటాము. అందుకే అంటారు 'దయ్యాలు వేదం వల్లించినట్లు' అని లేదా 'దెయ్యాలు బైబిల్ని ఉదహరించినట్లు' అని ఎవరయినా పవిత్ర గ్రంధంలోనివి ఉదాహరణగా చెప్పారు అంటే వారు దయ్యాలు అని అర్ధం అలా కాకుండా పవిత్ర గ్రంధాలని అర్థం చేసుకుంటే మీరే దేవుడు మీరు పవిత్ర గ్రంధాలనుంచి ఉదాహరణలు
భగవద్గీత - అధ్యాయం 12
చెప్పనవసరం లేదు. ప్రజలు మీ మాటలనే ఉదాహరణలుగా చెప్పకుంటారు. ఎప్పుడయితే పవిత్ర గ్రంధాలని అర్ధం చేసుకోకుండా అందులో మాటలని ఉదహరించితే అది దయ్యపు పనే. ఎందుకంటే వాటిని అర్ధం చేసుకున్న వాళ్ళు వాటిని పదే పదే పదే చెప్పరు.
ఎప్పుడయితే మీ లక్ష్యం నిరర్థకమయినది అని తెలుసుకుంటారో అలాగే మీ ఐశ్వర్యాలు అర్ధం లేనివి అని తెలుసుకుంటారో, ఆ ఐశ్వర్యం మీకు కలకాలం ఉండదు అని అర్ధం చేసుకుంటారో అప్పుడు అన్నీ పైన చెప్పిన మంచి లక్షణాలన్నీ మీ నుంచి అన్ని దిశలకీ వ్యాపించుతాయి. అప్పుడు మీరు ఒక వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. ఆ వ్యక్తి క్షమాగుణం కలిగి సమదృష్టికల మనస్సుతో సంత్పప్తిగా యోగంలో ఐక్యమయి ఉంటాడు. ఎప్పుదయితే మీరు అంతరంగంలో పరమానందంతో ఉంటారో మీరు ఈ లక్షణాలని అన్నివైపులకి మీ నుంచి వ్యాపింప చేస్తుంటారు. ఎవరయితే అంతరంగంలో నిత్యానంద స్తితిని పొంది ఉంటారో, ఆ వ్యక్తి తన ఆనందాన్ని ఏకారణం లేకుండానే అన్నివైపులకి ప్రసరింప చేస్తాడు.
నేను ఈ మధ్యనే ఒక ఉపన్యాసం ఇచ్చాను. అందులో ఇలా చెప్పాను. మనం నిరంతరం మన లోపల కోపం పుట్టించే గుణాన్ని (ఇరిటేషన్ని) మోస్తూ ఉంటాము. దాంతో ఎప్సుడు ఎవరిమీద విరుచుకు పడదామా అని చూస్తుంటాము. ఏక్షణంలో మనకి అవకాశం వస్తే ఆక్షణంలో ఎదుటివారి మీద దూకి వారి మీద అరచి యాగీ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు. వాళ్ళ మీదకి దూకుతాం, వాళ్ళని కరుస్తాం. చిన్నగా మనని రెచ్చగొడితే చాలు, చాలా పెద్ద గొడవ చేస్తాము. ఎందుకంటే మనలోపల మనం ఇరిటేషన్ అనే గుణాన్ని మోస్తుంటాము. దాంతో ఎదుటివారికి నిరంతరం బాధలని, కష్టాలని చూపిస్తుంటాము.
ఈ విధమయిన గుణం మనలో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనం నిరంతరం మాట్లాడుతూ ఉంటాము. ఇదంతా మనం అనుకున్నది అనుకున్నట్టు
జరగదు, అందుకే అలా చేస్తాము. మన వ్యధలు, బాధలు అన్ని కూడా జరిగిపోయిన విషయాల ఆధారంగా మనకి జరగబోయే విషయాల గురించే ఉంటుంది. భవిష్యత్‌లో మనకి ఏమి జరగబోతోందో అనేది మన అసలు బాధ. ఇది మనం ఆశించిన దానికి మనం అది సాధించటానికి మనకి ఉన్న సామధ్యానికి మధ్య ఉన్న ఖాళీవలన మనం బాధలు అనుభవించుతాము. అందుకే మనం అనుకున్నవి భవిష్యత్‌లో మనకి జరుగుతాయో లేదా అనే ఆతృతతో ఉంటాము.
వ్యధలు, బాధలు అనేవి ఏమాత్రం ఉపయోగం లేని విషయాలు ఎందుకంటే మనం ఏదయినా సాధించాలి అని అనుకుంటే, అది సాధించటానికి మన సామర్యం ఒక్కటే సరిపోదు. దాని కంటే కూడా కావలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనం చేయిబోయే పని నుంచి దేనినైనా ఆశించటం నిరర్థకమయినది, ఎందుకంటే భవిష్యత్ అసలు నమ్మకం లేనిది. అది ఊహ. మన తరువాత శ్వాసనే మనం నియంత్రించలేము. మన తరువాత శ్వాస తీసుకుంటాము అని కచ్చితంగా చెప్పలేము. మనం ఎటువంటి గర్వంతో మనం మన భవిష్యత్‌ని నిర్ణయించగలం. అలాగే మనం చేసే పనుల ఫలితాలని కూడా ఏమాత్రం నిర్ణయించలేము.
బాధ, ఆతృత, ఆందోళన, కోపం కలిగించే గుణం ఇవన్నీకూడా మనం వర్తమానంలోనికి రాగానే కరిగిపోతాయి. ఎప్పుడయితే మనం పూర్తిగా వర్తమానంలో ఉండగలుగుతామో అప్పుడు మనం మన పనులని ప్రభావితం చేయగల స్థితిలో ఉంటాము. అలాగే వాటి ఫలితాలని ప్రభావితం చేయవచ్చు. ఎప్పుడయితే మనం వర్తమానంలో స్థిరపడతామో మన ఆలోచనలన్నీ పోతాయి అలాగే బాధలు, ఇరిటేషన్, ఆతృత మాయం అవుతాయి. అప్పుడు మన వ్యధ అనేది ఎంత ఉపయోగం లేని విషయమో మనకి అర్ధం అవుతుంది.
నేను ధ్యానం కార్యక్రమాలలో క్లాసుకు వచ్చిన వారిని వాళ్ళ బాధలు వ్రాయమనే వాడిని. వాళ్ళు చాలా రాసేవారు. నేను వాళ్ళని ఆపేపర్లు దాచి ఉంచి,
ఆరునెలలయ్యాక అసలు అందులో నిజంగా వారికి వచ్చిన బాధలు ఎన్నో చెప్పమనే వాడిని. నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు, అందులో కనీసం ఇరవై శాతం బాధలు కూడా వారికి రాలేదు.
బాధలు, ఇరిటేషన్ అనేవి అసలు ఆధారం లేని విషయాలు ఒక్కసారి మీరు అవి ఎంత అర్ధం లేనివో, ఎంత ఉపయోగం లేనివో తెలుసుకోగలగితే, మిమ్మలని ఎంత రెచ్చగొట్టినా, ఎంత ఇరిటేట్ చేసినా అవి మీ దగ్గర పనిచేయవు. ఆతృత, కోపం అనేవి అసలు మీలో ఉండవు. మీరు సచేతనస్తితిలో ఎలా జీవించుతారో, ఏ చేతన స్థితిలో అయితే ఒక దానిని ఎంచుకుంటారో అది మాత్రమే మీతో ఉంటుంది. మీరు మీ ఉనికి యొక్క స్టితిని అర్ధం చేసుకుంటే, మీరు అప్రయత్నంగానే మీలోని మనోహరమయిన ఆనందాన్ని వ్యాపించటం ప్రారంభించుతారు. మీలోంచి సంతోషాన్ని వెదజల్లుతారు.
నేను ఒక చిన్న ధ్యాన పద్ధతిని అందరికీ నేర్పిస్తుంటాను. ఆ ధ్యానం మనకి నిజమయిన భక్తియోగం యొక్క అనుభవాన్ని ఇస్తుంది. ఈ చిన్న ధ్యానపద్ధతిని సాధన చేయండి. అది మీలోని సౌమ్యతని తెలియచేసేలా చేస్తుంది. దానిని ఎలా చేయాలి? మీరు ఉదయం నుంచీ రాత్రి వరకూ చాలా మనోహరమయిన ఆనందం యొక్క లక్షణాలని మాత్రమే శ్వాసించండి. కేవలం అందమయిన ఆనందాన్ని మాత్రమే మీ లోపలికి తీసుకుంటున్నారు : ఆనందాన్ని మాత్రమే ఊపిరిగా వదులుతున్నారు అని ఊహించుకోండి. అప్పుడు మీ అంతరంగం, మీ ఉనికి మొత్తం సంతోషంతో నిండిపోయి ఉంటుంది. మొదటిలో మీరు ఊహించుకుంటారు కొన్ని రోజులుకాగానే దాని గొప్పతనమేమిటో మీరే తెలుసుకుంటారు.
మరొక విషయం అర్ధం చేసుకోండి. కల్పన, భావన అనేవి రెండు వేరు వేరు విషయాలు. కల్పన అంటే కొన్ని విషయాలని ఊహించటం. ఆ విషయాలు నిజ ప్రపంచంలో జరుగవు. ఉదాహరణకి ఒక ఏనుగుకి పది తొండాలు ఉన్నట్టుగా
ఊహించుతారు. కానీ అది నిజంగా జరగదు. అలాంటిది ఉండదు. కాబట్టి కల్పన అంటే జరగనిది. భావన అంటే జరగేవాటిని ఊహించటం. జరిగే వాటిని ఇప్పుడు ఊహించటమే భావన.
పగలు మీరు కూర్చొని నక్షత్రాలు ఉన్నాయని ఊహించారనుకోండి అది భావన. అది కల్పన కాదు. ఎందుకంటే నక్షత్రాలు అక్కడ ఉన్నాయి కానీ మనకి కనపడటం లేదు. అంతే కాబట్టి ఇక్కడలేని దానిని చూడగలగటం భావన అదే ఊహ. మీరు చూడలేని దానిని ఊహించటం కల్పన. అదీ ఊహ
స్పష్టంగా అర్ధం చేసుకోండి. దేవతలు, దేవుళ్ళ మీద ధ్యానం చేయటం కల్పన కాదు. అది భావన. వాళ్ళు అక్కడ ఉన్నారు. మీరు వాళ్ళ శ్రుతిలో పడగలగాలి. అది ఎలా అంటే మీ టి.వి.ని మీకు కావలసిన ఛానల్‌కి ఎలా ట్యూన్ చేస్తారో అలాగే మీరు దేవుడులు, దేవతల ట్యూన్లో పడాలి. కాబట్టి అక్కడ ఉన్నదానిలోనికి ట్యూన్ చేసి వాటిని చూడటం భావన అదే ఊహ.
మీరు నిరంతరం ఆనందాన్ని శ్వాసిస్తున్నట్లు భావించండి. మీ ఆనందాన్ని, ప్రాణాన్ని లోపలికి తీసుకుని బయటకి వదులుతారు. ప్రాణం అంటే జీవించటానికి కావలసిన ముఖ్యమయిన శక్తి. ఒక విషయం అర్ధం చేసుకోండి. ప్రాణం అంటే గాలి కాదు. అది శక్తి. అది గాలి ద్వారా మీ లోపలికి వెళుతుంది. ఉదాహరణకి లారీ సామానుతో మీ ఇంటి దగ్గరకి వచ్చి, సామాను మీ ఇంట్లో దింపేసి వెళ్ళిపోతుంది. ప్రాణం సామాను అయితే గాలి లారీ. ప్రాణం గాలి కాదు. గాలి ఆధారంగా ప్రాణం మీలోకి వస్తుంది. ప్రాణశక్తి గాలిలో ఒక సూక్ష్మభాగం మాత్రమే. ప్రాణశక్తి ఆనందశక్తి, ఆనందం ఒక శక్తి.
అందుకే మీరు ఊపిరి తీసుకున్నప్పుడు, అనందాన్ని లోపలికి తీసుకుంటున్నట్టుగా ఊహించండి. అలాగే ఊపిరి విడిచేటప్పుడు ఆనందాన్ని బయటకి విడిచినట్టు
భగవద్గీత - అధ్యాయం 12
ఊహించండి. అలాగే ప్రకాశవంతమయిన వెలుగుని లోపలికి తీసుకొని ఆ ప్రకాశాన్ని ఊపిరిగా వదలండి. అప్పుడు మీ అంతరంగం ప్రకాశంతో నిండిపోతుంది అనే భావనలో ఉండండి. మీ అంతరంగం ఆనందంతో, ప్రకాశంతో నిండిపోయినట్లు ఊహించండి. అప్పుడు అప్పయత్నంగా మీరు ఆనందాన్ని అన్నివైపులా వ్యాపింపచేసారు. ఇక మీరు కోపం, అసూయ, ఇటువంటివాటిని ఎదుటివారి మీదకు వదలరు. మీరు ప్రేమని ఆనందాన్ని ఎదుటివారి మీద కురింపించుతారు.
అటువంటి భక్తుడు నాకు ప్రియమయిన భక్తుడు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆయన ఈ విధంగా చెబుతాడు, అలా ఉండే భక్తుడే నాకు అత్యంత ఆప్తుడు. ఆయన మనని ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడు ఆయన ఇంకా ఎటువంటి రూల్స్, సూచనలు మనకి చెప్పటం లేదు. ఆయన రూల్స్ చెప్పి చెప్పి అలసిపోయాడు. ఆయన ఏస్థితికి వచ్చాడంటే, నీవు చేయగలిగితే ఇది చేయి. లేదా ఏమి చేయాలి? అలాగే కానివ్వు. ఆయన చాలా రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్నాడు.
నేననుకోవటం ఏమిటంటే ఇది అందరు యోగులకి జరిగే అనుభవమే. అందరూ ఏదో ఒక సమయంలో ఈ స్థితికి వచ్చేసారు. కొంత కాలమయ్యక వాళ్ళు ఇలా చెబుతారు. "సరే! అలాగే. నీ ఇష్టమయిన విధంగానే చేయి. ఏంచేస్తాం మరి? మిమ్ములని కొంత వరకూ తీసుకెళ్ళగలం. కొంతవరకూ దారి చూపించగలం". కొంతకాలం అయ్యాక వీళ్ళు ఏమనుకుంటారు ఇందులో గురువులకి ఏదో స్వార్ధం ఉన్నది. అందుకే మనని జ్ఞానోదయం వైపు తీసుకువెళుతున్నారు. అది ఏదో నేను పదిమందికి జ్ఞానోదయం కలిగించితే నాకు స్వర్గంలో ఏదో ప్రత్యేక స్థానం దొరుకుతుంది, లేదా నా జీతం పెరుగుతుంది అని అనుకుంటారు. అర్ధం చేసుకోండి. మనం ఆనందం, సంతోషం ద్వారా పొందిన దానిని నలుగురితో పంచుకుంటాము. అంతే.
ఒక చిన్న కథ :
ఒక చూపులేని అంధవ్యక్తి హిమాలయాలలో నడుస్తుంటాడు. ఆకస్మాత్‌గా
అతని చేతిలోనికి మంచులో గడ్డ కట్లుకుపోయిన పాము పడుతుంది. అతనికి కుర్రలా అనిపిస్తుంది. ఆ వ్యక్తి దానిని కుర్ర అనుకొని "ఓహా! నాకు మంచి చేతి కుర్ర దొరికింది' అని అనుకొని దాంతో నడుస్తుంటాడు.
దారిలో ఒక సన్యాసి ఆ అంధుని చేతిలో పాము చూసి "ఓ! అయ్యా! నీ చేతిలో దానిని పారవేయి. నువ్వ అనుకుంటున్నట్లుగా అది కుర్రకాదు. అది పాము. ఇంకొక గంటలో సూర్యకిరణాలు వస్తాయి. అప్పుడు ఆ పాము మామూలు స్థితికి వస్తుంది. అది నిన్ను కాటు వేస్తుంది. నిన్ను చంపేస్తుంది" అని గట్టిగా చెబుతాడు.
దానికి ఆ అంధవ్యక్తి "అదేమీ కాదు! నాకు తెలుసు. నీవు మరి మాట్లాదుకుండా నీ పని నీవు చేసుకో" అంటాడు.
సన్యాసి అతనికి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు. అది కుర్ర కాదు. అది పాము నిన్ను కరిస్తే చనిపోతావు. దానిని పారవేయి అని. అతనికి చాలా కోపం వస్తుంది. సన్యాసితో ఇలా అంటాడు " బహుశః నీకు కుర్ర లేదనుకుంటాను. నేను దీనిని పారేస్తే దాన్ని నీవు తీసుకోవాలి అని చూస్తున్నావు. నేను కుర్రని పారవేయను. నాకు నీలాంటివాళ్ళు సంగతి బాగా తెలుసు," అంటాడు.
అప్పుడు సన్యాసి ఇలా అంటాడు "ఓ తెలివితక్కువ మూర్ఖుడా! అది కుర్ర కాదు. అది నిన్ను చంపేస్తుంది" అని అతని చేతిలో పాముని లాగేయటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ అంధుడు దానిని సన్యాసికి ఇవ్వకుండా ఆ కుర్రతోనే సన్యాసిని కొడతాడు. జీవితంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది.
ఎప్పుడయితే గురువులు 'నేను, నాది' అనేవాటిని పారేయమంటే మీరేమనుకుంటారు, అమ్మో వాటిని పారేస్తే గురువు వాటిని తీసేసుకుంటాడు అని అనుకుంటారు. గురువు వాటిని తీసి పారేస్తాడు. మరేం చేయాలికి వాళ్ళు అనుకుంటారు, గురువుకి ఇది కావాలి అని. ఆయన మనని అవి పారేయమని చెప్పి ఆయన తీసేసుకుంటాడు అని అనుకుంటారు. వాళ్ళు నిరంతరం
భగవద్గిత - అధ్యాయం 12
అనుమానంతో ఉంటారు. అందుకే గురువులు ఏమంటారంటే " ఇది అసలయిన దారి, మీకు ఎలా కావాలంటే అలా చేయండి".
ఎవరయితే వారి మనస్సుని, మేధస్సుని (బుద్దిని) నాయందు నిలుపుతారో…. అని అంటాడు శ్రీకృష్ణుడు. భక్తులకి, శిష్యులకి కూడా గురువులకి కాని విశ్వశక్తికి కానీ ఆధీనమవటం చాలా కష్టం.ఎంత కాలమయితే గురువు వారిని వారు ఇష్టంవచ్చినట్టు ఉండనిస్తాడో, అన్ని విషయాలు వారి ఇష్ట ప్రకారం జరుగుతాయో వారికి గురువు చాలా గొప్ప వ్యక్తి. ఆయనని పూజించటానికి, ఉత్సవం చేయటానికి అర్హుడు అని అనుకుంటారు. కాని గురువు ఒక్కసారి తన భాద్యతని సీరియస్‌గా తీసుకొని ఆధ్యాత్మిక ఆపరేషను మొదలు పెట్టగానే శిష్యులు పారిపోతారు.
నేను ఎప్పుడు చెబుతాను " నేను మీకు సరియైన గురువునా కాదా అని ముందుగా నిర్ణయించుకోండి". ఒక్కసారి అవును అనుకుంటే గురువులు ఆ బాధ్యతని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఆయనకి ఉండే పెద్ద బాద్యత సర్జరీ. అహంకారం అనే కాన్సర్‌ని ఆపరేషన్ చేసి తీసేయటం. ఒక్కసారి శిష్యుడు ఒప్పుకుంటే గురువు చాలా బాధ్యతాయుతంగా ఆ పనిని చేపడతాడు. ఆపరేషన్ టేబుల్ మీద నుంచి పారిపోతే అది చాలా ప్రమాదం. అలా చేస్తే ఈ జీవితాన్ని కోల్పోతాడు. తిరిగి అతను ఆ అవకాశం కోసం కొన్ని జన్మలు ఎదురు చూడాలి.
ఇక్కడ శ్రీకృష్ణుడు అదే స్థితిలో ఉన్నాడు. ఆయన అందుకే "నాకు ప్రియమైన భక్తుడు ఇలా ఉంటాడు' అని చెబుతాడు. అంతే ఆయన శిష్యుడు యొక్క నిబద్ధత గురించి చెబుతాడు.ఆయన ఇలా అంటాడు "ఎవరయితే నాకు ఆధీనులవుతారో ఎవరయితే వారి మనస్సు బుద్ధిని నాయందు స్థిరపరచుతారో అతను నాకు ప్రియమయిన భక్తుడు. అతనికి నేను స్వేచ్చని ఇస్తాను. బంధ విముక్తుణ్ణి చేస్తాను."
కృష్ణుడు ఈ అధ్యాయాన్ని చాలా అందంగా ముగించుతాడు. ఇది చాలా చిన్న అధ్యాయం. అందుకే మనం మొత్తం అధ్యాయమంతా చూడగలుగుతున్నాము.
యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హరామర్ష భయో ద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః (12:15)
అర్థము : యస్మాత్ = ఎవని వలన : లోకః = ప్రపంచము : న = లేదో : ఉద్విజతే = భయమును : చ= మరియు : యః = ఎవరు : హర్ష, అమర్ష భయ ఉద్యేగైః = సంతోషము, కోపము, భయము, ఆదుర్దా : ముక్తః = స్వేచ్చ పొందాడో : సః = అతడు : చ= మరియు : మే = నాకు : ప్రియః = ప్రియమయిన వాడు.
భావము : ఎవరివలన ప్రపంచము భయమును పొందక, లోకము వలన ఎవరు భయము పొందరో, ఎవరు సంతోషము, క్రోధము, భయము, ఆదుర్దా లేకుండా ఉంటారో అతనే నాకు ప్రియమయిన వాడు.
ఎవరయితే ప్రపంచము వలన వ్యతిరేకముగా ప్రభావము కారో, ఎవరి వలన ప్రపంచం భయపడదో లేదా ఆపద తెచ్చుకోదో….
మనందరం ఎవరైతే ఈ ప్రపంచంలో జన్మించామో, ఈ ప్రపంచంలో జీవిస్తున్నామో మనం ఒంటరిగా జీవించటం లేదు. జాన్దోన్ అనే తత్త్వవేత్త అంటారు" ఏవ్యక్తి కూడా ఒక దీపం కాదు" అని
మనం ఎవరమూ ఒక ద్వీపం కాదు. మనందరం ఒకరితో ఒకరం పరస్సర సంబంధాలు కలిగి ఉంటాము. మనం ఏమి ఆలోచిస్తామో, ఏమి చేస్తామో, ఏది కోరుకుంటామో అవన్నీ ఈ ప్రపంచంలో ఉండే ఇతరులని ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు, కోరికలు, చర్యలు ఈ భూమి మీద ఉండే శక్తి తరంగాలని సృష్టిస్తాయి. తిరిగి ఈ విశ్వం ఇంకా కొన్ని తరంగాలని సృష్టిస్తుంది. ఇవన్నీ మిగతావారి భావాలతో పనులతో పరస్సర సంబంధం నెలకొల్కొని తిరిగి మరిన్ని తరంగాలని సృష్టిస్తాయి.
కార్ల్ జంగ్ అనే మానసిక విశ్లేషకుడు, ఫ్రాయిడ్ నిర్వచించిన ఐ.డి. మరియు అహంకారానికి, అధిక స్థానంలో ఉండే అహంకారాన్ని (super ego) కలిపాడు.
వీరి ఉద్దేశ్యం ప్రకారం ఐ.డి. మానవులలో ఉండే ముఖ్యమయిన మేధస్సుని తెలియచేస్తుంది. అందులో జ్ఞాపకాలు ఒక పరిణామ క్రమంలో అమర్చబడి ఉంటాయి. మెదడులోని ఈ ప్రాంతాన్ని రెపటీలియన్ మెదడు అంటారు. ఇందులోని జ్ఞాపకాలు మామల్స్ అనేవి భూమిమీదకు రాక ముందు నుంచీ ఉంటాయి.
ఐ.డి. అనేది మెదడులోని సహజమయిన బుద్ధి యొక్క చర్యలకి సంబంధించినది. అవే అచేతన సుషుప్తస్థితులు. మనలో తొంభై శాతం పనులు, మనస్సుయొక్క చర్యలు ఇందులోనే జరుగుతాయి. సహజంగా ఈ ప్రాంతం అందుకే తయారు
చేయబడినది. ఇది మనకి అత్యంత ప్రమాదం సంభవించినప్పుడు మనలని రక్షిస్తుంది. మెదడులో ఈ ప్రాంతం గుడ్డిగా, అత్యంత వేగంగా పనిచేస్తుంది. అది చేతనస్థితిలో పనిచేసే మెదడుకంటే 10 కోట్ల రెట్లు వేగంగా పని చేస్తుంది.
అహంకారం మన గుర్తింపుకు ప్రతినిధిగా ఉంటుంది. మన మైండ్ (మనస్సు)లోని ఈ ప్రాంతమే మనకి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఈ అహంకారమే మన చేతనస్థితిలో అర్థం చేసుకోకుండా నిర్ణయాలు చేస్తుంది. అది మీ ఐ.డి.లో ఉన్నటువంటి జ్ఞాపకాల ఆధారంగా ఒక్కొక్క పరిస్థితిలో మన ప్రవర్తన ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. దీనితో సమస్య ఏమిటంటే, మనం అలా నిర్ణయాలు చేసినట్లు మనకి తెలియదు. మనమే నిర్ణయాలు చేసాము అని మనం అనుకున్నా అవి చేసేసి,అలా ఎందుకు చేసాము అనేది మనకి తెలియక అయోమయపడతాము.
అధికస్థితిలో ఉండే అహంకారం అంటేనే (పోగు చేయబడిన మన జాతియొక్క అచేతనస్థితి యొక్క రూపం. జంగ్ ఈ సందర్భంగా ఇలా చెబుతారు. మనం ఈవిధంగా చేయాలి ఇలా ప్రవర్తించాలి అనేది ఒకదానికాకటి సంబంధించి జరుగుతుంది. దీనిని హేతుబద్ధంగా వివరించటం కష్టం.
శాస్త్రవేత్తలు దీనినే 100 మంకీ (కోతి) ప్రిన్సిపల్ అన్నారు. ఇది ఎలా ఉంటుందంటే : 100 కోతులు ఉన్నాయి అని అనుకోండి. ఇవన్నీ ఒక ఒంటరిగా ఉన్న ద్వీపంలో చిక్కుపడిపోయాయి. ఆ ద్వీపం మిగతా భూభాగంతో సంబంధం లేకుండా తెగిపోయింది. ఇప్పుడు వీటికి ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్పించితే లేదా అవి నేర్చుకుంటే, వాటి సమూహంలో వాటి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఈ నైపుణ్యాన్ని ప్రధాన భూభాగంలో ఉండే కోతులకి కూడా చేరుతుంది. అయితే వాటిమధ్య ఎటువంటి భౌతిక, మానసిక సంబంధం లేకుండానె ఇది జరుగుతుంది.
ఇది నిజం! ప్రపంచంలో ఉండే కోతులన్నింటినీ వేరుగా ఉంచనవసరం లేదు. ఒక
భగవద్గిత - అధ్యాయం 12
గ్రూపు తీసుకొని వాటికి శిక్షణనిస్తే చాలు దీని తరువాత భూమి మీద ఉన్న కోతులన్ని ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించుతాయి. అవి పుస్తకాలు చదవనవసరం లేదు. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకోనవసరం లేదు. అవి టి.వి. చూడనవసరం లేదు. ఇంటర్నెట్ ఓపెన్ చేయనవసరం లేదు. ఈ జ్ఞానం, నైపుణ్యం వాటికి చేరుతుంది. అది ఎలా చేరుతుంది అనే విషయాన్ని శాస్త్రజ్ఞులు ఇంతవరకూ తెలుసుకోలేకపోయారు. ఇది జరుగుతున్నది అని తెలుసు కానీ ఎలా జరుగుతుందో తెలియదు.
ఈ విధంగా ఒక విషయం లేదా విశేష నైపుణ్యం మరొక చోటికి అప్రయత్నంగా వెళ్ళటం అనేది శాస్త్రీయ పరిశోధనలలో చాలా సార్లు జరిగింది. మేడమ్ క్యూరి రేడియంలో ఉండే రేడియో యాక్టివిటినీ కనుగొన్నప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలలో వేరువేరుగా శాస్త్రజ్ఞులు ఇదే విధమయిన పరిశోధనలని వెల్లడి చేసారు.
అత్యున్నత అహం అనేది ఒక సామూహిక అచేతన స్థితి యొక్క రూపం. అయితే ఇది నిజానికి అచేతనస్థితి కాదు. ఇది అత్యున్నతమయిన చేతనస్థితి. సమూహంగా ఉండే చేతనస్థితి మానవజాతి ఉనికికి చాలాముఖ్యమయిన విషయం. మనందరం ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటాము. మన ఆలోచనలు, పనులు వేరే వారిని ప్రభావితం చేస్తాయి. ఈ సమూహంలోని చేతనస్థితిలోనికి ప్రవేశించటం ద్వారా మనం విశ్వశక్తి యొక్క పరిధిలోనికి ప్రవేశించుతాము. మన వ్యక్తిగతం ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ, విశ్వ ఆత్మలో ఒక భాగం అవుతుంది. మనం భగవంతుడవుతాము.
సమూహ చేతనస్థితిలోనికి మనం చేరువయినప్పుడు ఒక కొత్త విషయం, ఒక కొత్త సంగతి జరుగుతుంది. దానికి చేరువ కాకముందు మనం తరంగాలు సృష్టిస్తుంటాము. మనం ఒకరికి ఒకరు ప్రభావితం చేసుకుంటాము. చాలసార్లు అది చాలా చెడుగా ప్రభావితం చేస్తాం. ఎందుకంటే మనలో నిస్వార్ధం అనేది
ఉండదు. కేవలం స్వార్ధమే ఉంటుంది. ఎప్పుడయితే సమూహ చేతన స్థితి యొక్క పరిధిలోనికి మనం వెళతూనే మనం ఒకరితో ఒకరం ఎంతగా కలసిపోతామంటే, అందరూ ఒకటిగానే అయిపోతాము. ఈ స్థితిలో మనం ఎటువంటి తరంగాలని సృష్టించలేము. ఎందుకంటే అందరూ ఉండేది ఒకే స్థితి, ఒకే సముద్రం, ఒకేనదిలా ఎటువంటి భేదం లేకుండా ప్రవహిస్తుంటాము.
ఇక్కడ కృష్ణుడు చెప్పిన "ప్రపంచంలో ప్రభావితం కాకుండా తాను ప్రపంచాన్ని ప్రభావితం చేయకుందా" అనే మాటకి అర్థం ఇదే .మనం సామూహిక చేతన స్థితికి చేరటమే. అదే భగవంతుని స్థితి : అక్కడ మీరు నేను, ఆయన అందరూ ఒక్కటే.
కృష్ణుడు ఇంకొక మాట కూడా అంటాడు. "ఎవరయితే సంతోషం కోపం, ఆదుర్దా అనేవి లేకుండా ఉంటాదో... దీని అర్ధం ఏమిటి? మనం కోపం ఆదుర్దా అనేవాటిని అర్ధం చేసుకోగలం, కానీ సంతోషం ఏమిటి? మనం ఎవరయినా కారణం లేకుండా సంతోషంగా ఉంటే, ఇతనికి ఏమయింది అని అడుగుతాము.
మనలో చాలా మందికి సంతోషం అంటే విచారానికి సంతోషం లేని స్థితికి మధ్యన ఉండే సమయం. రెండు యుద్ధాల మధ్య కాలాన్ని మనం శాంతి అని ఎలా అంటామో ఇదీ అంతే. ఇది ఒక అసత్యం.
సంతోషం ఉల్లాసం అనేవి స్పర్శేంద్రియాల ద్వారా బయట ప్రపంచం నుంచి మనకి కలిగిన అనుభవం. అది తప్పని సరిగా దుఃఖానకి దారి తీస్తుంది. సంతోషం అనేది మనం ఆశించినది పొందినప్పుడు మనకు దొరికే ఒక ఉపవస్తువు మనం ఆశించినది జరిగినప్పుడు, మనం సంతోషపడతాము. అవకాశాలు, నిజమయిన అవకాశాలు తరువాత దొరకకపోవచ్చు. అది జరిగినప్పుడు సంతోషం బదులు విచారం కలుగుతుంది.
భగవద్గిత - అధ్యాయం 12
సంతోషం అనేదానిని మనం మన అంతరంగం నుంచి మాత్రమే అనుభవించగలం. అది శాశ్వతమయినది. దానినే పరమానందం, నిత్యానందం అంటాము. పరమానందం శాశ్వతమయినది. సంతోషం స్థిరమయినది కాదు. పరమానందం శాశ్వతమయినది. మనం ఆశించటం అనే దానిని వదలగానే మనం దేనికీ అతిగా సంబంధం లేకుండా ఉంటామో, అప్పుడు కలిగే ఆనందమే పరమానందం. అదే నిత్యానందం.