KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/(పేమే మీ జీవితం అనేది భగవద్గీత 12 అధ్యాయంపై వ్యాఖ్యానం.Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

(పేమే మీ జీవితం అనేది భగవద్గీత 12 అధ్యాయంపై వ్యాఖ్యానం.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ అధ్యాయంలో ప్రతి శ్లోకాన్ని ఎంతో వివరంగా చక్కని ఉదాహరణలు ఇస్తూ వివరించారు. ' (పేమ అనేది ఒక భావావేశం కాదు. అది జీవి యొక్క స్వభావం. దాన్ని కనుక కనుగొన్నట్లయితే అన్ని బంధనాల నుండి విడవడి మన అంతరంగంలోమి పరమానందాన్ని పొంది నిత్యానంద స్థితికి చేరగలుగుతాము'. ఈ విషయం మనకు అర్థమయ్యేందుకు (పేమ, శరణాగతి అనే విషయాన్ని విశదీకరించారు.

అద్భుతయోగి. ఆయన మనిషిలో ఉండే దైవత్వాన్ని, పరమానందాన్ని మేలుకొలపటం అనే లక్ష్యం కోసం పనిచేసున్నారు. మీరు, ప్రపంచాన్ని (పేమిస్తాను, భగవంతుడిని

(పేమిస్తాను అని చెప్పటం చాలా సులభం. కానీ మీ ప్రక్క ఇంటివారిని (పేమించ‌గ‌ల‌గ‌డం చాలా కష్టం. నేను ఈ ప్రపంచాన్నంతా ప్రేమిస్తాను అని చెప్పి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మీరు ప్ర‌తిరోజు చూసే వ్యక్తిని [ప్రేమించలేనప్పుడు మీరు ఎప్పుడూ చూడని భగవంతుడిని ఎలా

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM (పేమ, శరణాగతిలకు ఉండే శక్తిని మనకు తెలియజేస్తూ, తద్వారా ఆనందకరమైన స్వేచ్చకు బాట వేశారు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM లమెలిశాలో భగవద్గిత - అధ్వియం12 మీద ఇచ్చిన పువచనిలు

భగవద్గీత దీనినే మనం గీతా అని కూడా అంటాము. దీనిని చాలా పవిత్ర గ్రంథంలా భావిస్తారు. ఇది స్మృతి. (స్మృతి అంటే వినటం ద్వారా ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేది) మన ప్రాచీన పవిత్ర గ్రంధాలయిన వేదాలు, ఉపనిషత్తుల లాగానే ఇది కూడా స్మృతి వేదాలు, ఉపనిషత్తులు చాలా మంది అనుకుంటున్నట్లుగా భగవంతుడు ఇచ్చినవి కావు. గొప్ప గొప్ప ఋషులు సమాధి స్థితిలో ఉండగా వారికి కలిగిన జ్ఞానంతో వారిలోని అంతరంగం జ్ఞానంతో చెప్పబడినవి.

భగవద్గీత హిందూ పురాణమయిన మహాభారతంలో ఒక భాగం. ఇది శాశ్వత సత్యాలను వెల్లడి చేసే వేదాలు వంటిది కాదు. వేదాలు మహారుషులు అంతరంగపు జ్ఞానంతో చెప్పబడిన సత్యాలు. అలాగే ఇది మహాఋషుల బోధనలయిన ఉపనిషత్తుల వంటిది కూడా కాదు. మనకి ఉన్న ఏ పురాణం కూడా గీతకున్న ప్రాముఖ్యతని కలిగిలేవు. గీత శ్రీకృష్ణుని యొక్క అత్యున్నత చేతన స్థితి నుంచి, పరబ్రహ్మ నుంచి ఉదయించినది. అందుకే దీనిని పవిత్ర గ్రంథం అంటారు.

మహాభారతం అంటే అర్ధం గొప్ప భారతం. ఇది ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన భారత దేశం గురించి చెబుతుంది. దీనిని భరతుడు అనే చక్రవర్తి పరిపాలించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని భారత్ అంటారు. మహాభారత కథ, రెండు వర్గాలకి సంబందించిన యుద్ధ కథ. వాళ్ళే కౌరవులు, పాండవులు. వాళ్ళు చాలా దగ్గర సంబంధం కలిగిన రక్త సంబంధీకులు. అంధరాజు అయిన ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజు. ఆయన వందమంది కౌరవులకు తండ్రి. ఆయన పాండురాజుకు అన్నయ్య. పాండురాజు అయిదుగురు కొడుకులూ పాండవులు.

ధృతరాష్టుడు పెద్దవాడయినా, పాండురాజుని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఎందుకంటే ధృతరాష్టుడు అంధుడు. రాజ్యపాలన చేయలేదు. అందుకని ఆ బాధ్యత పాండురాజు మీద పడుతుంది. అయితే పాండురాజు ఒక మునీశ్వరుని శాపానికి గురి అవుతాడు. అప్పుడు పాండురాజు తన రాజ్యాన్ని, బిడ్డలని ధృతరాష్టునికి అప్పచెప్పి అతని భార్యలయిన కుంతి, మాద్రులతో కలిసి అడవికి వెళ్ళిపోతాడు. ఈ మహాభారత కథ చెప్పిన వ్యాసుడు పాండవులు కుంతీ, మాద్రిలకు దేవతల ద్వారా జన్మించినట్టు చెబుతారు. ఎందుకంటే ముని శాపం వలన పాండురాజుకు పిల్లలు పుట్టరు. కుంతి చిన్నతనంలో దైవశక్తిని ఆహ్వానించగలిగే శక్తిని వరంగా పొందుతుంది.

దుర్యోధనుడు కౌరవుల యువరాజు. అతనికి పాండవులకి మధ్య మంచి సంబంధాలు, (పేమ ఏర్పడలేదు. అతని తమ్ముడు, దుర్మార్గుడయిన దుశ్శాసనుడుతో కలసి పాండవులని చంపాలని చాలా [పయత్నాలు చేస్తాడు. అయితే ఆ విషయంలో అతను ఎప్పడూ విజయం సాధించలేకపోతాడు.

కుంతికి సూర్యదేవుని అనుగ్రహంతో ఒక కుమారుడు ఆమె అవివాహితగా ఉన్నప్పుడు జన్మిస్తాడు. అతనే కర్ణుడు. అతను పాండవులకంటే పెద్దవాడు. అయితే కుంతీకి

వివాహం జరగని కారణంగా అతనిని వదిలి వేస్తుంది. అయితే ఇక్కడ కథ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కర్ణుడు ధుర్యోధనుడితో చేతులు కలుపుతాడు.

ఆ తరువాత పాండవులలో పెద్దవాడయిన యుదిష్టిరునికి దృతరాష్ఠుడు అర్ధరాజ్యాన్ని ఇస్తాడు. యుదిష్టిరుడు ఇంద్రప్రస్తని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేస్తుంటాడు. అతడు తన తమ్ములయిన భీమ,అర్జున, నకుల, సహాదేవులతో కలసి రాజ్యపాలన చేస్తాడు. అర్జునుడు స్వయంవరంలో ద్రుపదరాజు కుమార్తె [దౌపదిని గెలుచుకుంటాడు. పాండవులు అయిదుగురు వాళ్ళ తల్లికి ఇచ్చిన [పమాణం [పకారం ఐదుగురూ [దౌపదిని వివాహమాడతారు.

ధుర్యోధనుడు యుధిష్టిరుని జూదమాడటానికి ఆహ్వానించుతాడు. శకుని దుర్యోధనుని తరపున జూదమాడి యుధిష్ఠిరుని ఓడించుతాడు. దాంతో యుదిష్టిరుడు రాజ్యాన్ని, తమ్ములని, భార్యని చివరికి తనను తాను కౌరవులకి పోగొట్టుకుంటాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించాలని చూస్తాడు. ఆ తరువాత వాళ్ళు పదమూడు (13) సంవత్సారాలు అరణ్యవాసం ఆ తరువాత ఒక సంవత్సరం ఆజ్ఞాతవాసం చేయివలసి వస్తుంది.

పద్నాలుగు సంవత్సరాల తరువాత పాండవులు తమ రాజ్యాన్ని ఇవ్వవలసినదిగా కోరతారు. ఈ సందర్భంలో శ్రీ కృష్ణుడు పాండవులకు సహాయం చేస్తాడు. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం. అయితే రాజ్యాన్ని తిరిగి ఇవ్వటానికి ధుర్యోధనుడు సమ్మతించడు. చివరికి పాండవులు కౌరవుల మధ్య గొప్ప యుద్ధం [పారంభ మవుతుంది. అదే మహాభారత యుద్ధం. చాలా రాజ్యాల రాజులు కౌరవులు పాండవులకు సహాయంగా యుద్దంలో పాల్గొంటారు.

(పేమే మీ జీవితం

శ్రీ కృష్ణుడు యాదవరాజ్యానికి రాజు. ఆయన కౌరవులకి పాండవులకి సహాయంగా ఉంటానంటాడు. ఆయన వారితో ఇలా అంటాడు, "మీలో ఒకరు నన్ను తీసుకొండి. అయితే నేను యుద్ధం చేయను. మరొకరు మా యాదవ సైన్యాన్ని తీసుకోండి". ధుర్యోధనుడు యాదవ సైన్యాన్ని కోరుకుంటాడు. అందరూ కురుక్షేత్రంలో యుద్దానికి దిగుతారు.కురుక్షేత్రం ప్రస్తుతం హర్యానాలో ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునుని రథసారధి అవుతాడు. యుద్ధారంభంలో తన శత్రు సమూహంలోని అన్నతమ్ములని, స్నేహితులని, గురువులని, బంధువులని చూసిన అర్జునుడు అవరాధ భావంతో దుఃఖపడతాడు. దాంతో అర్జునుడు యుద్ధ భూమిని వదిలి వెళ్ళిపోతానంటాడు.

అప్పుడు శ్రీకృష్ణునికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. భగవద్దీత అంటే అర్ధం భగవంతుని పాట. శ్రీకృష్ణుడు అర్జునుని ఆయుధాలు చేపట్టి శతృనాశనం చేయమంటాడు. "వీళ్ళంతా మరణించారు. నిన్ను ఎదుర్కొంటున్న వీళ్ళందరూ అప్పటికే మరణించారు. కాబట్టి ముందుకి వెళ్ళు. నీవు చేయదలచుకున్నది చేయి. అది నీ బాధ్యత" అంటాడు.

భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి. ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్టునికి చెప్పటమే. దృతరాష్ఠుడు యుద్దాన్ని చూడలేదు. కాబట్టి సంజయుణ్ణి అక్కడ జరిగే విషయాలు [ప్రతి ఒక్క సంఘటనా వివరంగా చెప్పమని అదుగుతాడు. అప్పుడు సంజయుడు యుద్దాన్ని యధాతథంగా అంధరాజయిన ధృతరాష్టునికి చెబుతాడు. మహాభారత యుద్గం పద్దెనిమిది రోజులు జరుగుతుంది. చివరికి పాండవులు యుద్ధంలో గెలుస్తారు. తిరిగి తమ రాజ్యాన్ని పొందుతారు.

ఈ యుద్ధంలో కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ భగవంతునికి (నారాయణు నికి) మనిషికి (నరునికి) మధ్య జరిగిన సంభాషణ. సంస్కృతంలో వీరిని నర,

నారాయణులు అని అంటారు. అర్జునుడు అడిగిన [ప్రశ్నలు, వెల్లడి చేసిన అనుమానాలు మనందరిలోనూ ఉన్నాయి. భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాలు ఏ కాలానికి అయినా ఏ సమయానికి అయినా సరిపోతాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నేటికి కూడా అత్యంత విలువయినవే.

కొన్ని వేల సంవత్సరాల క్రితం అర్జునుడు ఏ విధంగా తన గురువు, దైవం అయిన శ్రీకృష్ణునితో సంభాషణ చేసాడో ఈ రోజు మీరు అదే విధంగా గురువు సమక్షంలో ఉన్నారు. గురువు మాటలు మీలోని అనుమానాలని నివృత్తి చేయుగాక. అమాటలు మీ [ప్రశ్న‌ల‌కి జ‌వాబులునిచ్చుగాక‌. నిత్యానందం.

ఈ గ్రంధంలో యువకుడయిన జ్ఞానోదయం పొందిన గురుదేవులు శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM భగవద్గీతపై వాఖ్యానించుతారు. కొన్ని సంవత్సరాలుగా భగవద్దీతపైన ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. అన్నింటికంటే ముందుగా చెప్పదగిన వ్యాఖ్యానం గురుదేవులు శ్రీ ఆదిశంకారాచార్యులవారిది. ఆయన దానిని కొన్ని వేల సంవత్సరాల క్రితం [ప్రచురించారు. ఆధునిక కాలంలో గురుదేవులయిన రామకృష్ణ పరమహంస, భగవాన్ శ్రీరమణ మహర్షి భగవద్గీత మీద చాలా విస్తృతంగా మాట్లాడారు. ఎంతో మంది ఈ పవిత్ర గ్రంధం మీద ఎన్నో గ్రంధాలు రాసారు.

ఈ పుస్తకంలో మేము శ్లోకాన్ని, దాని అర్దాన్ని వివరంగా ప్రతి పదానికి ఇచ్చాము. అలాగే ఆ శ్లోకం యొక్క భావాన్ని క్లుప్తంగా ఇచ్చాము. అలా ఇవ్వటం వలన దీనిని మరొక గ్రంధంతో పోల్చనవసరం లేదు. అలా పోల్చడం ఆపేస్తారు. భగవద్దీతపై శ్రీTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చేసిన వాఖ్య కేవలం తర్జమా కాదు. ఆయన ఒక్కొక్క శ్లోకం గురించి

మాట్లాడే సమయంలో చదివేవారిని ప్రపంచం మొత్తం నుంచి తీసుకువెళతారు. భగవద్గీతలో [పతి శ్లోకానికి ఐదు స్తితులలో అర్దాలు ఉన్నాయని చెబుతారు. మామూలుగా వచ్చే వాఖ్యానాలు మొదటి దశలో అర్థాన్ని మాత్రమే కలిగి వుంటాయి. ఇక్కడ జ్ఞానోదయం పొందిన గురుదేవులు సామాన్యస్థితి నుంచి అసాధారణ స్తితికి ఎంతో సులభంగా తీసుకువెళతారు.

పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM గీతావాఖ్యానం చాలా అరుదయినది. అది మనకి అరుదయిన ఆత్మదర్శనం కలిగిస్తుంది. ఇది చదవటం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప అనుభవం, ఇది ఒక ధ్యానం.

ఆదిశంకరాచార్య, గొప్ప తత్వవేత్త, గురుదేవులు ఈవిధంగా చెబుతారు.

భగవత్ గీతా కించితా ధీతా గంగాజల లావా కనికపితా సకృతాపి ఏన మురారి సమార్చ క్రియాతే తస్యా యామేన చర్చా

భగవద్గీతని కొంచెం చదివినా, గంగానదిలోని ఒక నీటిబొట్టుని తాగినా, శ్రీకృష్ణని ఒక్కసారి తలచినా, మనం మరణాన్ని సమీపించే సమయంలో ఎటువంటి సమస్యని ఎదుర్కోము.

(పేమే మీ జీవితం

భగవద్గీత ముందు అధ్యాయంలో అర్జునుడు భగవానుని విశ్వరూపం చూపించమని ప్రార్దిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించుతాడు. అదే శ్రీకృష్ణని విశ్వరూపం. భగవాన్ శ్రీకృష్ణుడు ఎంతో ఓపికతో అర్జునుని అనుమానాలన్నీ తీరుస్తాడు. అడిగిన [ప్రశ్న‌ల‌న్నింటికి జ‌వాబులు ఇస్తాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని అసలు రూపమయిన, రూపంలేని రూపాన్ని చూడాలనుకుంటాడు. అది నాశనం లేనిది. అనంతమయినది, మరణం లేని దివ్యత్వం ఆ స్థితి.

భగవాన్ శ్రీకృష్ణుడు తన స్నేహితుడు, శిష్యుడు, సర్వమానవులకి [ప్రతినిధి నరుడు అయిన అర్జునుడి కోరకని మన్నించుతాడు. శ్రీకృష్ణుని విశ్వరూపం దర్శించిన అర్జునుడు అందులోని అద్భుతశక్తికి తట్టుకోలేకపోతాడు. ఆ విశ్వరూపాన్ని చూడలేకపోతాడు. అర్జునుడు శ్రీకృష్ణుని తిరిగి మామూలు రూపానికి, తన స్నేహితుడు, యాదవరాజు, తన రథసారథి అయిన కృష్ణుని రూపానికి వచ్చేసేయమని [ప్రార్థేయపడతాడు. తనలోని విశ్వాన్ని, సర్వసృష్టి యొక్క రూపాన్ని అర్జునునికి

చూపించి, ఆ విశ్వశక్తి యొక్క అనుభవాన్ని చేతన స్థితిలో అర్జునునికి ఇచ్చి, ఆ తరువాత భక్తి గురించి అర్జునునికి వివరిస్తాడు. అదే భక్తి [పేమ, దివ్య [పేమ, దైవ [పేమ.

శ్రీకృష్ణుడు అర్జునునికి చూపించిన విశ్వరూపం ఈ సర్వవిశ్వం యొక్క సచేతన స్థితి. అదే భగవానుని చేతన స్థితి. అదే మనందరిలోనూ ఉండే సమూహ చేతన స్థితియొక్క సంపూర్ణ రూపం. శ్రీకృష్ణని విశ్వరూపదర్శనంతో అర్జునుడు తాను కూడా ఈ విశ్వచేతనలో భాగమేన్న విషయాన్ని అర్ధం చేసుకున్నాడు. అంతేకాకుండా తాను చూడగలిగే కృష్ణుడు ఆయన యొక్క అనంతమయిన, శాశ్వతమయిన విశ్వాత్మలో ఒక చిన్న భాగమని అర్ధం చేసుకున్నాడు.

దైవికమయిన శ్రీకృష్ణ భగవానుని విశ్వదర్శన అనుభవం తరువాత అర్జునునిలో ఎన్నో [ప్రశ్నలు ఉదయించాయి.

  • తాను ఇంతకుముందు చూసిన విశ్వరూపం ఈ సర్వవిశ్వం యొక్క అద్భుత సత్యమేనా?
  • తాను నిజంగా తన దృష్టిని కేంద్రీకరించవలసిన స్థితి ఇదేనా?
  • శ్రీకృష్ణుడు తాను ఇంతకుముందు చెప్పిన చాలా ముఖ్యమయిన విషయం, రూపంలేని ఆత్మ యొక్క స్థితి ఇదేనా?

మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే భక్తి (దైవ[పేమ) తరువాత ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుంది అనుకుంటారు. కానీ, మీకు అసలు నిజమేమిటో చెబుతాను. ఆధ్యాత్మిక అనుభవం అయిన తరువాత మాత్రమే భక్తి ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కూడా నిజమయిన భక్తి అనేది ఆధ్యాత్మిక అనుభవానికి ముందు జరుగదు.

తూర్పుదేశాల సమాజంలో వారి నమ్మకం ఏమిటంటే, ఆధ్యాత్మిక అనుభవం జరిగాక మాత్రమే సమాజ సేవ చేయగలరు అని. కానీ పశ్చిమదేశాలకి సంబంధించిన మతాలు మాత్రం సమాజ సేవ మాత్రమే ఆధ్యాత్మిక అనుభవాలకి దారితీస్తుంది అని నమ్ముతారు. అయితే అలా ఎప్పటికీ జరగదు. మన అంతరంగంలో మార్పు జరగనంత వరకూ, మనం ఎదుటివారికి సహాయం చేయగలం అనేది అసలు జరగదు. ఎప్పడయితే మనం అలా చేసామో అది కేవలం ఏదో పైపైన చేసే పనిమా(తమే అవుతుంది. అటువంటి సేవని మనం మన అహంకారాన్ని తృప్తి పరచటానికి మాత్రమే చేస్తాము. మనం చేసే సేవ చూసి అందరూ మనని మంచివారు, కరుణ కలవారు అని మెచ్చుకుంటారని చేస్తాము.

కానీ ఎప్పడుయితే ఆధ్యాత్మిక అనుభవం ద్వారా అహంకారం పూర్తిగా మాయమవుతుందో అప్పుడే మీరు ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఎదుటివారిని సర్వవిశ్వ చేతన స్థితిలో భాగమే అని మీరు అంగీకరించుతారు. అప్పుడే మీరు అందరూ ఒక్కటే, అందరం ఆ చేతన శక్తిలో భాగమే అని అనుకోగలుగుతారు. మనలో ఉండే పేద ధనిక తేదాలు, నలుపు తెలుపు రంగుల భేదాలు ఉండవు అని అర్ధమవుతుంది. అప్పడే, కేవలం అలా తెలుసుకోగలగినప్పుడే మనం ఎదుటివారికి ఎంతో కొంత అర్ధవంతమయిన సహాయం చేయగలుగుతాము.

ఎవరయితే ప్రతీ ఒక్కరూ విశ్వచేతన స్థితిలో భాగమే అనే అనుభవాన్ని పొందుతారో అటువంటి వ్యక్తి మాత్రమే నిజమయిన (పేమని అన్ని వైపులకీ వెదజల్లగలుగుతారు. ఆ (పేమని అన్ని దిశలలో వ్యాపింపచేయగలుగుతారు. అటువంటి వ్యక్తికి మాత్రమే [పేమ అంటే ఏమిటో తెలుస్తుంది. మరెవరికీ కూడా నిజమయిన [పేమ అంటే తెలియదు. మిగతా వారు [పేమిస్తున్నాము అని అనుకుంటారు. లేదా [పేమిస్తున్నట్టు నటిస్తారు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. చాలామంది [పేమిస్తున్నట్టుగా అనిపిస్తారు.

కొన్నిసార్లు అలా నటిస్తూ వాళ్ళు నిజంగానే [పేమిస్తున్నాము అని అనుకుంటారు. కానీ మీరు [పేమని ఎప్పడూ నటించలేరు.

(పేమ మీ అంతరంగంలో మీ అసలయిన ఉనికి నుంచి పొంగి [పవహించాలి. [పేమ అనేది మీరు విశ్వ చేతన శక్తిని అనుభవించేటప్పుడే తెలుస్తుంది. మీ అహంకారం పూర్తిగా పోయినప్పుడు, మీకు ఆధ్యాత్మిక అనుభవం కలిగినప్పుడు మాత్రమే అటువంటి [పేమ మీలో సృష్టించబడుతుంది. శ్రీకృష్ణుడు ఈ పద్ధతిని ఒక (క్రమమైన రీతిలో ఒక దాని తరువాత ఒకటిగా మనకోసం తీసుకువచ్చాడు. నేను మీకు చెబుతున్నాను : ఆధ్యాత్మిక అనుభవం తరువాత అంతులేని కృతజ్ఞత మీ లోపలినుంచి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మీలో పొంగి [పవహించే (పేమ అన్నివైపులకీ వ్యాపిస్తుంది. దానికోసం మీరు ఎటువంటి [పత్యేకమయిన [ప్రయత్నాలు చేయనవసరం లేదు. ఎవరూ కూడా ఆధ్యాత్మిక అనుభవం లేకుండా [పేమని చూపించలేరు, [పేమ అనుభూతిని పొందలేరు.

నిజమయిన, షరతుల లేని [పేమని సృష్టించలేము. ఎప్పుడయితే మీ మనస్సు (మైంద్) నిశ్శబ్దంగా, పవిత్రంగా ఉంటుందో అప్పుడే అటువంటి [పేమ మీలో వికసించుతుంది. అయితే మనం మామూలుగా చెప్పుకునే [పేమ నిరంతరం షరతులు, నిబంధనలతో ఉండే [పేమ. మనం మన [పేమతో వ్యవహారాలు నడుపుతాము. అది ఈ విధంగా పనిచేస్తుంది. ముందుగా మనం ఎదుటి వారి మాటలకి, పనులకి మన అనుమతిని ఇస్తాము. అలా ఇచ్చిన సర్టిఫికెట్లకి బదులుగా వాళ్ళు మనం కోరుకున్న విధంగా ఉండాలి అని మనం ఆశిస్తాము.దీనినే మనం [పేమ అంటాము.

మనం ఎదుటి వారిని [పేమిస్తున్నాము అని చెబుతుంటాము. మనం ఈ [ప్రపంచాన్ని [పేమించగలుగుతున్నామని గర్వపడుతుంటాము. నిజజీవితంలో చూసినప్పుడు మాత్రం మన పక్క ఇంటివారిని [పేమించటం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు మనకంటే ధనవంతులయినప్పుడు మనకంటే ఒక మెట్టు పైన ఉన్నప్పుడు ఇదీ మరీ కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఎదుటివారి రెండు కళ్ళు పోతాయి అంటే తన ఒక కన్నుని పోగొట్టుకోవటానికి ఆనందంగా సిద్దపడతారు. అటువంటి వ్యతిరేక భావాలు అసూయ, అత్యాశ వలన కలుగుతాయి. మనం మన పక్క ఇంటివారినే [పేమించలేనప్పుడు విచిత్రం [ప్రపంచాన్ని ఎలా [పేమించగలుగుతాము. మనం మన వాళ్ళు కోసం మాత్రమే పాటు పడేటప్పుడు, సమాజానికి ఎలా సేవ చేయ కలుగుతాము.

కొంతమంది నన్ను అడుగుతుంటారు 'స్వామీజీ, మీరు మీ శిష్యులని, భక్తులని ధ్యానం చేయి,ధ్యానం చేయి అంటుంటారు. దానివలన ఉపయోగం ఏమిటి? అది స్వార్థం కదా? వాళ్ళని సమాజ సేవ చేయమని ఎందుకు చెప్పరు? అది చాలామందికి ఉపయోగపడుతుంది కదా.' అని అంటారు.

చాలా ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. అవి ఆధ్యాత్మిక సంస్థలు అని చెప్పుకుంటాయి. అవన్నీ పేరుకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం, లేదా సమాజంలో గొప్ప కోసం అలా చేస్తుంటాయి. ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. అవి ఇటువంటి దానధర్మాలు చాలా చేస్తుంటాయి. ఇటువంటి సంస్థలని నడిపేవారు, ఇటువంటి కార్యక్షమాలలో ఉండేవారు ఫోటోలు తీయించుకొని న్యూస్ పేపర్లలోనూ మేగజైన్లలోనూ వేయించుకుంటారు. అలాంటివి మీరు చాలా చూసి ఉంటారు.

నేను ఎప్పుడూ చెబుతుంటాను. దానధర్మాలు చేయటం, సమాజసేవ అనే కార్యక్రమాలు చేయటం అనేది మిమ్మలని మీరు చాలా అందంగా మోసం చేసుకోవటం, అలాగే ఎదుటివారినీ మోసం చేయటం. ఇది కేవలం పైన బయటకి వెల్లడి చేయటమే కానీ అంత రంగంలో ఏర్పడిన కోరిక కాదు. ఏ క్షణంలో అయితే మీరు ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించాలని అనుకుంటారో అప్పుడే

[పేమే మీ జీవితం

ఈ కార్యక్రమం మొత్తం తన నాణ్యతని, రంగుని అసలు ఉద్దేశాన్ని పోగొట్టు కుంటుంది. ఇది మీకు ఆధ్యాత్మిక అనుభవం అయిన తరువాత జరిగితే అప్పుడు అది అలా [ప్రవహిస్తుంది. అదే నిజమైన [పేమని వెల్లడి చేస్తుంది.

ఎదుటివారిని మార్చటానికి [ప్రయత్నించేముందు, మన అంతరంగంలో మార్పురావాలి. ఎవరయితే తాను ఈ సర్వవిశ్వశక్తిలో భాగం అని అనుకోరో అలాగే ప్రతివ్యక్తి తనతో ప్రతి వ్యక్తికీ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయని తెలుసుకోరో, అటువంటివారు ఎదుటివారి కోసం నిజమయిన [పేమతో ఏమీ చేయలేరు. వాళ్ళు చూపించేది కేవలం కృతిమమైన, కపటమయిన [పేమ మాత్రమే. అటువంటి వాళ్ళు వంచకులు.

మనందరం ఈ అనంత విశ్వసాగరంలో ఒక భాగమే. అందులో మనందరం నీటి బిందువులమే. మనం ఎంతకాలం అలా నీటి బిందువులుగా ఉండిపోతామో, ఎంతకాలం మనం ఆ మహాసాగరంలోని ఒక భాగమే అని అర్ధంచేసుకోమో, అంతకాలం మనం ఈ అనంత సాగరానికి వేరుపడి ఉంటాము. ఈ విధంగా వేరుగా ఉన్నంతకాలం మనలో నిజమయిన [పేమ ఉండదు. మన అనుభవాల అనుభూతులు పూర్తిగా 'నేను' 'నాది' అనే వాటి మీదే ఆధారపడి ఉంటాయి. ఇటువంటి భేద భావం ఉన్నంతకాలం నిజమయిన [పేమ ఉదయించదు. అటువంటప్పుడు షరతులు లేని [ప్రేమని వెల్లడి చేయలేము.

జెన్ బౌద్ధమతంలో ఒక విషయాన్ని చాలా చక్కగా చెబుతారు. బుద్ధుడు ఏమిచేసినా, ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఏమి చేసినా , అది ఎవరినైనా చంపటం అయినా అది మంచి మాత్రమే చేస్తుంది. అది బుద్ధునికి, ఆ వ్యక్తికీ ఇద్దరికీ మంచి చేస్తుంది. బుద్ధుడు నిరంతరం విశ్వచేతన శక్తితో ముందుకు నడపబడతాడు. అందుకే అది ఎప్పుడయినా అందరికీ మంచిని మాత్రమే చేస్తుంది.

కానీ ఒక సామాన్యమయిన వ్యక్తి (జ్ఞానోదయం పొందని వ్యక్తి) అహంకారంతో ఏమి చేసినా, అది ఒక గొప్ప సేవ అయినా అది వారికీ మంచి చేయదు అలాగే సమాజానికీ మంచిది కాదు. మంచికాని చెడుకాని మనం చేసే పనివలన నిర్ణయింపబడవు. అది మన అంతరంగపు ఉనికి యొక్క నాణ్యతని బట్టి నిర్ణయింపబడుతుంది. జ్ఞానోదయమయిన వ్యక్తి చేసే సామాన్యమయిన చిన్న పనులు కూడా చాలా గొప్ప విషయాలుగా మారతాయి. అవి ప్రపంచానికి చాలా మంచి ఫలితాలని ఇస్తాయి. అదే సామాన్యమయిన ఒక వ్యక్తి లోతయిన అజ్ఞానంతో, అమాయకత్వంతో చేస్తే, గొప్ప సత్యాలు కూడా దురవస్థకి, వినాశనానికి దారి తీసాయి.

చూడండి : బుద్ధుడు చెప్పిన చాలా సామాన్యమయిన మాటలు "మీ శ్వాసని గమనించండి, మీ ఉచ్వాస నిశ్వాసలని పరిశీలించండి" ఇలాంటి చిన్న విషయాలు, సామాన్యమయిన సత్యాలు ఇవే వేలమందిని జ్ఞానోదయం పొందేలా చేసాయి. కేవలం చాలా సామాన్యమయిన ఉపాసన అనే ధ్యానం ఎంతో మందికి జ్ఞానోదయం కలిగేలా చేసింది. ఉపాసన అనేది చాలా చిన్నది, సామాన్యమయిన పద్ధతి. అయినా అది కొన్ని వేలమంది జ్ఞానోదయం పొందే విధంగా వారికి సహాయం చేసింది. వాళ్ళ జీవితాలని మార్చింది. దాని ఫలితంగా ఈ ప్రపంచమే మారిపోయింది.

ఎప్పుడయితే బుద్ధుడు మాములుగా ఉండే చిన్న సత్యాన్ని చెప్పాడో అది కొన్ని వేలమందిని ఉన్నతయిన చేతనస్థితికి చేర్చింది. ఒక మామూలు వ్యక్తి, గొప్ప గొప్ప సత్యాలని చెబితే అవి నాశనానికి దారి తీస్తాయి. ఉదాహరణకి అటామిక్ బాంబ్, అది గొప్ప సూత్రం. అది రెలటివిటీ థియరీ, గొప్ప సూత్రం, అది గొప్ప సత్యం. అయితే అది జ్ఞానోదయం లేని వ్యక్తి మైండ్లోనికి వస్తే దాని ఫలితం అంతులేని వినాశనమే.

నేను ఒక మేగజైన్‌లో కొన్ని విషయాలకి సంబంధించిన డేటా చూసాను. ప్రపంచంలో అన్ని దేశాల ప్రభుత్వాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అవన్నీ కలిపి ప్రయోగిస్తే భూమిని వెయ్యిసార్లు నాశనం చేయవచ్చు. వాళ్ళ దగ్గర నిలువ వుంచిన అణ్వాయుధాలు ఈ భూమిని ఒకసారి కాదు వెయ్యిసార్లు నాశనం చేస్తాయి. అయితే నేను చదివిన రిపోర్లు పాత రిపోర్లు. ఈ నాటికి అవి రెట్టింపు అయి ఉంటాయి. ఇదంతా కూడా ఒక జ్ఞానోదయం పొందని సామాన్య మైండ్ చేసిన పని వలన వచ్చిన ఫలితం.

ఇప్పుడు మన శాస్త్రీయమయిన క్లోనింగ్, స్లెమ్ సెల్స్ అనే పనుల్లో మునిగిపోయాము. వాటి ఫలితాలు ఆ పరిశోధనలలో నిమగ్నమయిన వ్యక్తుల అంతరంగపు ఉనికి యొక్క నాణ్యతమీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని వారి మైంద్ యొక్క నాణ్యత మీద కాదు. మైండ్ ఎప్పుడు అహంకారం చేతులలో ఉంటుంది. కానీ మన అంతరంగపు ఉనికి మనలోని విశ్వపేమని తెలుసుకోగల సచేతన స్థితి ఆధీనంలో ఉంటుంది.

తప్పు ధృక్సధంతో ఉండే ఒక వ్యక్తిని అధికార పీఠం మీద కూర్చోబెడితే అతను మానవాళికే ప్రమాదకారిగా తయారవుతాయి. మనకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక చేయవలసినది కేవలం బటన్ నొక్కటమే ఆలస్యం. అయితే మతిలేని క్రూర స్వభావం కలవాడు ఆ పని చేస్తే ప్రపంచంలో నరమేధ జరుగుతుంది. అందరూ మరణిస్తారు. అదే ఎన్నో అణ్వాయుధాలు నిలవచేయబడి ఉండటమే ఇటువంటి స్థితికి ఒక ఉదాహరణ.

చూడండి. అణుశాస్త్రం ఒక గొప్పసత్యం. అది అణువిచ్చేద సూత్రం. ఇందులో సూత్రం ఏమిటంటే, అణువుని విచ్చిన్నం చేసినప్పుడు అందులోంచి చాలా ఎక్కువ

శక్తి పుడుతుంది.అది చాలా గొప్ప సూత్రం, కానీ అది ఒక సామాన్యమయిన, జ్ఞానోదయం పొందని మైండ్ నుంచి వచ్చిన సత్యం. దానిని, ఆ సూత్రాన్ని ఎన్నో అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు. ఆ సూత్రంతో [ప్రపంచాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. కానీ ఇది ఎప్పుడయితే అహంకారంతో నిండి ఉన్న సామాన్యమానవుల మైండ్ నుంచి వస్తుందో, అటువంటి వారిచేత ఉపయోగింపబడుతుందో అది సర్వనాశనానికి మాత్రమే దారి తీస్తుంది.

మాటలు కాని, పనులు కాని వాటంతట అవే మంచీ చెడు ఏమీ చేయవు. అవి మంచికాని చెడు కానీచేసేది అవి వచ్చిన వ్యక్తి చేతన స్థితి ఆధారంగా మాత్రమే చేయగలుగుతాయి. ఈ చేతన స్థితి, తెలుసుకునే తత్వం అనేది మనకి ఎదుటివారి పట్ల ఉండే భావం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తిలోని ఉనికి యొక్క తెలుసుకోగల తత్వం, లక్షణం యొక్క నాణ్యత మాత్రమే, అతను చేసే పనులు ప్రపంచానికి, సర్వ మానవాళికి మంచి చేస్తుందా లేదా నాశనం చేస్తుందా అని నిర్ధయించేది.

మీ అంతరంగం, మీ నిజమయిన ఉనికి కృతజ్ఞతా భావాన్ని అనుభవించినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ప్రతీ ప్రాణి భగవంతుని రూపమే అని మీకు అనుభవం కావాలి. అప్పుడు మాత్రమే మీలో [పేమ అన్ని వైపులకి వెదజల్లుబడుతుంది. ఆ [పేమ విషయంలో మీరు పూర్తిగా నిస్సహాయులు. భక్తి, [పేమ అనేవి మీ ఆధ్యాత్మిక అనుభవాలని వెల్లడి చేసే పద్ధతులు మాత్రమే.

భగవానుడు భక్తియోగం పై తన [ప్రవచనాలని విశ్వరూప సందర్శనం తరువాత మాత్రమే ప్రారంభించుతాడు. ఆ అనుభవాన్ని అర్జునుడికి ఇచ్చిన తరువాత మాత్రమే క్ష్మదు అనుభవాన్ని వెల్లడి చేసే విషయం మీద మాట్లాడతాడు. ఆయన భక్తిపూర్వకమయిన దైవ [పేమ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఆ శ్లోకం ఏమిటో చూద్దాం.