భగవద్గీత - అధ్యాయం 12
పోగుచేసుకోవటమే. మానసిక వ్యధను ఎలా తగ్గించాలి. ఏవిధంగా ధైర్యంగా ఉండాలి. ఎలా బలంగా ఉండాలి : కోరికలు, భావావేశాలు ఎలా నియంత్రించాలి, ఇవన్నీ జ్ఞానమే. ఈ విధమయిన జ్ఞానాన్ని మీరు తెలుసుకొని మిమ్మలని రక్షించుకోవటానికి ఉపయోగించాలి.
ఉదా: లాస్ యాంజిల్స్లో, కాలిఫోర్నియాలో భూకంపం కిట్స్, తుఫాన్ కిట్స్ అని చెబుతుంటారు. వాళ్ళు ఏం చెబుతారంటే అందులో మంచినీళ్ళు సీసాలు, ముఖ్యమయిన వస్తువులని పెట్టమంటారు. వాటిని కార్లలో ఉంచుతారు. వెబ్సైటులో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా పెద్ద లిస్టునే పెడతారు. అదే భూకంప కిట్టు అంటారు.
పశ్చిమదేశాలలో ప్రజలని ఇటువంటి విపత్తుల నుంచి ఎలా కాపాడుకోవాలో తయారుచేస్తారు. కానీ వారి అంతరంగాలలో వచ్చే భూకంపాలకి మాత్రం వారిని తయారు చేయరు. వారిలో వచ్చే భావావేశాల ఒదుదుడుకులని ఎలా బాలెన్స్ చేయాలో నేర్పించరు. బయట ప్రపంచంలో వచ్చే భూకంపాలని ఎదుర్కొనటానికి ఎలా అయితే అందరినీ తయారు చేస్తారో, ప్రతి ఒక్కరూ మనలోపల వచ్చే భూకంపాలని ఎదుర్కొనటానికి మన భూకంపాల కిట్టుని సిద్ధం చేసుకోవాలి. ఈ భూకంప కిట్టనే నేను జీవిత సమస్యలనకి సరిపడే పరిష్కారాల జ్ఞానం అంటాను.
ఈ జ్ఞానాన్ని మీరు జాగ్రత్తగా పోగుచేసుకోండి. మీ మనస్సులో వ్యధ, కుంగుబాటు అనేవి కలిగినప్పుడు మీరు ఈ కిట్టుతో తయారుగా ఉంటారు. స్పష్టంగా తెలుసుకోండి. మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో మన అంతరంగంలో ఇటువంటి భూకంపాన్ని ఎదుర్కొంటాము. ఆ వ్యక్తి మరణించితే సమస్యలేదు. ఎందుకంటే అప్పుడు భూకంపమనేది ఉండదు. అయితే మనం జీవించి ఉన్నకాలంలో మనం ఎందరివో దగ్గరవారి మరణాలని చూస్తాము, అనారోగ్యాలని చూస్తాము. వీటిని మనం తప్పించలేము.
మనం ఏక్షణాన్ని తప్పించలేము. దానినే మనం అర్ధం చేసుకోవాలి. నేను చెప్పే జ్ఞానం అంటే ఇదే. జీవితంలో తప్పించుకోలేనివాటిని అర్ధం చేసుకోవటం, పరిష్కారాల జ్ఞానాన్ని పోగుచేసుకోవటం, అటువంటి క్షణాలని జాంగ్రత్తగా నియంత్రించటానికి అవసరమయిన పరికరాలని సమకూర్చుకోవటం దీనినే నేను జ్ఞానం అంటాను. మనం ఇటువంటి భూకంపాల కిట్లుని మన జీవితం కోసం ఏర్పరచుకోవాలి. లేకపోతే మనం వాటి నుంచి విజయవంతంగా బయటపడలేము.
ఆ తరువాత ఫలితాలు భయంకరంగా ఉంటాయి. భయంకరమయిన తుఫాను గురించి మనం తయారుగా లేకపోతే ఆ తరువాత జరిగే విషయాలు భయంకరంగా ఉంటాయి. ప్రజలు చాలా పోరాడవలసి ఉంటుంది. అది చాలా కష్టం. అదే విధంగా మన అంతరంగంలో వచ్చే భూకంపాలు, తుఫానులకి మనం తయారుగా లేకపోతే ఆ తరువాత జరిగే పరిణామాలు చాలా కష్టంగా ఉంటాయి. వాటిని మనం సంభాళించలేము. అందుకే ఆ తరువాత జరిగే పరిమాణాలకి మనం ముందుగా సిద్ధమవ్వాలి.
తూర్పుదేశాలలో ప్రజలు వారి అంతరంగంలో వచ్చే తుఫానులకి నిరంతరం తయారవుతుంటారు. అక్కడ వచ్చే భూకంపాలని జ్ఞానం అనే భూకంప కిట్టతో సిద్ధంగా ఉంటారు. మనం అంతరంగంలో వచ్చే భూకంపాలని సిద్ధపడే కిట్టునే జ్ఞానం అంటాము. ప్రస్తుతం ప్రజలు ఎంతో అభివృద్ధి సాధించారు. వారు అంతరంగ ప్రపంచం, బయట మీరు మీ కారులో బయట ప్రపంచానికి సంబంధించిన భూకంపాల కిట్ట పెట్టుకోవచ్చు. మీ హృదయాంలో అంతరంగపు భూకంపాల కిట్లుని అమర్చుకోవచ్చు. మీరు ఇదా, అదా అని ఒకదానినే ఎంపిక చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ రెండింటినీ ఉంచుకోవచ్చు.
ఒకసారి నన్ను ఒక వ్యక్తి ఇలా అడిగాదు "స్వామీజీ! బుద్ధుడు జ్ఞానోదయం కలిగేలా చేసాడు. మరి మీ లక్ష్యం ఏమిటి? అని" నేను చెప్పాను. న్యూస్ పేపర్లు, టెలిగ్రాంలు, ఫోనులు, ఇంటర్నెట్, విమానాలు ఇవేమీ లేని రోజుల్లోనే బుద్ధుడు జ్ఞానోదయాన్ని కలిగించగలిగితే మనం ఇన్ని సౌకర్యాలని ఉంచుకొని కనీసం జ్ఞానోదయం కలిగించాలి. అప్పుడే ఈ సౌకర్యాలని కలిగి ఉండటంలో అర్ధం ఉంటుంది.
ఇప్పుడు మీకు అన్నీ ఉండవచ్చు. మీకు బయట ప్రపంచం ఉంటుంది. మీ అంతరంగ ప్రపంచం ఉంటుంది. మీకారులో ఒక భూకంపపు కిట్లు, మీ హృదయంలో అంతరంగపు భూకంప కిట్టు పెట్టుకోవచ్చు. మన అంతరంగంలో వచ్చే భూకంపాలని తేలికగా తీసుకోవద్దు.
అంతరంగపు భూకంపాలని తేలికగా తీసుకుంటున్నారు అంటే దాని అర్ధం మీరు అజ్ఞానంతో పనులు చేస్తున్నారు అని. అంటే మీరు చాలా పెద్ద సమస్యని ఆహ్వానిస్తున్నారు అని అర్ధం. దానికి సరిపడే విధంగా మీరు తయారుగా ఉండటం లేదు. స్పష్టంగా తెలుసుకోండి. బయటప్రపంచంలో భూకంపమొస్తే మీరు ఎవరో ఒకరిని నిందించవచ్చు. వారిని భాద్యులని చేయవచ్చు. గవర్నమెంటుని, అధికారులని, రాజకీయనాయకులని ఇలా అందరినీ భాద్యులని చేయవచ్చు. కానీ మీ అంతరంగపు ప్రపంచం విషయానికి వస్తే, మీరు బయటవారిని నిందించలేరు. మీరే భాద్యత తీసుకోవాలి.
ఇంతకుముందు అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు.
ఉద్దరేదాత్మనా త్మానం నాత్మనమవసాద యేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః
ఉన్నత స్థితికి చేరటానికి నీకు నీవే సహాయం చేసుకోవాలి. ఎప్పుడయితే నిన్ను నీవు అభివృద్ధి చేసుకోవటానికి సహాయం చేసుకుంటావో అప్పుడు నీకు నీవు
మంచి స్నేహితుడవి. లేకపోతే నీకు నీవు చెడ్డ శత్రువువి.
ఆయన మనకి చాలా మార్గాలు చూపించుతాడు. సాధన చేయటం, జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, ధ్యానం, పనుల ఫలితాలను భగవంతునికి ఆధీనం చేయటం, అంటే కర్మఫల త్యాగం, ఇలా చాలా దారులు చూపించాడు.
ఈ మార్గాలు ఒకదానిని మించినది మరొకటి. ముందుగా జ్ఞానాన్ని పెంపొందించు కోమంటాడు. జ్ఞానానికంటే ధ్యానం మంచిది అని చెబుతాడు. ధ్యానంకంటే ఉత్తమయినది అన్నీ ఆ భగవంతుని పాదాలకు సమర్సించమంటాడు. ఈ విషయం మీద శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు.మనం చేసే పనుల ఫలితాలని భగవంతుని ఆధీనం చేస్తే మనకి త్వరగా మనశ్శాంతి దొరుకుతుంది. ఎంతకాలమయితే ఇవన్నీ నావి అనుకుంటానో అంతకాలం బాధ పడతావు. ఏక్షణానైతే నీవు ఆధీనమయిపోతావో, ఏక్షణానైతే సర్వం భగవంతునికి సమర్పించుతావో,నీలో గొప్ప చికిత్స జరిగిన భావం ఏర్పడుతుంది. మీ అంతరంగం భగవంతుని చికిత్సయొక్క దివ్య మారుత వీచికలు స్పృశించిన భావం మీకు కలుగుతుంది.
కొన్నిసార్లు కొంతమంది ఆధీనమవటం అంటే నియంత్రణ కోల్పోవటం అని అనుకుంటారు. అన్నీ సమర్పించేయటం బలహీనత అని అనుకుంటారు. అర్ధం చేసుకోండి. నియంత్రణ అంటే అహంకారాన్ని వెల్లడి చేయటం అనేది 'నేను, నాది' అనే సందర్భంలోనే వస్తుంది. నియంత్రణ అధికారాన్ని ఆశిస్తుంది. అధికారం కలుషితమయినది. అవినీతిమయినది.
ఆధీనత అంటే స్వేచ్చ. ఆధీనత అంటే ప్రత్యామ్నాయాలు లేని ఎంపికలేని దానిని వివరించటమే. నిర్ణయాలు భగవంతునికి వదిలివేయటమే. మనం పనిచేస్తాం నిర్ణయాలని భగవంతునికి వదిలివేస్తాం. మన ఆశలు, ఆశించటాలు అనే వాటిని వదిలివేయకపోతే మనం మన పనుల ఫలితాలతో ఎక్కువ సంబంధాలు