KAILASA Library/Love is Your Very Life (పేమే మీ జీవితం)/భగవద్గీత - అధ్యాయం 12Sign in
Love is Your Very Life (పేమే మీ జీవితం)

భగవద్గీత - అధ్యాయం 12

(పేమే మీ జీవితం మూడిసి)

ఇవ్వలేదు. ఒక వేళ ఒక విషయాన్ని వాళ్ళు స్వీకరించితే సరే. లేకపోతే వారు మతాన్ని వదిలేస్తున్నారు. అంతే.

తూర్పు సంస్కృతుల వారికి చాలా అవకాశాలని ఇచ్చారు. ఒక వ్యక్తి మేధస్సు మీద ఏకాగ్రత ఉండి దానిని అభివృద్ధి చేయాలి, అంటే శివుడిని పూజించుతారు. వాళ్ళు నిరంతరం ధ్యానం చేస్తుంటారు. మరొకరు భక్తి మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటే విష్ణుమూర్తిని ఆరాధించుతారు. ఈ మార్గంలో వెళ్ళేవారు పాటలు పాడతారు. నాట్యం చేసారు. చైతన్య ప్రభు, మీరాబాయి ఇటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. భగవంతుని వైభవాన్ని భక్తితత్వంతో అద్భుతంగా పాడతారు. తమిళనాడులోని ఆళ్వార్లు అనే యోగులు విష్ణుభక్తులు. వారు ఈ మార్గాన్ని, ఎంచుకుంటారు. యోగా మార్గాన్ని ఎంచుకున్నవారు దేవిని పూజిస్తారు. ఆమెపై ధ్యానం చేస్తారు. వాళ్ళు పూజలు చేస్తారు. తాంత్రికాన్ని సాధన చేస్తారు.

ఇక్కడ ఈ విధంగా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు తిరిగి మళ్ళీ మళ్ళీ ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి. మీకు సంప్రదాయమయిన పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. అవి మీ వ్యక్తిగతమైన అభివృద్ధికి సహాయపడతాయి. కాబట్టి సహజంగానే ఒక మార్గాన్ని ఎన్నుకొని అందులో అత్యున్నత స్థాయికి చేరవచ్చు. ఇక్కడ అన్నిరకాల, అన్ని సైజులలో నిచ్చనలు దొరుకుతాయి. అన్ని రకా మెట్లు ఉంటాయి. మీకు నిరంతరం అవకాశాలు ఇవ్వబడతాయి. కాబట్టి సహజంగానే ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానిని ఎంచుకుంటారు.

తూర్పుదేశాల వారు ఎంతో అన్వేషణ చేసారు. మన అంతరంగ ప్రపంచం లోతులోనికి అన్వేషణలు చేసి పరిశోధనలు చేసారు. పశ్చిమదేశాలవారు సమాజపరంగా చాలా సాధించారు. ఎందుకంటే వారికి స్వేచ్చ ఉన్నది. భరత్ లో ఆ స్వేచ్ఛ లేకపోవటం వలన చాలా పోరాడవలసి వచ్చింది, కానీ వాళ్ళు చాలా అద్భుతాలని ఆధ్యాత్మిక స్వేచ్చ ద్వారా సాధించగలిగారు.

ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా ఆధ్యాత్మిక అవకాశాలని వివరించుతాడు. ఇది చేయి, లేకపోతే అది చేయి. ఇది కేవలం తూర్పుదేశాలకి చెందిన గురువులకి మాత్రమే సాధ్యం. వారికి మనపైనే ఉండే అంతులేని ప్రేమ, కరుణ, దయ వలన మనకి ఉదారంగా ఎన్నో అవకాశాలని ఇస్తున్నారు. తూర్పుదేశాలలో ఆధ్యాత్మికత ఎంతో కరుణతోనిండి ఉంటుంది. అది మీకు చాలా అవకాశాలని ఇస్తుంది.

పశ్చిమదేశాలలో కొన్ని రంగాలలో మీకు గౌరవం ఇవ్వబదుతుంది. ప్రతి వ్యక్తీ గౌరవింపబడతాడు. ఉదా: కస్టమర్స్‌ని చాలా గౌరవంగా జాగ్రాత్తగా చూసారు. సమాజంలో వారికి చాలా అవకాశాలు ఉంటాయి. కావాలంటే భార్య లేదా భర్తతో ఉండవచ్చు లేదంటే విడిపోవచ్చు. వారికి ఆ స్వేచ్చ ఉన్నది.

కానీ భారతదేశంలో ఆధ్యాత్మిక స్వేచ్చకి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఈ నాలుగు శ్లోకాలలో, సమాజానికి ఆధ్యాత్మిక స్వేచ్చ ఎంత ఇచ్చారో అర్ధమవుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి, అతని ద్వారా అందరికి గొప్ప ఆధ్యాత్మిక స్వేచ్చని ఇస్తాడు.

కుంట్ గ్రామంల్యాసే వ్యసమర్దోసి ...... సిద్ధి మవాప్పుసి ...... (12:10)

నీవు భక్తి యోగాన్ని సాధన చేయలేకపోతే,నాకోసం పనిచేయి, ఎందుకంటే నా కోసం పనిచేస్తే, నీవు సంపూర్ణస్థితిని చేరతావు. సిద్ధిఅవప్యాసి. ఇలా ఒకదాని తరువాత ఒక అవకాశాన్ని వివరించి చివరలో ఇలా చెబుతాడు.

శ్రేయోహిజ్ఞానం ........ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే (12:13)

నీవు ఈ పద్ధతులేవీ పాటించలేకపోతే, నీవు జ్ఞానాన్ని సంపాదించు కోవటంలో నిమగ్నమవ్వు. ఆయన ఈ విధంగా చెబుతాడు. ఈ పరిష్కారాలన్నీ ప్రోగు చేసుకో. జ్ఞానాన్ని సంపాదించుకోవటమంటే జీవితపు చిక్కు సమస్యలకు పరిష్కారాలని