KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/స్వామీజీ చెప్పే పద్ధతులన్నీ సామాన్యుల జీవితానికి సరిపడే పద్ధతులు :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

స్వామీజీ చెప్పే పద్ధతులన్నీ సామాన్యుల జీవితానికి సరిపడే పద్ధతులు :

స్వామీజీ ఏమి చెప్పినా ప్రతి విషయానికి హామీ ఇస్తారు. ఎందుకంటే ఆయన తన అనుభవంతో తెలుసుకున్న విషయాలు మాత్రమే చెబుతారు. మరొక విశేషమేమిటంటే ఆయన చెప్పే ప్రతి విషయం, చూపించే ప్రతి పరిష్కారం సామాన్య మానవ జీవితానికి సరిపడే విధంగా ఉంటాయి. మామూలు లౌకిక జీవితం సాగించే వారికి, సంసార జీవితంలో ఉన్నవారి సమస్యలకి ఆయన చక్కని పరిష్కారాలు చూపించుతారు. అదే చాలా ఆశ్చర్యకరమయన విషయం.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, వయస్సులో చాలా చిన్నవారు. ఆయన 1978, జనవరి 1వ తేదీ జన్మించారు. వయస్సు 30లోపు. జనతః బ్రహ్మచారి. ఆయనకి అంటూ ఎటువంటి కుటుంబ జీవిత, సంఘ జీవతం లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు, బంధువులతో ఉన్నా, ఆయన వారితో ఎప్పుడూ లోతయిన సంబంధాన్ని కలిగి లేరు. ఐదు సంవత్సరాల వయస్సు నుంచే ఆయన ఎక్కువ భాగం యోగులతో సత్యానేషణలో ఉండే మునులతో గడిపేవారు. ఆయన జీవితంలో ముప్పావు భాగం తపస్సుతో గడచిపోయింది. మరి ఈ విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయి. భార్యభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతంగా మనకి సమాజంతో ఉండే సంబంధాలు, ఇలాంటి మన సమస్యలు ఆయనకి ఎలా తెలుసు అనేది ప్రతి ఒక్కరి మనస్సులోనికి వచ్చే ప్రశ్న.

ఈ ప్రశ్నకి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా చక్కని వివరణ ఇస్తారు. జ్ఞానోదయమయిన వ్యక్తికి ఈ భూమి మీద తెలియని విషయం ఏదీ ఉండదు. వారికి ఎటువంటి విషయాలు, ఎటువంటి జ్ఞానం కావాలన్నా పరాశక్తి దానిని వారిలో నింపుతుంది. వారు ప్రత్యేకంగా నేర్చుకునేది, తెలుసుకునేది ఏమీ ఉండదు.

ఇకపోతే సామన్య మానవుల జీవన సరళి గురించి స్వామి ఇలా చెబుతారు. సన్యాస జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అందులో ఒకటి పరివ్రాజకగా దేశ సంచారం చేసే సమయంలో వాళ్ళు ఎక్కడ అయినా ఊరులో ఒక రోజు మించి ఉందకూడదు. ఆ సమయంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కాలినడకన ఎక్కువభాగం తిరిగారు. ఒక ఊరుకి వెళ్ళటం, అక్కడ వారు పెట్టినది తినటం ఆ గ్రామంలోని ప్రజలతో మాట్లాడటం. మన దేశంలో సన్యాసులకి యోగులకి చక్కని గౌరవం దొరుకుతుంది. అంతేకాకుండా ఎటువంటి వ్యక్తిగత సమస్యనయినా వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఒక యోగికి చెప్పకోగలుగుతారు. ఈ విధంగా సామాన్య మానవులకి మామూలుగా ఉండే సమస్యలన్నీ ఆయనకి తెలుసు. ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, మన గురించి మనకి తెలియని విషయాలు కూడా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఈ సందర్భంగా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక విషయం చెబుతుంటారు. జ్ఞానోదయమయిన యోగికి ఏదో ఒక ప్రాంతంతో కాని, ఒక ఇంటితో కానీ, లేదా ఏదో కొద్దిమంది వ్యక్తులతో కాని సాన్నిహిత్యం ఉండదు. వారికి ఉండే సన్నిహిత సంబంధం పరాశక్తితో, ఈ ప్రపంచంతోనూ, వారికి ప్రపంచం ఒక కుటుంబం లాంటిది. భాషా బేధాలు, వయస్సులో వ్యత్యాసాలు, స్త్రీ పురుష బేధాలు వారికి అసలు ఉండవు. ఆ బేధభావం చూపటం కూడా వారికి తెలియదు. కాబట్టి వారు ఎక్కడ ఉంటే అదే వారి ఊరు, అదే వారి ఆశ్రమం.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కూడా కేవలం ధ్యానపీఠం యొక్క ఆశ్రమంలో తప్పా ఎక్కడా ఒకటి రెండు రోజులు మించి ఉందను అని చెప్పారు. అందుకే ఎవరి ఇంటికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అది కొత్త ప్రదేశం అని నాకు అనిపించదు అని చెబుతారు.