KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/నిత్యానందంలో ఉండండి (Be Blissfull) :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

నిత్యానందంలో ఉండండి (Be Blissfull) :

పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMస్వామి ప్రపంచలోని మానవులందరికీ ఇచ్చే చాలా ముఖ్యమయున సందేశం "నిరంతరం పరమానందలో ఉండండి." గురుదేవులు అందరి ఆనందం కోసం, అందరినీ ఈ సమస్యలనే గందరగోళం నుంచి, బాధలు కోరికలు అనే అల్లకల్నోలం నుంచి బయటకి తేవటానికి రూపొందించిన కార్యక్రమాలన్నీ ఈ సందేశం మీదే ఆధారపడి ఉన్నాయి.

పరమానందం గురించి స్వామీజీ ఈవిధంగా చెబుతారు. ఆనంద అంటే దానిని ప్రత్యేకంగా పుట్టించలేము. దానిని నాశనం చేయలేము. దానిని పెంచలేము తగ్గించలేము. అది ఒక నిరంతర ప్రపాహం. అది అదే. పరమానందలో ఉండటం, ఆనందంగా జీవించటం మీ జన్మ హక్కు ఆనందం అనేది బయట ఎక్కదో లేదు. అది మీలోనే ఉన్నది. ఆ విషయాన్ని తెలుసుకోండి.

నిరంతరం మీరు ఆనందంలో ఉండటమే నిజమయిన ఆధ్యాత్మికత. మీలో నిక్రిపమై ఉన్న ఆనందం అంతిమమైన ఉత్తమస్థితి. దానిని ఎవరూ మీకు దానంగా గాని, బహుమతిగా ఇవ్వనవసరం లేదు. అది మీ లోనే ఉన్నది. మీరే ఆనందం.

ఆనందం, సంతోషం రెండు వేరు వేరు పదాలు. సంతోషం అనే మాటకి వ్యతిరేక అర్తాలు ఉన్నాయి. సంతోషం ఉన్న దగ్గరే దుఃఖం ఉంటుంది. సంతోషం అనేది అతి చంచలమయనది. కాసేపు ఉంటుంది. మరికొద్ది సేపట్టో మాయమయపోతుంది. ఉదా: ఎవరయినా మిమ్మలను మెచ్చుకుంటే సంతోషంగా ఉంటుంది. మరుక్షణం ఎవరైనా విమర్శించితే ఆ సంతోషం కాస్తా దుఃఖంగా మారిపోతుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెప్పే ఆనందం ఈ సంతోషం కాదు.

నిత్యానందం, పరమానందం లేదా బ్రహ్మసందం అంటే శాశ్వతమయి ఆనందస్థితి. ఆనందం అంటే బాధకి సంతోషానికి అతీతమయిన ఒక నిశ్చలసితి. ఆ స్థితిలో బాధకాని సంతోషం కాని మిమ్మలని ఏవిధంగా కూడా ప్రభావితం చేయలేవు. ఇది శాశ్వతమయిన, కారణంలేని నిశ్చలస్దితి. దీనికి వ్యతిరేక అర్దాలు లేవు. అది మీ లోపల నుంచి అలా పొంగి ప్రపహిస్తూ ఉంటుంది. ఆనందం యొక్క ముఖ్యమయిన లక్షణం – అది కారణం లేకుండా కలిగే ఆనందం. ఈ ఆనందానికి బయట ప్రపంచంతో కాని, అందులోని విషయాలతో కాని ఎటువంటి సంబంధం ఉండదు. స్వామీజీ ఏమని చెబుతారంటే మీ ఆధ్యాత్మికి లేదా లౌకిక జీవన మార్గం, మీ లక్ష్యం రెండూ కూడా ఆనందమయమే. (Bliss is the path and goal) మీలోని నిత్యానంద స్దితిని తెలుసుకొనగలిగితే మీ మార్దం మీ లక్ష్యం కూడా ఆనందమే అవుతుంది.

ఎప్పుడయితే మీ అంతరంగం, మీ ఉనికి, మీ ఆత్మ ఎటువంటి కారణం లేని ఆనందంతో నిండి ఉంటుందో అప్పుడు మీ నుంచి ప్రపహించే ఆనందం అన్ని వైపులా ప్రవహించి మీ పరిసరాలని ఆనందమయం చేస్తుంది. ఈ కారణంగానే జ్ఞానోదయమయిన యోగులు ఎక్కడ ఉంటే ఆ పరిసరాలన్నీ ఆనందంతో నిండి ఉంటాయి. ఆ చుట్టు పక్కలవారు కూడా ఆనందంలో

మునిగిపోతారు. కానీ మన సంఘం మనని అలా కారణం లేకుండా ఆనందంలో ఉండనీయుదు. ఆనందానికి కారణాలు వెతకమంటుంది. మనలో అపరాధభావాన్ని నింపుతుంది. అలా చేయగలిగినప్పుడే సమాజం మనని తన గుప్పిటలో తన నియంత్రణలో ఉంచుకోగలుగుతుంది.

మనలోపల ఉన్న నిజమయిన ఆనందస్థితిని తెలుసుకోవటంలో మనకి ఉండే పెద్ద అవరోధం సమాజం విధించే నిబంధనలు, అది మనకు నేర్పిన అబద్ధపు సంతోషాలు.

మనం మనలోని ఆనందాన్ని తెలుసుకోగల పద్ధతులను స్వామీజీ చాలా సులభరీతిలో చాలా సామాన్య పద్దతిలో మనకోసం సృష్టించారు. అందులో చాలా కీలకమయినవి రెండు : మొదటిది చేసే ప్ర‌తి ప‌నీ పూర్తిగా తెలుసుకునే తత్వంతో చేయగలగటం. రెండవది ధ్యానం. ఈ రెండింటినీ మనకి అందించాలనే గొప్ప లక్ష్యంతో ఆయన అనేక కార్యక్రమాలు రూపొందించారు. ఆయనని ఆయన లక్ష్యాన్ని అర్ధం చేసుకుంటే మనందరం నిత్యానందస్థితికి చేరి, నిత్యానందం అయిపోతాము.

స్వామీజీ చెబుతుంటారు " మనకి కారణమేమీ లేకుండా ఆనందంగా ఉందగలము అని, ఆ శక్తి మనకి ఉన్నదని మనకి తెలియదు. మనందరం ఎంతో కుతూహలంగా, ప్రయత్నపూర్యకంగా వెదికే విషయం ఆనందం. మనం డబ్బుద్వారా, అధికారం ద్వారా, మాన సంబంధాల ద్వారా, మన నిత్యజీవిత విషయాల ద్వారా నిరంతరం ప్రయత్నించేది కేవలం ఆ ఆనందం కోసమే. మన జీవతానికి ఉన్న ప్రపథమ ఆధారం, జీవితేచ్చ, జీవించాలనే కోరికని నింపే శక్తి ఆ ఆనందంకి ఉన్నది. మనం జన్మంచింది మొదలు ఆ ఆనందం కోసం ప్రపంచమంతా వెతుకుతున్నాము. కానీ అదే మన లక్ష్యం అని మనికి తెలియదు. ఆ ఆనందం కోసం మనలో తప్ప ప్రపంచమంతా వెతుకుతున్నాము. కానీ ఆ ఆనందం మనలోనే ఉన్నది. దానిని పట్టుకోండి, నిత్యానందంలో ఉందండి" ఆ ఆనందాన్ని చేరే అత్యంత సులభమార్గాలే స్వామీజీ ఇచ్చే కార్యక్రమాలు.

ధ్యానం : అన్ని సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే మాస్టర్‌కి : జ్ఞానోదయమయిన తరువాత పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన చేత ఒక గొప్ప

ఆయుధాన్ని ధరించి మన మధ్యకి వచ్చారు. అది రామ బాణంలా తిరుగులేనిది, శివుని త్రిశూలంలా దేనినైనా ఛేదించగలది. విష్మమూర్తి సుదర్శన చక్రంలా దేనినైనా తరిమిగొట్టగలది. అది సులభ సాధ్యమయినది, అత్యంత ప్రభావం గలది, మహాశక్తి గల అత్యద్భుతమయినది. మరీ ముఖ్యంగా ఆధునికి మానవుని జీవన సరళకి చక్కగా సరిపోయేది. అదే ధ్యానం. నిత్యానందంలో ఉండండి అనేది ఆయన ముఖ్య సందేశమయితే, ధ్యానం ఆ స్థితిని చేర్చగలిగే ఒక రాజమార్ధం అని ఆయన చెబుతారు. ధ్యానం అనే విషయంలో పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తెలుసుకున్నంత పరిశోధన చేసినంత బహశః ఇంతవరకూ ఎవరూ చేసి ఉందరూ. "ధ్యానం చేయండి" అన్నది ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన పిలువు.

స్వామి మాటలలో ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే దేని మీద అయినా ఏకాగ్రత నిలపటం కాదు. మనస్సుని దేనిమీద స్నిరపరచటం కాదు. స్వామీజీ నిర్వచనలో, ధ్యానం అంటే, మిమ్మలని విశ్వశక్తితో కలపగలిగే

ఒక పద్ధతి. ధ్యానం మీలో నిక్రిప్తం చేయబడిన ఐశ్వర్యాలని, సంపదలని తెలుసుకోగలగేట్లు చేసే ఒక పద్ధతి.

ధ్యానం అంటే ఆ క్షణంలో నిత్యానందస్థితిలో ఉండగలగటమే. మీరు ఎప్పుడయితే వర్గమానంలో ఉంటారో, మీరు ధ్యానంలో ఉన్నట్టే. మీరు ఇంతకంటే చేసేది ఏమీ లేదు.

స్వామీజీ ఇలా చెబుతారు. మీరు ధ్యానం నేర్చుకోనవసరం లేదు. మీరు జన్మతః ధ్యానులు. దానిని తెలుసుకుని ఆస్దితిని అనుభవించగలిగితే మీరు పరమానందాన్ని పొందగలరు.

ధ్యానం మీలో మీ జీవనసరళిలో మీ అంతరంగ జీవితంలో సమూలమయిన మార్పుని తెస్తుంది. అది మిమ్ములని భౌతికంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా మార్చగలుగుతుంది. ధ్యాసం మీలోని శారీరక మానసిక వ్యాధులను పూర్తిగా బాగుచేస్తుంది.

ధ్యానం మీలోని ఏకాగ్రతని, గ్రగహింపు జ్ఞానాన్ని, విషయాలని గుర్తుంచుకునే శక్తిని ఆశ్చర్యకరమయిన విధంగా అభివృద్ధి చేస్తుంది. ధ్యానం చేస్తే మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది. మీరు చాలా సృజనాత్మకంగా ఉండి

మీ పనులలో మంచి నాణ్యతని సాధించగలుగుతారు. ఏ పని అయినా సామర్థంతో చేయగలుగుతారు.

అన్నింటికంటే ముఖ్యమయినది, ధ్యానం మిమ్ములని మీ అంతరంగపు లోతుల్లోకి తీసుకువెళ్ళే ఒక అద్భుతమైన ప్రక్రియ. అలా చేయటానికి ముందుగా మీరు మీ శరీరాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. మీ శరీరం మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఒక వాహనం లాంటిది. మీ జీవన సరళిని, మీ జీవన గమనాన్ని పూర్తి నాణ్యతతో నింపాలి. అప్పుడే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమయిన శరీరాన్ని కలిగి ఉండటం ఉత్తమ ఆధ్యాత్మిక లక్షణం.

ధ్యానానికి కావలసిన మరొక ముఖ్యమయిన విషయం మీ ఆలోచనల వేగాన్ని తగ్గించేవిధంగా వాటి మీద పనిచేయాలి. ఆలోచనలని అరికట్టటం, లేదా వాటిని నియంత్రించటం అనేది పూర్తిగా సాధ్యపడని విషయం. కాబట్టి తెలుసుకునే తత్వంతో ఆలోచనలని గమనించటం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. ఆలోచనలు అంటే ఏమిటి? ఆలోచనలు అంటే మనం మన అంతరంగంలో మనతో నిరంతరం మాట్లాడుకునే మాటలు. అవి అర్ధం లేనివి, ఒకదానికి ఒకటి సంబంధం లేనివి. వాటినే మనం మైండ్ లేదా మనస్సు అని కూడా అంటాము. ఇవన్నీ మన అచేతన స్థితిలో మనకి తెలియకుండా మనలో స్థిరపడిపోయినవి. అవి కేవలం మన భూతకాలం భవిష్యత్ కాలం గురించి పడే తాపత్రయం లేదా అపరాధ భావం మాత్రమే. ఎప్పుడయితే అనవసరమయిన భూత, భవిష్యత్ కాలాలని పూర్తిగా వదిలివేయగలుగుతామో, మనం నిజమయిన ఆ స్థితిలో స్థిరపడటమే ధ్యానం. అదే జ్ఞానోదయం పొందే స్థితి.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మన వేదాంతం, తంత్రాలు నుంచి, సూఫీ తత్త్వం నుంచి, బౌద్ధులు, జెన్‌ల ధ్యాన పద్ధతుల నుంచి, ప్రాచీన క్రైస్తవం నుంచి ఎన్నో ధ్యాన పద్ధతులను తీసుకొని వాటిని తన అనుభవంతో మనకి సరిపడే కొన్ని ధ్యాన పద్ధతులని రూపొందించారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ ధ్యాన పద్ధతులని నేర్పించటానికి కొన్ని కార్యక్రమాలని తయారుచేసారు. వాటిలో చాలా ముఖ్యమయిన కార్యక్రమం చక్ర ధ్యానం. ఆ కార్యక్రకమంలో మనలో ఉండే ఏడు ప్రముఖమయిన శక్తికేంద్రాలు (చక్రాలని) ఏ ఏ ధ్యాన పద్ధతి ద్వారా శుభ్రపరచి తిరిగి శక్తివంతం చేయగలం అనేది వుంటుంది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన అనుభవంతో చెప్పే మాట ఏమిటంటే, ఆధునిక మానవులకి ఉండే అన్ని రకాల భౌతిక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక సమస్యలకి గట్టిది, నమ్మకమయిన పరిష్కారం ధ్యానం ద్వారా దొరుకుతుంది. నియమానుసారం చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. అంతే. ఈ ధ్యాన పద్ధతులు అన్ని వయస్సులవారు చేయవచ్చు. ఆ భరోసా స్వామి మనకి పూర్తిగా ఇస్తారు. నిబంధనలు లేని, కారణాలు లేని ప్రేమని పంచాలి :

ప్రేమ అనేది చాలా అందమయిన అద్భుతమయిన భావన. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెప్పే దివ్యప్రేమ, దైవ ప్రేమ చాలా గొప్పది కూడా.

ప్రేమ అంటే ఏమిటి? మనకు తెలిసిన మామూలు ప్రేమ కేవలం హార్మోన్లు పెట్టే చిత్రహింస మాత్రమే. కానీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మనకు చెప్పేది నేర్పించేది దైవప్రేమ. అది అత్యున్నతమయిన ఆధ్యాత్మిక లక్షణం. ఆ ఉన్నతమయిన, స్వచ్ఛమైన ప్రేమ మనం జ్ఞానోదయమయిన యోగుల దగ్గర మాత్రమే చూడగలం.

మామూలుగా మనకి తెలిసిన ప్రేమ నిబంధనలు, షరతులు, కారణాలు అనేవాటి ఆధారంగా ఉండే ఒక వ్యవహారం. "నేను ఇంత ప్రేమ ఇస్తాను. దాని బదులుగా నీవు ఇలా అంత ప్రేమ చూపాలి. లేకపోతే ప్రేమించను" ఇదీ మనకు తెలిసిన ప్రేమ. మనం సాధారణంగా చూపించే ప్రేమ, అది భార్యాభర్తల మధ్య కాని, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమగాని, స్నేహితులు లేదా ప్రేమికులు ఎవరి మధ్య ప్రేమ అయినా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది.

ఒకసారి ఒకామె THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMతో, తల్లికి పిల్లలపై ఉండే ప్రేమ దివ్య ప్రేమ కదా! మరి అది సాధారణ ప్రేమ ఎలా అవుతుంది ? అని అడిగితే స్వామి ఇలా సమాధానం ఇచ్చారు " అది కొంతవరకూ నిస్వార్ధ ప్రేమ కావచ్చు కాని ఆ ప్రేమ కూడా షరతులు నిబంధనలతో ఉంటుంది. అందులో అంతర్లీనంగా ఏదో కొంత ఆశించటమూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, మీ పిల్లలు అన్నింటికీ మిమ్మలని ఎదిరిస్తూన్నారనుకోండి, అన్నీ వాళ్ళు సొంత నిర్ణయాలు చేసుకుంటున్నారనుకోండి, మీకు ఇష్టంలేని ప్రేమ వివాహం కులాంతర వివాహం చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఏ సంబంధాలయినా చూడండి మీరు ఆశించినట్లు ఎదుటివారు ఉండని మరుక్షణంలో ఆ ప్రేమ మాయమయిపోతుంది. అది స్వచ్ఛమయిన ప్రేమ కాదు. ఇది ఏ క్షణంలోనయినా ద్వేషంగా మారవచ్చు. ఈ ప్రేమ పూర్తిగా సమయానికి, సందర్భానికి సంబంధించినది. ఇది మనుషులని వీడదీస్తుంది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మనకి నేర్పించే ప్రేమ దివ్య ప్రేమ, స్వచ్ఛమయిన ప్రేమ. దానికి నిబంధనలు షరతులు ఉండవు. అది మనుషులని కలిపే ప్రేమ. దానికి వీడదీయటం తెలియదు. ఆ ప్రేమకి హద్దులు ఉండవు. అది అయిపోయింది ఇంకా నా దగ్గర లేదు అనదు.

ఈ దివ్యప్రేమ అనేదానిని మనం తయారు చేయలేము. దానిని సంపాదించలేము. అది మనలో ఎంతో సహజంగా ఉద్భవించే ప్రవహించే ఒక ప్రక్రియ.

మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడయితే మనం 'నేను' 'నాది' అనే వాటిని పూర్తిగా మన నుంచి తొలగించుతామో అప్పుడు మనలో గట్టిపడిపోయిన అహంకారం కరిగిపోతుంది. అంతవరకూ అహంకారపు పొరలకింద కప్పబడిపోయిన అసలయిన అంతరంగం, ఉనికి బయటకి వస్తాయి. ఆ క్షణంలో మన ఆలోచనల ప్రోగు అయిన మనస్సు అనేది కూడా క్రమంగా కరిగి మాయం అయిపోతుంది. అప్పుడు వర్తమానంలో ఉండగలగుతాము. ఆ స్థితిలో అత్యున్నత చేతన స్థితికి చేరి విశ్వశక్తి పరాశక్తితో ఐక్యమయిపోతాము. పరాశక్తి లేదా భగవంతునితో మన అంతరంగం నింపబడుతుంది. విశ్వశక్తి లేదా భగవంతుడు అంటేనే ప్రేమశక్తి. అలా నింపబడిన ప్రేమ అంతులేని శక్తి. అది మనలో నిండిపోయి పొంగి ప్రవహిస్తూ మన చుట్టు ప్రక్కలకి వ్యాపిస్తుంది. అప్పుడు ఇక మనం దానిని అందరికీ పంచటం తప్పా ఏమీ చేయలేము. మననుంచి పొంగి ప్రవహించే ఆ ప్రేమ ప్రవాహం మన ఎదుటివారిని ప్రేమతో ముంచెత్తుతుంది. ఆ ప్రేమ పంచే సమయంలో ఎదురుగా ఎవరు ఉన్నారు? వాళ్ళు ప్రేమకి అర్హులేనా? వాళ్ళకి ఎంత ప్రేమ మాత్రమే ఇవ్వాలి? అలా ప్రేమని వారికి ఇస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఏవీ ఆ వ్యక్తుల దగ్గరకి రావు. ఆ ప్రేమని ఎవరయినా పొందవచ్చు.

ఇక్కడ మరొక ముఖ్య విషయం. జ్ఞానోదయం పొందటం అంటేనే ప్రేమ, కరుణ, కృతజ్ఞతలు వారి అంతరంగం నుంచి పొంగి నిరంతరం ప్రవహిస్తూ వారి సమక్షంలో ఎవరెతే ఉంటారో వారికి ప్రేమ అందిస్తాయి. అందుకే జ్ఞానోదయమయిన యోగులు సమక్షంలో అందరూ చాలా ఆనందంగా, తేలికగా ఉంటారు. వారి నుంచి ఎవరూ తప్పుకోలేరు. ఎందుకంటే వారిలో ఉండేది దైవ ప్రేమ.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన భక్తులకి సరదాగా ఒక విషయం చెబుతుంటారు. "ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తే వారు ప్రేమలో పడ్డారు అంటారు. అది నిజం. ఎందుకంటే ఇక వాళ్ళు లేవలేరు. అదే జ్ఞానోదయమయిన గురుదేవుల విషయంలో భక్తులు, శిష్యులు ప్రేమలో లేస్తారు. వాళ్ళు గురువుల ప్రేమతో ఉన్నతస్తాయికి చేరతారు. నేను ఎప్పుడూ మిమ్మలని ప్రేమలో పడనీయను. ప్రేమలో మిమ్మలని అత్యున్నతస్తాయికి చేరుస్తాను అని మీకు హామీ ఇస్తాను" అని అంటుంటారు. కాబట్టి మనం గురుదేవుల ప్రేమలోపడితే, ఆ ప్రేమలో గొప్ప స్థానానికి ఎదుగుతాము, కాని పడ్డచోట ఉండము.

ఎప్పుడయితే ప్రేమలో ఆశించటం ఉంటుందో దాని ఫలితం కచ్చితంగా వ్యధ మాత్రమే. మీరు ప్రేమలో ముందుగా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి.

ప్రేమించండి, కాని దానికి బదులు ఏమీ ఆశించకండి.

ప్రేమించటానికి ఎదుటివారికి అర్హతలు పెట్టకండి.

కారణం లేకుండా ప్రేమించండి.

ఎప్పుడయితే మీరు ప్రతి వ్యక్తిలో ప్రతి ప్రాణిలో భగవంతుని చూడగలుగుతారో అప్పుడు మీరు ప్రతి వ్యక్తిని ప్రతి ప్రాణినీ కారణం లేకుండా ప్రేమించగలుగుతారు.

నిబంధనలు లేని స్వచ్ఛమయిన దివ్యప్రేమని అందరికీ అలా పంచండి. అది మీకు ఎన్నో వరాలని ఇస్తుంది.

భగవంతుని ప్రేమించమని మీ పిల్లలకి నేర్పించండి. ప్రతి వ్యక్తిని ప్రతి ప్రాణినీ ప్రేమించటం నేర్పించండి.

ఇటువంటి ప్రేమతో మీరు ప్రపంచాన్ని మార్సివేయగలరు.

ఇటువంటి ప్రేమ మీలో ఉంటే మీకు తెలియకుండానే అందరూ మిమ్మలని ప్రేమించుతారు.

ఇటువంటి ప్రేమకి భయం ఉండదు. అది ప్రశ్నించదు.

మీరే ప్రేమగా అయిపోవాలి, జీవితమే ప్రేమమయమయి పోవాలి. మీరు భగవంతుడు అని నిరూపించటానికి నేను ఇక్కడ ఉన్నాను :

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM విప్లవాత్మకమయిన ఆలోచనలతో, మహా చైతన్యవంతమయిన దృక్పథంతో ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి అడుగుపెట్టిన ఒక ధృఢసంకల్పం కలిగిన ఆధునిక యువకుడు, ఆధ్యాత్మిక గురువు. ఆయన సందేశం, ఆయన చెప్పే విషయాలు, ఆయన చేసే వాదనలు అన్నీ సంచలనాలే. ఆధ్యాత్మిక ప్రపంచం ఉలికి పడేలా, సామాన్య ప్రజలు అదిరిపడేలా ఆయన ఒక విషయాన్ని చాలా మామూలుగా చెప్పారు. అది "నీవు దేవుడవి అని నిరూపించటానికి నేను ఇక్కడికి వచ్చాను".

సామాన్యప్రజలు కేవలం భక్తులు, పాపులు, హీనులు, బలహీనులు, అనర్హులు అనే సంబోధనలకి ఇంతకాలం అలవాటు పడ్డారు. ఒక్కసారే "నీవు భగవంతుడివి" అన్నమాట వారిని సంభ్రమాశ్చర్యాలకి గురిచేసింది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా కార్యక్రమాల సందర్భంగా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తన స్పర్శతో చికిత్స చేసే సందర్భాలతో భక్తులు ఆయనతో, "స్వామీ! మీరు సాక్షాత్తు భగవంతుడే" అంటారు. అలాగే కొందరు మేధావులు " స్వామీ అందరూ అంటుంటారు మీరు దేవుడని నిజమా" అని అడుగుతారు. వెంటనే ఆయన భక్తులు చెంపలు వేసుకొని "అయ్యా! అలా అనవదు స్వామీజీ! అయినా ఇదెలా సాధ్యం?" అంటారు. అపుడు ఆయన "నేను ఇక్కడ ఉన్నది నేను భగవంతుడిని అని నిరూపించటానికి కాదు, మీరు భగవంతుడని నిరూపించటానికి" అని చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెబుతారు.

స్వామీజీ నిర్వచనంలో భగవంతుడు లేదా దేవుడు అంటే సర్వవ్యాప్తి అయిన సర్వేశ్వరుదు అని, మనం చెప్పే విశ్వశక్తి దానినే పరాశక్తి అంటాము. ఆ పరాశక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు సమస్తం ఆ విశ్వశక్తి ఆధారంగానే ఉన్నది. దానినే స్వామీజీ అత్యున్నత చేతనస్థితి, సర్వ చైతన్య స్థితి, సర్వసృష్టి, అత్యున్నత ఉనికి (Existence) భగవంతుడు అని అంటారు. రూపంలేని రూపం ఆశక్తిది. ఆ శక్తి లేని ప్రదేశం లేదు. ఆ శక్తికి తెలియని విషయం లేదు. సర్వశక్తి సంపన్నమయినది, సర్వజ్ఞానమయమయనది ఆ విశ్వ మేధస్సు, ఆ పరాశక్తి.

ఈ సృష్టిలో ఉండే ప్రతి ప్రాణిలోను, జీవంలేని వస్తువులో కూడా ఉండేది ఆ పరాశక్తే. ఎప్పుడయితే మనం మనలోని ఆ భగవంతుడిని చూడగలుగుతామో అప్పుడు మనం ఈ విశ్వమంతా మనం ఉన్న అనుభూతిని పొందతాము అని స్వామీజీ ఎప్పుడూ తన భక్తులతో చెబుతుంటారు.

అసలు ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి ఏ విధంగా భగవంతుడు? ఎలా నిరూపిస్తారు? అది నిరూపించే విషయం కాదు. దానిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి.

ఈ ప్రశ్నకి స్వామీజీ తన అనుభవాన్ని ఈ విధంగా చెబుతారు. "జ్ఞానోదయమయిన తరువాత ఆకస్మాత్‌గా నేను ఒక గొప్ప మార్పుని గమనించాను. నేను నా చుట్టూ ఉన్న ప్రతి వస్తువులో కనపడసాగాను. అదే విధంగా అన్ని వస్తువులూ నాలో కనపడసాగాయి. నేను అక్కడ ఉన్న రాళ్ళలో, చెట్లలో ప్రతి చోట ఉండటం స్పష్టంగా కనిపించింది. అప్పుడు నాకు అర్ధమయిన విషయం ఏమిటంటే మన అందరిలో ఉన్నది భగవంతుని అంశ లేదా పరాశక్తి మాత్రమే. అందరిలో ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇక నాకు నాముందు ఉన్న వస్తువుగాని, మనిషిగాని లేదా మరోప్రాణికాని వేరు అవదు కదా?"

స్వామి ఈ విషయం గురించి ఇలా కూడా చెబుతారు, "ఎప్పుడయితే మనలోని ఆలోచనలు పూర్తిగా మనని వదిలి వెళ్ళిపోతాయో, ఎప్పుదయితే నేను, నాది అనే వాటిని మనం పూర్తిగా వదిలివేసామో అప్పుడు మనం పూర్తిగా వర్తమానంలో ఉండగలుగుతాము. ఆ స్థితిలో మనకి ఉండే హద్దులు అంటే ఇంతవరకూ ఇది నాశరీరం, ఇది ప్రపంచం అనే హద్దులు పూర్తిగా కరిగిపోతాయి. అప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మన శరీరం ఎక్కడ ఉంది అనే విషయం కూడా మనకి తెలియదు, మనము విశ్వమంతటా ఉంటాము అని మనకు తెలుస్తుంది. బహుశా ఈ కారణం వలననేనేమో జ్ఞానోదయమయిన వ్యక్తులు ఏపని చేసినా ఎంతో సున్నితంగా, మృదువుగా ఉంటుంది. వారు గడ్డి మీద నడిస్తే, గడ్డి నలగదు. వారికి ప్రతి దానిలోనూ భగవంతుడే కనిపించుతాడు.

స్వామీజీని దగ్గర నుంచి గమనిస్తే ఆయన కుర్చీలో లేదా సింహాసనం మీద కూర్చున్నా, మైక్ పట్టుకున్నా లేదా ఒక కాగితాన్ని పట్టుకున్నా ఎంతో సున్నితంగా, మృదువుగా అపురూపంగా ఉంటుంది.

ఆయన మనకి అందించే ఒక గొప్ప సందేశం " మీ అందరిలోనూ దివ్యత్వం ఉన్నది. కానీ అది మీలో గట్టిపడిపోయిన అహంకారపు పొరల క్రింద, మీలోని వ్యతిరేకపు భావాల క్రింద కప్పబడిపోయి ఉన్నది. ధ్యానపద్ధతులు సాధన చేయటం ద్వారా మీరు మీలోని దైవత్యాన్ని తెలుసుకోవచ్చు. దానిని పూర్తిగా బయటకి తేవచ్చు. అందుకే నేను ఎప్పుడూ అంటాను నేను, మీరు అందరూ భగవంతుని రూపాలు అని.

ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలయిన బెబిల్, ఖురాన్, భగవద్గీత లేదా మరే గ్రంథమైనా చెప్పే విషయం ఒక్కటే, ప్రతీది భగవంతుడే, ప్రతిదీ దివ్యాత్మ స్వరూపమే. అవును కదా? మరి అటువంటప్పుడు, భగవంతుడిని కేవలం నా ఒక్కనిలోనే ఎందుకు చూస్తారు. మీరు భగవంతుడిని అందరిలో చూడగలగాలి. అది జరిగినప్పుడే మీ అందరి విషయంలో నా లక్ష్యం, నా ఆశయం నెరవేరుతుంది. వ్యతిరేకపు భావావేశాలని అనుకూల శక్తులుగా మార్చుకోగలగటం :

మనలో భయంకరమయినవి, విషపూరితమయినవి మూడు విషయాలు ఉన్నాయి. అని మనలోని వ్యతిరేక భావావేశాలు మన అహంకారం, మన ఆలోచనలు ఇవన్నీ ఒకదానికి ఒకటి పరస్పరం ఆధారమై సంబంధాలు కలిగి ఉంటాయి.

ముఖ్యంగా మనలోని వ్యతిరేక భావావేశాలయిన అసూయ, కోరిక, కామం, కోపం, భయం, శ్రద్ధ, ఆశించటం, అసంతృప్తి, బాధలు, వ్యధలు మొదలయినవి గొప్పశక్తి కలిగిన విషయాలు. మన దురదృష్ణం కొద్దీ ఎన్నో కారణాలవలని అవి మనలో వ్యతిరేకపు శక్తులుగా సృష్టిస్తుంటాయి. వీటి విషయంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక చక్కని విషయాన్ని బోధిస్తారు.

వ్యతిరేక భావావేశాలు మనని ఉన్నతస్థితికి చేరనీయకుందా అడ్లపడుతుంటాయి. మనలోని అద్భుతశక్తి మనకి ఉపయోగం లేకుండా చేస్తాయి. అలా అని వీటిని మనం నియంత్రించలేము, ఆపలేము. పోనీ వీటిని బలవంతంగా అణచివేద్దాము అని చూస్తే, అవి మన అచేతన స్థితిలో పేరుకుపోయి అక్కడ శక్తివంతమయిన ఆటంబాంబుగా తయారవుతాయి. వాటిపై ఏ మాత్రం వత్తిడి తెచ్చినా అవి భయంకరమయిన విస్ఫోటంలా అవుతాయి. అంతేకాదు వాటిని అణచేకొద్దీ అవి మనలోపల మానసిక, శారీరక వ్యాధులుగా తయారవుతాయి.

అయితే వీటికి పరిష్కారం ఏమిటి? అసలు ఉన్నదా? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కచ్చితంగా నమ్మకమయిన పరిష్కారాలు ఉన్నాయి అని హామీ ఇస్తారు. అవే స్వామీజీ నేర్పించే ధ్యాన పద్ధతులు. ఆ ధ్యాన పద్ధతుల ద్వారా వ్యతిరేకశక్తిని అనుకూల శక్తిగా మార్చగలిగితే, ప్రతి వ్యక్తి అత్యద్భుతమయిన ప్రగతిని సాధించగలరు, అని స్వామి చాలా గట్టిగా చెబుతారు. ఆయన చేసి చూపించుతారు. ఆయన ప్రత్యేకంగా కొన్ని ధ్యాన పద్దతులని కేవలం వీటికోసం మాత్రమే రూపొందించారు. అవి సామాన్యులకి, ఆధునిక జీవనసరళికి అలవాటుపడిపోయిన అందరికీ అందుబాటులో ఉండేలా వాటిని రూపొందించారు.