KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/శాసీయ దృక్పథం – ప్రయోగాల మీద ప్రత్యేక ఆసక్తి :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

శాసీయ దృక్పథం – ప్రయోగాల మీద ప్రత్యేక ఆసక్తి :

పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలో ఉండే మరొక ప్రత్యేకత, ఆయనకి శాస్త విజ్ఞానం పట్ట ఉన్న అవగాహన. ప్రతి చిన్న విషయాన్ని శాస్త్రీయంగా వివరించుతారు. అంతే కాకుండా ఆయనకి ఏ విషయమయినా అనుభవంతో తెలుసుకోవాలి, అప్పుడే దానిని నమ్మాలి అనే విషయాన్ని కచ్చితంగా పాటించుతారు. మనకి కూడా అదే విషయాన్ని చెబుతారు. "నేను మామిడి పండు తియ్యగా ఉన్నది అని అంటే మీరు దానిని నమ్మవద్దు అలాగే తిరస్కరించవద్దు. మీరు మామిడి పండు తిని తెలుసుకోండి" అని అంటారు.

ఆయన ఒకసారి అమెరికాలోని ఒక్లహామా పట్టణంలో ఉండగా ఆయనని కొందరు డాక్టర్లు, న్యూరాలజిస్టులు, శాస్త్రవేత్తలు కలిసి ఆయన మెదడు పనితీరు మీద పరిశోధన చేస్తాము అని కోరతారు. దానికి ఆయన ఒప్పకుని తన శరీరాన్ని, మెదడుని ఆ డాక్టర్స్‌కి అప్పగించారు. వారు ఆయన ధ్యానం చేసే సమయంలో, బాగా లోతుగా గాఢమయిన ధ్యానంలో ఉన్నప్పుడు, ఆయన ఒక వ్యక్తికి తన చేతి స్పర్శ ద్వారా చికిత్స చేసే సమయంలో, మామూలుగా ఉన్నప్పుడు అత్యంత ఆధునిక యంత్రాలతో పరిశోధనలు చేసి ఒక అద్భుతమయిన ఆశ్చర్యకరమైన రిపోర్టుని ఇచ్చారు. వారు అంతా ఏకకంఠంతోఆయన మెదడు పనితీరు చాలా ఖచ్చితంగా అద్భుతమయినది. అది సాధారణమయినది కాదు అని నిర్ణయించారు.

శాస్త్రవేత్తలు శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మెదడు పనితీరుపై పరిశోధన ఆయన మామూలు స్థితిలో ఉండగా ఆయన మెదడు చాలా చైతన్యవంతంగా ఉన్నది. అది మామూలు మనిషి మెదడు పని తీరుకన్నా చాలా చైతన్యం ఉండటం గమనించాము అని చెప్పారు. వారు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మెదడు ఎన్నో రేట్లు అధికంగా పనిచేయటం గమనించారు. అదే విధంగా మెదడు ముందుభాగం చాలా ఎక్కువ చైతన్యంతో ఉన్నది. ఆ భాగం తెలివితేటలు, మేధస్సు, జ్ఞానం నిర్ణయాలు చేయగల నేర్పు మొదలయిన పనులు చేస్తుంది.

ఆయన గాఢమయిన ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు మెదడులో 90% నిశ్శబ్దమయి పోయింది. మెదడు అలా నిశ్చలమయినప్పుడు మెదడు ముందు పైపక్క క్రింద భాగంలో ఒక చోట చాలా ప్రకాశవంతంగా ఉన్నది. అదే మన అనుకునే మూడవ కన్ను ఉండే భాగం. ఆ తరువాత డాక్టర్లు స్వామీజీని ఆ సమయంలో ఏమి చేసారు అని అడిగితే మూడవ కంటిని తెరచినట్లు చెప్పారట. బహుశ: అదే ఆత్మ యొక్క స్థానం అయి ఉందవచ్చు. దాని ద్వారానే మనం పరాశక్తి (భగవంతుని)తో సంబంధాన్ని నెలకొల్చుకొనగలుగుతాము. దాని ద్వారానే అంతరంగపు ప్రపంచంలోని అద్భుతాలని మర్మాలని మనం చూడగలుగుతామేమో అని డాక్టర్లు తమ రిపోర్టులో వ్రాసారు.

ఈ ప్రయోగం ద్వారా డాక్టర్లు ఒక విషయాన్ని నిర్ధారించారు. అది మెదడు యొక్క పనితీరుని నియంత్రించటం ద్వారా మనం మన వ్యాధులకు చికిత్స చేయగలమేమో! ఆ అవకాశం ఉన్నది. ఈ పరిశోధనా ఫలితాలు మెదడుపై జరిపే పరిశోధనలలో కొత్త అధ్యాయాలని తెరచాయి. ఈ విధంగా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

స్వామి మన ప్రాచీన మర్మయోగాకి, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మధ్య ఒక అద్భుతమయిన సంబంధాని నెలకొల్పారు. ఆధునిక వైద్యరంగానికి ఒక చక్కని సవాలు విసిరారు. వైద్యశాస్త్రంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు.