KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/తూర్పుదేశాల ప్రాచీన యోగానికి పశ్చిమ దేశాల ఆధునిక హేతువాద శాస్తానికి మధ్య THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక వారధి :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

తూర్పుదేశాల ప్రాచీన యోగానికి పశ్చిమ దేశాల ఆధునిక హేతువాద శాస్తానికి మధ్య THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక వారధి :

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి చాలా సార్లు తన శిష్యులకి ఒక విషయం చెబుతుంటారు. తూర్పుదేశాల ఆధ్యాత్మిక, యోగ శాస్త్రాలు ప్రాచీనమయినవి. వాటిని హేతువాదంతో నిరూపించలేము. అదేవిధంగా పాశ్చాత్య దేశాల హేతువాద సిద్ధాంతాలు ప్రతి విషయానికి శాస్త్రీయ నిరూపణని అవసరం అని అంటాయి. ఈ రెండింటిలోనూ మంచి ఉన్నది. ఈ రెండు చివరలని అనుసంధానం చేయటం ద్వారా మనం ఒక మంచి తత్వాన్ని తెలుసుకోగలుగుతాము అని అంటారు.

ఈ సందర్బంగా స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పాశ్చాత్యుల సమాజపు స్వేచ్ఛ తూర్పుదేశాల వారి అంతరంగపు (ఆధ్యాత్మిక) స్వేచ్ఛ గురించి ఇలా చెబుతారు.

పశ్చిమదేశాలలో వారి సమాజం వారికి చాలా స్వేచ్ఛని ఇస్తుంది. వాళ్ళు మూడు నెలలకొకసారి కారు మార్చవచ్చు. ఇల్లు మార్చవచ్చు భార్యా భర్తలని కూడా మార్చవచ్చు. వారికి ఏమి తినాలనిపిస్తే అది తింటారు. ఎటువంటి దుస్తులు వేసుకోవాలంటే అవి వేసుకుంటారు. వారికి బయట ప్రపంచంలో అంతులేని స్వేచ్ఛ వున్నది. కానీ ఆధ్యాత్మిక విషయంలో అంతరంగపు ప్రపంచంలో వారికి అసలు స్వేచ్ఛలేదు. పెద్దలు ఏమి చెబితే అదే అంతిమం. వారు అంతరంగపు ప్రపంచంలోనికి వెళ్ళి పరిశోధనలు చేసే స్వేచ్చ లేదు. ఎవరినైనా ఒక వ్యక్తిని సెయింట్ (Saint) అనాలి అంటే ఏదో ఒక వ్యవస్థ దానిని ధృవీకరించి, అవకాశం అసలు లేదు. ఇష్టముంటే ఉన్న ఒక్క మార్గాన్ని అనుసరించుతారు లేకపోతే ఆధ్యాత్మికతని పూర్తిగా వదిలివేస్తారు.

ఇక తూర్పుదేశాల పరిస్థితి దీనికి పూర్తి వ్యతిరేకం. వారికి బయట అంతా సమాజ నియంత్రణలో ఉంటుంది. కాని వీరికి అంతరంగ ప్రపంచంలో

అంతులేని స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏ మార్గంలోనైనా వెళ్ళవచ్చు. తమ అంతరంగంలోనికి వెళ్ళి ఎన్ని పరిశోధనలయినా చేయవచ్చు. అలా చేసిన పరిశోధనల ఫలితాలను ప్రకటించవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఒక్కొక్క తత్వాన్ని అభివృద్ధి చేసారు. దీనిమూలంగానే తూర్పుదేశాలలో ఇంతమంది దేవుళ్ళు ఎన్నో తరగతులు, గ్రూపులు, తత్వాలు, మతాలు ఉంటాయి. దీనివలన ఆధ్యాత్మికంగా ఎవరు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. అంతే కాని ఆధ్యాత్మిక మార్గాన్ని పూర్తిగా వదలరు. అంతేకాకుండా తూర్పుదేశాలలో ఎవరయినా ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందిన తరువాత తమకి తాము యోగిగా (Saint) ప్రకటించుకోవచ్చు. దీనిని ఎవరూ ధృవీకరించనవసరం లేదు. మనకి ఆధ్యాత్మిక ఉంటుంది. ఆ కారణంగానే అంతరంగ శాస్త్రంలో, ఆధ్యాత్మిక రంగంలో తూర్పుదేశాల వారు అద్భుతమైన అభివృద్ధి సాధించారు. మనకి ఉన్నంతమంది మహాయోగులు, గురువులు, జ్ఞానులు మరి ఎక్కడా ఉండరు. అది అందించే ఫలితాలు శాశ్వతమయిన ప్రభావాన్ని మన సమాజంపైన దేశ ప్రజలపైన చూపించుతాయి.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఇచ్చిన ఈ పరిశోధాత్మకమయిన వివరణ మనలో ఉండే ఎన్నో అనుమానాలని నివృతి చేస్తాయి. ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇస్తాయి. మనలోఉండే అస్పష్టతని అయోమయాన్ని తొలగించి ఆధ్యాత్మిక విషయాన్ని స్పష్టం చేస్తుంది.

పశ్చిమ, తూర్పుదేశాల ఆధ్యాత్మిక వ్యవస్థ మీద మంచి అవగాహన ఉన్నందునే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ రెండు చివరలని కలిపే ఒక అద్భుత ఆధ్యాత్మిక వారధి కాగలిగారు. సామాన్యంగా ఆయన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా అవి పశ్సిమదేశాలలోనైనా లేదా భారత దేశంలోనెనా ఆకార్యక్రమాలలో భారతీయులు పాశ్చాత్యులు ఉంటారు. అప్పుడు స్వామి రెండు ప్రాంతాలలో ఉండే మంచి విషయాలని స్పష్టంగా సామరస్యంగా వివరిస్తూ వారిని మరింత లోతుగా తెలుసుకోమని ప్రోత్సహిస్తారు.

ఒక చిన్న సంఘటన. స్వామీజీ ప్రతి సంవత్సరం హిమాలయ యాత్ర రెండు వారాలపాటు నిర్వహించుతారు. అలాంటి ఒక యాత్రలో సగం మంద్లి

పాశ్చాత్యులు సగం భారతీయులు ఉన్నారు. హిమాలయాలలో కొన్ని ప్రాంతాలలో జీవితం చాలా అపాయాలతో ఉంటుంది. ముఖ్యంగా యమునోత్రి, కేదార్‌నాథ్ యాత్రికుల కోసం గుర్రాలు, దోలీలు నిర్వహించేవారు చాలా ప్రమాదకరమయిన దారులలో వాటిని నడుపుతారు. ఆ సందర్బంగా స్వామీజీ పాశ్చాత్య శిష్యులు, భక్తులతో వారు ఎటువంటి ఇన్యూరెన్స్ పాలసీ తీసుకోరు. అసలు వారికి అటువంటి అవసరం ఉండదు. అనగానే పాశ్చాత్యు ఎంతో ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ యాత్రలో ఉన్న భారతీయులు కూడా కేవలం ఉద్యోగస్తులు ఇన్‌కంటాక్స్ (ఆదాయపన్ను) మినహాయింపుకి మాత్రమే ఇన్యూరెన్స్ తీసుకుంటారు, మిగతావారికి అది లేదు అని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు. పాశ్చాత్యుల నిత్యజీవితంలో ఇన్యూరెన్స్ ఒక ముఖ్యభాగం, అది లేని జీవితాలని వారు ఊహించులేరు.

స్వామిజీ సమక్షములో హిమాలయాలలో ధ్యానం చేస్తున్న అనుచరులు దీనికి కారణం పరమహంస చాలాచక్కగా వివరించుతారు. పాశ్చాత్యులకి తరువాత జన్మ అనే అంశం లేదు. కాబట్టి వారు అంతర్లీనంగా ఈ జన్మని పూర్తిగా ఆనందంలో గడపాలి అనే తీవ్రమయిన కోరిక ఉంటుంది.

ఎప్పుడయితే తీవ్రమయిన కోరిక ఉంటుందో దానితో పాటు తీవ్రమయిన భయం కూడా ఉంటుంది. వ్యాపారస్తులు ఆ భయాన్ని వ్యాపారంగా మలచుకుంటారు. అదే ఇన్యూరెన్ను వ్యాపారం.

కానీ భారతీయులకి అంతర్లీనంగా, తెలియకుండా ఒక భరోసా ఉంటుంది " సరే, ఇప్పుడు కాకపోతే తరువాత లేదా మరోజన్మలో అనే భావన చాలా లోతుగా ఉంటుంది. కాబట్లి భయం కూడా తక్కువ ఉంటుంది. అంతేకాదు. ఆ కారణం మూలానే వారు ప్రతి పనినీ నిదానంగా చేసారు. లేదా వాయిదా వేస్తారు. ఉదాహరణకి కార్యక్రమం ఉదయం 8 గం။ అంటే భారతీయులు 9 గం తరువాతే వస్తారు. ఎందుకంటే వారి ముందు అనంతమయిన కాలం ఉన్నది అని వారి ఆధ్యాత్మిక శాస్త్రాలు వారికి చెప్పాయి. ఆ కారణంగానే వారిలో కంగారు, తపన, పరుగులు తీయాలనే ఆరాట కనపడవు. స్వామి ఈ వివరణ ఇచ్చాక అక్కడ ఉన్న అందరికీ ఎన్నో అనుమానాలు నివృతి అయ్యాయి.

ఈ విధంగా ప్రతి చిన్న విషయంలో ఆయన పశ్చిమదేశాలు తూర్పుదేశాల సంస్కృతీ సంప్రదాయాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలను ఒక దగ్గరికి తీసుకురావటానికి ప్రయత్నిస్తారు. ఆరెండింటిలోను మంచిని గ్రహించేలా చేయటం ఆయన ముఖ్య ఉద్దేశ్యం.