KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం పుట్టుక :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం పుట్టుక :

జ్ఞానోదయమయ్యాక స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కావేరి నది ఒద్దన చిన్న ఆశ్రమంలో ఉండేవారు. చాలా కొద్దిరోజులలోనే ఆయనకీర్తి తమిళనాడులో అన్ని వైపులా వ్యాపించింది. దానితో ఆయన దర్శనం కోసం, ఆయన చేతిలో ఆరోగ్యవంతులవ్వాలి అనే ఆశతో ఆయన ప్రవచనాలు వినాలనే కోరికతో భక్తులు అధిక సంఖ్యలో రావటం మొదలయింది. అప్పుడు కొందరు భక్తులు స్వామీజీతో అక్కడ పెద్ద ఆశ్రమం నిర్మించటానికి అనుమతి అడిగారు.అప్పుడు ఆయన వారితో నేను రెండు పెద్ద ఆశ్రమాలు భవిష్యత్‌లో స్థాపించుతాను అందులో ఒకటి బెంగుళూరు దగ్గర మరొకటి లాస్యయాంజిల్స్(అమెరికా) అనేచోట అని చెప్పారట. అప్పడు కొందరు భక్తులు "స్వామీ! లాస్‌యాంజిల్స్ అనేది భారతదేశంలో లేదు అది అమెరికాలో ఉన్నది" అని అన్నారట. అప్పుడు

ఆయన నవ్వి, అలాగా! అయితే నా రెండవ ఆశ్రమం అక్కడే వస్తుంది అన్నారట.

స్వామీజీకి తమిళం, కొంచం హిందీ తప్ప మరే భాషా రాదు. అసలు అమెరికా అనే భావం ఆయనలో లేదు. కాని ఆయన తన దివ్యదృష్టితో అలా చెప్పగలిగారు. అంతేకాదు. ఆయన దివ్యదృష్టికి ఒక గొప్ప మర్రి వృక్షం కనిపించేది. ఆయన తన భక్తులతో "బెంగుళూరు పరిసర ప్రాంతాలలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ ప్రదేశంలోనే మన ఆశ్రమ నిర్మాణం జరగాలి అని చెప్పారట.

ఆయన అనుమతి ఇవ్వటం మహదానందంగా భావించి, ఆయన శిష్యులు, భక్తులు బెంగుళూరు పరిసరాలలో విస్పృతంగా గాలించి చివరికి బెంగుళూరుకి 20 కి.మి. దూరంలో మెసూరు రోడ్లు నుంచి 3 కి.మీ దూరంలో బిడిది అనే ఒక చిన్న ఊరులో ఒక వ్యక్తికి సంబంధించిన పొలంలో ఒక పెద్ద మర్రి చెట్టుని చూసారు. వారి అనందానికి అవధులు లేవు. వారు పరుగున వెళ్ళి పొలం సొంతదారుని అమ్మమని అడిగితే ఆయన ఆ పొలం అమ్మను అని చెప్పాడట. వారు ఎంతో నిరాశతో స్వామి దగ్గరకి వచ్చి ఆ విషయాన్ని చెబితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారట. కొన్నిరోజులు గడిచాక ఆ పొలం సొంతదారుడు వచ్చి ఆ పొలాన్ని స్వామీజీకి భక్తితో సంతోషంగా ఇచ్చారు.

2003వ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ పరమహంస జయంతి శుభవేళ ఆ ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణం ప్రారంభమయినది. అక్కడ ఉన్న పవిత్ర మర్రి వృక్షం షుమారు 300 సంవత్సరాల నాటిదని తెలసుకున్నారు. పూర్వం అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేసాడని స్వామిజీ చెప్పారు. ఆయన పూజించిన శివలింగం ఆ మర్రిచెట్టు మొదలులో ఉండే ఒక తొఱ్ఱలో కనుగొన్నారు. స్వామీజీ ఆ శివలింగాన్ని ఆ చెట్టుక్రింద పునః ప్రతిష్ఠించారు. అక్కడే దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. దక్షిణామూర్తి ఆ ఆశ్రమానికి మార్గదర్శి.

ఆ మర్రి వృక్షం చాలా విశాలమయినది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలలో కొన్ని ధ్యాన తరగతులు స్వామి ఆ వృక్షం క్రింద తీసుకుంటారు. అలాగే ఆయన ఆ మర్రి వృక్షం కింద ప్రవచనాలు ఇస్తారు. కొన్ని విషయాలని బోధిస్తుంటారు. ఈ ఆశ్రమంలో

మర్రిచెట్టు, దాని క్రింది అతి చిన్న వయస్సు ఉన్నగురుదేవులు ఆయనచుట్టూ ఆయన కంటే వయస్సులో దాదాపు రెట్టింపు వయస్సు ఉన్న శిష్యులు, ఇదంతా చూసేవారికి ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తిని ఉద్దేసించి వ్రాసిన శ్లోకం గుర్తుకొస్తుంది.