KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/స్వామి ఆధ్యాత్మక జీవితంలో యోగులు తాపసులు :Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

స్వామి ఆధ్యాత్మక జీవితంలో యోగులు తాపసులు :

పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కువ కాలం హిమాలయాల లోపలి ప్రాంతాలలో కాలినడకన విస్త్రతంగా పర్యటించారు. మంచు కొండల్లో, ప్రతికూల పరిస్థితులలో ఏ విధంగా ఆయన కొన్ని

వేల మైళ్ళు నడిచారో సామాన్య మానవులకి అర్ధం కాదు. ఇదే ప్రశ్న ఒకసారి ఆయన శిష్యులు అడిగినప్పుడు ఆయన రెండు విషయాలు చెప్పారు.

స్వామి ఐదవ సంవత్సరం వయస్సు ఉన్నప్పుడే రఘుపతి యోగి అనే అద్భుతమయిన ఒక గొప్ప యోగీశ్వరుడు ఆయనకి యోగాలో చాలా అద్భుతమయిన శిక్షణని ఇచ్చారు. ఆ శిక్షణ స్వామి శరీరాన్ని ఇటువంటి కఠోరమయిన శ్రమకి ఓర్సుకునే విధంగా తయారు చేసింది. ఆ యోగీశ్వరుడే స్వామికి ఆకలి దాహం అనేవి లేని విధంగా ఎలా ఉందాలో ఆ శిక్షణని కూడా

ఇచ్చారు.

ఇక రెండవ విషయం, స్వామి నడక ప్రారంభించగానే తన పూర్తి ఏకాగ్రతని విశుద్ధిచక్రంపై నిలిపేవారట. అలా చేసిన కొద్ది సమయం తరువాత ఆయన శరీరం గాలిలో తేలుతున్నంత హాయిగా నడిచేయగలిగేవారని ఆయన ఎంతో వివరంగా చెప్పారు. బహుశః ఆ అనుభవంతోనే స్వామి మనకి శక్తిసాగర ధ్యానాన్ని ఇచ్చి ఉంటారు. శక్తి సాగర ధ్యానం ఎ.ఎస్.పి.లో ఆచార్యులు మనతో నడిస్తూ చేయమని చెప్పే ధ్యాన పద్దతి. ఇది మనలోని విశుద్ధి చక్రాన్ని శక్తివంతం చేస్తుంది.

వీటినన్నింటినీ మించి ఆయనలో అత్యధికస్తాయిలో ప్రజ్వలిస్తున్న "జ్ఞానోదయం పొందాలి" "అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలి" అనే బలమయిన కోరిక. ఆ దృఢ సంకల్పమే ఆయనని అన్ని శ్రమలకి, ఎన్నో ప్రయాసలకి నిలబడేటట్లు చేసింది. నిజమయిన సంకల్ప బలం గురించి, తన శక్తిమీద ఉన్న నమ్మకాన్ని గురించి తెలుసుకోవాలంటే స్వామి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోగలిగితే చాలు. అంత చిన్న వయస్సులో, చిలిపి అల్లరితో, ఆటపాటలతో ఆనందంగా గడిపే చిన్న ప్రాయంలో పెద్దవారిలో ఉండే దీక్ష, మహాయోగులలో మాత్రమే చూడగలిగే సంకల్పశక్తి మనం పదిహేడు సంవత్సరాల THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలో చూడగలుగుతాము.

అలా విస్తృతంగా పర్యటించే రోజులలో ఆయన ఎందరో మహా తాపస్సులని, యోగులని, జ్ఞానులని కలిసారు. ఆయన వారితో కొంతకాలం గడిపి వారి నుంచి ఎంతో కొంత నేర్చుకునేవారు.

ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత శిఖరాలు చేరాలి అనే అతి బలీయమయిన కోరిక, ఒక మహా జ్వాలగా ఆయన తనువు, మనస్సు ఆత్మలలో దేదీప్యమానంగా జ్వలిస్తుంటే ఆ ప్రకాశం ఆయన ముఖంలో ప్రస్ఫుటమవుతుంటే, ఏ యోగి మాత్రం ఆ యువకుడిని చేరదీయకుండా ఉండగలరు? ఆ పరాశక్తి ప్రేరణతో సాక్షాత్తు మహేశ్వరుని అంశతో భూదేవి నోములు పంటగా, మానవుల పుణ్యఫలంగా ఈ భూమి మీద అవతరించిన ఆయనని ఎవరు కాదనగలరు. ఆయన అనేక మంది సుఫీయోగులు, బౌద్ధ గురువులు, జెన్ యోగులు, ఎంతో కాలంగా తపస్సు సమాధిలో నిమగ్నమయిన మునీశ్వరులు,

నాగాబాబాలు ఇలా ఎందరెందరినో ఆయన కలిసారు. అందరూ ఆయనకి చెప్పగలిగినవి చెప్పి నేర్చగలిగినవి నేర్పించి, దీవించి పంపించారు. మహిమాన్వితులయిన దేవతల దర్శనం :

పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM జన్మించిన క్షణం నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిరంతరం దేవతలు, మహిమాన్వితుల రక్షణలో ఉండేవారు. ఆయన పసి బాలునిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ భైరవుల రక్షణవలయం ఉండేది. వారు ఎవరో ఆయనకి తెలియని సమయంలో వారిని ఆయన స్పష్టంగా చూడగలిగేవారు. వారంతా తన బంధువులే అనుకునేవారు. స్వామి నాలుగు సంవత్సరాల వయస్సులో ఆయన ఒక మహాయోగి రక్షణలోనికి వెళ్ళగానే భైరవులు మాయం అయిపోయారని అప్పుడు ఆ యోగి స్వామితో వాళ్ళు బంధువులు కాదు. భైరవులు అని స్వామికి చెప్పారని స్వామి తన శిష్యులతో ఒక సందర్శనంలో వివరించారు.

అలాగే స్వామికి ఐదవ సంవత్సరంలో ఒక యోగి (రఘుపతి యోగి) ఆయనకి అరుణా చలేశ్వరుడు సన్నిధిలో దీక్షనిచ్చి మంత్రం చెప్పగానే జగన్నాథ దర్శన మిచ్చింది. ఆదర్శనం ఎంతో స్పష్టంగా, లోతుగా ఆ చిన్నారి బాబు మనస్సులో హత్తుకు పోయింది. వెంటనే ఇంటికి వెళ్ళి జగన్మాత రూపాన్ని రాతి మీద చెక్కారు.

అదే ప్రాయంలో ఆయన ఒకసారి అరుణాచలేసుని సన్నిధిలో ఉండగా శ్రీచక్రం స్పష్టంగా కనిపించింది. అది ఏమిటో తెలియని ఆచిన్నారి బాలుడు దానిని రాగిరేకు మీద గీసాడు. శ్రీ, చక్రం విశిష్టత బాగా తెలిసిన యోగిని ఒకామె దానిని చూసి ఆ బాలుడు సిద్ధపురుషుడు, కారణజన్ముడని తలచి అతని ఆధ్యాత్మిక పురోగతికి చాలా తోడ్పడినది.

స్వామి ఒకసారి గాసిఫిల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అనే గ్రంథాన్ని ఏకబిగిన పది గంటలపాటు నిర్విరామంగా చదివి పూర్తి చేసారు. అప్పుడు స్వామి రామకృష్ణ పరమహంస చిత్రపటానికి ఫోటో పూజలు చేసేవారు. ఆ రోజు రామకృష్ణ పరమహంస, శారదాదేవి ప్రత్యక్షమయ్యి, ఆయన తలపై చేయి ఉంచి స్వామిని దీవించారు.

స్వామి యమునోత్రిలో ఉండగా యమునాదేవి దర్శనమిచ్చినది.

అదేవిధంగా పరమేశ్వరుడయిన శివుడు ఆయనకి అనేక సార్లు దర్శనాన్ని ఇచ్చారు. ఒకసారి స్వామికి ఆశ్రమంలో ఆయన దర్శనమయినప్పుడు మహేశ్వరుని అడుగులు ఉన్న స్థలంలో మరెవరూ నడవకుండా గట్టు కట్టించారు. దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు స్వామి నివాసముండే ఆశ్రమంలో నిరంతరం సంచరించే విషయం చాలా మంది భక్తులు కూడా గమనించారు.

బదరీనాద్ నుంచి వ్యాస గుహకి వెళ్ళే దారిలో గణేశుని ఆలయం ఉన్నది. వ్యాసమహర్షి భారతం చెబుతుంటే గణేశుడు ఇక్కడే మహాభారతం వ్రాశాడట.THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ ప్రాంతంలో ఉన్న రోజులలో ఆయనకి గణేశుడు దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. తీవ్రమయిన జ్ఞానోదయపు తపన :

హిమాలయాలలో, ఎన్నో పుణ్యక్షేతాలలో, గొప్ప గొప్ప సంస్ధలలో మఠాలలో ఆశ్రమాలలో ఆయన నేర్వదగిన వేదాలు, ఉపనిషత్తులు, యోగశాన్నము తంత్రాలు సమస్లం నేర్సుకున్నారు. ఎన్నో గ్రంథాలు చదివారు. స్వామి బహుసూక్ష్మగ్రహీ, ఏక సందాగ్రాహి. ఎంత పెద్ద గ్రంధాన్నెనే ఇట్టే చదవగలరు. అందులో ఏ పేజీలోని విషయానైనా ఎటువంటి తేదాలేకుందా చెప్పగలరు. ఆయన విషయాన్ని మెరుపు వేగంతో గ్రహించగలరు, అంతే అద్భుతంగా గుర్తుంచుకోగలరు. ఆయన ఆ మహాశక్తిని కలిగి ఉన్నందునే అతి తక్కువ కాలంలో శాస్త విజ్ఞానము మానసిక శాస్త్రము, వైద్యశా స్తము, భౌతిక, రసాయన శాస్త్రాలు, ఇలా ఎన్నో పుసకాలని ఆయన చదివారు. క్రిస్టియన్, ఇస్తాం, బౌద్ధ సుఫీ, జూరా।ష్టియిన్ మొదలయిన అన్ని మత గ్రంథాలని చదివారు. పూర్తిగా చదివి అందులోని విషయాలని గ్రహించారు.

ఇలా అన్ని ఆశ్రమాలు తిరిగారు కానీ ఆయన తానుకోరుకుంటున్న జ్ఞానోదయాన్ని పొందలేకపోయాను అనే తపన ఆయనని దహించివేసేది. స్వామి కొంతకాలం ఓంకారేశ్వర్‌లోని నర్శదానది ఒడ్లన ఒక చిట్టఅడవి ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు. కొంతకాలం గడిచాక ఆయన చాలా మానసిక వ్యధకిలోనయ్యారు. తాను నిరంతరం పూజించే రామకృష్ణల పటాని వదిలివేసి, నర్మదలో తాను కలిసిపోవాలి అని నిర్ణయించి అంతులేని వేదనతో

నర్శదానదిలోనికి దిగి నడవసాగారు.

గంగా యమునాదేవీల ప్రియపున్నుతుడు, కావేరీ మాత అనంగు తనయుడు భరతదేశంలో పతినీదీమతల్లి దీవెనలు పొందిన భాగ్యవంతుదు, ఆయనని నర్శదాదేవి మాత్రం బాధపెడుతుందా. ఆయనని తన ఒడిలో కొంత సేద తీరనిచ్చి, జాగ్రత్తగా ఆవలి ఒడ్లుకు చేర్చింది.

ఒడుకు చేరిన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలో ఆకస్మాత్‌గా ఒక మార్పు వచ్చింది. జ్ఞానోదయం అన్ని ఆలోచనని ఆయన పూర్తిగా తన నుంచి తీసివేసారు. అక్కడే ఒక పెద్ద రాతిమీద ఏటవాలుగా పడుకొని అనంతమయిన, అద్భుతమయిన అందాల ప్రకృతిని చూసి ఆనందించుతూ ఆ ఆనందంలో పూర్తిగా మునిగిపోయారు. ఆ విధంగా స్వామికి తెలియకుందా ఏదురోజులు గడచిపోయాయి.