KAILASA Library/Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM/నిత్యం పరాశక్తి రక్షణలో స్వామీజీ!Sign in
Our Gurudev is THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

నిత్యం పరాశక్తి రక్షణలో స్వామీజీ!

స్వామీజీ జన్మించినది మొదలు ఆయన జ్ఞానోదయం పోందేవరకూ ఎదో ఒక అదృశ్య హస్తం ఆయనకి నిరంతరం రక్షగా నిలిచేది. అది కచ్చితంగా సర్వాంతర్యామి, భగవంతుడు అయిన పరాశక్తి రక్షణ.

స్వామి పది సంత్సరాల వయస్సులో ఆయన తన సాధనలో భాగంగా,అరుణాచలం పర్వతానికి ప్రదక్షణ చేసేవారు. అలా చేసే సమయంలో ఆయన అరుణాచలేశ్వరుని కీర్తనలు పాదుకుంటు, భక్తి పారవశ్యంలో ఉండేవారు. ఒకరోజు నిర్మానువ్యంగా ఉండే ప్రాంతానికి రాగనే,ఆయనకి అతి సమిపంలో తోలేదుల గుంపు కనబడింది.అవి స్వామి మీదకి దూకటానికి సిద్ధంగా ఉన్నాయి.స్వామి గట్టిగా "అరుణాచలేశ్వరా", అన్నారు. అంతే వెంటనే ఒక సాధువు చేతిలో కుర్రతో అక్కడికి వచ్చి వాటిని దూరంగా తరిమేసి, స్వామికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆయన కోసం ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా,మరి ఆసాధువు కనబడలేదు.

స్వామీజీ,హరిద్వార్‌లో తపస్సు చేసుకోవాటానికి అనువుగా గంగానది ఒడ్డన ఒక చిన్న వంతెన క్రింద కుర్సునేవారు.ఒకసారి ఆయనకి తీవ్రమయిన అనారోగ్యం కలిగి లేవలేని స్థితిలో ఒంటరిగా ఆ గంగాఒద్దన,వంతెన క్రింద పదుకుని ఉన్నారు.కనీసం కదలటానికి కూడా ఓపిక లేనంత నీర్పంగా ఉన్నారు.ఆ సమయంలోఒక యువకుడయిన సాధువు వచ్చి ఆయనకి మందులు,ఆహారం ఇచ్చేవాడు.ఆ సాధువు చూడటానికి చాలా అందంగా ఉన్నాడు.అంత నీర్సంలో కూడా స్వామీజీ ఆయువకుడి షర్ణు జేబుకి ఉన్న ఒక పెన్‌ని చూసారు.ఆయనకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే,ఆ పెన్ బంగారంతో,వుజాలతో ఉన్నది.ఒక సన్యాసి దగ్గర పెన్ ఉండటమే అసాధరణం;అది బంగారం వుజాలతో ఉన్న పెన్.అందుకే ఆయన ఆశ్చర్యపోయారు.

స్వామీజీ ఆ సాధువుని వివరాలు అడిగితే తన పేరు శంకర్ మహరాజ్ అనీ,గంగానది ఒద్దన ఉన్న ఒక అశ్రశమవుని ఏవో గుర్త్తలు చెప్పాడు. మూడురోజులకి స్వామి పూర్తిగా కోలుకున్నారు.

ఆ అందమయిన యువకుడయిన సాధువు తనకి సేవ చేసినందుకు కృతజ్ఝతలు చెబుదామని ఆయన ఆ తరువాత రోజు అతను చెప్పిన అడ్రస్ ఉన్నది.బయట మెట్లమీద ఒక సాధువు కూర్సోని ఉన్నాడు.ఆయన వయస్సులో చాలా పెద్గాయన.

స్వామి ఆయనికి నమస్కరించి,తాను శంకర్ మహరాజ్‌ని కలవటానికి వచ్చాను అని చెప్పారు.దానికి ఆయన ఇక్కడ అలాంటివారు లేరు అని జవాబు ఇస్తాడు.అప్పుడు స్వామీ ఆ యువ సాధువు గుర్తులు చెప్పి,తనకు సేవచేసిన విషయాలు చెప్పి,అతను ఈ ఆ[శమం అడ్రస్ చెప్పినట్టుగా వివరిస్తాడు.

ఆ పెద్దాయనకి చాలా విసుగు వస్తుంది.ఇక్కడ ఆ పేరు,ఆ గుర్తుగలవారు ఎవరూ లేరు.మాకు ఉన్న శంకర్ మహరాజ్ ఒక్కరే. ఆయన అదిగో అక్కడ ఉన్నారు అని తన చేతిని ఒక చిన్న గుడి వైపు చూపించారు.

స్వామి పరుగున ఆ గుడి దగ్గరకి వెళ్ళిచూసి,ఆశ్చర్యంతో,నిశ్చేష్ఠులయి

నిలబడిపోయారు.ఆయన ఆశ్చర్యపోవటానికి కారణం,ఆ గుడిలో ఉన్నది శివుడి విగ్రహం. ఆ విగ్రహం పైన వజ్రాలు పొదిగిన పెన్ ఉన్నది.స్వామికి చాలా అయోమయం అనిపించి పరుగునవచ్చి ఆపెద్దాయనతో ఆ పెన్ ఎవరిది? దానిని ఎవరు అక్కడ పెట్టారు? అని అడిగారు. ఆయనకి ఉన్న చిన్న అనుమానం ఆ సాధువు ఇక్కడ ఆ పెన్ పెట్టాడేమోనని. దానిని ఆపెద్దాయన "దానిని ఎవరో ఒక భక్తురాలు ఇచ్చింది. దానిని మేము అక్కడ పెట్టాము" అని కొంచం విసుక్కుని,"నీవు చూడటానికి చదువుకున్న వాడిలా ఉన్నావు. నీకు ఆ పెన్ కావాలంటే తీసుకో" అని అన్నాడు. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుని పాదాల దగ్గర ఉన్న పుష్పం స్వామీజీని మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం ఆయన గంగానదిలో స్నానం చేస్తున్నప్పుపుడు అందులో ఒక విచిత్రమయిన పుష్పం ఒకటి కొట్టుకు వచ్చింది. అది సహజమైన పుష్పం కాదు కాని చూడటానికి చాలా అందంగా ఉన్నది. స్వామి ఆ పుష్పాన్ని తెచ్చి, ఆయనే రోజూ పూజించే శివలింగం పైన ఉంచారు. ఈ పుష్పం ఇప్పుడు ఇక్కడ గుడిలో శంకర్ మహారాజ్ పాదాల దగ్గర కనపడింది.

స్వామికి సర్వం అర్ధమయి పోయింది.పరమేశ్వరుని మీద ప్రేమ,భక్తి, కృతజ్ఞత కన్నీటి ప్రవాహంలా బయటకి వచ్చేసింది. ఆ పెద్దాయన తాను విసుక్కున్నందుకు స్వామి బాధ పడుతున్నారని అనుకుని ఆ పెద్దాయన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని ఓదార్చాడు.

తనతో పాటు హిమాలయాలకి వచ్చిన ఆయన భక్తులు రెండువందల మందికి స్వామి ఈ విషయాలు ఎంతో ఉద్యేగంతో వివరించి అందరినీ ఆ ఆశ్రమానికి తీసుకు వెళ్ళారు. ఇప్పటికీ ఆగుడిలో శంకర్‌మహరాజ్ అలానే చిద్విలాసంతో ఉన్నారు. శంకర్‌మహరాజ్ దర్శనంతో అందరూ ఎంతో పులకించి పోయారు.

కొంతకాలం స్వామీజీ ఓంకారేశ్వర్ దగ్గర ఉన్న దట్టమయిన ఆడవులలో తపస్సు చేసుకునేవారు. ఒకసారి ఆయన ఊరిలోనికి వెళదాము అని లేచి నిలబడేసరికి ఒక భయంకరమయన ఎలుగుబంటి స్వామి మీదకి రాబోయింది. అక్కడినుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఆయన అలా నిలబడి దాని వైపు చూడసాగారు.అది దగ్గరగా వచ్చి ప్రక్కనుంచి వెళ్ళిపోయింది.ఆయన సదా పరాశక్తి రక్షణలో ఉన్నారు అని మరోక సారి అర్ధమయింది.

ఇలా చెబుతూ వెళితే ఎన్నో సంఘటనలు ఉన్నాయి స్వామీజీ తన శిష్యులకి ఎప్పుడూ ఒక విషయం చెబుతారు, నేను పరాశక్తిని నమ్మి,ఆ పరాశక్తి మీద భారం వేశాను. ఎప్పుడూ ఆ పరాశక్తి రక్షణలోనే ఉన్నాను, అని.