హిమాలయాలలో, పవిత్రక్షేతాలలో స్వామి కఠోర తపస్సు:
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి భారత్, నేపాల్లోని హిమాలయాలలో విస్త్రంగా పర్యటించారు. భారత్లో కన్యాకుమారి మొదలు గంగోతి పైన హిమాలయాలలోని తపోవనం వరకూ, తూర్పున కలకతా మొదలు పదమట ద్వారక వరకూ స్వామీజీ అన్ని పుణ్యక్షేతాలు చూసారు. అన్ని నదులలో స్నానం చేసారు. ఎందరో మహయోగులని, రుషులని,కలిసి వారి దగ్గర తాను నేర్చుకోవలసిన విద్యలన్ని నేర్చుకున్నారు. ఇలా తరతరాలుగా వస్తున్నా హిందూ పుణ్యగ్రంథాలని, విద్యలని,శాస్త్రాలని అభ్యసించి వాటిలో అసమాన్య ప్రతిభని,నెపుణ్యాన్ని సాధించారు.
భారత్లోని మహాయోగులు, అవతారపురుషులు,జ్ఞానోదయం పొందిన గొప్ప ఋషుల జీవిత చరిత్రను ఎంతో క్షుణ్ణంగా చదివారు. ఒకసారి ఆయన అనుకోకుండా గాసిపిల్ ఆఫ్ గ్రీ రామకృష్ణ అనే ఆరువందల పేజీల గ్రంథాన్ని పది గంటలలో ఏక బిగిన చదివారు. ఆయన ఆ గ్రంథం నిమగ్నమయిపోయి, ఆనంద పరవశులయి చదివారు. ఆ గ్రంథం చదవటం పూర్తిచేసాకా ఆయనకి మాత శారదా దేవి, శ్రీరామకృష్ణ పరమహంస యొక్క దర్శనం లభించింది. వారు ఆయన శిరస్సు మీద చేతులు ఉంచి చిరునవ్వుతో హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఆక్షణం స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వారి ఇరువురిని ఎంతో గౌరవంతో ప్రేమతో తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు. ఆయన శ్రీరామకృష్ణ చిత్రపటానికి పూజలు చేసి ఆరాధించేవారు.
స్వామి తన సత్యాన్వేషణలో మనస్సుకు నచ్చిన విధంగా ప్రయాణం చేసేవారు. ఆయన ఎక్కువ భాగం ఒంటరిగానే ప్రయాణించేవారు.ఆయన చిన్నతనం నుంచీ ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. చెప్పులు లేకుండానే, ఒక జత బట్టలు, త్రిశూలం,కమండలం కొంచెం విభూది,కుంకుమతో ఆయన తిరిగేవారు.
కంటికి నచ్చిన చోట ఆగేవారు, ముఖ్యంగా ఎక్కడ అయితే ప్రకృతి అందముగా ఉంటుందో, ఆయన మనస్సుకి ఆహ్లాదం కలుగుతుందో అక్కడ ఆగేవారు. మనస్సుకి తృప్తి కలిగినంతకాలం అక్కడ తపస్సుచేసుకునేవారు. అక్కడ ఆయన కలవగలిగిన మహాత్ములని కలిసి,వారి దగ్గర తాను నేర్చుకోగల అన్నివిషయాలు క్షుణ్ణంగా నేర్చుకొని తిరిగి పరాశక్తి ఎటు తీసుకువెళితే అటు వెళ్ళేవారు. ఇలా ఆయన హిమలయాలలో ప్రతి అణువు కాలినడకన తిరిగేవారు.
చిన్నతనంలో తనకు గురువులు నేర్పిన యోగసాధన పద్ధతులతో ఆకలి దాహం ఆయనని బంధించేవి కావు. దొరికిన రోజు భోజనం చేసేవారు. దట్టమయిన అడువులు,స్మసానాలు,నది ఒద్దులు,పర్వతాలు ఇవే ఆయన తపో భూములు ఎక్కడ ప్రకృతి అందంగా ఉంటుందో,ఎక్కడ ప్రశాంతత అనిపిస్తుందో అక్కడ కొద్దికాలం ఉండేవారు.ఆవిధంగా ఆయన చాలామంది యోగులని,
నాగా బాబాలని, మహాపండితులని కలిసారు. మరణాన్ని జయించి మరణ అనుభవం పొందిన స్వామీజీ:
స్వామీజీ వారణాసిలో గంగానది ఒడ్డన తీవ్రమయిన తపస్సు చేసేవారు. ఒకరోజు ఆయన మణికర్ణిక ఘాటు దగ్గర పూర్తి ధ్యానంలో నిమగ్నమయిపోయి ఉన్నారు. మణికర్ణిక ఘాటు దగ్గర ప్రతిరోజు ఎన్నో శవదహనాలు జరుగుతాయి. వారణాసిలో ఈఘాటు హిందువులకి చాలా పవిత్రమయినస్థలం.ఇక్కడ వందల సంఖ్యలో శవదహనాలు జరుగుతుంటాయి. ఆయన ముందు ఎన్నో శవ దహనాలు జరుగుతున్నాయి అప్పుడు ఆయన తనకి మరణంలో ఉండే మర్మం తెలుసుకోవాలి అనే తీవ్రమయిన కోరిక కలిగింది ఆయన రెండు రోజులు అదేస్థలం నుంచి కదలకుండా తన దృష్టిని మరల్చకుందా,పూర్తి నిశ్శబ్దంలో ఉండిపోయారు. మూడవ రోజు ఆయన తన శరీరం క్రమంగా కరిగిపోవటం గమనించారు. ఆయన ఆ సంఘటనలని ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అలా జరగనిచ్చారు. క్రమంగా ఆయన శరీరం పాదాల దగ్గర నుంచి మరణించటం ఆయన తెలుసుకున్నారు. భయం ఆయనని చుట్టిముట్టినట్టయింది. మరణం పైకి ఇంకా పైకి వస్తుంది. అంతే ఆయన ఆమరణ భయాన్ని పూర్తిగా జయించారు. మరణ అనుభవాన్ని పొంది మహర్షి అయ్యారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమయిన మలుపు. అది ఆయన ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరగా తీసుకు వెళ్ళినది.