కేదార్నాద్ :
హిందువులకి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ ఒకటి. అక్కడ హిమాలయాలలో ఒక గుహాలో స్వామి తపస్సు చేసుకునే వారు. ఆయన తనకు పరిచయమయిన ప్రతి ఒక్కరినీ అక్కడ ఉన్న జ్ఞానోదయమయిన యోగుల గురించి అడుగుతుండేవారు. ఆ సమయంలోనే ఆయన తనువు మనస్సు ఆత్మ ఆయన సమస్త ఉనికి జ్ఞానోదయం కోసం తపించిపోయేవి. ఎవరిని కలిస్తే తనకు మంచి మార్గదర్శకులుగా ఉండగలరో అనే ఆశతో ఆయన అటువంటి వారి కోసం వెతుకుతుండే వారు. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు స్వామి ధ్యానంలో ఉండగా ఒక అందమయిన యువకుడు ఎంతో ప్రకాశవంతమయిన తేజస్సుతో అలారారుతూ స్వామి ఉన్న గుహలోనికి వచ్చాడు. ఆ యువకుడి అందానికి ఆ తేజస్సుకి ఆశ్చర్యపడిన స్వామి నిశ్సేష్యులయి అలా చూస్తుండిపోయారు. అప్పుడు ఆయన స్వామి వైపు ఎంతోకాలంగా పరిచయమున్నట్టుగా చూస్తూ చాలా దగ్గర వ్యక్తితో మాట్లాడినట్టుగా 'పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM' అని చెప్పి ఆయనలోనే లీనమయినట్లుగా మాయమయి పోయారు.
అప్పుడు స్వామి ఆయనని మహావతార్ బాబాజీగా గుర్తించారు. స్వామి ఈ విధంగా అనుకున్నారు. " బాబాజీ నాకు ఒక మార్గాన్ని చూపించుతున్నారు. నన్ను పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అనే ఒక జ్ఞానోదయమయిన యోగిని కలవమన్నారు" అని ఆయన అటువంటి పేరు గల యోగి కోసం ఎందరిని అడిగినా ఫలితం లేకపోయింది.
స్వామి కలకతాలో గంగానది ఒడ్డన ఉండగా ఒక వృద్ధుడయిన యోగి స్వామికి సన్యాస దీక్షని ఇస్తానని చెప్పి ఆయనకి దీక్షని ఇచ్చి ఆయన పేరుని పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMగా మార్చాడు. అప్పుడు స్వామికి అంతా అర్ధమయింది. బాబాజీ తనకి ఆ పేరు పెట్టారని, ఈ వృద్ధుడయిన యోగి ద్వారా తనకి తిరిగి ఆ పేరుని గుర్తు చేసారు అని. యమునోత్రి :
చార్ ధామ్ పవిత్రయాత్రలో యమునోత్రి మరొక పుణ్యక్షేత్రం. యమునోత్రి యమునానది జన్మస్తానం. అద్భుతమయిన ప్రకృతి అందాలతో శోభిల్లుతూ హిమాలయాల అంతర్భాగంలో ఉంటుంది. స్వతః ప్రకృతి స్వరూపుడయిన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM యమున ఒద్దన ధ్యానం చేసారు. ఆయన యమునాదేవి ఆలయంలో మాత దర్శనం చేసుకొని ఆమెకి అభిషేక పూజలు జరిపారు. అక్కడ ఆయనకి యమునాదేవి దర్శనం ఇచ్చి ఆయనని ఆశీర్వదించింది. దర్శనంతో స్వామి
మహదానంద భరితులయ్యి ఆమె ఆశీస్సులతో, సంకల్ప బలంతో మరింత ఉత్సాహంగా గంగోత్రి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు. గంగోత్రి :
భారతీయుల పరమ పావన నదీవు తల్లి గంగామాత. ఆదిశంకరాచార్యుల మాటలలో చెప్పాలంటే, గంగ నీటి బొట్టు తాగితే చాలు. సకల పాపాలు పటాపంచలవుతాయి అని. గంగా ప్రవాహం ఒట్టి నీటి ప్రపాహం కాదు, అది అమృతవాహిని. ఎందుకంటే ఆ నీటి కెరటాలు తమతో అద్భుతమయిన ఔషధాలని తీసుకువస్తాయి. కొన్ని వేలమంది మహా యోగులు, లక్షలమంది పండితులు, కోట్లకొలది భక్తులు నిత్యం తమ పూజలతో, ప్రార్ధనలతో, ఆరాధనలతో గంగా జలాన్ని మంత్ర జలంగా మారుస్తారు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నిరాటంకంగా జరుగుతూ ఉన్నది. అందుకే గంగానది మామూలు నది కాదు. ఆమె అమృతమూర్తి. అమ్మ. అందులో ప్రవహించేది మామూలు నీరు కాదు, సర్వప్రాణికోటికే అత్యవసరమయిన అమృతమే. అటువంటి ఆ పవిత్ర మాత జన్మస్దలమే గంగోత్రి. ఇందులో చాలా భాగం, చాలా కాలం మంచుతో నిండిపోయి ఉంటుంది.
స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి అతి ప్రియమయిన పుణ్యక్షేత్రాలలో గంగోత్రి చాలా ముఖ్యమయినది. స్వామి చాలా కాలం ఇక్కడ తపస్సు చేసారు. తరువాత ఆయన అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ అనే ప్రదేశంలోను అక్కడ నుంచి మరొక 15 కిలోమీటర్ల దూరంలోని తపోవనం లోనూ తపస్సు చేసారు. ఈ రెండూ కూడా పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. ఇవి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాయి. అటువంటి ప్రదేశంలో స్వామి కఠోర తపస్సు చేసారు. ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత దశకు చేరిన యోగులు సత్యాన్వేషులు ఈ తపోవనాన్ని తమ తపస్సుకి ఎంచుకుంటారు. దీనిని చేరటానికి వెళ్ళే దారి కూడా చాలా ప్రమాదభరితంగా ఉంటుంది. ఏ క్షణాన మంచుశిలలు విరిగి పడతాయో ఎప్పుడు ఆప్రదేశాన్ని మంచుతో సమాధి చేస్తాయో ఎవరికీ తెలియదు. ఆ ప్రదేశమంతా లోతయిన అగాధాలతో, లోయిలతో నిండి ఉంటుంది. అంత ప్రమాదమయిన ప్రదేశం కాబట్టి భక్తులు, యాత్రికుల తాకిడీ ఎక్కువగా ఉండదు. చాలా ప్రశాంతమయిన ప్రదేశం అది.