తీవ్రరూపం దాల్చిన తపోనిష్ఠ:
మరణ అనుభవం స్వామీజీ ఆత్మసాక్షాత్కార తృష్ణని మరింత ఎక్కువ చేసింది.ఆయన పట్టుదల రోజురోజుకి అధికమవ్వసాగింది.స్వామి తపోనిష్ఠలో ఎక్కువ సమయం గడపసాగారు.
పంచతపస్సు :
ఇది చాలా కఠినమైన ప్రమాదకరమైన తపస్సు. ఈ తపస్సు చేయాలంటే చాలా ధైర్యం, పట్టుదలా తనపై తనకు నమ్మకం ఉండాలి. అత్యంత సాహససహపరులైన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ పంచ తపస్సుని ఎన్నుకున్నారు. ఈ పద్ధతిలో చుట్టూ మహా అగ్నిని రగిలించి మధ్యలో కూర్చుంటారు. తలపై నిప్పుల కుంపటి ఉంటుంది. సూర్యోదయంతో ఈ ధ్యానం మొదలవుతుంది. ధ్యాన సమయంలో సూర్యుని వైపు మాత్రమే కన్ను చెదరకుండా చూస్తూ ఉండాలి. సూర్యగమనానికి అనుగుణంగా తన దృష్టిని మరల్చుతూ ఉండాలి. ఆ విధంగా సూర్యోదయంతో మొదలు పెట్టి సూర్యాస్తమయంతో ముగించుతారు. దీనినే త్రాటక్ ధ్యానం అంటారు. స్వామి అగ్ని కీలల మధ్య ధ్యానం చేసే సమయంలో ఆయనకి తెలిసిన వ్యక్తులు అక్కడ ఉండి అగ్ని నిరంతరం జ్వలించే విధంగా చూస్తూంటారు.
స్వామిని ఎవరో ఈ విధంగా అడిగారు "ఇంత చిన్న వయస్సులో, ఇంత కఠినమైన తపస్సు చేయటానికి ఎందుకు అంత సాహసం చేసారు" అని. ఆ ప్రశ్నకు స్వామి " నాలో ఆత్మాసాక్షాత్కారం కోసం, జ్ఞానోదయం కావాలి అనే ఆకాంక్ష భయంకరమయిన జ్వాలగా మండుతున్నది. ఆ మంటలను భరించే శక్తి నాకు ఇక లేదు. కనీసం నా బయట మండే ఈ అగ్ని జ్వాలలయినా నాలో రగులుతున్న అగ్ని కీలలని ఉపశమింప చేస్తాయేమో అనే ఆశతో నేను ఈ ధ్యానం చేసాను అని చెప్పారు. అది విన్న యోగులు, ఆయనలోని అసాధారణ సిద్ధ పురుషుని దర్శించి పులకితులయ్యారు. హిమాలయాలలో తపస్సు :
నిత్యం దట్టంగా మంచుతో కప్పబడిన పవిత్ర హిమాలయ పర్వత శ్రేణులు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి చాలా ముఖ్యమయిన, ఎంతో ప్రీతికరమయిన తపోభూములు. స్వామి హిమాలయాలలో అన్ని ప్రముఖ పుణ్యక్షేతాలలో తపస్సు చేసారు.